ఈ విషయం పై గతంలో ఒక జాబు (http://deeptidhaara.blogspot.com/2007/03/blog-post_6672.html) రాసాను. దురదృష్టవశాత్తు సంవత్సర కాలం గడిచినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.
తెలుగులో గత సంవత్సరం తో పోలిస్తే, ఇప్పుడు బ్లాగులు, టపాలు ఎక్కువయ్యాయని , అన్నీ చదవటం కష్టం గా వుందని పాఠకులు feel అవుతున్న, ఈ రోజుల్లో Dig అవసరం ఇప్పుడు మరింతగా వుంది. పాఠకులు, ఎంపిక చేసిన టపాలను డిగ్ చెయ్యటం వలన, అసంఖ్యాకంగా వస్తున్న టపాల లోంచి, మంచివి చదివే అవకాశం, పాఠకులకు లభిస్తుంది. గత సంవత్సరంగా డిగ్ లో ఎవరు ఎంత progress చూపించారో చూద్దాము.
ముందుగా చంద్రశేఖర్ డిగ్
http://digg.telugusoftware.org
ప్రస్తుత పరిస్తితి: పనిచెయ్యటం లేదు.
ఆ తరువాత ప్రవీణ్ గార్లపాటి డిగ్
http://employees.org/~praveeng/mydigg/
ప్రస్తుత పరిస్తితి: పనిచెయ్యటం లేదు.
కూడలి లో ఎప్పుడో రావలసిన ఈ feature ఇంకా రానే లేదు. కారణం వీవెన్ కే ఎరుక. ఎన్నో కొత్త features తో ముందు కొచ్చిన జల్లెడ ఈ విషయంలో వెనకబడే వుంది. జాలయ్య గారు, ఎందుకు కొత్త features పెట్టడం లో జాప్యం చేస్తున్నారో, కారణం తెలియదు. డిగ్ కాదు కదా కనీసం టపాకు star rating ఇచ్చే సౌకర్యం ఏ blog aggregator లో కూడా, లేదిప్పటికి.
ఇలాంటి పరిస్తితి లో కనిపిస్తుంది ఒక ఆశా కిరణం. అదే ముద్ర.
http://tenugublog.com/mudra/
కొద్దిగా మార్పులు దిద్దితే, ఇది జనామోగ్యం పొందే సూచనలున్నాయి. దీని పనితీరు చూద్దామా.ఇందులోని టపాలు ఎవరైన చదవొచ్చు కాని డిగ్ చెయ్యాలంటే ఇందులో సభ్యత్వం వుండాలి. సభ్యత్వం ఉచితం. మీ పేరు, పాస్ వర్డ్ ల తో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. మన సభ్యత్వం ఆమోదించబడినట్లుగా మనకు e-mail మౠదౠర
నేను నమోదు చేసిన టపా పేరు మిస్టర్ మేధావి - నిజంగా మేధావేనా....! ఈ టపా మీకు రాబోవు టపాలు లో కనిపిస్తుంది. ఇది ప్రచురింపబడిన టపాలు లోకి ఎలా మార్చాలో సహయము లేదు. టపాలు ప్రచురించిన పేజీలో bury అనే feature మనకు ఆసక్తికరంగా లేని టపాలను, మాయం అయ్యేలా చేస్తుంది. దీనికి మీరు చెయ్యవలసిందల్ల,మీకు అక్కరలేని టపా పక్కన గల bury పై mouse తో క్లిక్ చెయ్యటమే. ఇంకా ఉత్తమ సభ్యులు అనే ఆసక్తి కరమైన విషయం వుందిక్కడ. దీని పనితీరు, ఎలా వాడాలనేది వివరించలేదు. అంతే కాక ఖర్మ అనే feature కూడా వుంది. వీటన్నింటికీ వివరణలతో help page అవసరం వుంది.
కొద్దిపాటి మార్పులతో, Website వేగం పెంచి,తగినంత ప్రాచుర్యం కలిపిస్తే, పోటీ లేని ముద్ర, పాఠకుల అభిమానం పొందగలదు. పాఠకులు తక్కువ సమయంలో, ఎక్కువ ఉత్తమ టపాలు చదవగలిగేలా చెయ్యటమే,ముద్ర యొక్క బలం. ఆదరించండి, లాభం పొందండి.
1 కామెంట్:
మౠదౠర అంటే ముద్ర అనుకుంటా!... అది సరిగ్గా వచ్చేలా మారుస్తాను. ముద్ర మొదటి పేజీలో ( ప్రచురింపబడిన టపాలు కి ) చేరాలంటే... కనీసం 3 ముద్రలు రావాలి. ఇప్పుడు మీ టపాకి నేను కూడా ముద్ర వేసను. మరి ఒకరు కూడా ముద్ర వేస్తే...మీ టపా మొదటి పేజీకి చేరుతుంది. కొద్దిపాటి మార్పులు చాలా చేయాలి ..నాకు వచ్చిన సలహాలు, సూచనలను బట్టి మారుస్తాను. ' హెల్ప్ పేజీ ' మంచి సలహా. ఈ వారాంతానికి అయ్యేలా చూస్తాను. వెబ్‌సైట్ స్పీడ్ గమనించాను. బెటర్ అయ్యేలా ప్రయత్నిస్తా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి