S.సౌమ్య ఈనాటి, అగ్రస్థానంలో ఉన్న, కర్ణాటక సంగీత కళాకారులలో ఒకరు. రసాయన శాస్త్రం లో,IIT లో మాస్టర్స్ డిగ్రీ చేశాక, PhD చేసే సమయంలో సంగీతమా లేక Chemistry యా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు,సంగీతం లో దైవత్వం ఉందని తలచి, ప్రీతిపాత్రమైన Chemistry ని త్యజించి, సంగీతం వైపే మొగ్గారు సౌమ్య. ఆ తదుపరి మదరాసు విశ్వవిద్యాలయము నుంచి B.A, M.A.,(సంగీతం) పరీక్షలు ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణులయ్యారు.
సౌమ్య ను బాలమేధావి అనేవారు. రెండున్నర సంవత్సరాల, చిరు ప్రాయంలోనే,రాగాలను గుర్తు పట్టగలిగేదట. ఆమె ప్రధమ గురువు, తండ్రి Dr.M. శ్రీనివాసన్ గారే. వారు రసాయన శాస్త్ర యింజనీరు. ఆరేళ్ళ వయసు నుంచే, సంగీత కళానిధి Dr.S.రామనాథన్ వద్ద సంగీత శిక్షణ పొందారు. 12 ఏళ్ళ ప్రాయంలో, శ్రీమతి టి. ముక్త వద్ద అపరూపమైన, కృతులు, పదాలు, జావళులు నేర్చుకున్నప్పటికీ, సౌమ్య పాడే విధానం పై డా.రామనాథన్ గారి ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. స్కూల్, కాలేజ్ సంగీతం పోటీలలో సౌమ్య ఎప్పుడూ విజేతే.
సంగీతానికి భాషా ఎల్లలు లేవంటారు సౌమ్య. భగవంతునికి, కళాకారుల నివేదనలే ఈ కీర్తనలు. వాగ్గేయకారుల, ఆర్ద్రతతో కూడిన, భగవంతునికి ఇచ్చే నైవేద్యమే,సంగీతం. సంగీత జ్ఞానము, భక్తి వినా,సన్మార్గము కలదే మనసా అన్న త్యాగరాజు సందేశాన్ని, శిరసావహిస్తారు సౌమ్య.
http://carnatica.net
వీరి,Cyber University, CD-ROM ల ద్వారా, రసజ్ఞులు, సంగీతం ఎలా ఆస్వాదించాలో, నేర్చు కొంటారు. ఆమెను cyber guru అని అభిమానులు, భావిస్తారు. ఇవే కాకుండా, Sowmya కర్ణాటక సంగీతంపై చర్చా గోష్టులు నిర్వహిస్తున్నారు.
సౌమ్య, ప్రపంచంలోని అన్ని ఖండాలలో కచ్చేరీలు ఇచ్చారు. సంగీతాన్ని ప్రోత్సహించే అనేక స్వతంత్ర సంస్థల, తమిళ్‌నాడు ప్రభుత్వ, భారత ప్రభుత్వ సంగీత, నృత్య అకాడెమీల గౌరవపురస్కారాలు శ్రీమతి సౌమ్య అందుకున్నారు.
శ్రీమతి సౌమ్య పాడిన,శంభో మహాదేవా - ఫంతువరాళి రాగం - రూపక తాళం - త్యాగరాజ కీర్తన వినండి.
|
Courtesy:http://carnatica.net
2 కామెంట్‌లు:
ఆమధ్యనెప్పుడో మీ బ్లాగులో సౌమ్య యూట్యూబు లంకె ఒకటి పెట్టారు. ఈ పరిచయ వ్యాసం సంతోషకరం. ఈవిడ గాత్రంలో ఒక సైంటిఫిక్ ఎప్రోచ్ కనిపిస్తుంది. ఎవరూ ఎక్కువగా పాడని అపురూపమైన కృతుల్ని వెలికి తీసి పాడుతుంటుంది. కర్ణాటక సంగీత వ్యాప్తిలో వెబ్బుని బాగా ఉపయోగించిన ఘనత కూడా ఈమెదే.
@cbrao గారు,నాకు సౌమ్య IIT student అని తెలీదు ! ఇంత గొప్పగా చదివేసి, సంగీతం మీద ఆసక్తి తో అలా సంగీతం మీదే దృష్టిని పెట్టేవాళ్ళు అంటే, నాక్కొంచెం అసూయ అన్నమాట ! ఏదేమైనా, మంచి టపా ! పాపనాశం శివం కృతి "శోధనై సుమై " కృతి నేను మొట్ట మొదట రేడియో లో విన్న సౌమ్య కృతి !ఇంకెవరు పాడినా ఆ కృతి నాకు అంతగా నచ్చలేదు ! అప్పటి నుంచి, నేను తన ఫ్యాన్ , ఏసీ అన్నీ ! కొందరైనా ఇలాంటి కృతులు విని, మంచి సంగీతం పట్ల ఆకర్షితులు కావాలని కోరుకుందాం ! పాశ్చాత్య సంగీతానికి రెపరెప లాడుతున్న మన సంగీతాన్ని నిలబెడదాం !
@కొత్త పాళీ గారు,మరేమో మీకు ఎలా తెలుస్తూంది --- scientific approach గానం లో కనపడ్డం అంటే ఏంటి ? I heard too many people use these words ! కొంచెం తెలుగు లో చెప్తారా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి