శుక్రవారం, సెప్టెంబర్ 28, 2007

సాహితీవనం -4


Maredumilli forest,E.G.dt.,A.P. Photo -cbrao

లత, సంతానం చిత్రం లో మాత్రమే కాక ఆఖరిపోరాటం చిత్రం లో కూడా పాడారని సిరి గారు రాశారు.అమూల్యమైన సమాచారాన్నిచ్చిన సిరి గారికి నా ధన్య వాదాలు. లత పాడిన ఆఖరిపోరాటం చిత్రం లో పాటలు మీరు ఇక్కడ వినవచ్చు.

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే భూదేవి అని ఇంకో అర్థం కూడా ఉందని తెలుస్తూంది.ఆసక్తి గలవారు, DTLC Group ఇంకా TELUSA గుంపు చర్చలలో చూడవచ్చు.

ఊ) ప్రకృతి అందాలకు నిలయం తుమ్మపూడి.పచ్చని చేలు, ఆ పక్కనే బకింగ్‌హాం కాలువ, అందులో వెళ్తూండే తెరచాప పడవలు, చెట్లూ, వాటి పై పక్షులూ,మనకు చక్కటి గ్రామీణ వాతావరణాన్ని అందిస్తాయి. చనిపోయే వరకూ సంజీవదేవ్ ఇక్కడే, ప్రకృతిని ఆస్వాదిస్తూ,చిత్ర పటాలు గీస్తూ గడిపారు.

ఎ) పారడీ రచనలైనా, కటుంబ సంబంధ బాంధవ్యాల కథలైనా శ్రీరమణకు కొట్టిన పిండి.

ఏ)భారత రత్న సుబ్బలక్ష్మి గారి గాత్రం అనితర సాధ్యం. గాంధి గారు వైష్ణవ జనతో పాటను వీరి ముహతా వినటానికి ఇష్ట పడే వారు.భక్త మీరా (1945) చిత్రం లో నటించి మీరా భజన్లను పాడారు.ఇంకా సేవాసదనం, సావిత్రి, మీరా(తమిళ్) చిత్రాలలో నటించినా, అవి తన ప్రవృత్తికి సరి పోక పోవటం తో గాయనిగానే కృషి చేశారు.

ఐ) వివిధ రామాయణాలలో గల వ్యత్సాసాలను వివరిస్తూ రాసిన పుస్తకమిది.వీటిలో రాముడికి, సీతకు గల సంబంధాన్ని ఏ రామాయణం లో ఎట్లా రాశారు అని తులనాత్మకంగా పరిశీలించిన గ్రంధం.

ఒ) కారులో షికారు కెళ్లే -ఈ పాట సినిమాలో సందర్భాన్ని బట్టి గాక, పాటకై సందర్భాన్ని సృష్టించినట్లుగా ఉంటుంది. సొషలిస్ట్ భావాలతొ నిండిన ఈ పాట పాఠకులను బాగా తికమక పెట్టింది. చాల మంది దీనిని శ్రీశ్రీ రాసినట్లుగా పొరబడ్డారు. ఈ పాట పై చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి. బుచ్చిబాబు గారు దీని పై ఆంధ్ర ప్రభ లేక జ్యొతిలో ప్రత్యేక వ్యాసం రాసినట్లు గుర్తు. ఆత్రేయ గారు శ్రీశ్రీ లో పరకాయ ప్రవేశం చేసి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. అద్భుతమైన పాట.అందుకే ఇంతకాలమైనా మన మదిలో నిలిచిపోయిందీ పాట.

పాఠకుల స్పందన చూద్దాము ఇప్పుడు.
1) నేను సైతం 5 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు. 5 మార్కులు
2) కారణి నారాయణ రావు గారు సినీవాలికి ఒకే సమాధానం ఇచ్చి 0.5 మార్కులు పొందారు. మొత్తం మార్కులు 5.5 మార్కులు
3) సినీవాలి కి రెండు అర్థాలు ఇచ్చారు సౌమ్య. మొత్తం స్కోరు 6 మార్కులు.
4) శ్రీనివాస్ పరుచూరి చివరలో రాసిన ఎనిమిదవ జవాబులో ఆరుద్ర అని రాసారు. కాని ఏ ప్రశ్నకు జవాబుగా రాసారో చెప్పలేదు.సాహితీవనం లో చివరగా ఉన్న ఐ,ఒ ప్రశ్నలు రెండింటిలో ఆరుద్ర అన్న option ఉంది.ఆరుద్ర అన్న జవాబు ఒక ప్రశ్నకు సరైనది.వెరే ప్రశ్నకు కాదు.కావున జవాబు invalid vote కింద జమయ్యింది.ప్రశ్న, జవాబు రెండూ రాసుంటే, శ్రీనివాస్ గారికి ఇంకో అదనపు మార్కు వచ్చేదేమో.Topper అయ్యుండే వారు. రామ భక్త హనుమాన్ గా శ్రీశ్రీని గుర్తించింది వీరే.శ్రీనివాస్ గారి స్కోర్ 6 మార్కులు.

సినీవాలికి రెండవ సమాధానం రాసుంటే నారాయాణరావు గారికి 6 మార్కులు వచ్చుండేవి. 5 మార్కులు సాధించిన నేను సైతం ఇంకొంచం శ్రద్ధ పెట్టి జవాబులు రాసుంటే,అందరికీ సమానంగా నిలిచే వారు.సాహితీవనం ప్రశ్నలకు ఉత్సాహంగా జాబులు, జవాబులు రాసిన అందరికీ ధన్యవాదాలు.చివరగా శ్రీనివాస్ పరుచూరి, సౌమ్య ఇద్దరూ చెరి 6 మార్కులతో సమ ఉజ్జీ అయ్యారు.ఉత్తమ సమాధానాలిచ్చిన వీరిరువురికీ దీప్తిధార వీరతాడు వేస్తున్నది.హై, హై నాయకా! హై, హై,నాయకా! సంజీవదేవ్ రచనల సమీక్ష,విశ్లేషణ,జీవితం సంకలన కర్త శ్రీ పారుపల్లి కవికుమార్ సౌజన్యంతో, సంజీవదేవ్ గురించిన పుస్తకం వీరిరువురికీ దీప్తిధార నుంచి అందుతుంది.

4 కామెంట్‌లు:

C. Narayana Rao చెప్పారు...

అసలు కంటే వడ్డీయే, ముచ్చటగ వుందండి- Quiz లో ప్రశ్నల కంటే కూడా, మీ వివరణలు భలే!

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది. దీన్ని రెగ్యులర్ ఫీచర్ చెయ్యండి.
ఒక సూచన - టైటిలు మీరు వనం 2, 3, 4 అని పెడుతూ పోతే కొత్త క్విజ్జులు పెట్టరేమో అని ఆత్రంగా చూసి ప్రతిసారీ నిరాశ పొందాను. అక్కడ మీరు రాసినవి ఆసక్తి కరంగానే ఉన్నై. ఒకే కివ్వ్జు గురించి పొడిగింత టపాలటైటిలుకి కి మీరు వేరే పద్ధతి ఏదన్నే అవలంబించాలి .. వనం 1 (అ), (ఆ) .. ఇలాగ.

థాంకులు

S చెప్పారు...

THanks rao garu!! :))
ఐతే మరి కొత్త క్విజ్జులు కూడా పెట్టండి...ప్రయత్నిస్తాను...నాకు ఉత్సాహం వచ్చింది పుస్తకం అనగానే..హీహీ

గిరి Giri చెప్పారు...

గుడ్డుకి ఈకలు పీకుతున్నానేమో కానీ రెండు విషయాలు..

1.శ్రీశ్రీ గారు కమ్యూనిస్టు కదా? (సోషలీజాన్ని కాపిటలిజం నుంచి ఇంకొంచెం దూరం లాగితే కదా కమ్యూనిజం వచ్చేది)
మీరు చెప్పినదే సరి అవ్వచ్చు, కానీ ఒక్కసారి చూపేయండి.

2. 'కారులో షికారు' పాట: పాల బుగ్గల పసిడి చాన (పసిడి దాన కాదు). పాట వింటున్నప్పుడు అది పట్టడం కొంచెం కష్టమే కానీ సినిమా చూస్తే తెలుస్తుంది. పాట కాగానే సావిత్రి వచ్చి నాగేశ్వర రావుతో "ఎవరండి పాల బుగ్గల పసిడి చాన?" అని అడుగుతుంది.

చాన ని దాన కి అర్ధంలో తేడా లేదేమో..

పైన చెప్పినట్టు ఇవి nitpicking అభిప్రాయాలే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి