శనివారం, సెప్టెంబర్ 29, 2007

సాహితీవనం -5



శ్రీశ్రీ గారు కమ్యూనిస్టు కదా? రామ భక్త హనుమాన్ కు పాటలు రాయడమేమిటి? అని గిరి విస్మయం వెలిబుస్తున్నారు. రామభక్త హనుమన్ ఫేం శ్రీశ్రీ అన్న విషయం చేరా గారిని బాధించి,"మరో ప్రపంచ మహాకవి రామభక్త హనుమాన్ ఫేం?" అని అక్రొశిస్తూ,"వారం,వారం నీ రచనల శరవర్షం కురిపించవయా " అంటూ శ్రీశ్రీని అభ్యర్దిస్తూ, స్వతంత్ర పత్రిక లో గేయం రాశారు. అది చదివి,వరవరరావు స్వతంత్ర లో ఒక వ్యాసం రాస్తూ "శ్రీశ్రీ వైపు దేబె మొగాలు వేసుకు చూస్తుండకపోతే, మీరంతా ఎందుకు రాయకూడదూ?" అని ప్రశ్నించాడు. (చూ.స్మృతికిణాంకం.పే 24.)

దేవుళ్లను స్మరించిన మాత్రాన, శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కాకుండా పోడు. వస్తున్నాయ్,వస్తున్నాయ్ జగన్నాధ రధ చక్రాల్ అని రాయటం వెనుక జగన్నాధుడు దేవుడని కాక, మన సంస్కృతి లో భాగమైన జగన్నాధుని, తన భావాలను ప్రజల దరిచేర్చే అవసరం కోసం వారికి సుపరిచితమైన జగన్నాధుని, వాడటం జరిగిందని భావిస్తాను. శ్రీశ్రీ జీవితంలో ఎన్నో వైరుధ్యాలున్నై. సినిమాల లో నెహ్రూ ని పొగిడి ఆ తరువాత నాలుక్కరుచుకున్నాడు."ఒక పక్క సోషలిస్ట్ విలువలు పొగడుతూనే,తన సెక్సు విజయాలను చాటుకునే ఫ్యూడల్ మనస్తత్వమూ ఉంది." -చేరా. శ్రీశ్రీ లోనూ మనుషులకుండే కొన్ని లోపాలు లేక పోలేదు. శ్రీశ్రీ లోని కవి, అతను సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం కావించిన తీరు, ఈ లోపాలను సులభంగా అధిగమిస్తాయి.

సాహితీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న, రెండవ విడత ప్రశ్నలివిగో.ఇవి మీకు ఆసక్తికరంగా ఉండగలవని ఆశ.

సాహితీవనం ప్రశ్నలు

A) రష్యన్ సీత కథా సంపుటి రచయిత్రి

1) వాసిరెడ్డి సీతా దేవి
2) వసుంధర
3) కందుకూరి వెంకట మహాలక్ష్మి
4) కొండేపూడి నిర్మల

B) "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు" అని శ్రీశ్రీ రాసిన పాటకు ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండు తాటాకుల్" అని పారడి రాసిన కవి

1) చలం
2) ఝరుక్ శాస్త్రి
3) శ్రీ రమణ
4) ఆరుద్ర

C) ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి



1) అన్నమాచార్య, తాళ్లపాక
2) తిరు వాళ్లువార్, కన్యాకుమారి
3) శ్రీత్యాగరాజ, తిరువాయూరు
4) స్వాతి తిరుణాల్, తిరువనంతపురం

D) సుగాత్రి అంటే ఏమిటి?

1) మంచి శీలం ఉన్నది
2) మంచి శరీరం ఉన్నది
3) మంచి చూపు ఉన్నది
4) పైన పేర్కొన్నవి ఏవీ కావు

E) కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం

!) గుంటూరు సేన
2) శివ సేన
3) కవి సేన
4) ముత్యాల సేన

F) పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి

1) శిలాలోలిత
2) సావిత్రి
3) యస్.జయ
4) డా.పి.సుమతీ నరేంద్ర

G) ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి.



1) వెల్చేరు నారాయణ రావు
2) ఆరి సీతారామయ్య
3) బి.నర్సింగరావు
4) చిత్రకారుడు చంద్ర

H) ఆలాపన రాసిన రచయిత

1) మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ
2) నూకల చిన సత్యనారాయణ
3) వి.ఎ.కె.రంగారావు
4) యస్.సౌమ్య

I) చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు.

1) రాధా గోపాలం
2) ముత్యాల ముగ్గు
3) పెళ్లి పుస్తకం
4) మిస్టర్ పెళ్లాం

J) "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు " అని గర్జించిన రచయిత

1) మాడపాటి హనుమంతరావు
2) దాశరధి కృష్ణమాచార్య
3) వట్టికోట ఆళ్వార్ స్వామి
4) సురవరం ప్రతాప్ రెడ్డి

షరా మాములే. మీ సమాధానాలు,ప్రశ్నలకు సంబంధించిన, ఆసక్తికరమైన విషయాలు దీప్తిధారకు పంపండి.

6 కామెంట్‌లు:

Dr.Pen చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dr.Pen చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dr.Pen చెప్పారు...

http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html

కొత్త పాళీ చెప్పారు...

చాలా కష్టంగా ఉన్నై మేస్టారూ!

అజ్ఞాత చెప్పారు...

అసలు శ్రీ శ్రీ ని ఏదో ఒక కూటమిలో (కమ్యూనిష్టులు) చేర్చేయ్యాలా? నాకు మట్టుకు శ్రీశ్రీ ఒక మానవవాది. అతనికి ఈ ఇజాలు గట్రా అంటించకండి. కమ్యూనిజం ఇప్పుడు మతవాద ’ఇజం’ గా మారిపోతుంది. ఉర్దూ అరుపులు ప్రాధాన్యత పెరిగింది...కమ్యూనిజంలో, వారి సాహిత్యంలో..

netizen నెటిజన్ చెప్పారు...

గూగులమ్మను అడక్కుండా జవాబులివ్వాలి! అది గొప్ప!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి