శనివారం, సెప్టెంబర్ 06, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -7

OLYMPUS DIGITAL CAMERA

నవకిషోర్ చంద్ర చిత్రలేఖనం  ఛాయా చిత్రం:cbrao  

ఆత్మకథ ఎలా రాయాలి?            

ఎవరికైనా ఆత్మకథ రాయటం కత్తిమీద సామే. ఆత్మ కథంటే, మనతో పాటుగా, మన జీవితం లోకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చిన వారి గురించి, ఆత్మకథలో రాసే సమయంలో, పెక్కు సమస్యలెదురవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల మనో భావాలు గాయపడకుండా, చనిపోయినవారి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా రాయాల్సుంటుంది. ఇంతదాక దాచి పెట్టిన కొన్ని నిజాలు రాస్తే, కొందరికి ఖేదం, మరికొందరికి  కోపమూ రావచ్చు. ఆత్మకథ కర్త, గతంలో లో చేసిన కొన్ని చర్యలు (ఉదాహరణకు తన boy friend) గురించి భర్తకు చెప్పిఉండని సందర్భంలో, నిజాయీతీ తో,  ఇప్పుడు వెల్లడిస్తే, భర్తతో పొరపొచ్చం వచ్చే  ప్రమాదం. తను చేసిన కొన్ని పనులు, తన ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, నొప్పింపక, తానొవ్వక రాయాల్సుంటుంది. ఆత్మకథలలో, గాంధిజీ ఆత్మకథ ఎంతో విశిష్టమైనది.  తండ్రి చనిపొయిన సమయంలో, తను, భార్యతో శృంగారంలో ఉన్న సంగతి, ఎంతో నిజాయితిగా వెళ్లడిస్తారు. యుక్తవయస్సు లో తను చేసిన వివిధ ప్రయోగాలను తేటతెల్లం చేస్తారు. తమ ఆత్మకథ రాసే ముందు, ప్రతి ఒక్కరికీ, గాంధీజీ ఆత్మకథ పఠించ వలసిన  ఆవశ్యకత ఎంతైనా ఉంది.

http://mandahaasam.blogspot.com/2008/08/blog-post_29.html

ప్రజా రాజ్యం

తిరుపతి సభలో జనప్రభంజనాన్ని చూస్తే, ప్రజలు మార్పు కోరుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రజలు అభిమానులా, లేక సామాన్య ప్రజానీకమా అన్నది ప్రజారాజ్యం భవితను తేల్చగలదు.

http://krishnadevarayalu.blogspot.com/2008/08/blog-post.html

10000 వ పర్ణశాల పాఠకుడు అదృష్టవంతుడా?

10000 సందర్శనలలో నా సంఖ్య తక్కువే. కూడలి లో, నా కాలేజీ కథ అనే టపా చూసి ఇదేదో కాలేజీ కుర్రాడి ప్రతాపమనుకుని, అప్పటి పని ఒత్తిడిలో పర్ణశాల బ్లాగు దాటవేశాను. ఎన్ని మంచి వ్యాసాలు మిస్ అయ్యానో. శాన్ హొసే (కాలిఫోర్నియా) లో తీరిక సమయంలో వీటిని చదవాలి. 10000 వ పర్ణశాల పాఠకుడు (అదృష్టవంతుడు కానే కాదు బాబోయ్) ఎవరు? అతని I.P., ఊరు, పేరు ఏమిటి? దీప్తిధార 10000 వ పాఠకుడికి బహుమతిగా మా అమ్మాయి తులసినిచ్చి వివాహం చేశా. మహేశుడేమి బహుమతి ఇవ్వబోతున్నాడో?

http://parnashaala.blogspot.com/2008/09/10000.html?ext-ref=comm-sub-email

జీవన వైచిత్రి

అదృశ్య శక్తి అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నిరూపణ లేనిదే science దీన్ని అంగీకరించదు. జీవితం లో కొన్ని సంఘటనలు అలా దేని ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. బోస్టన్ లో ఒక అమెరికన్, ఒక తెలుగు అమ్మాయి ప్రేమలో పడితే అది ఆకర్షణ అనో లేక వారి psychic vibrations కలిసాయనో అనుకోవాలి. దేవుడు, దయ్యం ప్రసక్తి ఇక్కడ అనవసరం. దెయ్యాలను రాంగోపాల్ వర్మ సినిమాలలో చూస్తాము. దానర్ధం దెయ్యాలున్నాయనా? సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. దీనర్ధం కొన్ని నియమాలతో ఈ విశ్వం నడుస్తుందని, అది ప్రకృతి సహజమని. Darwin's theory of evolution చదివితే, మతాధికారులు చెప్పేవి శాస్త్ర నిరూపణకు నిలబడవని తెలుస్తుంది. ప్రకృతే దేవుడంటే అది ఒక నమ్మకం గా మారుతుంది.

"సైన్సు ని నేను నమ్మినా, రోజుకొక సిద్దాంతం పుట్టుకొచ్చే ఈ రోజుల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాదు.” -ఉమాశంకర్

సైన్సు నిరంతరం తనను తాను సరిదిద్దుకుంటూ, ఆవిష్కరించుకుంటూ, ముందుకు పయనించే పథం లో కొత్త సిద్ధాంతాలు పుట్టడం, ఒక సహజమైన విధానం. అది శాస్త్రీయం. అతీతాలను నిరూపించటం సాధ్యం కాదు కనుక శాస్త్రం దానిని నిర్ధారించలేదు.

http://umasankarrao.blogspot.com/2008/08/blog-post_26.html

2 కామెంట్‌లు:

gaddeswarup చెప్పారు...

Rao garu,
There have been problems with science reports in the recent years. At one level, the problem is that unversities have been going for private funding and have publicity departments to publicize their work. This has led to trivial or even bad research receiving publicity. Secondly, there is pressure on researchers whose work may not suit business. Thirdly the reports on climate and such are very complex and it is difficult for ordinary people to discern and have to depend on experts. But the experts are politicized. Eventually these may be sorted out but often at the so called cutting edge research which is often touted as useful work, it is not clear what is valid and what is not.
P.S. I will attempt to write in Telugu in a few weeks but it may be even less clear.

cbrao చెప్పారు...

@గద్దె స్వరూప్: దీప్తిధారలో మీ తొలి ఉత్తరానికి ప్రమోదం. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, చివరికి ప్రజలు గుర్తుంచుకునేది, వారికి ఉపయుక్తమైన కొత్త విషయాన్ని, శాస్త్రం ఆవిష్కరించినప్పుడే. http://lekhini.org/ సహాయముతో తెలుగులో రాయటం తేలికైన పద్ధతి. నేను లేఖిని వాడుతున్నా. మీరూ ప్రయత్నించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి