ఆదివారం, జనవరి 04, 2009
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
వ్యాస నేపధ్యం
కోగంటి సుబ్రహ్మణ్యం సంపాదకత్వాన రాడికల్ హ్యూమనిస్ట్ పక్ష పత్రిక తెనాలి నుంచి ప్రచురితమైంది. 1958 ప్రాంతాలలో ఇన్నయ్య గారు విశాఖపట్టణం లో వుంటూ హ్యూమనిస్ట్ లో రాసిన ఈ వ్యాసం ఇటీవలనే లభించింది. విశ్వనాధ సత్యనారాయణ గారిపై ఆ నాటికే త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ, ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, జాషువా వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు.విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది.
ఆంధ్ర ప్రదేష్ లో పాఠ్య పుస్తకాలను జాతీయం చేసిన సందర్భంలో విశ్వనాథ వారు, అభ్యుదయ మానవతావాదుల తీవ్ర విమర్శలను ఎదుర్కొనవలసివచ్చింది. బుద్ధుడిని రాక్షసుడిగా రాయటం జరిగింది. AGK తీవ్రంగా విమర్శించటంతో ఆ వ్యాసాన్ని పాఠాలనుంచి తొలగించారు. కులం పేర్కుంటూ, జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు చేసారు. ఇవి ఈ వ్యాసం రాసిన సమయాన ఉన్న నేపధ్యం. ఇన్నయ్య గారి వ్యాసం దిగువున ఇస్తున్నాము.
-cbrao
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
అధికార కేంద్రీకరణ సాహిత్యరంగంలో ప్రబలుతున్నకొద్దీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారిని రచయితగా, నవలాకారునిగా, నాటకకర్తగా, కవిగా, పండితునిగా, కవిపండిత, పండిత కవి వగైరాలుగా – విభజించి – ఏ రంగానికారంగమైనా సరే – మొత్తం కలిపి అయినాసరే – ఏరీ ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో విశ్వనాథకు ఎదురేరీ – ఇదీ నేడు వీధి వీధినా జరుగుతున్న తోలుబొమ్మలాట, సాహిత్యంలో స్వాతంత్ర్య పిపాసువులూ, నిష్కర్ష విమర్శకులు లోపిస్తుండగా భట్రాజీయం విరివిగా – కలుపువలె పెరిగిపోతున్నది. ఎవరి స్వార్థములు వారివి. సత్యనారాయణగారితర్వాత ఎవరైతేనేమి... (నెహ్రూ తర్వాత ఎవరన్నట్లు) వర్తమానం గడవాలి. అంటే భజన చెయ్యాలి. అది సరేనయ్యా.
ఈ విధంగా వీధి వీధినా ఏదో శక్తి వుండక పోతుందా – మళ్ళీ తిన్న అన్నమే తిని చూశాను. తిన్న అన్నం తింటే మనిషికి విషం కాదూ మరి ? పశువులైతే నెమరువేయగలవు కానీ పరిణామంలో ఆ శక్తిని అధిగమించాంగా. తిన్న అన్నము వంటిది తినగలము. అంతకుముందున్న అభిప్రాయాలు అవతలకు నెట్టి, పొగడే వారిపై గల గౌరవంతో మళ్ళీ కల్పవృక్షం తిరగేస్తే అంతా చిన్నము నిలువక వ్రాసినట్టే వున్నది. దీపికా లతాంతములో దివ్యజ్యోతి వుంటుందా, అక్కడక్కడ కవిత్వపు పటుత్వం, దుర్విదగ్ధతతో కూడిన శిల్పం మసక మసకగా కన్పించినవి. విశ్వనాథ పేరు నిలబెడితే, అంటే ఆయన తర్వాత కీర్తిని శేషింప చేయగలిగినది పలువురు పేర్కొంటున్న రామాయణ కల్పవృక్షమే యిటులుండ యిక మిగిలిన వాటి మాటేమిటి.
వ్రాసిన నవల లన్నిటిలోకి ఏకవీర అత్యుత్తమమన్నారెవరో. చదివి అభిప్రాయం సైతం యిదివరకే వ్రాశాంగాని, మరలా ఒక్కసారి తిరగేస్తే వంటబట్టని మనస్తత్వ శాస్త్రం కనిపించింది. అదే శరత్ అయితే.
వేయి పడగలు చిత్రం తెలుగు వికిపిడియా సౌజన్యంతో
పరిమాణాన్ని బట్టి అయినా – విశ్వనాథవారి ఓపిక చిహ్నమైన – వేయిపడగలు ఇది ఏ కోవలోకి చెందినదబ్బా? నవల అనటానికి వీలు లేదు. కేవలం వచన రచన అనలేం. అంత జుగుప్స కలిగించే సంభాషణలు, చాదస్తం ఎలా ప్రవేశపెట్టగలిగారో విశ్వనాథవారు. పండిత కవి కదా.
కొందరెవరో వీధి శృంగారమనేవారట విశ్వనాథవారి శృంగార వీధిని. ఏమోగాని వీధిలో సైతం అలాంటి శృంగారం కన్పట్టదు. ఆ మధ్య సన్నిధానం సత్యనారాయణ శాస్త్రిగారి నరస భూపాలీయం చూస్తుంటే శృంగార వీధి లోనిదంతా ఆరీతి అని అన్నారాయన. మరి తెలిసిన వారు ఎక్కడేమాట అనాలో అలాగే అంటారు. విశ్వనాథవారిని చదివి చదివి అభిప్రాయం చెప్పలేని నాలాంటివారికేం తెలుసు ఏమనాలో. తెలియనిచ్చేట్లు రాశారా ఆయన.
విశ్వనాథవారి రచనలన్నీ ఓపిగ్గా సేకరించి ( కొన్నట్లయితే ఎంత అదనంగా బాధపడేవాడినో) చదివిన తర్వాత ఎందుకు ఇంత కాలం వృధా చేశానా? అనిపించింది. అసలు మాతో రోశయ్యగారంటుండేవారు. – తపస్సు చేస్తే మాత్రం పానుగంటి సమాసపు కట్టు విశ్వనాథకు అబ్బుతుందా. విశ్వనాథవారు తన శక్తినంతా దుర్వినియోగమే చేశారు. చక్కని భాషలో గద్యరచన చేసినా బాగుండేది. అన్నిటిల్లో కాలు పెట్టి – దేనిలోనూ సాధన లేకుండా పాడు చేసుకున్నారు. అడుగడుగునా నాగుబాము వలె ఏమారక విషం కక్కుతూ, ఆ వైదికాధ్యాయత తొంగి చూస్తూనే ఉంటుంది ఆయన రచనల్లో. నన్నయకున్న లోటదేగా. ఎందుకో ఆయన శిష్యుడయ్యాడు విశ్వనాథవారు.
విశ్వనాథవారి రచనలు యికనుంచి రావు – వచ్చే అవకాశాల్లేవు – అని నిశ్చితాభిప్రాయాని కొచ్చిన తర్వాత పంచశతి కనిపించింది. అవినీతికి శిఖరాగ్రమందినట్లేనని నిశ్చయించుకున్నాను. ఏమైనా యీ ఆధునిక కాలంలో – అటువంటి రచనలు సాగిస్తూ చెలామణి కాగలుగుతున్నందుకు చెప్పదలచినది ఎవరేమనుకున్నా ధైర్యంగా చెబుతున్నందుకు ఆయన్నభినందించాలి. అయితే నా సందేహమల్లా? విశ్వనాథవారే స్వయంగా వెళ్ళి ఎన్ని సభల్లో తన కావ్యాల విశిష్టతను వివరించగలరు గనుక. వయసు మీరింది. త్వరగా కాలం వృధా చేయక పేరు నిలబడటం కోసం – వెంటనే రచనలన్నిటికీ టీకాతాత్పర్య సహిత వ్యాఖ్యానము వ్రాసిపెట్టిపోతే అభిమానులకు తర్వాత చదువుకునేందుకు బాగుంటుంది. ఈ ఉపన్యాసాలు తాత్కాలికమే కాని చెప్పినదంతా గుర్తుంచుకుంటారా ఏమన్నానా.
ఇంత వ్రాసిన తర్వాత మిత్రుడొకడు, ఎంత చెడ్డా కవిగదా, ఆయన కవిత్వంపై ఏమీ వ్రాయలేదేమన్నాడు. భట్రాజులంతా జీలగబెండులో సారం పిండిన తర్వాత, మిగిలినది పిండి నీవు అనుభవించు అన్నట్లుంది. శక్తి దుర్విదగ్ధతవల్ల చెడగొట్టుకున్నవారిని చెప్పిన తర్వాత, యింకా శక్తి విషయం చెప్పమనటంలో అర్థం లేదు.
మరి వూరూరా విశ్వనాథ సత్యనారాయణ గారికింత ప్రచారం సాగటంలో అంతర్యం? కవిత్వమా? కవిత్వం ఎవడికి కావాలి. లౌకికం. అదే భారతీయ సంస్కృతి లోతుపాతులు తెలిసిన వారికి ఈ విషయాలాట్టే చెప్పనక్కరలేదు. అమ్ముడుపోయే ప్రతులూ, భట్రాయాలూ కాదు. కవిత్వపు విలువను నిర్ణయించేది. అది కాలగమనంలో ఋజువౌతుంది. పేరుకు గ్రాంధికం, లౌక్యానికి వ్యావహారికం, యిది కాదు. సమ్రాట్ లక్షణాలు. అకాడమీలు విలువల్ని కొలవలేవు. అన్నీ ప్రియమైన సత్యాలు చెబుదామనే మొదలు పెట్టాను. సత్యంలో ప్రియత్వమేదీ? ఉంటే విశ్వనాథవారు కవిత్వమే వ్రాయక పొయ్యేవారు.
ఇంతకూ విశ్వనాథను గురించి ఏమంటావు? అన్నాడు మిత్రుడు. కచ్చితంగా చెప్పలేను, పండితుడని, సాహిత్య దృష్టిగలవాడని, తద్వారా ప్రయోజనాన్ని ఆశించిన వాడని సాహిత్య రంగంలో ప్రమాదకర వ్యక్తి అనీ – యింకా ఇలాంటివే ఏవో కొన్ని కారణాలు అందరికీ వంటబట్టవు. ఆహా సరుకుంటే యింత వందిమాగధత్వం ఎందుకవసరమౌతుందీ. ఏమైనా విశ్వనాథ కళ్ళతో తిక్కన, శ్రీనాథుల చూసే దౌర్భాగ్యం కలగకుండు గాక. సాహిత్య రంగంలో ఈ అవ్యవస్థకు భట్రాజీయం అంతిరించు గాక.
అసతోమా సద్గమయ.
-- ఇన్నయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
113 కామెంట్‌లు:
chala chettagaa undi innayya raasindi
ఇదేదో పొలిటికల్ స్టేట్మెంటు లాగా ఉంది తప్ప ఒక గొప్ప సాహిత్యకారుని బేరీజు వేసే రచనగా లేనే లేదు. ఇప్పుడు ఏ సందర్భమని మీరీ రచనని వెలికి తీసి ప్రచురించారో కూడా అర్ధం కాదు.
సరే ఇన్నయ్య రచనని వొదిలెయ్యండి.
"కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది."
ఇది మీర్రాసిన వాక్యం. చాలా తీవ్రమైనది. మీరా కంక్లూషన్ కి ఎందుకొచ్చారో వివరించాల్సిన బాధ్యత ఉన్నది.
కొత్త పాళీ గారూ
రావుగారిని అలా ప్రశ్నించే సాహసం చేయకండి. ఇంతకు ముందు @యోగి కామెంటుకి వారు ఇది ఇన్నయ్యగారన్నారు, వారి బ్లాగులో రాయండి అని జవాబిచ్చేరు. తస్మాత్ జాగ్రత.
సూర్యప్రకాషు
@ కొత్తపాళి: "కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది." - మీరు ఉటంకించిన పై వాక్యానికి, వ్యాసంలో, ముందు ఉన్న వాక్యాన్ని దీనిని కలిపి చదవండి. విమర్శకుల దృష్టిలో కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది. అదీ నేపధ్యం.
ఇన్నయ్య గారి వ్యాసం చదివితే ఒక్క మాట జ్ఞాపకం వస్తుంది. ఏనుగు వెడుతోంటే కుక్కలు మొరిగినా ఏనుగుకి నష్టం లేదు.
----బురద మెచ్చును కాని పన్నీరు నచ్చునా.
ఒక్ఖమాటలో ఖచ్చితంగా చెప్పాలంటే... మనం ఏ వ్యక్తినైనా లేదా ఆ వ్యక్తి కృషినైనా (ఆ కృషి ఏ రంగంలోదైనా) బేరీజు వేయాలంటే మనం స్వయంగా చూసి అనుభవించి ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో ఆ కృషి లేదా కృతి ఎంత గొప్పదో చెప్పినంత ఉత్తమం లేదు అని నా నమ్మకం. నేనిప్పటివరకూ విశ్వనాథవారి రచనలు పెద్దగా చదవలేదు. కాబట్టి ఆయన గురించి చాలామంది పెద్దవాళ్లేమన్నారో అదే నిజమని నమ్ముతాను (విమర్శించిన శ్రీశ్రీనే విశ్వనాథవారిని పొగిడారని కూడ ఎక్కడో చదివిన గురుతు). బహుశా చాలామంది ఆంధ్రుల విషయంలో కూడ ఇది నిజమే కాబోలును. నెత్తిమీద పావలా పెట్టినా గట్టిగా ఒక్ఖ అణాకి కూడ అమ్ముడుపోని కొంతమంది వ్యక్తులకే నేటి సమాజంలో బోల్డంత ప్రచారం ఉందాయె... అలాంటప్పుడు ఈ కోణంలో విశ్వనాథవారికి ఉన్న గుర్తింపు చూస్తే పెద్దగా ఏమీ అనిపించదు.
విశ్వనాథవారిని విమర్శించేంత లేదా పొగిడేంత స్థాయి కావాలంటే మరో విశ్వనాథ పుట్టాలి. ఏ విధంగానూ హేతువాది-ఇన్నయ్యగారు సరిపోరు. అదొక మహామేధ. ఎన్ని జన్మలెత్తినా విశ్వనాథవారిలో ఒక్కశాతం జ్ఞానమైనా మనక్కలుగుతుందా ? అని బాధపడుతూంటాన్నేను.
ఈ వ్యాసం రాసేనాటికి కులాల మీద, మతాల మీదా, ఆచారాల మీద వట్టి వర్గద్వేష పూరితమైన దుష్‌ప్రచారమే తప్ప అవగాహన తక్కువ. అలాంటి కించిద్ జ్ఞానపు అభ్యుదయ/ సోషలిస్టు వాతావరణంలో విశ్వనాథవారు విలన్‌లా కనిపించడం సహజం. ఏదీ ? ఆ ప్రాతిపదిక మీద ఆయన్ని విమర్శించినవాళ్ళు కులానిగ్గానీ, మతానిగ్గానీ, ఆచారానిగ్గానీ ఒక్క వెంట్రుకయినా పీకలేకపోయారేం ఈ యాభై యేళ్ళలో ? పైపెచ్చు తాము వేటినైతే కాదంటున్నారో వాటినే మఱో రూటులో వచ్చి ఆప్యాయంగా కౌగలించుకున్నారు కూడాను.
నేను కూడా కులాన్ని, మతాన్ని, ఎక్కువశాతం ఆచారాల్ని ఖండించను. అంతమాత్రాన నేనొక అస్పృశ్యుణ్ణై పోను. మన ఖర్మేంటంటే - ఆధునిక ప్రపంచంలో చాలామంది పొలిటికల్లీ కరెక్ట్ నినాదాలతోనే మేధావులుగా చెలామణీ అయిపోతున్నారు. నినాదాల దృష్టిలోంచి ఇతరుల్ని నిందిస్తున్నారు, చెప్పేది పూర్తిగా వినకుండాను, లోతులు చూడకుండాను !
దీప్తిధార లో విశ్వనాధ వారికి పట్టం కట్టారా అబ్బో అనుకుంటూ వచ్చాను. నా ఆశ అడియాస అయ్యింది.
అదేంటి Right to speak వుంది కదా రావు గారికి కూడా?? పాపం రావు గారు ఎవరిని ఏమన్నారు? తన అభిప్రాయాలు తన బ్లాగు లో రాస్కున్నారు.
"తనదాకా వస్తే..." అనే సామెత ఇందుకే వచ్చింది ఏమో?? :)
అవునూ ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు జరగలేదు ఎందుచేత. రావు గారి హుందాతనం అనుకోవాలా. లేక ...??????????
@ అరుణ: నేను వ్యక్తిగత దాడులకు వ్యతిరేకం. టపాలోని విషయం బాగాలేక పోతే, రచయిత అవాస్తవాలను వెల్లడిస్తే రచనపై సంధించాలి బాణాలు; రచయితపై కాదు. ఈ వ్యాసంలో రాసినవి అవాస్తవాలని ఇంతవరకూ ఒక్కరూ రాయలేదు. వ్యాసం బాగాలేదు అంటే సరిపోతుందా? ఎందుకు బాగాలేదు? రచయిత విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఎక్కడ విఫలమయ్యాడు లాంటి విషయాలతో అర్థజనితమైన వ్యాఖ్య కోసం ఏ బ్లాగరైనా ఎదురుచూడాలి అంతే. వ్యాఖ్యలు లో సంస్కారం లోపిస్తే వాటిని తొలగించాలి అంతే కాని వ్యక్తిగత దాడులవలన ఎవరికి లాభం? మీ జాబుకు నెనర్లు.
" విశ్వనాధ సత్యనారాయణ గారిపై ఆ నాటికే త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ, ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, జాషువా వంటి వారు తీవ్ర విమర్శలు చేశారు.విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది." మరి పురోగమన వాదులు గా
మీరు చెప్పిన పైవారిలో శ్రీ శ్రీ గారి మీద వున్న విమర్శలు అందరికి తెలిసినవే. ఇక పొతె మీరు నా ప్రపంచం బ్లొగ్ లో రామస్వామి గారి గురించి మీరు అన్నది రామస్వామి గారు మతాభిమానాన్ని బాగా విమర్శించినారు.కులాంతర వివాహాలు ప్రోత్సాహించారు. తన జీవిత చివరి భాగంలో మాత్రమే, తన పేరులోని చౌదరి ని పరిత్యజించారు.తమ పిల్లలకు, కమ్మ కులంలోనే, వివాహాలు గావించారు. రామస్వామి గారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో చివరిది భగవద్‌గీత.ఈ పుస్తక ప్రచురణ సమయంలో, రామస్వామిగారు తన పేరులో చౌదరి ని ప్రచురించలేదని, కొందరు చెప్తున్నారు. మలిముద్రణలలో కూడా చౌదరి తొలగించబడి ఉండ వచ్చు. ఏమైనా, ఇది ఆహ్వానించదగ్గ పరిణామము. మత చాందసాలను, చీల్చి చెండాడిన, రామ స్వామి గారు, వ్యక్తిగత జీవితంలో కుల తత్వాన్ని అధిగమించ లేకబోయారు.
ఈ విషయాలు, ఇన్నయ్య గారి వ్యాసములో చర్చనీయాంశాలయి,శ్రీయుతులు చేకురి రామారావు, కోటపాటి మురహరి రావు, రావెల సొమయ్య, ఇతరత్రా ప్రముఖుల కు మింగుడు బడలేదు.చివరకు కక్కా లేక మింగా లేక అయిష్టంగానైనా, వారంతా ఒప్పుకోవాల్సి వచ్చింది. "
Narla V R on Viswanatha Satyanarayana:
"Viswanatha Satyanarayana is undoubtedly a genius. For over four decades now he has been striding the Telugu literary scene like a Colossus. From the lyric poem to the grand epic, from the short story to the mighty saga, from the one-act play to the full – length drama, from the literary essay to the philosophical disquisition, there is no literary genre to which he has not contributed abundantly. He is, indeed, the most prolific of our front-rank writers. At a modest guess, his published works run into more than thirty thousand pages. And at what speed does he compose? A three hundred- page novel, he claims, takes him just one week’s dictation. He is equally quick in his output of poetry. After mental composition, he sets down on paper, again according to his own claim, a score or more of verses at a time. Even though he is now publishing much more than ever before. This is all the more amazing when we note the most of the other Telugu writers who started their literary careers along with Viswanatha in the twenties of this century have gone more or less dry quite along while ago. The versatile and prolific nature of the genius of Viswanatha has attracted to him a host of admirers. I too count myself as one among them, though unlike others I am rather critical of the abiding values and the ultimate worth of his contribution to modern Telugu literature."
@Rao garu
"నేను వ్యక్తిగత దాడులకు వ్యతిరేకం"
నాకు తెలుసండీ. మీ నుండీ బ్లాగుల్లో వ్యక్తిగత దాడులు గాని, అవి ప్రోత్సహించడం కాని ఇప్పటివరకు చూడలేదు నేను కూడా.
"వ్యాఖ్యలు లో సంస్కారం లోపిస్తే వాటిని తొలగించాలి అంతే కాని వ్యక్తిగత దాడులవలన ఎవరికి లాభం? "
ఈ నిజం అందరూ తెల్సుకుంటే ఎంత బాగుంటుంది. బ్లాగ్లోకం సొంత జాగీరు మల్లే వాడేస్కుంటున్న వాళ్ళు ఈ సత్యాన్ని గుర్తిస్తే, ఇప్పటికే ఎన్నో జతల కళ్ళు ఈ పధ్ధతులని అర్ధం చేస్కున్నాయని తెల్సుకుంటే మంచిదేమో. అందరిని తోలు మందం చేస్కోమని చెప్పటం కంటే, అందరినీ గిల్లటం గిచ్చటం మనమే మానేస్తే మంచిదేమో.
క్షమించాలి టాపిక్ పక్కదారి పట్టితే. ప్రస్తావన వచ్చేప్పటికి తప్పు ని ఖండించడం తో పాటు ఒప్పు ఏదో కూడా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.
@Yogi garu
మీ సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీస్కుంటాను. :)
మీరు చెప్పిన అభ్యుదయ వాదులందరు ఎంత వరకు అభ్యుదయ వాదులో పాటకులు/ప్రజలు వారిని గురించి సమగ్రంగా చదివి తెలుసుకొని అభిప్రాయలు ఎర్పరచుకుంటారు. అంటె కాని ఒక పాత
వ్యాసన్ని తిరిగి ప్రచూరించి మీతు కొత్తగా బ్లొగువాళ్లకు చెప్పెది ఎమీ లేదు.
అలాగే ఇన్నయ్య గారి సాహితి విమర్శలు (విస్వనాథ గారి మీద ) మీరు నిర్వహించె నార్లా గారి బ్లొగ్ లొనే మీకు సమాధానం దొరకుతుంది. " Viswanatha Satyanarayana is undoubtedly a genius. "
సి.బి.రావుగారు వ్యక్తిగత దాడులకి వ్యతికేకమని తెలుసుకొని చాలా సంతోషించాను. కానీ నన్నొక సందేహం పట్టిపీడిస్తోంది. ఇన్నయ్యగారు విశ్వనాథవారిమీద చేసిన విమర్శ వ్యక్తిగతదాడి కాదా ? ఒక పుస్తకాన్నో రచననో తీసుకొని చేసిన విమర్శేనా ఇది ?
విశ్వనాథ మీద ఇలా నోరుపారేసుకోవడం (దీనికింత కన్నా మంచి పదం నాకు దొరకలేదు, దీన్ని విమర్శ అనలేమన్నది స్పష్టమే,కాకపోతే ఈ వ్యాఖ్య పూర్తిగా చదవండి, కనీసం పొలిటికల్ స్టేట్మెంటు అనడానికి కూడా నాకు మనసొప్పటం లేదు) కొత్తేమీ కాదు. కాబట్టి చదివాక నవ్వి ఊరుకున్నాను. అయినా ఈ కాలంలో ఎవరు దీన్ని గురించి పట్టించుకుంటార్లే అనుకొని. కానీ ప్రతిస్పందన చూసాక, ముఖ్యంగా సి.బి.రావుగారి వ్యాఖ్య చూసాక ఇది రాయకుండా ఉండలేక పోయాను. రావుగారు వ్యక్తిగత దాడులకి తాను వ్యతిరేకం అన్నారు. సంతోషం. మరి ఈ వ్యాసంలో ఈనయ్యగారు చేసిన వ్యక్తిగత దాడి కనబడలేదా? కనబడినా దాన్ని ఏ రకంగానూ ఖండిచకుండా ఎలా ఉన్నారు?
"ఈ వ్యాసంలో రాసినవి అవాస్తవాలని ఇంతవరకూ ఒక్కరూ రాయలేదు. వ్యాసం బాగాలేదు అంటే సరిపోతుందా? ఎందుకు బాగాలేదు? రచయిత విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఎక్కడ విఫలమయ్యాడు లాంటి విషయాలతో అర్థజనితమైన వ్యాఖ్య కోసం ఏ బ్లాగరైనా ఎదురుచూడాలి అంతే."
అని కూడా అన్నారు. ఈనయ్యగారు తన వ్యాసంలో చేసింది సరిగ్గా ఇదే కదా! విశ్వనాథ రచనలు బాగోలేదు (ఇంకా తీవ్రమైన మాటలే) అని ఊరుకున్నారు కాని, ఎందుకు బాగోలేదో అర్థజనితంగా వివరించారా? లేదే! మరి ఏరికోరి దీన్ని మళ్ళీ ఇక్కడ ప్రచురించడం వెనక ఉద్దేశమేమిటి?
సరే, నేనీ వ్యాసం గురించి పైన చెప్పిన మాటలకి వ్యాసం మొత్తమూ ఉదాహరణే అయినా, ప్రత్యేకించి కొన్ని ప్రశ్నలని వేస్తున్నాను. ఈ వ్యాసాన్ని అవగాహన చేసుకొనే రావుగారిక్కడ పెట్టారని నేననుకుంటున్నాను కాబట్టి, వారే సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. అప్పుడు ఆరోగ్యకరమైన చర్చ చెయ్యవచ్చు. లేదూ దీనికి ఈనయ్యగారే జవాబిచ్చుకోవాలి అంటే ఇంకప్పుడు చర్చకి మార్గమేది? మంచి చర్చ జరగాలన్నదే కదా రావుగారి ఆకాంక్ష. అందుకే వారా బాధ్యతని తీసుకోవాలి మరి.
" ఏ రంగానికారంగమైనా సరే – మొత్తం కలిపి అయినాసరే – ఏరీ ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో విశ్వనాథకు ఎదురేరీ – ఇదీ నేడు వీధి వీధినా జరుగుతున్న తోలుబొమ్మలాట, సాహిత్యంలో స్వాతంత్ర్య పిపాసువులూ, నిష్కర్ష విమర్శకులు లోపిస్తుండగా భట్రాజీయం విరివిగా – కలుపువలె పెరిగిపోతున్నది. ఎవరి స్వార్థములు వారివి." - విశ్వనాథని మెచ్చుకొనేవారిని ఊకుమ్మడిగా భట్రాజులని గేలిచేస్తూ, వాళ్ళకి స్వార్థాన్ని అంటగట్టడం వ్యక్తి నింద కాదా?
"తినుచున్న అన్నమే తినుచుంటిమిన్నాళ్ళు" అన్న వాక్యాలకి ఈనయ్యగారు చెప్పిన అర్థం వంకర భాష్యమని మీకు తెలియదా?
"మళ్ళీ కల్పవృక్షం తిరగేస్తే అంతా చిన్నము నిలువక వ్రాసినట్టే వున్నది" - ఇలా అనడాం వెనకనున్న కారణాలని వివరించలేదెందుకు? మరది సాహిత్య విమర్శా లేక విశ్వనాథమీదున్న అక్కసు వెళ్ళగక్కడమా?
"వేయిపడగలు ఇది ఏ కోవలోకి చెందినదబ్బా? నవల అనటానికి వీలు లేదు." - ఎందుకో చెప్పలేదు మళ్ళీ.
"విశ్వనాథవారిని చదివి చదివి అభిప్రాయం చెప్పలేని నాలాంటివారికేం తెలుసు ఏమనాలో. తెలియనిచ్చేట్లు రాశారా ఆయన." - ఈ వ్యాసంలో ఈనయ్యగారు చెప్పినవి అభిప్రాయాలు కావా?
"అన్నిటిల్లో కాలు పెట్టి – దేనిలోనూ సాధన లేకుండా పాడు చేసుకున్నారు. అడుగడుగునా నాగుబాము వలె ఏమారక విషం కక్కుతూ, ఆ వైదికాధ్యాయత తొంగి చూస్తూనే ఉంటుంది ఆయన రచనల్లో. నన్నయకున్న లోటదేగా. ఎందుకో ఆయన శిష్యుడయ్యాడు విశ్వనాథవారు." - "దేనిలోను సాధన లేకుండా పాడుచేసుకున్నాడు" అన్న ఘాటైన అభిప్రాయం ఏ చిన్న సమర్థనా ఇవ్వకుండా అనేస్తే అది విమర్శ అవుతుందా నోటి దురుసుతనం అవుతుందా? వైదికాధ్యాయత తొంగి చూడ్డం ఒక్కటే అతని దోషంగా అనిపిస్తోంది. వారన్న "చక్కని భాషలో గద్య రచన"లో కూడా వైదికాధ్యాత తొంగిచూస్తే అప్పుడేమనేవారో? అప్పుడది చక్కని భాష కాకుండా పోయేది కాబోలు.
విశ్వనాథ రచనలలో సాంప్రదాయికత, వైదికాధ్యాత ప్రస్ఫుటంగా కనిపిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులో ఈ కాలానికి పనికిరానివి కూడా ఉన్నాయని ఒప్పుకోవడానికి నాకే మాత్రమూ అభ్యంతరం లేదు. కేవలం వాటిని పట్టుకొని ఆ రచనలని బేరీజు వెయ్యడం సాహిత్య విమర్శ అనిపించుకోదని సాహిత్యంలో ఓనమాలు తెలిసినవాడైనా ఒప్పుకొనే విషయం. అంచేత ఇక్కడ చర్చలో ఆ విషయాలని ప్రస్తావించడం అనవసరం.
అసతోమా సద్గమయ. తమసోమా జ్యోతిర్గమయా.
@Aruna..."అందరిని తోలు మందం చేస్కోమని చెప్పటం కంటే, అందరినీ గిల్లటం గిచ్చటం మనమే మానేస్తే మంచిదేమో"...well said!
నా పై వ్యాఖ్యలో "ఇన్నయ్య"గారిని "ఈనయ్య" అని పొరపాటున రాసాను. క్షమించండి. ఇది నా పొరపాటే తప్ప వెటకారంకోసం రాసింది కాదని గమనించండి.
కర్‌కట్టుగానే రాసారు ;)
అసలు రావుగారిక్కడ రాసినవాటిలో ఒక్కటి కూడా ఆయన అభిప్రాయం లేదు.. అన్నీ వేరేవారివి. అయితే ఈ టపా మొదటి కూర్పులో రావుగారి అభిప్రాయం ఒకటుండేది., అదిప్పుడు లేదు. మొదటి పేరాలోని "విమర్శకుల దృష్టిలో" అనే ముక్క టపా మొదటి కూర్పులో లేదు. సహజంగానే, ఆ విమర్శ రావుగారే చేసినట్టు అప్పుడు అర్థం వచ్చింది. అంత తీవ్రమైన విమర్శ చేసినపుడు ఏవిఁటి కారణమని అడగడం హక్కులను లాగేసుకున్నట్టవుతుందా?
------------------
రావుగారూ, విశ్వనాథ వారి పాడిత్యం గురించి చెప్పగల సత్తా నాకు లేదు. మీ పాండిత్యం గురించి చెప్పగలవాడనూ కాను. కానీ ఈ టపాను నిన్న చూసినప్పుడు అంత తీవ్రంగా ఆయన్ను ఎందుకు విమర్శించారో అర్థం కాలేదు. "విమర్శకుల దృష్టిలో " అనే ముక్కను మీరు తగిలించిన తరవాతే మీరు చెప్పిన అర్థం వచ్చింది.
పోతే.. ఇక్కడి వ్యాఖ్యాతలు ఇన్నయ్యగారి వ్యాసంలోని లోపాలను చూపారు. దాంతోపాటు వ్యక్తిగత దాడిపై మిమ్మల్ని కొన్ని సూటి ప్రశ్నలూ అడిగారు. నాకూ అవే ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలకు మీ సమాధానాల కోసం ఎదురుచూస్తాను.
చదువరి గారి కామెంటు చదివాక కొత్తపాళీ గారి ప్రశ్న అర్థమయింది.
"చెబితే వినడు కొడితే ఏడుస్తాడు" అన్నట్లు ఇటువంటి వివాదాస్పద టపాలు ప్రచురించడమెందుకు నలుగురితో నానామాటలు అనిపించుకోవడమెందుకు?
"ఒక మహానుభావుడిని పట్టుకుని పనికిమాలినవాడు" అని ఇన్నయ్యగారు అంటే మీరు దాన్ని పనిగట్టుకుని ఇక్కడ ప్రచురించవలసిన అవసరమేమిటి సార్?
ఒక్కవిషయం, మీ ఇన్నయ్యగారు వ్రాసిన దానిపై మీ అభిప్రాయం చెప్పండి.
ఒక ‘చెలియలకట్ట’ తప్ప విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు నేను చదవలేదుగానీ, ఇక్కడ చర్చమాత్రం...చెలియలకట్ట దాటుతోందనిపిస్తోంది.
@ యోగి: "మీరుఏది రాయాలో ఏది రాయకూడదో (అసలు మీరు రాయాలో రాయకూడదో) స్వయం ప్రకటిత బ్లాగు పెద్దలనుంచి తెలుసుకోండి! " -బ్లాగు ప్రపంచం లోకి మీరు కొత్తగా వచ్చినట్లు కనబడుతుంది. బ్లాగర్లకు తాము రాసే విషయాలపై ఇతరుల నియంత్రణ ఉండటం సవ్యం కాదని నేను రాసి ఉన్నాను. నా టపా ధర్నా కనపడుటలేదు చూడండి. భావ స్వాతంత్ర్యానికి ఎవరు అడ్డుగా ఉన్నారో మీకే విదితమవుతుంది.
"మేం అభిమానించేవాడిని ఎదిరించావో - వ్యక్తిగత దాడి ." - నేను ఎవరిపై నన్నా వ్యక్తిగత దాడి చేశానా ఈ విధంగా -గతంలో. ఎన్నడూ లేదు. ఎవరిపై వ్యక్తిగత దాడి చేశానో చెప్పగలరా?
"రచయిత గారు non intellectual, unscientific and adhoc criticism రాస్తే ఎలా విభేదిస్తాం చెప్పండి? " - త్రిపురనేని రామస్వామి, శ్రీ శ్రీ, ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, జాషువా, ఇన్నయ్య - ఏ విమర్శకుడితో మీరు విభేదిస్తున్నారు? అందరితోనా?
మీ మొదటి జాబు కంటే రెండో జాబు సభ్యతగా ఉంది. అందుకు మిమ్ములను అభినందిస్తున్నాను.
జీవితానికి భిన్న పార్శాలున్నట్లే సాహిత్యానికి భిన్న పార్శ్వాలుంటాయి. ఒక తరహా ప్రపంచానికి విశ్వనాధ గారు చక్రవర్తి. అందులో తప్పేమిటి. ఒకరిని విమర్శించేపుడు ఆయన చెప్పిన విషయాలను,వాని సామాజిక ప్రయోజకత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆధ్యాత్మికత గొప్పదా హేతువాదం గొప్పదా అంటే నా వోటు ఆధ్యాత్మికతకే. రెండూ రెండు రకాలైన మతాలే.
ఈ మాట శబ్ధ తరంగాలో విశ్వనాధగారి గళంద్వారా ఆయన నిశ్చితాభిప్రాయాలను విని ఆయనంటే, నా యవ్వనకాలాల తక్కువ భావాలు(పాషాణ భావాల కవి అని) తుడిచిపెట్టుకుపోయి, గొప్ప గౌరవం ఏర్పడింది. ఒక చోట ఆయనంటారు " దేముడు ఉన్నాడో లేదో తెలీదు, ఉన్నాడు అని అనుకొనేప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది అనుకొన్నప్పుడు అలా అనుకోవటంలోనూ, అలా ప్రచారం చేయటం మంచిదే కదా" అని (ఇవే పదాలు కాకపోవచ్చు, అర్ధం మాత్రం ఇదే). మొదట నేను దిగ్భ్రాంతి చెందినా ఆలోచించి చూడగా ఇది చాలా శాస్త్రీయమైన విశ్వమానవ కల్యాణ కాంక్ష, గొప్ప హృదయవైశాల్యత లా అనిపించింది.
నచ్చింది.
ఆయన ముద్ర తెలుగు సాహిత్యంపై మరువరానిది. అది ఆకాలంలోనే విమర్శకులదాడినెదుర్కొని నిలిచినదనే నా అభిప్రాయం. బ్లాగులోకంలో కూడా ఆయనను అభిమానించేవారు, సమర్ధించేవారు ఉండటాన్ని బట్టి ఆయన ముద్రఏపాటిదో గ్రహించవచ్చును.
బహుసా కొంతమంది అనుకోవచ్చు ఇది కులపరంగా జరుగుతున్న సమర్ధనేమోనని, అది అసత్యం. విశ్వనాధవారు హైజాక్ చేయబడలేని సార్వజనీనుడు.
భైరవభట్ల గారి కామెంటు చాలా శాస్త్రీయంగా ఉంది.
వారి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఆశిస్తాను.
cb రావు గారు, నేను మిమ్మల్ని సమర్థిస్తున్నాను. విశ్వనాథ వారిపై మామూలుగా, జనసామాన్యం లో ఉన్న అభిప్రాయాలు కాక, ఓ భిన్న అభిప్రాయం వ్యక్తపరచబడింది అని మీరు చెప్పదలిచారని నేను భావిస్తున్నాను. దీని వెనుక ఏ దురుద్దేశం ఉందనో భావించట్లేదు.
మీరు నేపథ్యం కూడా సరిగ్గానే వివరించారని నా ఉద్దేశం.
"విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది.....బుద్ధుడిని రాక్షసుడిగా రాయటం జరిగింది...కులం పేర్కుంటూ, జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు చేసారు. .." పైవన్నీ సజావుగా కనిపిస్తున్న నేపథ్యాలే.
@Rao Garu
Yogi garu "స్వయం ప్రకటిత 'బ్లాగు పెద్దల'నుంచి" అన్నారు కాని. 'బ్లాగు పెద్ద' నుంచి అనలేదు. అంటే మిమ్మల్ని కాదు. ఇక్కడ బ్లాగు పెద్దరికాల్ని ఆపాదించుకున్న వేరే ఎవరినో అని అర్ధం.
"మేం అభిమానించేవాడిని ఎదిరించావో - వ్యక్తిగత దాడి ."
దీనికి అర్ధం తాము అభిమానించే సదరు బ్లాగు పెద్ద ని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వ్యక్తిగత దాడి చేసే కొందరు హీన సంస్కారుల గురుంచి. ఇక్కడ కూడా మిమ్మల్ని కాదు అన్నది.
నా వ్యాఖ్యకు స్పందన గా ఈ వ్యాక్యాలను యోగి గారు రాశారు. నా మొదటి వ్యాఖ్య మిమ్మల్ని వుద్దేశించింది కాదు. కాబట్టి యోగి గారి ప్రతిస్పందనగా చెప్పిన వ్యాక్యాలు వరకు మీకు సంబంధించినది కాదు.
అందుకే టాపిక్ పక్కదారి పట్టింది అని నేను రెండవ వ్యాఖ్య లో రాశాను.
ఇకపోతే వ్యాసం లో విశ్వనాధ వారి మీద ఇన్నయ్య గారు చేసిన దాడిని నేను కాని, యోగి గారు కాని సమర్ధించలేదు.
Hope I cleared the confusion.
@రవి గారు,
మీరు నేపథ్యం కూడా సరిగ్గానే వివరించారని అని అన్నారు.
"విమర్శకుల దృష్టిలో, కులం, మత ఛాందసం, దుష్టాచారాలను సమర్ధించిన విశ్వనాథ తిరోగమనవాది.....బుద్ధుడిని రాక్షసుడిగా రాయటం జరిగింది...కులం పేర్కుంటూ, జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు చేసారు. .." పైవన్నీ సజావుగా కనిపిస్తున్న నేపథ్యాలే.
కాని ఈ వ్యాసం లో ఎక్కడైనా పైన చెప్పిన నేపధ్యము మీద ఒక్క మాటైనా వుందా? నాకు ఎక్కడా కనిపించ లేదు. ఇది కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారయణ గారి రచనల మీద చేసిన వ్యంగ్య వ్యాఖ్యనాలు అని నావుద్దేశము, నాలాగే ఇక్కడ చాల మంది ది అదే అభిప్రాయం.
" విశ్వనాథ వారిపై మామూలుగా, జనసామాన్యం లో ఉన్న అభిప్రాయాలు కాక, ఓ భిన్న అభిప్రాయం వ్యక్తపరచబడింది అని మీరు చెప్పదలిచారని నేను భావిస్తున్నాను.దీని వెనుక ఏ దురుద్దేశం ఉందనో భావించట్లేదు."
మరి భిన్న అభిప్రాయం వ్యక్తపరచాలి అనుకున్నపుడు ఇలాంటి (see భైరవభట్ల కామేశ్వర రావు point out chesina )విమర్శలేందుకు? నేరుగా విశ్వనాధ గారు జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు ఎప్పుడు, ఎలా, ఎందుకు చేసారు? దానిని జాషువా గారు ఎలా త్రిప్పి కొట్టారు, అలాగే బుద్ధుడిని రాక్షసుడిగా ఎక్కడ,ఎప్పుడు అన్నారు అని వ్యాసం రాసి వుండవచ్చు కదా!
ఇక్కడ చర్చ చాల రసవత్తరంగ నడుస్థుంది. ఇంతవరకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన పుస్తకాలు చదవలెదు. School రొజులలొ తెలుగు మాస్టారు చెప్పిన పాటాలు ఇప్పుడు గుర్తుచెసుకొవాలి. లెదా ఇప్పుడు చదివి చర్చలొ పాల్గొవాలి. Wish you guys all the best.
@ Aruna, అరుణం, యోగి, sutti katti : మీ ఉత్తరాలకు ధన్యవాదాలు. ఈ నలుగురు వేరా లేక ఒకరేనా? వేరయితే Aruna మీరు దయచేసి enable access to your Profile. ఒకరు ఇన్ని పేర్ల తో రాయవలసిన అవసరమేమిటో నాకు తెలియటం లేదు. ఒకవేళ మీరు వేరయితే నా అజ్ఞానానికి మన్నించాలి.
ఈ మధ్య అమెరికా పర్యటనలో ఒక యువ మిత్రుడు తారసపడి, ఎదో మాటల సందర్భంలో అడిగాడు శ్రీ శ్రీ అంటే ఒక్కరా లేక ఇద్దరా అని. అతని ప్రశ్నకు నవ్వుకొని ఒక్కరే అని జవాబిచ్చాను. మీ సమాధానం కూడ ఒక్కరే అంటే నేను ఆశ్చర్యపోను.
రావ్ గారు, మీరు ఏ ఉద్దేశ్యం తో, ఈ టపా ప్రచురించారో కాని, ఇన్నయ్య గారిని మీరు వెనకేసుకురావటం, ఆయన్ను, త్రిపురనేని ని, ఆవుల గోపాలక్రిష్ణయ్య, శ్రీ శ్రీ లను, ఒకే గాటన కట్టేయాలనుకోవటం మాత్రం ఏమీ బాగా లేదు.
ఇన్నయ్య గారు టపాల కు మీరు ప్రాచుర్యం కల్పించనక్కర్లేదనుకొంటా, ఎందుకంటే వారి బ్లాగ్ ఉంది, అది ఎంతో కొంత ప్రాచుర్యం పొందినదే.
విశ్వనాధను త్రిపురనేని విమర్శించాడేమో కాని, పైన మీరు ఉటకరించిన వ్యాసం అంత అద్వాన్నంగా (తలా, తోకా లేకుండా) మాత్రం అయ్యి ఉండకపోవచ్చునేమో నని నా అభిప్రాయం.
మా తాత గారికి ఆయన మిత్రుడు అవ్వటం వలన, ఆయన గురించి మా తెనాలి లో విని ఉండటము వలన అలా అనుకొంటున్నాను.
చర్చ ప్రక్క దారిపట్టకుండా మీరు పైన యోగి (మీ ద్రుష్టి లొ నలుగురో, నలబయ్యి మందో అయినప్పటికి) అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి.
సూటిగా సమాధానం ఇవ్వలేను అనుకొంటే ఎప్పటి లాగానే, ఆ ప్రశ్నలు ఇన్నయ్యను మాత్రమే అడగండి, కేవలం నేను నా భట్రాజు పాత్ర పోషించాను అని చెప్పండి. ఇక చర్చించాల్సిన అవసరం ఉండదు.
p.s. విశ్వనాధ మీద పొగడ్తలే కాదు, వేరు అభిప్రాయాలు కూడా ఉన్నాయి, అవి పరిచయం చేద్దాము అనే మీ ప్రయత్నం నాకు నచ్చింది, కాకపోతే, ఇంత చెత్త వ్యాసం తో, మొదలెట్టటమే బాలేదు.
ఇక శ్రీ శ్రీ ఒకరా, ఇద్దరా అని ఎవరో తెలియక అడిగారు అంటున్నారు, బాగా తెలిసినవాళ్లు అయితే మాత్రం, ఒకరు, ఇద్దరు ఏమిటి, ఆయనకు చాలా రూపాలు ఉన్నాయి అంటారు.
ఆరుణం ఐ.డి. అరుణ పప్పు గారిది. తనని హైదరాబాదు బుక్ ఫెస్టివల్ లో బ్లాగర్లందరూ చూసారు. యోగి గారిని కూడా అక్కడ అందరూ చూశారు. ఇక నేను, తెలుగు ముచ్చట్లు బ్లాగు నడిపిన అరుణ గోసుకొండ ని. ఈ మధ్య బ్లాగు మూసేశా. ఇక ఇప్పటికైనా భైరవభట్ల గారు, యోగి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారా?
"పొద్దు పెద్దలకి ప్రత్యేక విన్నపం."
ముఫ్ఫై కామెంట్లకు పైగా వచ్చిన టపా కదా అని దీని వివరాలని బ్లాగు వీక్షణం లో ప్రచురించకండి. ఈ టపా రావడమే సాహితీ ప్రియులందరికి బాధ గా వుంటే. దీనికి పొద్దు లో చోటు దొరకడం అందరినీ అవమానించినట్లు అవుతుంది.
C.B. రావు గారు, మీకు నేను ఒక పాటకుడిని మాత్రమే నాకు బ్లొగ్స్ రాసే అంత సమయము మరియు నిపుణత లేదు. నాకు ఆ అరుణ ఎవ్వరో తేలిదు అలాగే యోగి కూడా. నాకు తప్పు అని పిస్తే నేను నా వ్యాఖ్యాలు రాస్తాను, అంతే. నేను బ్లొగ్ క్రియెటె చేసింది కొంతమంది అప్పట్లో ఇప్పుడు దాదాపు అందరు యుసర్ ఐ.డి. లేక పోతే వ్యాఖ్యలు రాయడాని కి అనుమతించటం లేదు.
మీరు శ్రీ శ్రీ ఉదహిరించి రాస్తున్నారు నాకు ఇదె అనుమానం వచ్చింది, నార్లా గారి బ్లొగ్ లో విశ్వనాధ గారి మీద అలా రాసారు " Viswanatha Satyanarayana is undoubtedly a genius.". మరి ఈ రోజు ఇలాంటి టపాను రాశారు అని నేను మొదట ఆశ్చర్య పోయాను. మీరు నా సందేహాన్ని తీర్చగలరు.
అయ్యో, ఇక్కడి అరుణం పేరు అరుణ పప్పు గారిది కాదా. నేను సరిగ్గా చూస్కోలేదు. సారీ అరుణ పప్పు గారు.
@ అరుణం:"కాని ఈ వ్యాసం లో ఎక్కడైనా పైన చెప్పిన నేపధ్యము మీద ఒక్క మాటైనా వుందా? "
-మాలపల్లి నవల, చిత్రం గురించి రాసేటప్పుడు అప్పటి నేపధ్యం గురించి, ఆ నవల లేక చిత్రం విడుదల తరువాత జరిగిన అనేక సంఘటనలు గురించి కాని ముచ్చటించుకుంటాము. ఇవన్నీ ఆ మూల నవల లో ఉండవచ్చు, ఉండకపోనూ వచ్చు. కథా సంపుటాలలో కథాకాలం అని వేస్తుంటారు చూడండి అదీ ఒకరకంగా కథ నేపధ్యాన్ని వివరించటానికే. కొన్నింటిలో కథా నేపధ్యాన్ని సంపాదకులు లేక మూల రచయిత వివరించటం ఉంటుంది. ఇది రచనలను పరిచయం చేసేటప్పుడు చేస్తున్న శాస్త్రీయ పద్ధతి.
"అలాగే బుద్ధుడిని రాక్షసుడిగా ఎక్కడ,ఎప్పుడు అన్నారు అని వ్యాసం రాసి వుండవచ్చు కదా!"
-వ్యాసం కన్న, మీ ఆసక్తి నేపధ్యంపైనే ఎక్కువగా ఉన్నట్లుంది. అది తప్పనను. 1957 లొ జాతీయం చేసిన 5వ తరగతి తెలుగు వాచకము లొ బుద్ధుని పై పాఠం.బుద్దునిపై విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన అనౌచిత్య విమర్శలపై ఎజికె పెద్ద ఉద్యమం చేశారు. 1956-57లో పాఠ్యగ్రంథాలనుండి, బుద్ధుణ్ణి రాక్షసుడుగా చిత్రించిన భాగాలు తొలగించే వరకూ నాటి విద్యామంత్రి ఎస్.బి.పి పట్టాభి రామారావుపై విమర్శలు చేశారు. (చూడండి Telugu Street లో AGK పై ప్రత్యేక వ్యాసం.)
@ Arunam: "మీరు నా ప్రపంచం బ్లొగ్ లో రామస్వామి గారి గురించి మీరు అన్నది రామస్వామి గారు మతాభిమానాన్ని బాగా విమర్శించినారు."- నేను ఎన్నడో నా ప్రపంచంలో రాసినది మీరు ఇంకా గుర్తుపెట్టుకున్నందులకు మీ జ్ఞాపకశక్తికి జోహార్లు. రామస్వామి గారు హేతువాది. నేను రాసినది కులతత్వాన్ని గురించి,మతాభిమానాన్ని గురించి కాదు. త్రిపురనేని గురించిన ఒక పరిశీలన నేను పేర్కొనటం తప్పు ఎలా అవుతుంది?
Narla V R on Viswanatha Satyanarayana
విశ్వనాధ గురించి నార్ల ఇలా అన్నారు అని రాయటం జరిగింది. ఇందులో మీకు ఆశ్చర్యం కలిగించిన అంశమేమిటి? ఈ కింది వాక్యం మరో మారు పరికించండి. నార్ల మాట '"Unlike others I am rather critical of the abiding values and the ultimate worth of his contribution to modern Telugu literature."
@ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: "ఇన్నయ్యగారు విశ్వనాథవారిమీద చేసిన విమర్శ వ్యక్తిగతదాడి కాదా ?"- మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందులకు ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్న సబబైనదే. ఇక్కడ మనము తేల్చవలసినది ఏది వ్యక్తిగత దాడి? ఏది కాదు అని. మీకు ఒక ఉదాహరణ చెపుతాను. ఒక రచయిత ఉన్నాడనుకోండి. అతను ఒక తాగుబోతు. పెద్దిల్లుతో బాటు చిన్నిల్లు కూడా నడిపే గ్రంధసాంగుడు. లంచగొండి కూడా. ఇలాంటి విషయాలను ఆ రచయిత గురించి మన రచనలో చెప్తే అది వ్యక్తిగత దాడి అవుతుంది.
ఇంకో ఉదాహరణ. ఒక వ్యక్తివి అన్నీ బూర్జువా భావాలనుకోండి. వర్ణ వ్యవస్థను సమర్ధిస్తూ అంటరాని వాళ్లను హేళన చేస్తూ తన రచనలలో వెలిబుచ్చాడనుకోండి (కేవలం ఉదాహరణకు మాత్రమే). అతని భావాలకు వ్యతిరేకంగా రాస్తే అది వ్యక్తిగత దాడి అవగలదా?
అయినా, గొప్పోళ్ళ "గొప్పతనాన్ని"(what ever it means) సమయానుగుణంగా ప్రశ్నించకపోతే వాళ్ళ గొప్పతనం irrelevant అయిపోదూ!
@CBరావు:చర్చకు సిద్ధమైనవాళ్ళని "పెద్దలు","మేధావులు" వంటి బ్రాండ్లు తగిలించేసి కొందరు అలాఅలా సర్వైవ్ అయిపోతుంటారు. అలాగే, చర్చల్లో మేధ(intellect),తర్కం(logic),హేతువు(reason)కావాలని కోరుకుంటూ వారుమాత్రం తమ లేకితనాన్ని, తలబిరుసునూ ప్రదర్సిస్తూ ఉంటారు. అలాంటివారితో చర్చ అవమానకరమేకాదు కొనసాగిస్తే అది మూర్ఖత్వంకూడా.
@ భైరవభట్ల కామేశ్వర రావు : చాల ఆసక్తికరమైన ప్రశ్నలే వేశారు మీరు. "విశ్వనాథ రచనలు బాగోలేదు (ఇంకా తీవ్రమైన మాటలే) అని ఊరుకున్నారు కాని, ఎందుకు బాగోలేదో అర్థజనితంగా వివరించారా?" - మీ ఆక్షేపణ సక్రమమే. మీ ప్రశ్నకు జవాబుగా రచయిత మరో వ్యాసం రాయాల్సుంటుంది. చిన్న వ్యాసంలో అన్ని విషయాలు దీర్ఘముగా చర్చించుట సాధ్యము కాదు కదా.
"మరి ఏరికోరి దీన్ని మళ్ళీ ఇక్కడ ప్రచురించడం వెనక ఉద్దేశమేమిటి?" -దీనికి సమాధానం దీప్తిధార పాఠకుల మాటలలో ఇస్తున్నాను.
"విశ్వనాథ వారిపై మామూలుగా, జనసామాన్యం లో ఉన్న అభిప్రాయాలు కాక, ఓ భిన్న అభిప్రాయం వ్యక్తపరచబడింది అని మీరు చెప్పదలిచారని నేను భావిస్తున్నాను. దీని వెనుక ఏ దురుద్దేశం ఉందనో భావించట్లేదు. మీరు నేపథ్యం కూడా సరిగ్గానే వివరించారని నా ఉద్దేశం." -రవి.
"విశ్వనాధ మీద పొగడ్తలే కాదు, వేరు అభిప్రాయాలు కూడా ఉన్నాయి, అవి పరిచయం చేద్దాము అనే మీ ప్రయత్నం నాకు నచ్చింది." -అజ్ఞాత
"ప్రత్యేకించి కొన్ని ప్రశ్నలని వేస్తున్నాను. ఈ వ్యాసాన్ని అవగాహన చేసుకొనే రావుగారిక్కడ పెట్టారని నేననుకుంటున్నాను కాబట్టి, వారే సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను." - మీ ప్రశ్నలకు జవాబు ఎవరు జవాబు చెప్పాలన్నది చర్చించదగ్గ అంశం. పత్రికా రంగంలో ఏదైనా వ్యాసంపై పాఠకులు సందేహాలు వ్యక్తపరచినప్పుడు, ఆ ఉత్తరాలను వ్యాస రచయితకు పంపి, ఉత్తరాలతో బాటుగా రచయిత సమాధానాలు ప్రచురిస్తారు. ఇది ఎప్పటినుంచో ఉన్న సత్సాంప్రదాయమే. మీ ప్రశ్నలకు జవాబివ్వటానికి రచయిత ఇన్నయ్య గారు అందుబాటులో లేనందువలన మీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తున్నాను. వ్యాస రచయిత తాను ఏ దృక్పధంలో వ్యాసం రాసాడో ఆ విషయాన్ని రచయిత కాక వేరెవరైనా అంతకంటే బాగా చెప్పగలరా? ఆలోచించండి. పత్రికా రంగంలో లేని, తక్కువ ఉపయోగం కల పద్ధతులు మనకెందులకు?
"విశ్వనాథ రచనలలోఈ కాలానికి పనికిరానివి కూడా ఉన్నాయని ఒప్పుకోవడానికి నాకే మాత్రమూ అభ్యంతరం లేదు. "-నార్ల వారి అభిప్రాయాన్ని @ Arunam కు రాసిన వ్యాఖ్యలో చూడగలరు.
మీ ప్రశ్నలకు వివరంగా బదులివ్వాలంటే మరో రెండు వ్యాసాలన్నా రచయిత రాయాల్సుంటుంది. ఇన్నయ్య గారి కొత్త వ్యాసాలకై ఎదురు చూద్దాము.
@కత్తి మహేష్ కుమార్, we recognised your గొప్పతనం, you will start blog and did not give reply if some body asks you a dificult question and you will start one more tapaa. Please don't comment us. If I give you reply to you, It will deviate from the topic. Don't write anaamaka and blaw, blaw ....... nuvvu gamugaa vundamma, Maa bujji kadoo... Thanks in advance.
సి.బి.రావుగారు, నా వ్యాఖ్యకి స్పందించినందుకు నెనరులు.
"మీ ప్రశ్నకు జవాబుగా రచయిత మరో వ్యాసం రాయాల్సుంటుంది. చిన్న వ్యాసంలో అన్ని విషయాలు దీర్ఘముగా చర్చించుట సాధ్యము కాదు కదా."
ఈ వ్యాసంలో రచయిత అసలు ఏమీ "చర్చించ" లేదనే నా బాధ. ఇంత ఘాటైన అభిప్రాయాలని ఇక్కడ వ్యక్తం చేసిన ఇన్నయ్యగారు న్యాయంగా అయితే వాటిని సమర్థిస్తూ ఇప్పటికే వ్యాసాలు రాసి ఉండాలి. అలాటివేవైనా మీకు తెలిస్తే చెప్పండి.
ఇక దీన్నిక్కడ ప్రచురించడం గురించి. ఇందులో మీకు దురుద్దేశాలని అంటగట్టడం నా ఉద్దేశం కాదు. ప్రచురించి నప్పుడు, దాని గురించి మీరుగా కొంత అవగాహన కలిగి, మీ అభిప్రాయాలని కూడా జత చేస్తే మరింత ఉపయోగంగా ఉంటుందనే నే చెప్పదలచుకున్నది. లేకపోతే మీరు ఆశిస్తున్న ఆరోగ్యకరమైన చర్చకి ఆస్కారం తగ్గుతుంది.
రవిగారి వ్యాఖ్యకి ముందే స్పందిద్దామనుకున్నాను కాని మీ జవాబు కోసం ఎదురు చూసాను. ముందుగా ఒక మాట. ఈ వ్యాసంలోని అభిప్రాయం జనసామాన్యంలో ఉన్న అభిప్రాయం కన్నా భిన్నమైనదిగా అనిపించడం ఆశ్చర్యం (ఒకింత సంతోషం కూడా :-) కలిగించింది. విశ్వనాథవారు బతికుండగానే అతని మీదా, అతని రచనలపైన వచ్చిన తీవ్ర విమర్శలు ఇన్నీ అన్నీ కావు. అందులో సజావైనవి, ఆరోగ్యకరమైనవి ఎన్నున్నాయో, వంకరగా అసమంజసంగా (అంటే ప్రస్తుత వ్యాసంలాగా) ఉన్నవీ అన్నే ఉన్నాయి.
సరే ఆ విషయం పక్కన పెడితే, చెప్పే విషయం భిన్నమైనదీ, కొత్తదీ అయినంత మాత్రాన అది సమర్థించ దగ్గది అయిపోదు కదా?
రెండు నేపథ్యం గురించి. అక్కడ ప్రస్తావించిన అంశాలు విశ్వనాథ వ్యక్తిత్వానికీ, అతను నమ్మిన సిద్ధాంతాలకూ సంబంధించినవి. వాటిల్లో కనిపించిన లోపాలని నిరసిస్తూ, అవి అతని రచనల్లో ఎలా వ్యక్తీకరించబడ్డాయో సహేతుకంగా వివరిస్తూ వాటిని ఖండిస్తే నాకెలాంటి అభ్యంతరమూ ఉండేది కాదు. అది వ్యక్తిగత దాడి అవ్వదు కూడా. కానీ ఈ వ్యాసంలో అది ఎక్కడుందో నాకైతే కనిపించ లేదు! నేనిచ్చిన ఉదాహరణల్లో ఏ ఒక్కటైనా యీ కోవకి చెందిందని వివరించగలరా?
కొత్తపాళీ గారన్న "పొలిటికల్ స్టేట్మెంట్" అని కూడా నాకనబుద్ధి కాలేదన్నది ఇందుకే. ఇక్కడ జరిగిందల్లా విశ్వనాథవారి భావాలపై వ్యతిరేకత మనసులో పెట్టుకొని, అతని రచనా సామర్థ్యాన్ని, కవిగా అతని ప్రతిభని నిర్హేతుకంగా కించ పరచడం (పైగా అతని కవిత్వాన్ని బాగుందనే వాళ్ళని స్వార్థపరులని నిందించడం). అంచేత ఇది కచ్చితంగా వ్యక్తిగత దాడే.
వ్యక్తిగత దాడిని ఒప్పుకోనివారెవరైనా ఈ వ్యాసాన్ని నిరసిస్తారని ఆశిస్తున్నాను.
cb రావు గారు, ఇక్కడ చదివిన చర్చ చదివిన తర్వాత నాకు కనిపించిన కొన్ని విషయాలు, కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నాను.
ఇక్కడ విషయాలు బాగా అర్థం అవాలంటే, "నేపథ్యం" బాగా తెలియాలి. ఆ నేపథ్యంలో భాగంగా, త్రిపురనేని వారు, శ్రీశ్రీ, జాషువా మున్నగు వారు విశ్వనాథ వారిని ఎందుకు విమర్శించాల్సి వచ్చింది. ఆ నేపథ్యం లో వచ్చిన ఈ ఇన్నయ్య గారి వ్యాసం relevance ఎంత? ఇన్నయ్య గారిది కేవలం నోరుపారేసుకోవడమేనా? నిజానికి ఇదే చర్చ 1958 లో అప్పటి background లో జరిగి ఉంటే, ఇన్నయ్య గారిది సద్విమర్శా, వ్యక్తి గత దాడా అన్నది ఇంకాస్త బాగా అర్థం అయి ఉండేది. మీరు నేపథ్యాన్ని గురించి కాస్త చెప్పారు. (పాఠ్య పుస్తకాలలో బుద్ధుడిని రాక్షసుడుగా చిత్రించటం మీద). ఈ నేపథ్యాన్ని ఇంకాస్త elaborate చేయాలేమో?
ఇక ఇంకొక్క విషయం, కొంత మంది ప్రజలు దేవుడిగా కొలుస్తున్న ఓ వ్యక్తిని "రాక్షసుడు" గా చిత్రించటం. ఆ చిత్రించటం అద్భుతమైన, చందోబద్ధమైన కవిత్వంలో నారికేళపాకం లో, సంస్కృత సమాస భూయిష్టంగా జరిగినా కూడా, చివరకు "విషయం" ఏమిటి? ఇలాగే మనం కొలుస్తున్న ఓ పురాణ పురుషుడిని (ఎవరు మీరే ఊహించుకోండి :-))ఎవరైనా విమర్శిస్తే, అప్పుడు మనం ఆ విమర్శలోని content ను తెగడాలా? లేక ఆ సాహిత్యం లో లోపాలను విమర్శించాలా? లేదూ ఆ వ్యక్తి నే విమర్శించాలా? ఏదో ఒక రకం అనుకుందాం. ఏ రకంగా చేసినా అది నిజంగా వ్యక్తిగత విమర్శే అవుతుందా?
ఏది వ్యక్తిగత దాడి అని మీరు చెప్పిన వివరణ సమంజసంగానే నాకనిపించింది.
విశ్వనాథపై వ్యక్తిగత దాడులు చేయటం తప్పు అని భావించే వారు, విశ్వనాథ వారు ఇతర కవులపై (పంచముడు అని ఒకరిని, విషజీవి అని ఓ మహిళా రచయిత్రినీ వగైరా) చేసిన వ్యక్తిగతదాడులను కూడా అదే విధంగా నిరసిస్తే సంతోషం. ఇది ఇన్నయ్య గారి వ్యాసానికి ఏ రకంగా సంబంధం? ఆ సంబంధమే "నేపథ్యం".
ఏకవీరడు
శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ
గారి శ్రీమద్రామయణ
కావ్యం రోజూ పారాయణ
చేసేవ్ళ్ళేవరూ లేరా యన
ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారయన.
గొర్రెల మందగ, వేలం
వెర్రిగ ఉద్రిక్తభావ వివశులై జనుల్
కిర్రేక్కిపోయినప్పుడు
చిర్రేత్తుకు వచ్చు నాకు సిరిసిరిమువ్వా!
నేనూ ఒక మూర్ఖుణ్ణే
ఐనా నా కన్నామూఢులగుపడుతుంటే
ఆనంద పారవశ్యము
చే నవ్వక తప్పలేదు సిరిసిరిమువ్వా!
రవిగారు,
మీరు సి.బి.రావుగారిని అడ్డుపెట్టుకొని కొన్ని ప్రశ్నలు నాకే వేసేరని తెలుసు. ఒకరికొకరం డైరెక్టుగా మాట్లాడుకొనే చనువు మనకుంది కదండి, మరెందుకీ అన్యాపదేశాలు :-) మీరు లేదనుకున్నా ఆ చనువు నేను తీసుకొని సమాధానం చెప్తున్నాను.
" ఇలాగే మనం కొలుస్తున్న ఓ పురాణ పురుషుడిని (ఎవరు మీరే ఊహించుకోండి :-))ఎవరైనా విమర్శిస్తే, అప్పుడు మనం ఆ విమర్శలోని content ను తెగడాలా? లేక ఆ సాహిత్యం లో లోపాలను విమర్శించాలా? లేదూ ఆ వ్యక్తి నే విమర్శించాలా?"
ఆ పురాణ పురుషుడిని విమర్శిస్తూ మాంచి రసవత్తరమైన కథో కావ్యమో రాస్తే నేను దాన్ని కచ్చితంగా ఆస్వాదిస్తాను, మెచ్చుకుంటాను. సాక్ష్యం కావలిస్తే, "మృణ్మయనాదం" అనే ఓల్గా రచించిన మంచి కథ గురించిన నా అభిప్రాయాన్ని ఇక్కడ చదవ వచ్చు. http://groups.yahoo.com/group/racchabanda/message/18239. ఓల్గాగారి కథంటే మీరు ఊహించుకోవచ్చు. రాముని విమర్శిస్తూ స్త్రీవాద దృక్పథంతో రాసిన కథ.
ఇక, అలాకాక అది ఆ పురాణ పాత్ర గురించిన మామూలు విమర్శ అయితే, దాన్ని నేను "తెగనాడను". దానిలోని ప్రయోజనాన్ని మాత్రం ప్రశ్నిస్తాను. ఆ విషయం మీకు స్వానుభవమే :-)
విశ్వనాథవారి విషయంలోనూ నేననుసరించే పద్ధతి ఇదే.
విశ్వనాథ ఇతరులపై చేసే వ్యక్తిగత విమర్శలని నేను ముమ్మాటికీ ఖండిస్తాను.
మీ సందేహాలు తీరితే, అసలు విషయం సూటిగా మాట్లాడుకోవచ్చు. నేను మళ్ళీ చెప్పేది ఒకటే, నేపథ్యం ఏదైనా, ఇది నోరుపారేసుకోవడమే కాని సాహిత్య విమర్శ అవ్వదని. ఎందుకో నా ముందరి రెండు వ్యాఖ్యల్లో వివరించాను. దాన్ని మీరు అంగీకరిస్తారా? లేకపోతే నేను చెప్పిన విషయాల్లో ఏది సరికాదో వివరించండి.
@ netizen: ఈ టపాకు 50 వ వ్యాఖ్య గా మీ నుంచి ఈ చక్కని కవిత రావటం ప్రమోదాన్నిచ్చింది. నేనూ నవ్వకుండా వుండలేకపోయా, కవితను చదివాక. మీరు కవిత ఇక్కడ రాసినందుకు నెనర్లు.
ఈ టపా చూసిన ప్రేరణ తో కస్తూరి మురళీ క్రిష్ణ గారు తమ రాతలు-కోతలు లో విశ్వనాధవారి రచనలను పరిచయం చేస్తున్నారు. చదవతగ్గ పరిచయాలు. ఒక మారు చూడండి. ఈ బ్లాగులోని వ్యాసాల్లో అచ్చుతప్పులు భయంకరంగా ఉంటున్నాయి. రచయిత అచ్చులో పేరున్నవాడే. (Print media.) బ్లాగులకు కొత్త కాబట్టి కొన్నాళ్లు అచ్చుతప్పులు భరిద్దాము.
అచ్చుతప్పులు అచ్చు రచయితలకు కాక
నెటిజన్లకొచ్చునా సిరిసిరిమువ్వా.
ఈ మొత్తం పోస్ట్ చదివేసరికి తలప్రాణం తోక్కొచ్చింది ఈ వ్యాసమూ దాని కామెంట్లూ ...
@భాస్కర్ రావు :- దీప్తిధార ను నేను తరచూ చదూతుంటా... ఎప్పుడూ కామెంట్‌చేయకపోయినా. ప్రచురించడం అంతా మీరు చేసిన తర్వాత.. ఇది నేను రాసినది కాదు వాల్లనో వీల్లనో అడగండి అని చెబుతారు మీరు మామూలుగా. మంచిదే ఇక్కడ నే గమనించిన ఇంకో విషయం(ఈ పోస్ట్ లో)- మీరు బాగా నొక్కి అడిగిన తర్వాత గానీ సమాధానాలివ్వడానికి సిద్ధపడలేదు, అప్పుడప్పుడూ మీరు సమాధానం ఇచ్చిన చాలా సుకుమారమైన మాటల్లో ఒకరిద్దరు వ్యాఖ్యాతలను ఎక్కిరించారు గానీ అసలు విషయానికి రాలేదు. ఇప్పుడు ఈ నెటిజెన్ గారెవరో రాసిన సంబంధంలేని వ్యాఖ్య ఇక్కడ ఇంతవరకూ వ్యాఖ్యానించిన వారందరినీ వెక్కిరించేటట్లుగా ఉంది. అది నెటిజెన్ గారి ఇష్టం గానీ మీ బ్లాగులో మీ పోస్ట్ కు స్పందించిన వ్యాఖ్యాతలను వెక్కిరించడం మీకు నవ్వు తెప్పించటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
ఇన్ని రోజులూ కొంచెం కొంచెం తెలుగులో రాద్దాం అనే ఆసక్తి ఉండేది...కొద్దిరోజులుగా బ్లాగుల కథా కమామిషూ చూసిన తర్వాత అవసరంలేదనిపిస్తాంది.
త్రిపురాంతకం నాయుడు
I noticed a recent article by Velcheru Narayana Rao:
http://jhs.oxfordjournals.org/cgi/content/full/1/1-2/93
It includes a discussion of Viswanatha's views and of a play of his on budhism.
భైరవభట్ల గారు, నేను మిమ్మల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదండీ. నిజంగానే. :-).
మీరు చెప్పిన వాక్యాలు "విశ్వనాథ రచనలలో సాంప్రదాయికత, వైదికాధ్యాత ప్రస్ఫుటంగా కనిపిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందులో ఈ కాలానికి పనికిరానివి కూడా ఉన్నాయని ఒప్పుకోవడానికి నాకే మాత్రమూ అభ్యంతరం లేదు." కూడా నేను చదివాను. మీ దృక్పథం నాకు అర్థం అయ్యింది. ఓ విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోకుండా విమర్శించే కుసంస్కారం మీకు లేదని నాకు తెలుసు. అయితే నేను వాడిన పదం "నోరు పారేసుకోవడం" అన్నది మీరు రాసిన వ్యాఖ్యతో కాకతాళీయంగా కలవడంతో మీకు అలా అనిపించిందేమో. ఏవేమైనా మీకు మనస్స్ఫూర్తిగా క్షమాపణలు.
అయితే నా వ్యాఖ్యల వెనుక ప్రేరణ (మీ వ్యాఖ్యలు కాని పక్షంలో) ఏవి అని నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రేరణ వెనుక భావాలివి - వ్యక్తిగత దాడి, వ్యక్తి ఆరాధన. ఈ రెండు ప్రమాదకరమైనవే అని నా నమ్మకం. మొదటిది poison అయితే రెండవది slow poison. విశ్వనాథ వారి రచనల గురించి విమర్శ కాదు కదా, మాట్లాడగలిగేంత విషయం కూడా నాకు లేదు. అయితే, విశ్వనాథ వారిని విమర్శించకూడదా?
అరుంధతీ రాయ్ ని విమర్శించాలంటే - నాకూ బుకర్ ప్రైజ్ వచ్చుండాలి.
చంద్రబాబును విమర్శించాలంటే - నాకో హెరిటేజ్ కర్మాగారం ఉండాలి.
విశ్వనాథను విమర్శించాలంటే - నేనూ అంత పెద్ద సాహితీ వేత్తనయి ఉండాలి.
ఇలాంటి వాదనలు పూర్తిగా అసంబద్ధం. వీటి వల్ల నిజానిజాలు వెలికి రావు. అలాగని మీరన్నట్టు నోరు పారేసుకోమని ఉద్బోధ చేయట్లేదు.
పైన గౌరవనీయులయిన బ్లాగర్లు, "ఏనుగు వెళుతుంటే కుక్క మొరుగుతుంది" ఇలాంటి పోలికలు చేశారు. వీటిని చదివిన తర్వాతే నాకూ రాయాలనిపించింది.
అందుకని రాశాను. cb రావు గారినడ్డం పెట్టుకని మీ మీద "వ్యక్తిగత దాడి" కోసం కాదు. :-)
ఇక మీరన్న సాహిత్య విమర్శ : మొదట నాకు వచ్చిన అనుమానం . బుద్ధుడిని రాక్షసుడిగా చిత్రీకరించడం అన్నది ఏరకమైన సాహిత్య సంవిధానమో నాకు అర్థం కాలేదు. సరే ఓ గొప్ప సాహిత్య ప్రక్రియ ద్వారా ఈ చిత్రించడం జరిగిందనే భావిద్దాం. "సాహిత్యపు విలువలు ప్రక్రియలో ఉంటాయా, ఆ సాహిత్యం తాలూకు విలువలలో ఉంటాయా" ?
ఎక్కడో చదివిన గుర్తు. రాయప్రోలు వారు అన్నారట, " బుద్ధుడిని మర్చిపోయిన నాడే, భారత దేశం సాంస్కృతికంగా చచ్చిపోయింది" అని. చచ్చిపోయింది అంటే "తిరోగమనం చెందింది" అని. ఇక్కడ ఇన్నయ్య గారు చెప్పిన విమర్శ ఏమిటి? "తిరోగమనమే" కదా? అయితే వచ్చిన చిక్కు - సదరు ఇన్నయ్య గారు విశ్వనాథ వారంత సాహితీ వేత్త కాకపోవడం.
అయితే ఇన్నయ్య గారి వ్యాసం వెనుక నేపథ్యం కొంత కాక, పూర్తిగా అర్థం అవ్వాలి. అప్పుడే ఇది సాహిత్య విమర్శా, వ్యక్తిగత దాడా, ఒకవేళ వ్యక్తిగత దాడి అయితే, ఆయన ఎందుకు చేయవలసి వచ్చింది? అన్నవి తెలుస్తాయి. విషయాలు పూర్తిగా అర్థం కాక, విశ్వనాథ వారు గొప్ప సాహితీ వేత్త అన్న కారణంగా ఇన్నయ్య గారిని బోనెక్కించటం మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం.
ఈ వ్యాసం, 50 పైగా ఉన్న వ్యాఖ్యలను ఇప్పుడే చూసాను. ఆగండాగండి. మనం ఏ జమానాలో ఉన్నాం? e - జమానాలో కూడా పందులని, కుక్కల్ని రంగంలోకి దించాలా తిట్టుకోవటానికి? మన వీర ఆవేశానికి అవి కూడా సిగ్గుపడతాయి. ఒక రచయిత యొక్క రచనను అభిమానించటం రచయితను అభిమానించటము అభినందనీయం. రచయితను కాని, రచనని కాని విమర్శించటం అభినందనీయం కాదా? ఆ మాటకొస్తే, విశ్వనాధవారే వారి జీవిత కాలంలో, ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రతి వ్యక్తిలో మంచి చెడూ ఉంటాయి. మంచిని మెచ్చుకుంటాము, చెడుని తెలుసుకొంటాము. తప్పేముంది? ఎవరు ఎన్ని అన్నా సంయమనంతో నిలబడటం రావుగారి వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది.
ఇన్నయ్య గారు హేతువాది వారికి విశ్వనాథ సత్యనారాయణ గారు కవి విళిద్దరికి వున్న "జూలకటక" ఎమిటి? ఆ నేపద్యం కూడ వివరిస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు అందరికి సమగ్రంగా అర్థ మౌతుంది ఇన్నయ గారి వ్యాసం.కావలంటె మీరు చూడండి నా ప్రపంచం బ్లొగ్ లో ఇన్నయ్య గారు కలసిన ప్రముఖు లందరిని వాళ్ళందరిని ( బెజవాడ గోపాల్ రెడ్డి మొ|| వారిని ) ఆయనకు ఙ్ణాపీఠ్ అవార్డ్ ఎలా వచ్చింది ఎవరు రెకమెండ్ చేశారు అని కూపి లాగే వారు. ఇన్నయ్య గారికి ఎందుకంత క్యురియాసిటి?
రవిగారు,
మన మధ్యన క్షమాపణలూ గట్రాలు ఎందుకండీ!
"విశ్వనాథను విమర్శించాలంటే - నేనూ అంత పెద్ద సాహితీ వేత్తనయి ఉండాలి."
అవసరం లేదు! అందుకు నేనే పెద్ద ఉదాహరణ :-)
విమర్శ చేసేటప్పుడు, ఆ చేసే విషయం మీద కనీస అవగాహన ఉండాలనుకోడం మాత్రం తప్పులేదనుకుంటాను. ఉదాహరణకి విశ్వనాథ కవిత్వంలోని భాష, శైలి, కథనం మొదలైన విషయాల గురించి విమర్శిస్తున్నప్పుడు వాటి గురించిన కనీస పరిజ్ఞానం అవసరమే కదా. అలాగే అతని సిద్ధాంతాలో, తన రచనల్లో ప్రతిపాదిస్తున్న విలువల గురించో విమర్శించేటప్పుడు, ఆయా రచనల్లో కనిపించే ఆ విలువల గురించి (పాక్షికమైనా సరే) కొంత అవగాహన ఉండాలి. లేదూ అతని వ్యక్తిత్వాన్ని విమర్శించాలంటే, అతని వ్యక్తిత్వం గురించి, వ్యక్తిగత జీవితం గురించి తగినంత (విమర్శలో చేస్తున్న ఆరోపణలను నిరూపించ గలిగేంత) సమాచారం ఉండాలి.
మొత్తంగా కవినీ, అతని కవిత్వాన్నీ అతని సిద్ధాంతాలనీ విమర్శించాలంటే వాటన్నిటి మీద కూడా కనీస అవగాహన ఉండాలి కదా?
అయితే చెప్పే విషయంలో కనీస అవగాన ఉందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? సదరు విమర్శకునికున్న డిగ్రీల వల్లా? పేరు ప్రఖ్యాతల వల్లా? రెండూ కాదు. విమర్శకుని అవగాహన చేసిన విమర్శలోనే కనిపించాలి.
నేను పై చెప్పిన వాటిల్లో మీరు అంగీకరించని దేమైనా ఉంటే చెప్పండి.
"ఇక్కడ ఇన్నయ్య గారు చెప్పిన విమర్శ ఏమిటి? "తిరోగమనమే" కదా? అయితే వచ్చిన చిక్కు - సదరు ఇన్నయ్య గారు విశ్వనాథ వారంత సాహితీ వేత్త కాకపోవడం." "విశ్వనాథ వారు గొప్ప సాహితీ వేత్త అన్న కారణంగా ఇన్నయ్య గారిని బోనెక్కించటం మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం."
ఇతరుల వ్యాఖ్యల వల్ల మీకీ అభిప్రాయం కలిగి ఉండడంలో తప్పులేదు. కాని దయచేసి మీరు నా వ్యాఖ్యలని మళ్ళీ చదవండి. వ్యాసం కూడా మరో సారి చదవండి. అప్పుడు నేనీ వ్యాసాన్ని తప్పుబడుతున్నది "ఇన్నయ్యగారు విశ్వనాథ అంత సాహిత్యవేత్త కాకపోవడం వల్లనా (అవునో కాదో నాకు తెలియదు), లేదా విశ్వనాథ విమర్శకి అందని సాహితీవేత్త అవ్వడం వల్లన" కాదని స్పష్టంగా తెలుస్తుంది. నేను పైన చెప్పిన అవగాహన లోపం ఈ వ్యాసంలో కొట్టొచ్చినట్టు కనిపించడమే అసలు కారణం అని బోధపడుతుంది. ఇన్నయ్యగారు విశ్వనాథ "తిరోగమన" తత్త్వం గురించి మాట్లాడారో, అతని కవిత్వాన్ని గురించి మాట్లాడారో, అతని వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడారో అర్థమవుతుంది. అప్పుడు, ఈ వ్యాసాన్ని "నోరుపారేసుకోవడం"గా జమకట్టడానికి మీరంటున్న నేపథ్యం అవసరం లేదని ఒప్పుకుంటారనుకుంటాను.
ఒప్పుకోలేకుంటే, నేను నా పై వ్యాఖ్యలలో వేసిన ప్రశ్నలకి ఒకోదానికీ సూటిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి.
భైరవభట్ల గారు, ముందు చెప్పినట్లు నేను మీతో విభేదించడానికి రాలేదు. నాకంత సీనూ లేదు. :-) మీరు అవగాహనా లోపం అని అక్కడితో ఆగారు. నేను భాస్కర రావు గారు చెప్పిన నేపథ్యం ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలని, అందుకు వీలయితే ఆయన విశదీకరించాలని అనుకున్నాను.
ఇక చాలా మంది ఇది ఇన్నయ్య గారి వ్యక్తిగత దాడి విశ్వనాథ వారి మీద అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. నా ఉద్దేశం లో ఇది వ్యక్తిగత దాడి అవచ్చు, అవకపోవచ్చు. నిజానిజాలకు నేపథ్యం పూర్తిగా తెలియాలి. ఒకవేళ నిజంగా వ్యక్తిగత దాడి అయితే, ఎందుకు చేశారు అన్నది కూడా ఆలోచించాలి. (బుద్ధుడిపై విశ్వనాథ వారు చేసింది కూడా "వ్యక్తిగత" దాడి అన్న అనుమానం వస్తుంది కాబట్టి)
ఇకపోతే, ఇన్నయ్య గారు తగినంత అవగాహనతో, విశ్వనాథ వారి వ్యక్తిత్వం మీదా, వ్యక్తిగత జీవితం మీదా పూర్తి సమాచారంతో విమర్శించాలి, అన్న మీ సూచనను నేను గౌరవిస్తున్నాను.
అయితే ఒకరి వ్యాఖ్యతో బాధ పడ్డ వ్యక్తి (నిజంగా బాధపడి ఉంటే) మీరు చెప్పినంత ఆత్మ సంయమనంతో, పూర్తిగా విమర్శకుడి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి వ్యాఖ్యలు చేయడం చేయడం చాలా సందర్భాల్లో జరుగదు. they just react.
రవిగారు,
"ముందు చెప్పినట్లు నేను మీతో విభేదించడానికి రాలేదు.", అని ఓ పక్క అంటూనే మరో పక్క మీకు తెలీకుండానే విభేదిస్తున్నారు :-)
"ఇక చాలా మంది ఇది ఇన్నయ్య గారి వ్యక్తిగత దాడి విశ్వనాథ వారి మీద అన్న అభిప్రాయం వెలిబుచ్చారు." - ఆ చాలా మందిలో నేనూ ఒకణ్ణి.
"నిజానిజాలకు నేపథ్యం పూర్తిగా తెలియాలి." - అక్కరలేదు అన్నది నా వాదన.
"ఒకవేళ నిజంగా వ్యక్తిగత దాడి అయితే, ఎందుకు చేశారు అన్నది కూడా ఆలోచించాలి. (బుద్ధుడిపై విశ్వనాథ వారు చేసింది కూడా "వ్యక్తిగత" దాడి అన్న అనుమానం వస్తుంది కాబట్టి)"
విశ్వనాథ బుద్ధునిపైనో లేదా జాషువాపైనో వ్యక్తిగత దాడి చేస్తే, తిరిగి విశ్వనాథ మీదా (అతన్ని ఇష్టపడేవాళ్ళ మీదా) వ్యక్తిగత దాడి చెయ్యడాన్ని మీరు సమర్థిస్తారా?
ఈ విషయమై నేను చెప్పాలనుకున్నదంతా సి.బి.రావుగారికీ మీకూ చెప్పేసాననే అనుకుంటున్నాను. ఇంక నేను చెప్పేదేదైనా చర్వితచర్వణమే అవుతుంది. కాబట్టి నా ప్రశ్నలకి సమాధానాలు వచ్చే వరకు మరి మాటాడను.
ఒకవేళ నా ప్రశ్నలకి సమాధానం లేకపోతే (ఇవ్వలేకపోతే), అవి సమంజసమైనవే అని నా వ్యాఖ్యలలోని అభిప్రాయాలకి అంగీకారం చెప్పడం, చెప్పకపోవడం ఇక మీ మీ యిష్టం :-)
భైరవభట్ల గారు, మీరు చెప్పినంత ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ, ఇన్నయ్య గారిది వ్యక్తిగత దాడి అన్న విషయం పైన నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. "ఏది వ్యక్తిగత దాడి? వ్యక్తిగత దాడికి పూర్తి అర్థం ఏమిటి?" అన్నది తెలియాలి. తెలియాలంటే అనేక విషయాలు తెలియాలి. పైన భాస్కర రావు గరు కూడా వ్యక్తిగత దాడి గురించి తమ భాష్యం (తమ ఆలోచన) చెప్పారు. ఇప్పటికి ఇది నా stance.
"విశ్వనాథ బుద్ధునిపైనో లేదా జాషువాపైనో వ్యక్తిగత దాడి చేస్తే, తిరిగి విశ్వనాథ మీదా (అతన్ని ఇష్టపడేవాళ్ళ మీదా) వ్యక్తిగత దాడి చెయ్యడాన్ని మీరు సమర్థిస్తారా?"
జరిగింది నిజంగా వ్యక్తిగత దాడి అయితే - కర్కశంగా చెప్పాలంటే, సమర్థిస్తాను. కనీసం అందులో తప్పు లేదు అని నా భావన. ఎందుకంటే, ఇన్నయ్య మొదట ఓ మనిషి. తర్వాతే విమర్శకుడు. (This also may depend upon per case basis)
అయితే ఇలాంటివి అలా కర్కశంగా మాట్లాడుకోవడం వల్ల, అదీ ముఖ్యంగా ఇలాంటి ఫోరం లో, సాధించేదేం లేకపోగా, అనవసర అపోహలకు కారణ భూతమవుతాం అన్నది నా భయం (అనుమానం).
కవిరాజు చలోక్తులు
ఒకనాడు, తోటలో అరటిమొక్క పాదు చేస్తూ వుండగా, విశ్వనాధ సత్యనారాయణగారు సూతాశ్రమానికి వచ్చి, "కవిరాజు గారు అరటిగెల ఈశాన్యపు మూల వేయరాదంటారు, కోయించి వేయండి", అన్నారంట.
వారి మాట ముగియక ముందే "అవును సత్యనారాయణ గారూ యింకొక వారానికి పక్వాని కొస్తుంది, అట్లాగే కోసివెస్తా" అన్నారట.
@netizen, Did you read దేవరనేని త్రిపురాంతకం నాయుడు comment on you. don't write which is not related to the topic( "కవిరాజు చలోక్తులు"). భైరవభట్ల కామేశ్వర రావు and రవి it seems your discussion going out of the scope of this Tapaa. Thanks for undeerstanding.
@అజ్ఞాత: ఆ పెద్దల ఇరువరి మధ్య ఉన్న సాన్నిహిత్యాని తెలియజేయడానికే వారివురి మధ్య చలోక్తిని ఊదహరించడమైనది. వారి సంస్కారమది - మూర్ఖుల సంస్కార మిక్కడ కనపడుతున్నది కదా?
రామస్వామి వ్రాసిన కుప్పుస్వామి శతకంలోని ఒక పద్యం:
మండి వెలుగుదాని మన దీపమని చెప్పి
ముద్దు పెట్టుకొన్న మూతిగాలు;
మూర్ఖుడైన వాని పొందు చేకుర్చును
ముప్పు దప్పకిటుల గుప్పుస్వామి!
మీరు ఇక్కడ సూచించిన శ్రీ దేవరనేని త్రిపురాంతకం నాయుడు గారి వ్యాఖ్యకు స్పందించాలా! అది మీ ఇరువురి విజ్ఞత!
మూర్ఖులు ఎదురైనప్పుడు, నేను పక్కకి తప్పుకుంటానండి, అజ్ఞాతగారు!మరి మీరు?
@ అజ్ఞాత: చర్చలోనే కదా విషయాలు సమగ్రంగా అందరకూ తెలుస్తాయి. చర్చ ప్రజా సామ్యమేకదా? మీరు చర్చకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చర్చలో పాల్గొనువారు పక్కతోవ వెళుతుంటే సరైన మార్గోపదేశం చెయ్యండి. ప్రయాణమే వద్దు అంటే గమ్యస్థాన మెట్లు చేరుకొందము?
నెటిజన్ రాసినది వ్యాసంలో ఉన్న వ్యక్తుల గురించే కదా? స్టాలిన్ లేక కెనడీలగురించి కాదుకదా!
మీ పరిచయం గావించ కోరుతాను.
విశ్వనాధవారి ఛలోక్తి
ఒకసారి విశ్వనాధ సత్యనారాయణగారికి రాష్ట్ర సచివాలయంలో ఏదో పని కావలసి వచ్చింది. చాలా రోజులుగా ఆ వ్యవహారం తెమలకపోవడంతో ఏదో సందర్భంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు. సచివాలయంలో వారికి కావలసిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోమని ప్రకాశం గారిని అడిగారు. అందుకు ప్రకాశంగారు కొంత విముఖత చూపుతూ.."ఆ సచివాలయం పెద్ద అడివి. దానిలో పనులు అలాగే వుంటాయి" అన్నారు.అందుకు విశ్వనాధ ఓ చిరునవ్వు నవ్వి "అందుకే కదండీ తమకు మనవి చేసుకున్నది. మీరు ఆంధ్రకేసరి కదా! ఆ అడవి మీకొక లెక్క కాదు." అన్నారు.ఆ మాట విన్నాక ఆంధ్రకేసరికి ఆ పని నెత్తిన వేసుకోక తప్పింది కాదు.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో
మిస్టర్ భాస్కర్ రావ్... నేను ఇంతకుముందు రాసిన వ్యాఖ్యలో విపరీతార్థం గాని ఇంకోటి గాని లేవు. అది మిమ్మల్ని ఊద్దేశించి మీతో మాట్లాడటానికై నేను రాసిన వ్యాఖ్య. ఇప్పుడు ఈ నెటిజెన్ కుర్రకుంక వాగుడు ను చూస్తూ మీరు ఆనందిస్తున్నారా? మీ బ్లాగుల ముసుగులు చూస్తే నాకు అసయ్యమేస్తంది. జ్ఞానం పెంచుకొనడి బాబూ.. ఇందాకా వచ్చింది కాబట్టి చెబుతున్నా.. మా ఊర్లో మూర్ఖుల మీద జాలి పడతారు.
నాకు తెలిసినవాడెవడైనా పొరబాటున తెలుగు బ్లాగుల వంక చూసినా నేనొద్దని చెబుతాను. ఇక్కడ నేర్చుకోడానికేముంది గనక...
ఇక్కడ చర్చకోసం సరి అయిన సమాధానాలకోసం చూసిన ప్రతి ఒక్క వ్యాఖ్యాతకూ మనవి... మల్లీ ఇట్రాకండి. తీరిక సమయం ఉంటే పదిమంది వీధి పిల్లలకు పాఠాలుజెప్పండి. వాళ్లను విద్యా వంతులను జెయ్యండి. మీ సమయాన్ని నెటిజెన్ లాంటి బఫూన్ల కోసము వారి ఆటలు చూసి వినోదించే భాస్కర్ రావు కోసమూ వృధా చేసుకోకండి.
"మీ సమయాన్ని నెటిజెన్ లాంటి బఫూన్ల కోసము వారి ఆటలు చూసి వినోదించే భాస్కర్ రావు కోసమూ వృధా చేసుకోకండి." -దేవరనేని త్రిపురాంతకం నాయుడు చెప్పారు...
నాయుడు గారు,
వ్యక్తుల అభిప్రాయలతో విభేదముంటే అభిప్రాయాలతో వ్యతిరేకించండి. వ్యక్తులను కించపరుస్తూ ద్వేషాన్ని చూపించకండి. ఇలాంటి ప్రాధమిక సూత్రాలు తెలియకుండా వ్యాఖ్యలు రాసే మీరా, తెలుగు బ్లాగుల గురించి దుష్ప్రచారం సాగిస్తానని బెదిరిస్తున్నారు?
@ దేవరనేని త్రిపురాంతకం నాయుడు: "ఇప్పుడు ఈ నెటిజెన్ గారెవరో రాసిన సంబంధంలేని వ్యాఖ్య ఇక్కడ ఇంతవరకూ వ్యాఖ్యానించిన వారందరినీ వెక్కిరించేటట్లుగా ఉంది. "
"నేనూ ఒక మూర్ఖుణ్ణే
ఐనా నా కన్నామూఢులగుపడుతుంటే" అని Netizen రాసిన దాంట్లో తనమీద తనే వేసుకున్న విసురు మీరు గమనించలేదా? తన మీద తనే ఛలోక్తులేసుకునే విజ్ఞులు తక్కువ. ఈ కింద రాసిన సంఘటన మీకు తెలుసా? ఇందులో విశ్వనాధగారికున్న sense of humor గమనించగలరు.
కవుల లోపల బమ్మ రాకాసి
విజయవాడలో సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులైన గూడూరి వియ్యన్న గారిల్లు సాహిత్య నిలయంగా కూడా వాసికెక్కింది. ఒకసారి మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అప్పటికి బాగా యువకులైన రాచకొండ నరసింహమూర్తిగారు, వీరంతా కూచుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు వియ్యన్న గారింట్లో. ఇంతలో విశ్వనాధ సత్యనారాయణ గారు వచ్చి చేరారు.
ప్రసంగవశాన ఆ మాటా ఈ మాటా వచ్చి "కవుల సాంగత్యం చేసి బాగుపడ్డ వాడెవడూ కనిపించడం లేదు. మనల్ని దగ్గరికి చేర్చి దివాలా తీసిన వాడేగాని బాగుపడిన వాడు ఒకడూ లేడు." అని విశ్వనాధ గారు ప్రారంభించారు. 'కావాలంటే నా విషయమే చూడండి. నా పుస్తకాలు అంకితం పుచ్చుకున్న వాడెవడూ సవ్యంగా బతికి బట్ట కట్టలేదు.' అంటూ ఎవరెవరికి ఎంతెంత క్లేశాలు చుట్టుకున్నదీ చెప్పడం ప్రారంభించారు. అదంతా సావధానంగా విని సహజ గంభీరులైన కాటూరి వారు సైతం నవ్వుకున్నారు.
నవ్వులు ఆగీ ఆగకుండానే మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి గారు శంఖం ఒత్తినట్టు తమ కంఠం ఎత్తి విశ్వనాధపై సీస పద్యం అందుకున్నారు.
"పండు వంటి గృహస్థు పైడి పాట్యగ్ర హా
రికుడు నీ కృతిచె దరిదృడయ్యె"
(అంటే బెల్లంకొండ రాఘవరావుగారన్న మాట)
ఆ తరువాత పాదాన్ని వేదుల వారిలా పొడిగించారు-
"కోరి నీ కృతి గైకొన్న పెన్నాడయ్య
వారి కయ్యెను స్థల భాండశుద్ధి"
(అంటే పెన్నాడ కదాళం రఘునాధ చక్రవర్తి)
విశ్వనాధ వారు వింటూ తెగ నవ్వుకుంటున్నారు.
మూడోపాదం నరసింహమూర్తి చెప్తాడని వేదుల వారు ప్రకటించారు. నరసింహమూర్తి గారు ముందు భయపడ్డా తర్వాత విశ్వనాధ వారు కూడా ఉత్సాహపరచడంతో..
"కొన్నది లేద ఊ కొన్న పాపానికే
ముక్త్యాల దొర రాజ్యమునకు బాసె" అన్నారు.
'వహ్వా' అన్నారంతా-
నాలుగో పాదం కృష్ణ శాస్త్రి గారి వంతు అయింది.
"శుభమంచు క్రొత్తింట జొచ్చుచు, నీ కృతి
గొన్న లింగము కొంప కూలిపోయె" అన్నారు.
(లింగము అంటే బందా కనకలింగేశ్వరరావు గారు. వారికి ప్రధమ భార్య గతించారు)
ఇక ఎత్తు గీతి మిగిలింది.
"జారె నీ కడిమి ని టంగుటూరి పదవి" అన్నారు కాటూరి వారు
(కడిమి అంటే కడిమి చెట్టు నవల)
"కూలె కాశినాధుడు నీ త్రిశూలహతిని" అన్నారు బుచ్చి సుందర రామ శాస్త్రి గారు.
అంతవరకు అయాక కాటూరి వారు అందరినీ లేచి నిలబడమన్నారు.
"రెండు చేతులూ జోడించి నేను చెప్పినట్టు చెప్పండి" అని మిగిలిన రెండు పాదాలు ఆయన పూరించారు.
"కవుల లోపల బమ్మ రాకాసి నీవు
దండముర బాబు నీదు కైతలకు నీకు"
సీస పద్యం మొత్తం పూర్తయింది. వాతావరణం నవ్వులతో నిండిపోయింది.
ఆంధ్రజ్యోతి సౌజన్యంతో
"దీప్తిధార ను నేను తరచూ చదూతుంటా... ఎప్పుడూ కామెంట్‌చేయకపోయినా. "
నెనర్లు.
"మీ సమయాన్ని నెటిజెన్ లాంటి బఫూన్ల కోసము వారి ఆటలు చూసి వినోదించే భాస్కర్ రావు కోసమూ వృధా చేసుకోకండి.
ఇన్ని రోజులూ కొంచెం కొంచెం తెలుగులో రాద్దాం అనే ఆసక్తి ఉండేది...కొద్దిరోజులుగా బ్లాగుల కథా కమామిషూ చూసిన తర్వాత అవసరంలేదనిపిస్తాంది."
మహిళా బ్లాగరు (నెటిజెన్) పై ఇంత కఠినంగా వ్యాఖ్యానించటం అవసరమా?
అయ్యో! నా బ్లాగువలన మీరు ఇలాంటి అభిప్రాయానికి రావటం విచారకరం. అన్ని బ్లాగులూ దీప్తిధారలా ఉండవులెండి. మీరు భైరవభట్ల కామేశ్వర రావు గారి బ్లాగులు తెలుగు పద్యం ,
తెలుగువీర లేవరా! చూసినట్లు లేదు,చూడండి. ఆసక్తికరంగా ఉంటాయవి.
చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
మనలో రసజ్ఞత ఎక్కువ తక్కువ లవటానికి, సాహిత్యాన్ని ఆనందించటానికి ఉన్న పరస్పర సంబంధం మీకు తెలుసా?
రసజ్ఞత గురించి రసజ్ఞంగా వివరించిన భైరవభట్ల వ్యాసం చదువది యెంతగల్గిన... చదవండి. తెలుగు కవితా పరిమళాల్ని మీరు మరింతగా ఆస్వాదించాలంటే మీరు మంచుపూలు బ్లాగులోని MY BLOG LIST చూడగలరు. ఇవి చూశాక తెలుగు బ్లాగులు గురించి మీ అభిప్రాయం మార్చుకుంటారు.
ఇంతకూ విశ్వనాథవారిపై మీ అమూల్య అభిప్రాయం వెళ్లడించలేదు.
త్రిపురనేని రామస్వామి 66 వర్ధంతి సభ (తెనాలిలో)
http://kaviraju.blogspot.com/2009/01/blog-post.html
@ అరుణం: "విశ్వనాధ గారు జాషువా పై అవహేళనగా వ్యాఖ్యలు ఎప్పుడు, ఎలా, ఎందుకు చేసారు? దానిని జాషువా గారు ఎలా త్రిప్పి కొట్టారు?"
-గుర్రం జాషువా తండ్రి యాదవ కులానికి చెంది, క్రైస్తవ మతం పుచ్చుకొన్నాడు. తల్లి
ఆది ఆంధ్ర కులమునకు (మాదిగ) చెందిన మహిళ. జాషువా తన జీవితంలో పెక్కు పర్యాయాలు కులవివక్షను ఎదుర్కొన్నాడు. ఎన్నో వేదనలు, ఘర్షణల తో నిండినది జాషువా జీవితం.
ముద్దుకృష్ణ ( 1930 ప్రాంతపు అభ్యుదయ కవి, తెలుగు పత్రిక జ్వాల సంపాదకులు) 1935 లో వైతాళికులు అనే పేరుతో ఆధునిక కవితలను ఒక సంకలనం గా వెలువరించారు. వైతాళికులు సంకలనం లో జాషువా కవితలకు చోటు దక్కకపోవటం చారిత్రాత్మక తప్పిదమని జాషువా అభిమానులు భావిస్తారు. దళిత సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించే జాషువా కవితలకు వైతాళికులలో స్థానం లభించకపోవటానికి కారణం జాషువా దళితుడు కావటమేనని కొందరు తలుస్తారు.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపురే
ఖా కమనీయ వైఖరులు గాంచిభళీభళీ; యన్నవాడే 'మీ
దేకుల'మన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో
బాకున గ్రమ్మినట్లగున్ పార్థివచంద్ర! వచింప సిగ్గగున్.
"ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే.అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు." ('' '' లో ఉన్నదానికి మూలం: తెలుగు వికీపిడియా )
కవికోకిల జాషువా బహిరంగంగా, వేదికపై విశ్వనాథ సత్యనారాయణగారి చేత అవమానించబడ్డాడు. ఒక సారి కాకినాడ సభలో వేదికపై సాహితీ పరులు కూర్చుని ఉండగా విశ్వనాథ అధ్యక్షత వహించారు. వరుసక్రమంలో 5వ స్థానంలో జాషువా ఉన్నారు. ఆయన వంతు వచ్చినప్పుడు, విశ్వనాథ ఇప్పుడు పంచముడు ప్రసంగిస్తాడు అన్నాడు. అది చాలా దారుణపైన ప్రస్థావన. ఎందుకంటే పంచముడు అంటే అంటరాని 5వ కులంవాడని అర్థం ఉన్నది. వరుసలో 5వ స్థానంలో కూర్చున్నాడు కనుక అది దృష్టిలో పెట్టుకుని, తన కుల ద్వేషాన్ని విశ్వనాథ ఆ రూపాన వెల్లడించుకున్నాడు. సభలో సాహితీ పరులు దానిపై నిరసన తెలియజేశారు.
ఒక సందర్భంలో బందరులో దువ్వూరి రామిరెడ్డి, జాషువా కూర్చుని ఉండగా విశ్వనాథ వచ్చి, రెండు కవి కోకిలలు ఒకే చోట చేరాయే అని అపహాస్యంగా అన్నాడు. వారి ఇరువురికి కవి కోకిల అనే బిరుదులు ఉండేవి. దానిపై జాషువా స్పందిస్తూ కిరాతకుడు మా పై దృష్టి పెట్టటం ఇంకా పోలేదా అని తిప్పి కొట్టాడు.
ఆంధ్రప్రభ, భారతి పత్రికలలో విశ్వవాథపై కొత్త సత్యనారాయణ మొదలైన వారు తీవ్ర విమర్శలు పరంపరగా చేశారు. వాటికి విశ్వనాథ సమాధానం చాలా పేలవంగా ఉండటానికి ఆయన సంకుచిత భావాలు, కరుడుకట్టిన కులతత్వం, మత ఛాందసం, అగ్రకుల అహంకారం కారణం అని పలువురు సాహితీపరులు అభిప్రాయబడ్డారు. విశ్వనాథ కులద్వేషానికి, వేయిపడగలు ఒక ఉదాహరణగా చెప్తారు. రామాయణము విశ్వనాధవారికి ప్రీతిపాత్రము. విశ్వనాథ వారి వేయిపడగలు చాతుర్వర్ణ వ్యవస్థను సమర్ధిస్తుంది కావున బ్రాహ్మణులు విశ్వనాథకు అడ్డుగా పెద్ద గోడవలే నిలిచి, విమర్శకులను ఎదుర్కొంటూ, విశ్వనాథ వారి భావాలను ప్రచారం చెయ్యటం జరిగింది అని అప్పటివారి ఉవాచ.
విశ్వనాధ, అవధాని,తిట్టు కవి వేలూరి శివరామ శాస్త్రి (చూడండి ఆత్మకథ ప్రధమ, ద్వితీయ సంపుటాలు - 1929 లో కాశీనాధుని నాగేశ్వర రావు ద్వారా ప్రచురితమైనవి.) హిందూ సాంప్రదాయాలు, వర్ణాశ్రమ ధర్మాల కు కాపు కాస్తూ, కవిత్వం రాసే వారు. నవ్య కవితా పితామహుడు రాయప్రోలు సుబ్బారావు ప్రేమ గీతాలు, భావ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి విరహ గీతాలు, పాషాణ హృదయ కవి విశ్వనాధ వర్ణాశ్రమ ధర్మాల కవితలు రాస్తుంటే భారతదేశమెలా బాగుపడుతుందని జాషువా అనే వాడు.
17 వ శతాబ్దపు కవి వేమన వలె, జాషువా సమాజంలోని కులవివక్షను ఈసడించాడు. జాషువా వేదాల అధికారకతను ప్రశ్నించాడు. హిందుత్వాన్ని అందులోని పునర్జన్మ, కర్మ సిద్ధాంతాన్ని విమర్శించాడు. తమ పూర్వ జన్మ పాపాలవలనే పంచములుగా పుడతారన్న హిందూ మత తత్వాన్ని, దానికి ప్రతినిధులుగా కాపుకాస్తున్న బ్రాహ్మణులపై ధ్వజమెత్తాడు. దళితులను అస్ప్ర్‌స్యులుగా చూస్తూ వారిపట్ల అమానుషంగా ప్రవర్తించటం వెనుక హేతుబద్ధ కారణం ఏమీ లేదంటాడు. తనకు జరిగిన అవమానానికి జవాబుగా జాషువా గబ్బిలం (1941 మరియు 1946) రాశాడు. "గబ్బిలం" లోని నాయకుడు జీవితాంతం హిందువుల కులవివక్షకు గురైన హరిజనుడు. నాయకుడికి గుడిలో ప్రవేశార్హత (అమెరికా యువ మిత్రుడి కోసం - పంచములకు (అంటరానివారు, అస్ప్ర్‌స్యులు,దళితులు- వీరినే బాపూజీ హరిజనులుగా అభివర్ణించారు) దేవాలయాల్లో ప్రవేశాన్ని హిందూ అగ్ర వర్ణీకులు నిషేధించారు; మహాత్మా గాంధి ఈ ఆంక్షలను ఖండించారు) లేనందువలన, గబ్బిలాన్ని తన దూతగా ఎంచుకుని, అంటరాని వారికి, దరిద్రులకు జరుగుతున్న అవమానాల గురించి శంకరునికి గబ్బిలం చేత సందేశం పంపిస్తాడు. కులవివక్ష నుంచి ఈ జన్మకు విముక్తి లేదా అని తన బాధను వెళ్లబుచ్చుతాడు. ఈ కావ్యం లో హిందూ మతాచారాలు, వర్ణవ్యవస్థ ను విమర్శించాడు. విశ్వనాధవారి వేయిపడగలకు జాషువా రాసిన కావ్యం "గబ్బిలం" దీటైన జవాబుగా నిలుస్తుంది.
విశ్వనాథ వారి కవిలికట్టలలో గాలి తప్ప మరేమీ లేదన్నాడు శ్రీ శ్రీ. నార్ల వెంకటేశ్వర రావు గారు తమ సంపాదకీయాలలో విశ్వనాథవారి రచనలపై పెక్కు విమర్శలు చేశారు. ఒక వ్యక్తిని అతని గుణ గణాలు, ప్రతిభను బట్టి గౌరవించాలి, కులాన్నిబట్టి కాదు. అభ్యుదయవాది, పద్మభూషణ్, కవికోకిల శ్రీ గుఱ్ఱం జాషువా తన ఆత్మకధను మూడు సంపుటాలుగా "నా కధ" అనే పేరుతో వ్రాశారు.
నెటిజెన్ ,
కవి రాజు గారి మొత్తం రచనలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? నా దగ్గర మా వూరిలోని అభ్యుదయ భారతి అనే సంస్థ ప్రచురించిన "కవిరాజ మార్గం" అనే పుస్తకం ఒక్కటి ఉంది. అందులో ఆయన రచనల్లోని కొన్ని భాగాలను తీసుకుని సంకలనం చేసారు.
@సుజాత:
కవిరాజు సాహిత్యం - ౩ సంపుటాలు,
కవిరాజు సాహితి సమితి
"లుంబిని"
3-30-14/D
నలంద నగర్, రింగ్ రోడ్
గుంటూరు 522006
ఫోను; (0863) 2350017 లో లభ్యం.
ఇక బి.ఎస్.ఎన్.ఎల్ వారు, పై ఫోన్ నెంబరుకి ఇచ్చిన చిరునామా:
PEDDABBAIAH ALOKAM, 3-30-14/7,RING ROAD,2ND LINE,NALANDA NAGAR,522007,GUNTUR
కవిరాజు పుస్తకాలు అశోక్ బుక్స్, విజయవాడ ఇంకా విశాలాంధ్ర వారి అన్ని కార్యాలయాల్లోనూ లభ్యమవుతాయి.
netizen garu, cbrao garu
thank tou!
ఇక చెప్పేదేమున్నది.మనకు సంచలనాలు కావాలి .ఇప్పుడు మా వినుకొండ బిడ్డ జాషువాగారు లేరు.విశ్వనాథులవారు లేరు. కానీ వారి గొప్పతనాలు నిలచేవున్నాయి. ఒక పంటలో వచ్చే మంచి ధాన్యాన్ని మనం వుంచుకుని మిగిలిన చెత్తా చెదారం ,విసర్జనపదార్ధాలను పారవెస్తాము.గొప్పవారి జీవితాలనుండి మనం స్వీకరించవలసిన విషయాలకంటె,అనవసరమయిన విషయాలను లేకుంటే విసర్జించవలసిన చెత్తను దానిగురించి చర్చలను పెట్టి ఎంత సాధ్యమైతే అంత అనైఖ్యతను ఈదేశస్తులలో కల్గించాలనె ప్రయత్నాలకు,అలా చేస్తున్న వారికి సహకరించేవిధంగా మేధావులంతా ఈ కుట్రలలోనికి లాగబడుతున్నారు.ఇది ప్రతి విషయము లోనూ.ఒక విధముగా ఈ గూఢచారుల ప్రయోగాలు సఫలీ కృతమవుతున్నట్లే. ఇక నన్నా ఇది ఆపుతారా?
"వ్యాఖ్యలు లో సంస్కారం లోపిస్తే వాటిని తొలగించాలి అంతే కాని వ్యక్తిగత దాడులవలన ఎవరికి లాభం? " ... సంస్కారం లోపించినా సరే ఆ వ్యాఖ్యలను ప్రచురించడమే మంచిది. (లేకపోతె పత్రికలకి బ్లాగులకి తేడా ఏముంటుంది.) బ్లాగుల్లో భావ ప్రకటనా స్వేఛ్చ లేకపోతె ఇక బ్లాగులు చదవడం దేనికి?? వ్యాఖ్యలు రాయడం దేనికి?? అక్కడదాక ఎందుకు తప్పో ఒప్పో ఇన్నయ్య గారు రాసిన వ్యాసం ఆ నాడు రాడికల్ హ్యూమనిస్ట్ పక్ష పత్రిక లో ప్రచురించ బట్టే కదా... ఇప్పుడు ఇంత చర్చ. అలనాడు ఆ పత్రిక ప్రచురించకుండా ఉంటే... బ్లాగర్లూ అందరూ అర్ధం చేసుకోండి.
గుర్రం జాషువ పుస్తకాలు ఎక్కడ దొరుకుతయ్యో ఎవరైనా చెప్పగలరా? ముఖ్యంగా ఖండకావ్యాల కోసము చూస్తున్నాను. వాడినవైనా ఫరవాలేదు. మార్చిలో హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో కొద్దిరోజులు ఉంటాను.
తెలుగు సారస్వతమున్నంత కాలము విశ్వనాథ వారి రచనలు నిలిచి వుంటాయి. శ్రీ గరికపాటి నరసింహారావుగారు ఆయనను రెండవ వాల్మీకి (http://surasa.net/music/purana/garikapati/01-ramayana.mp3) అని ఎందుకు భావిస్తారో లింకులో వినండి. విశ్వనాథ వారిని గ్రాంధికవాది అని విమర్శించేవారు ఈమాటలో (http://www.eemaata.com/em/issues/200806/1276.html/) వ్యాసం చదవండి. రామాయణ కల్పవృక్షం మానె, ఇది కల్పవృక్షం (శ్రీ వడలి మందేశ్వరరావు గారు) మొదట చదివితే చాలు.
గురువుగారి ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు. (ఇక రాకపోవచ్చు అని అర్ధమౌతోంది, బ్లాగుకర పోస్టు చేసిన వివిధ వ్యాఖ్యలు గమనిస్తే)
చివరగా రెండు మాటలు:
తన లోతు నెరుగని జనుల పూజకు తిరస్కృతి జూపు మత్సరస్వతి సుభద్ర
తన లోతు నెరిగిన జనుల పూజకు నవాదృతి జూపు మత్సరస్వతి సమార్ద్ర
తిట్టడమే పనిగా పెట్టుకున్నవారికి విశ్వనాథ వారి పై మాట చాలు.
చాటుపద్య మణిమంజరిలో ఒక పద్యం గుర్తుకు వస్తోంది కానీ మరీ నేను కూడానోరు(చెయ్యి) పారేసుకున్న జాబితాలోకి చేరడం ఇష్టం లేక రాయటం లేదు.
సూర్యప్రకాషు
@ సూర్యప్రకాషు: "గురువుగారి ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేదు. (ఇక రాకపోవచ్చు అని అర్ధమౌతోంది, బ్లాగుకర పోస్టు చేసిన వివిధ వ్యాఖ్యలు గమనిస్తే)"
- మీ గురువుగారు ఎవరు? వారు ఎవరికి, ఎక్కడ జాబు వ్రాశారు? వారి సందేహమేమిటి?
@ gaddeswarup: జాషువా రచనలు -మూడు భాగాలు విశాలాంధ్ర ప్రచురణలు లో లభ్యమవగలవు.
అమెరికా లో ఉన్న వారు AVKF ద్వారా తెప్పించుకోవచ్చు. ఈ కింద లింక్ చూడండి.
http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=121
ఈ సంపుటాలలో అన్నీ ఉన్నట్లు లేవు. నేను అడిగిన ఖండకావ్యాలలో మూడు poems ఆంధ్రభారతి లో చూడవచ్చు:
http://www.andhrabharati.com/kavitalu/jAShuvA/index.html
అందులొ స్మశానస్థలి మానాన్న చాలాసాలు పాడారు. చిన్నప్పుడు ఆయన పుస్తకం దొంగతనం చేసి బొంబాయి తీసుకు వెళ్ళాను. తర్వాత పారేసుకున్నా.
క్షమించాలి. రాత్రి రాస్తున్నప్పుడు శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి పేరు (గురువుగారి) బ్రాకెట్లులో తొలగిపోయింది. వారు అడిగిన ప్రశ్నలకు నాకైతే ఇంతవరకూ మీరు పోస్టు చేసిన వ్యాఖ్యల్లో సమాధానాలు కనపడలేదు.
సూర్యప్రకాష్
@ gaddeswarup: జాషువా రచనలు మూడు భాగాల లో ఉన్న విషయాల గురించిన వివరణ AVKF వారి సైట్ కిచ్చిన లింక్ లో చూడవచ్చు. జాషువా ఫౌండేషన్, విజయవాడ వారు జాషువా రచనలు కొన్ని ప్రచురించారు. జాషువా గేయాలతో కొన్ని శ్రవ్య casettes వెలువరించారు. హైదరాబాద్, విజయవాడ లోని పుస్తక దుకాణాలలో పాత ప్రచురణలు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ అబిడ్స్, కోఠీ ప్రాంతాలలోని, విజయవాడ అలంకార్ టాకీస్ పరిసరాల్లో పాతపుస్తకాలు అమ్మే దుకాణాలలో, జాషువా పాత ముద్రణలు దొరికే అవకాశముంది. పాత పుస్తకాల రాసులలో రత్నాలను ఏరుకోవచ్చు.
@ భైరవభట్ల: "మళ్ళీ కల్పవృక్షం తిరగేస్తే అంతా చిన్నము నిలువక వ్రాసినట్టే వున్నది" - ఇలా అనడం వెనకనున్న కారణాలని వివరించలేదెందుకు?"
- దీనికి సమాధానం వ్యాస రచయితే చెప్పాలి, ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా అది ఊహాగానమే కదా. అయితే అప్పటి చారిత్రక నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను.
విశ్వనాధవారి సమకాలీన రచయితలు, విమర్శకుల దృక్కోణంలోచి చూస్తూ, అప్పటి నేపధ్యాన్ని అర్థం చేసుకొందాము.
కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి కల్పవృక్షఖండనం , విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షంపై విమర్శనాత్మక సమీక్ష. తొలుత తెలుగు విద్యార్ధి మాసపత్రిక లోను, తదుపరి 1961 జూన్ నుంచి భారతి మాసపత్రికలో రామాయణ కల్ప వృక్షం పై విమర్శల పరంపర కొనసాగింది. తదనంతరం కల్పవృక్ష ఖండనం గా ప్రచురించారు. కల్పవృక్ష ఖండనం భారతి మాస పత్రిక లో వెలువడుతున్న సమయంలో సంచలనం గలిగించినది. అది విశ్వనాధవారిపై కాదనీ, రచనపైనే తన విమర్శని కొత్త సత్యనారాయణ గారు విమర్శకుల సందేహ నివృత్తి చేశారు. చౌదరి గారు వర్ణవ్యవస్థ ను ఒక కుట్రగా తలిచారు. దేశ భవిష్యత్తుకు అది గొడ్డలిపెట్టు అని తన కలిపురాణము లో ఉద్ఘాటించారు. రామాయణ రహస్యాలు పుస్తకంలో వాల్మీకి రామాయణం ఆధారంగా రాముడు దైవ సంభూతుడు, సత్యవ్రతుడు కాదని, మనలాంటి రాగ ద్వేషాలతో కూడిన మానవుడేనని నిరూపించారు.
విశ్వనాధవారి రచనలపై కొత్త సత్యనారాయణ చౌదరి గారి మనోభావాలను అక్షర రూపంలో, Quotes లో కింద చూడగలరు (రచన చేసిన తేది 25-5-1964).
"పూర్వ వాజ్ఞ్మయములొ కులగోత్రాలపేరుతో జాతిమతముల వంకతో కావలసినన్ని కల్మషములు పుట్టి పెరిగి- అదియొక సంప్రదాయముగా సనాతనాచారముగా వర్ధిల్లి తన్మూలమున పీడుతులైన వారికి సైతము అదే ఉపాస్యమన్న ధోరణిలో వెలసినది. ఈదేశములో ఈరహస్యమెఱిగినవారు ఎందరో ఉన్నను, రచనలో కవితలో నిబ్బరముగా నిరాటంకముగా బయటపెట్ట నేర్చిన దిట్ట ఒక్క త్రిపురనేని రామస్వామి చౌదరి యనియే చెప్పవలెను. ఆత్రోవలో వ్యాసంగము చేసి ఆ రహస్యములను మఱికొన్నింటిని గుర్తించి ఆవంకకే కలము త్రిప్పి ఈరచయిత ‘కలిపురాణ’ శ్రేణిని వెలువరింప సాగెను. ‘కలిపురాణ’మన్న పద్యకావ్యము ఇంతవఱకు అయిదు భాగములుగా వెడలినది.
వర్ణాశ్రమ ధర్మమన్నపేరిట సనాతనాచారమన్న ధోరణిలో అవకాశము కలిగినప్పుడెల్ల తెలుగులో ‘విశ్వనాధ వారు’ వ్రాసెడి వ్రాతలు చదివి ఏవగించుకొనువారు నూటికి ఎనుబదిమందికి పైగాఉన్నను, వ్రాతలో వానిని ఖండించువారు ముందునకు రారైరి. ఆయనకేదో ఇంత ప్రతిష్ట ఉన్నదన్న భ్రమచేత -ఆయన నోటినుండి వచ్చిన మాటలకెల్ల ‘భజగోవిందము’ పాడు శిష్య పరమాణవులు కొందరు పిల్లగంతులు వేయుచుండుట చేత, అధికారికముగా సాంఘికముగా రాజకీయముగా ఏవేవో ఇబ్బందులున్నవన్న స్వార్ధముచేత విశ్వనాధ వారి రచనల లోని అవకతవకలను దెలిసియు గొందరు గ్రందస్ధము చేయరు. విషయమందే గాక రచనలో శయ్యలో శాబ్దికముగా ఆర్ధికముగా ఆయన చేసెడి దోషములు లక్షలుగానున్నను ఉపేక్షవహించుటయే విద్వాంసులనేకులకు ఆచారమైనది. శ్రీమద్రామాయణకల్పవృక్షము మహాకావ్యమనియు, కవిత్రయము వారు పోతనామాత్యులు భారత,భాగవములను తెలుగునకు దెచ్చిరేగాని, వాల్మీకమునకనువాదము నేటి వఱకు సరియైనది రాలేదనియు, ఆలోపము ‘వైశ్వనాధము’తో తీరినదనియు, వాల్మీకమునకీకల్పము అచ్చముగా భాష్యమువంటిదనియు, ప్రసిద్ధులైన సంస్కృతాంధ్రమహాకవులనేకులు పోవని పోకడలు ఈకల్పవృక్షములో వున్నవనియు, శ్రీనాధాదులనే గాక వాల్మీకిని సైతము ఈగ్రంధకర్త ఒకవిధముగ రచనలో మించెననియు, విశ్వనాధ వారి బృందముతో బాటు విశ్వనాధులవారికి ఈభావమున్నట్లు ఉపన్యాసముల వలన ప్రసంగముల వలన స్పష్టమగుచున్నది. ఈభావమే ప్రకోపించి ఎదురెవ్వరు లేరన్న ధీమాతో, భాష్యమనివంకపెట్టి వాల్మీకమును వికృత పరచి అందలి పాత్రలను అపాత్రలను జేసి, లాక్షణికముగా లక్షోపలక్షలుగా అపభ్రంశములు కావించి తెలుగు మర్యాదనే చెఱచి, ఛందస్సునే విఱిచి, విశ్వనాధవారు యదేచ్ఛముగ సంచరించిన ఘట్టములనేకములున్నవి. ‘విశ్వనాధ పంచశతి’ పేరుపెట్టి ఆయన వ్రాసిన అయిదు వందల పద్యములలో బూతులెన్నెన్ని కలవో, జాతి నింద, వర్గ దూషణ ఎంతెంత కలదోసోపపత్తికముగా ఈరచయిత వ్రాసియుండెను. దాని పేరు ‘పంచశతీ పరీక్ష’. తీరిక లేని వారు, ఓపిక చూపలేని వారు, విశ్వనాధ రచనలు అన్నింటిని జూడవలసిన పనిలేదు. ‘పంచశతీ పరీక్ష’ అనెడి ఈచిన్న సమీక్షను జూచిన జాలు, ఆయన తత్వము అక్షరాల ఆరచనలో ప్రతిబింబించి కన్నులకు గట్టినట్లు స్పష్టమగును. వాల్మీకమొక చేతిలో బెట్టుకొని ‘కల్పవృక్షము’ను ప్రత్యక్షరము పరిశీలించి చూడగా తెలుగు బాసకు ఆయన చేసిన ద్రోహము, వాల్మీకి మహర్షికి ఆయన కావించిన అపచారము వ్యక్తము కాగలదన్న భావముతో ఈరచయిత ‘కల్పవృక్షఖండన’మని పేరు వెట్టి తెలుగువారి కెఱుక పఱిచెను. ఇదే ధోరణిలో ‘వేనరాజు - వేయిపడగ’లను గూడ పరీక్షలో పెట్టి ఆయన తత్త్వము స్పష్టపఱుపవలెనన్న సంకల్పముతో ఈ రచయిత కృషి చేయుచున్నాడు."
http://kamalkotha.blogspot.com
సౌజన్యంతో
కొత్త సత్యనారాయణగారి వ్యాఖ్యలు ఇన్నయ్యగారి వాటికన్నా వెయ్యిరెట్లు నయం. ఎందుకంటే, ఇతను కల్పవృక్షం చదివి ఆ విమర్శలు చేసారు. అయితే ఆ విమర్శ ధోరణి ఇద్దరిదీ ఒకటే. "కల్పవృక్ష ఖండనము"లోని "ప్రస్తావము" చదివితే, దీని వెనకనున్న ఉద్దేశం - విశ్వనాథ మీద, అతను రచించిన కల్పవృక్షం మీద ఉన్న పట్టరాని ద్వేషాన్ని వెళ్ళగక్కడమే తప్ప నిష్పాక్షికమైన సాహిత్య విమర్శ చెయ్యడం కాదని స్పష్టంగా తెలుస్తుంది. కొత్త వారి ఖండనకి ప్రతిస్పందనగా ఆ రోజుల్లోనే అనేకుల సమాధానాలు, ప్రతి ఖండనలూ వచ్చాయి. అయితే అవన్నీ వారికీ, ఇన్నయ్యగారి లాంటి వారికీ "భట్రాజుల" "చెక్కభజన" గానే కనిపించాయి. విశ్వనాథ కవిత్వాన్ని మెచ్చుకొన్నవాళ్ళందరినీ భట్రాజులుగా పరిగణించే వాళ్ళు, తాము విశ్వనాథ మీద చేస్తున్నది పక్షపాత పూరితమైన negative propagandaగా అనిపించవచ్చుననే ఆలోచన కలగక పోవడం విచిత్రం!
కొత్త సత్యనారాయణగారి ఖండనలో ముఖ్యమైన అంశాలు ఇవి:
1. విశ్వనాథ అహంకారాన్ని గురించి విపులంగా వర్ణించి, దాన్ని నిరసించడం - దీనికీ అతని కవిత్వానికీ ఏమిటి సంబంధమో తెలీదు. అహంకారి అయిన కవి మంచి కవిత్వాన్ని రాయలేడని వీరి ఉద్దేశమా? ఇందులోకూడా విశ్వనాథ మాటలకి తప్పుడు అర్థాన్ని లాగడం విరివిగా కనిపిస్తుంది. "నన్నయ్యయు తిక్కన్నయు నన్నావేశించిరి" అన్న పద్యాన్ని పట్టుకొని, తాను నన్నయ్య తిక్కన్నల కంటె గొప్ప కవినని విశ్వనాథ చాటుకున్నారనడం దీనికొక ఉదాహరణ.
2. ప్రౌఢ బాల వ్యాకరణాల ఆధారంగా కల్పవృక్షంలోని కొన్ని పదాలనీ, వాక్యాలని దోషాలని తప్పుబట్టడం - దీనికి సమాధానంగా చాలా పదాలు పూర్వ కవి ప్రయుక్తాలే అని నిరూపించ బడ్డాయి. అలాగే తక్కినవి విశ్వనాథ వారి కాలంలోని వాడుకభాష వాడటం వలన అవి వ్యాకరణ విరుద్ధంగా కనిపించడం. ఆధునిక కవిత్వ విమర్శకులెవ్వరూ దీన్ని దోషంగా పరిగణించరు కదా దీన్ని గుణంగానే పరిగణిస్తారు. ఇలాటి దోషాలను ఎత్తిచూపడం ఎంత అర్థం లేని పనో ఒక ఉదాహరణ కొత్తవారు తప్పుపట్టిన "ఆడుబిడ్డల, మఱదుల, అత్తలందు" అన్న వాక్యం. వాడుకభాషలో మాట్లాడేటప్పుడు "ఆడుబిడ్డలందు, మఱదులందు, అత్తలందు" అని "అందు"ని మూడు సార్లు అనం. "ఆడుబిడ్డల, మరదుల, అత్తలందు" అనే అంటాం. ఇది చాలా సులువుగా బోధపడే సామాన్య విషయం. ఇది అతనికి దోషంగా కనిపించడం అతి విచిత్రం!
3. రామాయణ కల్పవృక్షాన్ని వాల్మీకంతో పోల్చి మూలాన్ని అనుసరించ లేదనడం - ఇది నిజానికి విమర్శా? మూలాన్ని అనుసరించని చాలా చోట్ల దానికొక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించే విశ్వనాథ చేసారు. దాని గురించి చాలామంది విమర్శకులు వివరించారు కూడా. అయితే మూలానుసరణం కాని ప్రతిదాని వెనుకా ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవ్వదా? కథని తిరిగి చెప్పేటప్పుడు కవికి సొంతగొంతంటూ ఒకటి ఉంటుంది. అది అతను చెప్తున్న కథకి ఎంతవరకూ దోహదం చేస్తోంది అన్నది ప్రథానం కాని అది మూలాన్ని ఎందుకు అనుసరించ లేదు అన్నది కాదు కదా. మూలాన్ని మార్చినప్పుడు ఏదైనా అనౌచిత్యం కలిగితే దాన్ని విమర్శించవచ్చు. అలాంటి విమర్శ ఇందులో చాలా తక్కువ.
4. ఔచిత్యాన్ని గురించి విమర్శించినప్పుడాల్లా కొత్తవారు సంస్కృత కావ్య నాటకాలకి ఉపయోగపడే సూత్రాలని తెచ్చి ఇక్కడ ప్రయోగించారు! దీనికొక పెద్ద ఉదాహరణ ఇతను విశ్వామిత్రుని కథ గురించి చేసిన విమర్శ. కథ చెపుతున్నది శతానందుడు కాబట్టి, చెపుతున్నది రామలక్ష్మణులకి కాబట్టి, విశ్వామిత్రుడు అక్కడే ఉన్నాడు కాబట్టీ, విశ్వామిత్రుని వశిష్ఠుడు తిట్టిన తిట్లు ఆ కథలో ఉండకూడదట! అలాగే విశ్వామిత్ర మేనకల శృంగారాన్ని వర్ణించడం అనౌచిత్యమట! ఇది దృశ్యకావ్యమో, రూపకమో (నాటకం) కాదనీ, పాఠకులు చదువుకునే లేదా వినే కావ్యమనీ, కథలోని కథలో పాఠకుడు నిమగ్నమైనప్పుడు అది చెప్తున్నది ఎవరు ఎవరితోనన్న స్పృహ పాఠకులకి ఉండదనీ, అంచేత దృశ్యకావ్యానికి సంబంధించిన ఔచిత్య అనౌచిత్యాలన్నీ శ్రవ్యకావ్యాలకి వర్తించవన్న కనీస సాహిత్య పరిజ్ఞానం ఇతనికి లేకపోయింది! పాత్ర స్వభావాలలో కూడా మూలానికి భిన్నంగా చిత్రీకరించిన సందర్భాలలో, వాటికి పాతకాలపు స్వభావాలే తప్ప, ఈ కాలపు స్వభావాలు ఉండకూడదని అనడం ఎంత సమంజసమైన సాహిత్య విమర్శా? సీత వాల్మీకి రామాయణంలో (మనకి తెలియని సంస్కృతిలో భాగమైన) సీతలేగా కనిపించాలి తప్ప ఒక తెలుగింటి సీతగా కనిపించ కూడాదనడం కవి ప్రతిభని పాతిపెట్టటానికే!
5. అన్వయ క్లిష్టతని ఎద్దేవా చెయ్యడం, తూలనాడటం - అన్వయ క్లిష్టత కవిత్వానికి కొత్తా కాదు, కవిత్వాన్ని తక్కువ చేసేదీ కాదు. అయినా కల్పవృక్షంలోని చాలా పద్యాలు అరసికులైన పండితుల అన్వయానికి లొంగవేమో కాని రసజ్ఞులైన సామాన్యులకి అనుభూతమౌతాయి. మైసూరులో విశ్వనాథ కల్పవృక్షాన్ని చదివినప్పుడు, "ఇంత కొద్దిగా చదివి ఎందుకు ఆపేసారు, ఇంకా కావాలని" ఒక సామాన్య రైతు కోరడం దీనికి ఉదాహరణ. అలా చెయ్యడంలో ఆ రైతు విశ్వనాథ "భట్రాజు" ఎలా అయిపోయాడో, ఆ రైతు ఏ స్వార్థం వల్ల ఈ పని చేసాడో కొత్తవారికో, ఇన్నయ్యగారికో తెలియాలి.
6. కొత్తవారు చేసిన విమర్శలన్నిటిలోకీ నాకు కొంత సమంజసంగా తోచిన విమర్శ, విశ్వనాథ పద్యాలలో చాలా చోట్ల కనిపించే "ఊత"పదాలు. ఇది ప్రథానంగా విశ్వనాథ వాడుక భాషా స్ఫూర్తిని కలిగించడానికి వాడారు. అయితే ఇది శ్రుతి మించి "ఉత్త" పదాలుగా మారిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. ఈ ఒక్క దోషమూ కల్పవృక్షాన్ని "బుఱ్ఱ లేకుండా" రాసారని మాటతూలడానికి ఏ మాత్రం సత్తువా ఇవ్వదు.
7. కల్పవృక్షంలో కనిపించే విలువలని నిరసించడం - భారతీయ సంప్రదాయం, సంస్కృతీ ఏ మాత్రమూ సహించలేని వారికి కల్పవృక్షమూ, చాలా ఇతర రచనలూ ఏమాత్రం రుచించవు. అందులో సందేహమేమీ లేదు. అయితే విశ్వనాథ తన కావ్యంలో ప్రచారం చేసింది వట్టి పాత సంప్రదాయం కాదనీ, అందులోని మంచి గ్రహించి, దాన్ని ఆధునీకరించే నవ్య సంప్రదాయమనీ సహేతుకంగా విశ్లేషించిన వారు చాలామంది ఉన్నారు. లేదు కేవలం అతను ప్రగతి విరోధి అని అన్నవాళ్ళూ ఉన్నారు. ఒకోరిది ఒకో దృష్టి. విచిత్రం ఏవిటంటే, విశ్వనాథ కవిత్వాన్ని మెచ్చుకొన్న వాళ్ళలో, సిద్ధాంతాల గురించి కాక, కేవలం అతని కవిత్వంలో గొప్పదనాన్ని వివరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అతన్ని నిరసించిన వాళ్ళెవ్వరూ అతని సిద్ధాంతాల జోలికి పోకుండా కేవలం అతని కవిత్వాన్ని విమర్శించిన వాళ్ళు లేరు! అతని కవిత్వంలో దోషాలని వెతికిన వారు ఒక్క కొత్త సత్యనారాయణగారే. అందుకతన్ని అభినందించాలి. కాని దురదృష్టవశాత్తు ఆ దోషాన్వేషణ, కేవల రంధ్రాన్వేషణగా పరిణమించింది. ఎందుకో నా పై వివరణ చూస్తే స్పష్ట మౌతుంది.
కొత్త సత్యనారాయణగారి "ఖండనము" గురించి నేను పైన చెప్పిన విషయాలు తప్పో ఒప్పో స్వయంగా తెలుసుకోవాలంటే, అతని "కల్పవృక్ష ఖండనము" జాలంలోని Digital libraryలో దొరుకుతుంది. దాన్ని చదివి నిర్ణయించుకోవచ్చు.
విశ్వనాథ కావ్య రచనలోని విశిష్టతగూర్చి కొలకలూరి ఇనాక్ గారు చెప్పిన ఈ వాక్యాలు సంపూర్ణ సత్యాలు:
"వర్తమాన కథను జీవితాన్ని గ్రహించిన సందర్భములలో పౌరాణిక చారిత్రక భావాలు విలువలు ప్రతిష్ఠించి ఈ వర్తమాన జీవితానికి గత సమాజము సంస్కృతికి సంబంధం బాంధవ్యము ఏర్పరచుటలో విశ్వనాథ విశిష్టుడు. అందువల్ల విశ్వనాథ పౌరాణిక చారిత్రక కథలలో ఆధునిక స్పర్శ, ఆధునిక ఇతివృత్తములకు ఒక జీవిత స్పర్శ ఉండడము తథ్యము. అంటే విశ్వనాథ సాహిత్యము సమాజము మీద అధిగతమైన వర్తమానమైనా మన జీవిత సంబంధిత ధర్మ విపర్యయము పొందే స్థితి ఉంది. గతములో వర్తమానము, వర్తమానములో గతము ప్రతిష్ఠించటము విశ్వనాథ ఇతివృత్తములలో ప్రాణ ప్రతిష్ఠ పొందిన విశేషమైన అంశము"
ఈ మాటలు "ఆధునికాంధ్ర కవిత్వంలో విశ్వనాథ స్థానము" అన్న వ్యాసంలోనివి. ఈ వ్యాసమూ, దీనితో పాటు కల్పవృక్ష విశిష్టత గురించి "సహేతుకంగా" విశ్లేషించే ఇతర వ్యాసాలు "శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య వైభవము" అన్న పుస్తకంలో చదవ వచ్చు. ఇదికూడా Digital Libraryలో దొరుకుతుంది.
ఇందులో వ్యాసాలు రాసిన వారందరూ "భట్రాజులూ" "స్వార్థ పరులూ" అవునో కాదో ఎవరికి వాళ్ళు, వాళ్ళ సంస్కారాన్ని అనుసరించ నిర్ణయించుకోవచ్చు.
@ కత్తి మహేష్ కుమార్: "అయినా, గొప్పోళ్ళ "గొప్పతనాన్ని"(what ever it means) సమయానుగుణంగా ప్రశ్నించకపోతే వాళ్ళ గొప్పతనం irrelevant అయిపోదూ!" - ఈ వ్యాస ఉద్దేశం ప్రశ్నించటానికి కాదు, అర్థం చేసుకోవటానికి. మనము విశ్వనాధ వారి భావాలు సరిగా అర్థం చేసుకున్నామా అని ప్రశ్నించుకోవటానికి. ఈ వ్యాసం వలన ఇంకో ప్రయోజనం కలిగింది. మనలో చాలా మంది ఎప్పుడో కాలేజ్ లో ఉండగా విశ్వనాధ గురించి వినటమో లేక వారివి కొన్ని పుస్తకాలు చదవటమో జరిగింది. ఈ వ్యాసం ప్రేరణతో కొందరు విశ్వనాధ పుస్తకాలు మరల తిరగేయటము, ఈ తరం పాఠకులు కొందరు ఆయన రచనలు చదవాలని అనుకోవటము, మిత్రుడు మురళీకృష్ణ తన బ్లాగు లో విశ్వనాధ రచనలను పాఠకులకు పరిచయం చేయడం జరిగింది. ఈ వ్యాస ప్రచురణ ద్వారా విశ్వనాధ గురించి, వారి భావాలు, పుస్తకాల మంచి-చెడుల చర్చలు పునఃశ్చరణం అయ్యాయి. మధుర చిత్రం ఏకవీర చిత్రానికి మూల కథ రాసిన రచయితగా విశ్వనాధ నా మదిలో నిలిచిపోయారు.
@ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: "విశ్వనాథవారిని విమర్శించేంత లేదా పొగిడేంత స్థాయి కావాలంటే మరో విశ్వనాథ పుట్టాలి." - ఈ సిద్ధాంతం ప్రకారం ఒక హోటల్ లోని ఆహారం బాగుందో లేదో చెప్పాలంటే, చెప్పేవాడు పెద్ద వంటవాడు అయ్యుండాలి. ఒక చిత్రం (Film) బాగుందో లేదో చెప్పటానికి, చెప్పేవాడు దర్శకుడయ్యుండాలి.
"కులానిగ్గానీ, మతానిగ్గానీ, ఆచారానిగ్గానీ ఒక్క వెంట్రుకయినా పీకలేకపోయారేం ఈ యాభై యేళ్ళలో ?" -ఈ రోజున హరిజనులను కులం పేరు పెట్టి పిలువగలమా?పిలువ వచ్చునా? ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకుడికి ఏమయ్యిందో చూశాము కదా. కేవలం ఊరేగింపులో ఉన్నాడన్న కారణంగా జైలు పాలయ్యాడు.
"నేను కూడా కులాన్ని, మతాన్ని, ఎక్కువశాతం ఆచారాల్ని ఖండించను. అంతమాత్రాన నేనొక అస్పృశ్యుణ్ణై పోను." -ఏ కులాన్ని, ఏ మతాన్ని గాని ఖండించే స్వాతంత్రం మీకున్నదా?
ఈ లేఖ మీ పై వ్యక్తిగతదాడిలా మీకనిపిస్తే, అందులకు క్షంతవ్యుడను.
@ చదువరి : "అసలు రావుగారిక్కడ రాసినవాటిలో ఒక్కటి కూడా ఆయన అభిప్రాయం లేదు.. అన్నీ వేరేవారివి. " - సరైన మాటే ఇది. చర్చ సంధానకర్త తన అభిప్రాయాలు వెళ్లడిస్తే చర్చలో పాల్గొనే పాఠకులపై ముందస్తుగా తన అభిరుచులు రుద్దటం కాదా? ఇంతవరకూ అలా unbiased గా చర్చలో ఉన్నా. ఎంత చెప్పకూడదనుకున్నా, అప్రయత్నపూర్వకంగా నేను రాసే రాతలలోంచి పాఠకులు నా అభిప్రాయం తెలుసుకోలేనటువంటి అమాయకులు కారు.
"అంత తీవ్రమైన విమర్శ చేసినపుడు ఏవిఁటి కారణమని అడగడం హక్కులను లాగేసుకున్నట్టవుతుందా?" -ఎలా అవుతుంది? అవదు. పాఠకుడు తన సందేహాలను వ్యాస రచయితకు వెళ్లడించటం సబబైనదే.
"పోతే.. ఇక్కడి వ్యాఖ్యాతలు ఇన్నయ్యగారి వ్యాసంలోని లోపాలను చూపారు. ఈ ప్రశ్నలకు మీ సమాధానాల కోసం ఎదురుచూస్తాను." - మీ ఉత్తరం వచ్చాక భైరవభట్ల , అరుణ, అరుణం, యోగి గార్లకు రాసిన ఉత్తరాలలో మీకు చాలా సమాధానాలు లభించిఉంటాయి. సమాధానం దొరకని ప్రశ్నలకు కూడా సమాధానాలు వస్తాయి. ఈ రోజు కాకపోతే రేపు ఏ విజ్ఞుడైన పాఠకుడో వీటికి జవాబు చెప్తాడని ఆశిద్దాము. ఆరోగ్యకరమైన చర్చకు level playing field కావాలి. ఎన్నో ఉత్తరాలు, ఎన్నో సందేహాలు -అందరికీ నేను ఒక్కడినే సమాధానాలివ్వాలంటే జాప్యం అవుతుంది. భైరభట్లతో చర్చలో పడటంతో, ఎప్పుడో మీరు రాసిన ఉత్తరానికి ఇవ్వాళ జవాబిస్తున్నాను. కొత్త సత్యనారాయణ గారి ముందున్న మీమాంసే నా ముందు ఉన్నది.
"'విశ్వనాధ వారు' వ్రాసెడి వ్రాతలు చదివి ఏవగించుకొనువారు నూటికి ఎనుబదిమందికి పైగాఉన్నను, వ్రాతలో వానిని ఖండించువారు ముందునకు రారైరి." -కొత్త సత్యనారాయణ చౌదరి. చౌదరి గారి కాలానికి ఇప్పటికీ పరిస్తితులలో మార్పు లేదు. ఇన్నయ్య గారి వ్యాసానికి వ్యతిరేకముగా ఇన్ని ఉత్తరములొచ్చుచుండ, కేవలము ఒక్క రవి గారి నుంచే అనుకూలముగా జాబు వచ్చినది. చర్చ సంధాన కర్త చర్చను తులనాత్మకంగా (అనుకూలురు, వ్యతిరేకులు సమంగా ఉన్నప్పుడే కదా ఆట సవ్యంగా ఉండేది) నిర్వహించటం అనువుకాని స్థితి ఇది.
పాఠకులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయరాదు. వారు రచయిత రాసినది నిశిత పరిశీలన చేశాక తమ సందేహాలు ఎంతో తెలివిగా వ్యక్తం చేస్తారు. ఈ ప్రశ్నలవలన కొంత ప్రయోజనముందనే భావిస్తాను. పాషాణకవి విశ్వనాధను అర్థము చేసుకొనటానికి ఈ చర్చ కొంత దోహదపడిందనే తలుస్తాను. జాషువా, విశ్వనాధల గురించి ఇంతకు క్రితము అంతర్జాలములో లభించని కొత్త విషయాలు ఈ చర్చ ద్వారా బహిర్గతమయినవి;మరికొన్ని కానున్నవి. ఇందులోని విషయాలు, ఉపయోగమనుకున్నవి తెలుగు వికీపీడియా నందు వాడుకోవచ్చు. విశ్వనాధ వారి మరికొన్ని రచనలు వికీపీడియా ద్వారా పరిచయం చేయ కోరుతాను.
ఇంతవరకూ విశ్వనాధపై విమర్శకుల అభిప్రాయం రాశాను. యువ రచయితల అభిప్రాయం ఇవ్వకపోతే చిత్రం అసమగ్రం.
విశ్వనాథ సత్యనారాయణ రచనలపై
sowmyawrites ….
నిరాశ కలిగించినది: - వేయిపడగలు.
పి.భవాని
వేయి పడగలులో విశ్వనాథ తెలుగుదేశంలో శిథిలమవుతున్న ప్రాచీన నాగరికతను చిత్రీస్తూ ఆ సమాజం రావాలని ఆశించారు. ''వేయి పడగలు''లో సామ్యవాద వాస్తవికత మినహా కాల్పనిక, సవిమర్శక, భౌతిక, మానసిక వాస్తవికతలన్నీ ఉన్నాయి. కొన్ని పాత్రల సందర్భాల చిత్రణలో ఏదో ఒక వాస్తవికత ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఏ రచయిత అయినా తాను చూసింది, విన్నది, తన అవగాహన లోకి వచ్చింది వంటివేకాక తాను అభిలషించే సమాజ స్వరూపాన్ని కూడా చిత్రిస్తారు కాబట్టి ఈ వర్గీకరణ అన్వయిస్తుంది.
http://www.eenadu.net/sahithyam/display.asp?url=main203.html
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
sowmyawrites ….
వేయిపడగలు దెబ్బకి అల్లాడుతున్న నన్ను మళ్ళీ విశ్వనాథ రచనల వైపు లాగిన పుస్తకం విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు. మొత్తానికైతే మంచి పుస్తకం. మరిన్ని సార్లు చదివినా కూడా బోరు కొట్టదేమో. నేను పుస్తకం చివరికొచ్చేసరికి Language Technologies Research లో ఒక హాస్యమయమైన దృక్కోణాన్ని చూట్టం మొదలుపెట్టాను :) ఇక్కడ తరగతి గదుల్లో సీరియస్ గా చర్చించిన విషయాల్నే అక్కడ పుస్తకం పుటల్లో విశ్వనాథ వారు చాలా చక్కని హాస్యం తో జనానికి అందించారు.
http://vbsowmya.wordpress.com/2007/11/06/vishnusarma-english-chaduvu/
Sriram
ఈ మధ్య నేను చదివిన తెలుగు పుస్తకాలలో ఒకటి ఇది. విశ్వనాధ వారి ఊహాశక్తి కి, సృజనాత్మకతకి ఇది చక్కటి తార్కాణం. అద్భుతమైన వ్యంగ్యం, కడుపుబ్బనవ్వించే హాస్యం వీటికిమించి ప్రతి ఒక్కళ్ళనీ ఆలోచింపచేసే సునిశితమైన తర్కం ఈ పుస్తకంలో కనిపిస్తాయి.మన భాష గొప్పతనాన్ని తెలియచేస్తూ, గుడ్డిగా మనం పరభాషావ్యామోహంలో ఎలా కొట్టుకుంటున్నామో చూపిస్తుంది ఈ పుస్తకం. తెలుగు భాషని అభిమానించేవాళ్ళు తప్పక చదవవలిసిన పుస్తకం.
http://sreekaaram.wordpress.com/2006/07/07/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%87%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80%E0%B0%B7%E0%B1%81-%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5/
చంద్ర శేఖర్ కాండ్రు
"విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు" ధారావాహికం దూరదర్శన్‌లో ప్రసారమయ్యింది.
http://telugukurrodu.blogspot.com/2008/09/blog-post.html
చాలా మంచి చర్చ. విశ్వనాథ వారి గొప్పదనం మరింత తెలిసింది. ప్రపంచం ఉన్నన్నినాళ్ళూ రామాయణము, తెలుగు ఉన్నన్నినాళ్ళు విశ్వనాథవారూ ఉంటారు. మధ్యలో వచ్చే చిల్లర రచనలు అప్పుడే గాలికి కొట్టుకుపోతాయి. విశ్వనాథవారి గురించి తరతరాలు చెప్పుకుంటున్నాము. ఈ ఇన్నయ్య గురించి నలుగురికి కూడా తెలియదు అనుకుంటాను. అసలు ఎవరు ఈ ఇన్నయ్య? కాస్త చెప్పగలరా?
ఇన్నయ్య హేతువాదం అంటే ప్రతిదాన్ని పిచ్చిగా ఎదిరించటం అనే దురభిప్రాయంలో బ్రతికే old school మూఢుడు. ఇన్నయ్య ఎవరో బయట ప్రపంచానికి తెలియదు ఆయన విమర్శలకు పదునూ విలువా లేవు. ఎందుకు సమయం వృధా?
@jeedipappu: ఇన్నయ్య గారు హేతువాది. వారికి నా ప్రపంచం అనే బ్లాగ్ ఉంది. మరింత సమాచారానికై ఈ కింది వెబ్సైట్ చూడగలరు.
http://innaiahn.tripod.com/
అవును.. ఆయనగారి నాప్రపంచం హేతువాదులక్కూడా అర్థం కాదు. చెప్పను కదా మూర్ఖుడని
విశ్వనాధ వారి హాహాహూహూ చదివితే అందులో హాహాహూహూ ఒకచోట అన్నమాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. "నాకు మీ తలల్లో ఇటువంటి చిలిపి ఆలోచనలు ఎలా వస్తాయో తెలుసుకోవాలని ఉంది. అందుకోసం మీ మెదళ్ళు తెరిచి చూడాలని అనిపిస్తోంది"
@ Mallik: "నాకు మీ తలల్లో ఇటువంటి చిలిపి ఆలోచనలు ఎలా వస్తాయో తెలుసుకోవాలని ఉంది. అందుకోసం మీ మెదళ్ళు తెరిచి చూడాలని అనిపిస్తోంది" -హాహాహూహూ నేను చదవలేదు. ఈ వ్యాఖ్య ఈ పుస్తకంలో ఎవరు ఏ సందర్భంలో చేస్తారు? ఈ పుస్తకం గురించిన సమాచారంతో విపులంగా ఉత్తరం/వ్యాఖ్య రాయగలరు.
@ అజ్ఞాత : "ఇన్నయ్య ఎవరో బయట ప్రపంచానికి తెలియదు ఆయన విమర్శలకు పదునూ విలువా లేవు. ఆయనగారి నా ప్రపంచం హేతువాదులక్కూడా అర్థం కాదు. చెప్పాను కదా మూర్ఖుడని." - -మీకు ఊరు, పేరు లేవని ఇన్నయ్యగారికి కూడా లేవన్న భ్రమలో ఉన్నట్లున్నారు. మీ ఉత్తరం, అందులోని భాష మీ సంస్కారాన్ని, జ్ఞాన పరిధిని తేటతెల్లం చేస్తున్నాయి.
"జ్ఞానం అనంతమైనది. తొలి జిజ్ఞాసుత్వదశనుంచి మానవుడి జ్ఞానార్జన ప్రక్రియ కొనసాగుతూనే వుంది.అయినా, ఇంకా అర్జించవలసినది అనంతంగా మిగిలిపోతూనే వుంది. అందుకే Encyclopedia of Ignorance గ్రంధ సంపాదకులు ' Compared to the pond of knowledge, our ignorance remains Atlantic. Indeed the horizon of the unknown receds as we approach it. ' అన్నారు. తెలియనిదాన్ని మనము తెలుసుకోడానికి యత్నించే కొలది, అది దూరదూరంగా పోతూనే వుంటుంది. అందుకేనేమో మతాలు ఎక్కడికక్కడ జ్ఞానానికి మేకులు కొట్టాయి. ఆ మేకులూ చుట్టూ తిరగటం తప్ప మతస్థులీనాటికీ సాధించిన మానవ ప్రగతి లేదు.
అయితే, మానవుడి జ్ఞానం ఆధునిక వాస్తవికతా మార్గానికి చేరకముందు అది ఎప్పటి కప్పుడు, ఎక్కడికక్కడే వ్యవస్థీకరణ చెందుతూ వచ్చింది. వేర్వేరు ప్రదేశాల్లో వ్యవస్థీకరణ చెందిన జ్ఞానం వేర్వేరు మతాలుగా గిడసబారిపోయింది. ఒకసారి మతాలుగా కరడుకట్టిన భావాలు అజ్ఞానం గా మారి అందుకు భిన్నమైన నూతన భావాలను సహించిన దశ చరిత్రకు అందదు." -రావిపూడి వెంకటాద్రి
అజ్ఞాత - మీ చిన్ని ప్రపంచంలో నూతన భావాలకు, సనాతన భావాలకు జరిగే సంఘర్షణే మీ చేత ఇలాంటి ఉత్తరాలు రాయించింది. కొత్త భావాలను అంగీకరించాలంటే మనసు పరిధి పెంచాలి. మీ జ్ఞాన పరిథిని విస్తరించండి. ఆధునిక విజ్ఞాన శాస్త్రపు పుస్తకాలు, Richard Dawkins, Sam Harris ఇంకా Christopher Hitchens వంటి ప్రతిభావంతుల పుస్తకాలు చదవండి. ముసుగులోంచి బయటకు రండి. కొత్త ప్రపంచాన్ని చూడండి.
మీ యొక్క సమాచారం నిమిత్తం ఇన్నయ్య గారి గురించిన మరింత సమాచారం కింద ఇస్తున్నా. ఇన్నయ్య గారు జగమెరిగిన వారు.
ఉత్తర అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ నగరం లోని The Library of Congress ( http://www.loc.gov/) వారు ఇన్నయ్య గారి పుస్తకాలను తమ భాండాగరంలో పరిశోధకుల ఉపయోగం నిమిత్తం ఉంచారు.ఇన్నయ్య గారు రాసిన 50 పైగా పుస్తకాలలో, వారికి లభ్యమైన 31 పుస్తకాల వివరాలు గ్రంధాలయ వెబ్సైట్ లో అన్వేషించి తెలుసుకోవచ్చు. ఈ కింది లింక్ ద్వారా అక్కడి గ్రంధాలయములో ఉన్న ఇన్నయ్య గారి పుస్తకాల జాబితా చూడవచ్చు.
http://catalog.loc.gov/cgi-bin/Pwebrecon.cgi?Search_Arg=innaiahSearch_Code=GKEY^*PID=JADx6KYP0qbGCXaZo0iysw7f4c5ZSEQ=20090115133215CNT=100HIST=1
ఇన్నయ్య గారి పుస్తకాలు amazon.com లో కూడా లభ్యమవుతాయి. వీరు రాసిన 16 పుస్తకాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు.
http://www.amazon.com/s/ref=nb_ss_?url=search-alias%3Dstripbooks&field-keywords=innaiah&x=0&y=0
అమెరికాలో పేర్గాంచిన The Center for Inquiry సంస్థ భారతీయ శాఖను హైదరాబాదు నుంచి నడుపుతున్నారు. ప్రఖ్యాత హేతువాదులు పాల్ కర్ట్జ్, రిచర్డ్ డాకిన్స్, శాం హార్రిస్ వంటి ప్రఖ్యాత హేతువాద రచయితులు వీరి మిత్రులు.
మరిన్ని వివరాలకై http://en.wikipedia.org/wiki/Innaiah_Narisetti చూడండి.
@cbrao హాహాహూహూ లో చివరిలో శాస్త్రజ్ఞులు హాహాహూహూ తలను తెరచి పరీక్షిద్దామని ప్రయత్నించి మత్తుమందు పనిచేయక విఫలమయినప్పుడు హాహాహూహూ వారితో ఇట్లా అంటాడు.
విశ్వనాధ విరచిత "కావ్యపరీమళము" ఈ కింద గొలుసులో చదవవచ్చు.
http://www.ulib.org/cgi-bin/ulibcgi/ulibreader_path/bookReader.cgi?barcode=99999991334285format=ptiffcurPage=1handler=IISC
ఈ పుస్తకములో మను చరిత్ర, పాండురంగ మహత్యం, పారిజాతాపహరణము, ఆముక్తమాల్యద వగైరా విశిష్టకావ్యాల గురించిన పరిచయాలు కలవు.
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు పుస్తకాన్ని ఈ కింది గొలుసునుంచి దిగుమతి చేసుకోవచ్చు.
http://www.archive.org/details/vishnusharmaengl026111mbp
CBRaoగారు ఓ మంచి చర్చకు వారి బ్లాగును వేదిక చేసి, ఇన్నయ్య, విశ్వనాథ, కొత్త సత్యనారాయణ చౌదరి, కవి రాజు , జాషువా మొ//వారల గురించి మంచి సమాచారం రాబట్టారు/ ఇచ్చారు కూడా.
నేను మాటి మాటికీ చదివే తెలుగు పుస్తకాలలో ఒకటి,విశ్వనాథవారి వ్యాఖ్యాన సహిత పద్య సంకలనం- "సాహిత్య సురభి" [1986, S.A.S & Co, Hyderabad].
దీనిని గురించి విశ్వనాథవారి మాటలలోనే:
".....................ఇవి సుమారు 300 పద్యములు. యిందులో నెక్కువ పద్యములు పూర్వము దేశములో వేలమందికి కంఠగతములై యుండెడివి. నా చిన్నప్పుడు నే నెరుగుదును.
కొన్ని పద్యములు ధర్మమును చెప్పును. కొన్ని సామాన్యార్థమును చెప్పును. కొన్నింటిలో లోతైన వేదాంతార్థములుండును. కొన్నింటిలో శాస్త్రార్థమూండును. కొన్నిటిలో సాహిత్యపు లోతులుండును. ఇవి రకరకాలైన పద్యములు.
ఈ మూడువందల పద్యములు మాటి మాటికి చదువుచున్నచో వ్రాసిన వ్యాఖ్యానములు తెలిసికొన్నచో ప్రతివాడును సామాన్యమైన ఆంధ్రభాషావేత్తయగును......అతడు కవుల కవిత్వమును విని కావ్యములు చదివి తనకు తెలియలేదన్న దుస్స్థిలో నుండడు......................"
@ బొల్లోజు బాబా : "ఒకరిని విమర్శించేపుడు ఆయన చెప్పిన విషయాలను,వాని సామాజిక ప్రయోజకత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. " - రచనలు మనలను ముందుకు నడిపించాలి. 'క్రొత్తనీటిని జేర్చుకొని పరిగెత్తు నదివలె ఎట్టి జాతియు ముందుకేగిన, యంతకాలము మూడుపూవులు, ఆరుకాయలు' అంటూ అభ్యుదయాన్ని ఆహ్వానించినప్పుడుమాత్రమే జాతి ముందుకు అడుగువేస్తుందని కవి డాక్టర్ సి నారాయణరెడ్డి చెప్తారు. "గతకాలం మేలున్, వర్తమానము కంటెన్ " అని విశ్వనాధ భావించారని శ్రీ శ్రీ అంటారు. చాతుర్వర్ణ వ్యవస్థను సమర్ధిస్తూ రాసిన రచనలు ఎలాంటి సామాజిక ప్రయోజనాన్ని కలుగ చేస్తాయి?
" దేముడు ఉన్నాడో లేదో తెలీదు, ఉన్నాడు అని అనుకొనేప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది అనుకొన్నప్పుడు అలా అనుకోవటంలోనూ, అలా ప్రచారం చేయటం మంచిదే కదా"
-రిచర్డ్ డాకిన్స్ రచించిన “The God Delusion” అనే పుస్తకాన్ని “దేవుడి భ్రమలో” అన్న పేరుతో నరిశెట్టి ఇన్నయ్య గారు తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం లో దేవుని గురించిన ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి. మతమే కారణమా మనలోని మంచితనానికి? మతం లేకపోతే సామాజిక విలువలు అనేవి ఉండవా? చరిత్రలో మతంవలన కలిగిన దుష్పరిణామాలేమిటి? మతం లేకపోతే కలిగే ప్రయోజనమేమిటి? ఇలాంటి ప్రశ్నలకు రిచర్డ్ డాకిన్స్ మనలను నొప్పించని విధంగా, సమాధానాలు రాశారు. ఈ పుస్తక సమీక్ష పుస్తకం.నెట్ లో ప్రచురించారు. ఆ గొలుసు కింద ఇస్తున్నాను. చూడగలరు.
http://pustakam.net/?p=59
డాక్టర్లకేం భయం ?
పలుకు దారుణాఖండల శస్త్రతుల్యంగా ఉన్నట్లు కనిపించే
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సహజమైన రీతిలో
సరస సంభాషణలో నవ్వులు పండించగల దిట్ట కూడా.
ఆయన తన చివరి ఘడియల్లో కూడా జోక్ వేశారు. ఆయన
గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రవి కళాశాల
అధిపతి సి.వి.యస్.ధన్ ఆయన్ను పరామర్శించడానికి
వెళ్ళారు. "డాక్టర్లు ఏం భయంలేద"ని చెప్పారండీ అని
విశ్వనాథవారితో అన్నారు. వెంటనే విశ్వనాథవారు
'డాక్టర్లకేం భయం, నాకు భయం గానీ!"
అన్నారు. అందరినీ నవ్వుల్లో తేల్చారు. ఆ తర్వాత కొద్ది
సేపటికే మరణించారు. అందరినీ దుఃఖసాగరంలో ముంచారు.
శ్రీ శంకర నారాయణ గారి పుస్తకం "అప్రస్తుత ప్రసంగాలు" సౌజన్యంతో
@ Mallik: హ హ హు హు పుస్తకం చదివినవారు, అంతర్జాలం లో రాసినది అరుదు.ఈ పుస్తకం కథా వస్తువేమిటి? ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలతో రాయగలరు.
హాహాహూహూ అన్న గంధర్వుడు భూలోకం పై ఎగురుతుండగా విమానం గుద్దుకోవడం వలన రెక్కలు తెగిపోయిభూలోకం లోని ఇంగ్లాండ్ లో స్పహ కోల్పోయి పడిపోతాడు. అక్కడ ఆయన మీద అక్కడ శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుపుదామని అనుకుంటుండగా ఆయనకి స్పహ వస్తుంది. అక్కడనుండి వారితో చర్చలు, సంవాదాలు, రసవత్తరంగా జరుగుతాయి. అయ్యనకు మత్తు ఇచ్చి ఆయన మెదడు తెరిచి చూద్దామని ప్రయత్నిస్తారు కూడా. కానీ ఆయనకు మత్తు మందు పని చెయ్యదు. నవల చివరిలో ఆయనకు రెక్కలు రావడం జరిగి ఆయన తన లోకానికి ఎగిరిపోతాడు. ఆయనతో బ్రిటిష్ వాళ్ళు ఎలా సంభాషించారు అన్న సందేహం ఉన్న వాళ్ళకి తగిన సమాధానం కూడా శ్రీ విశ్వనాధ చక్కగా ఇచ్చారు. శ్రీ విశ్వనాధలోని విదుషి ని విదూషకుడిని కూడా ఆనందంగా గ్రహించవచ్చు.
విశ్వనాధ సత్యనారాయణ విరచితమైన కురుక్షేత్ర యుద్ధము కధాంశముగా యున్న గుప్త పాశుపతము పై నా సమీక్ష http://pustakam.net/?p=377 లో చదవగలరు.
@Aruna: " Mon, Jan 5, 2009"పొద్దు పెద్దలకి ప్రత్యేక విన్నపం. ముఫ్ఫై కామెంట్లకు పైగా వచ్చిన టపా కదా అని దీని వివరాలని బ్లాగు వీక్షణం లో ప్రచురించకండి. ఈ టపా రావడమే సాహితీ ప్రియులందరికి బాధ గా వుంటే. దీనికి పొద్దు లో చోటు దొరకడం అందరినీ అవమానించినట్లు అవుతుంది. " -
అరుణ గోసుకొండ గారు - మీరు ప్రచురించవద్దు అంటే పొద్దు వాళ్లు ప్రచురించటం మానివేస్తారా, ఈ టపా గురించి రాయకుండా? వాళ్ల కి కొన్ని policy guidelines ఉంటాయి. వాటి ప్రకారం ఏవి ప్రచురించాలో, వద్దో వారు నిర్ణయం తీసుకుంటారు. సిఫారసులపై పొద్దు పత్రిక నడవటం లేదు.
రావు గారు చాలా తెలివైన వారు. సరిగ్గా పొద్దు నిర్వాహకులు గత నెల సమీక్ష ప్రచురించబోయే ముందు అరుణ గారి వ్యాఖ్య కు సమాధానం. వీళ్ళ మాటలు పట్టించుకోకుండా నా బ్లాగును ప్రస్తావించండి అని సూచన. ముచ్చటేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే
కవిరాజు త్రిపురనేని రామస్వామి మీద "రామయణ కల్పవృక్ష' కర్త విశ్వనాధ సత్యనారాయణ గారి అభిప్రాయం:
"హేతువాద యుగంలోని కవులందరికీ ఆదిపురుషుడు త్రిపురనేని రామస్వామి. ఆయన సూతపురాణ మొక మహాగ్రంధం. కవిత్వం ఒక ప్రబంధ కవుల కవిత్వం వలె ఉంటుంది. ఆయన పద్య రచనాశైలి ఎంతో మధురంగా ఉంటుంది. భావాలు పురాణాలకు వ్యతిరేకం. మొదట విప్లవం తెచ్చింది ఆయన. ఈ విప్లవవాదులు నిజంగా విప్లవవాదులైతే ఆయనకొక శిలాప్రతిమ వేయవలె" - కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ
ఎవరివి గొప్ప రచనలో ఎవరివి నేలబారు రచనలో కాలమే నిర్ణయిస్తుంది. మరొక ఏభై ఏళ్ళు పోయినాక మనం ఇప్పుడు అభ్యుదయ వాది అనుకునే రచయిత గురించి అప్పటి వాళ్ళు , ఉట్టి చాందస వాది ఎప్పుడు చూసినా వామపక్షం వ్రాతలేకాని మరేమీ వ్రాయలేదు అనేసే అవకాశం ఎంతయినా ఉన్నది.
విశ్వనాథ వారు తనకు తెలిసిన తను మెచ్చిన జీవన విధానాన్ని గురించి వ్రాసి ఉండవచ్చు. అలా వ్రాయటానికి ఆయనకు అధికారం/హక్కు లేవా? ఏమైనా సరే ఇప్పటి ఎర్రద్దాలు పెట్టుకుంటే గాని వాటిల్లోంచి మాత్రమే కనపడేవి వ్రాస్తేనే మెచ్చుకుంటామా. మనకు ఒక పంథా నచ్చినంత మాత్రాన మరొక పంథా గురించి వ్రాసే వారిని వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేయటం ఎంతవరకూ సబబు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి