గురువారం, జనవరి 29, 2009

స్పందన -3Scenic Pacific Coast on the way to Mendocino, North California Photo: cbrao

సెగలు - పొగలు

టపా చల్లగా - వ్యాఖ్యలు వేడిగా, మునుపటివలెనే, మజా మజాగా. అబ్రకదబ్రా now rejoice.

http://parnashaala.blogspot.com/2008/12/e.html


పుస్తక ప్రేమికులకోసం

మంచి ప్రయత్నం. సినిమాలకు నవతరంగం, పుస్తకాలకు పుస్తకం బాగున్నాయి. కొద్ది కాలంలోనే ఇది ప్రాచుర్యం పొందాలని, తెలుగు వారికి దూరమైన పుస్తక పఠన అలవాటు, పుస్తకం సైట్ ద్వారా మరలా వెల్లివిరియాలని అభిలాష. ఇందుకు కాను interactive గా ఉండే గుణాలుకల కొత్త రూపురేఖలను ప్రవేశ పెట్టాలి. పాఠకులను సైట్ లో భాగస్వాములను చెయ్యాలి.

పుస్తకాలకు సంభందించిన సమాచారం తో నింపాలనుకుంటున్న, ఈ పుస్తక సమాచార భాండాగారంలో, ఇదివరలో వెలువడ్డ కొన్ని ఉత్తమ పుస్తక సమీక్షలు మరలా ప్రచురిస్తారా? లేక సరికొత్త వ్యాసాలు ఎక్కడా ప్రచురించబడనివి మాత్రమే ఇందులో చేరుస్తారా అనే విషయంలో స్పష్టత కావాలి.

ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

http://pustakam.net/?page_id=2


కొత్త సంవత్సర సంకల్పాలు

మీకు చాలా ఇష్టమయిన వస్తువు రాయటమయితే అది కాశీలో గంగా స్నానమాచరిస్తూ వదిలి రావాలన్నమాట.ఇవన్నీ పిచ్చి నమ్మకాలు.

అందుకోండి నూతన సంవత్సర శుభాకాంషలు.

http://tethulika.wordpress.com/2008/12/31/%e0%b0%8a%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8b%e0%b0%95-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%af%e0%b1%87%e0%b0%a1%e0%b1%82-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0/


Happy New Year

మిత్రులు కలుసుకొని సరదాగా గడపటానికి ఇది ఒక వంక; అంతే, కాలెండర్లో మరో కొత్త రోజు వస్తుంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంషలు.

http://kasturimuralikrishna.wordpress.com/2008/12/31/హాపీ-న్యూ-ఇయర్-టు-ఆల్

"సొగసు చూడ తరమా!!!"

ఇది నిజకథా లేక కల్పితమా? కల్పితమైతే కథ బాగుంది కాని కథా ప్రయోజనమేమిటి? చదువు కంటే పెళ్లి ముఖ్యమనే సందేశం ఇచ్చినట్లు కదూ? దురద్రుష్ట వశాత్తు మన కథా నాయకుడు ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే, నాయిక తన కాళ్లపై నిలబడటానికి కావలసినంత చదువుకోవద్దా?

కొత్త నేస్తానికి నూతన సంవత్సర శుభాకాంషలు.

cbrao
San Jose, CA

http://jaajipoolu.blogspot.com/2008/12/blog-post_30.html


తెలుగు బ్లాగుల ప్రస్థానం

శ్రీపద్మ కస్తూరి బ్లాగులో టపాలేవీ ఇంకా ప్రచురించలేదు. ఇలాంటి వాటిగురించిన ప్రస్తావన అనవసరమేమో! వర్గాల వారీగా బ్లాగు సమీక్షల విభజనలో కొత్త వర్గంగా పుస్తకాలు చేర్చటం అభిలషణీయం. పుస్తకం హస్తభూషణం అన్నారు కదా.

2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం - సమీక్ష ఉపయోగకరంగా ఉంది.

http://poddu.net/?p=1576


రచనలపై హక్కులు

ఏ వెబ్ పత్రికలు రచనలపై సర్వహక్కులూ తమవని చెప్తున్నాయి? ఆ పేర్లు వెల్లడించండి. మిగతా రచయితలు అలాంటి పత్రికలకు ఉత్తరాల ద్వారా తమ అసమ్మతి తెలియచేయవచ్చు. 60 ఏళ్ల పై బడ్డ రచనలకు కాపీరైట్ ఉంటుందా! పరుచూరి గారు ఈ విషయమై భారతీయ చట్టమేమంటుంది?

http://tethulika.wordpress.com/2008/12/22/ఊసుపోక-"కలం-బలం"-అంటే-నవ్


Bold theme

తొలికథలోనే ఇంత bold theme తో రాయటం కొంత ఆశ్చర్యం కలుగచేసింది. స్త్రీలు రాసే కథా వస్తువులో సెక్స్ పాత్ర గతంలో లత, వోల్గా కథలలో ఎప్పుడో చదివాను. ఈ కాలం రచయిత్రులెందుచేతనో (బహూశా సెక్స్ అంటే ఉన్న social stigma వల్ల కావచ్చు) సెక్స్ ఊసెత్తరు. చలం పదే పదే తన రచనలలో సెక్స్, స్త్రీ స్వేచ్ఛ గురించిన ప్రస్తావన పలు మార్లు తేవటం జరిగింది. స్త్రీ పురుషుల మధ్య sexual compatibility ఉంటే విడాకుల ప్రశ్న , ఎవో కొన్ని ఇతర బలీయమైన కారణాలుంటే తప్ప ఉత్పన్నం కాదు. మంచి కథ అందించినందులకు అభినందనలు.

http://arunam.blogspot.com/2009/01/blog-post_8969.html

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి