Photo courtesy:Nachofoto
ఈ మధ్య జరుగుతున్న ప్రేమికుల ఉన్మాద చర్యలు మనసును కలవరపెడటం సహజం. Shakespeare తన డ్రామా A Midsummer Night's Dream లో లిశాండెర్ తో అనిపించినట్లుగా The course of true love never did run smooth. ఈ నాటకంలో, లిశాండెర్ తో హెర్మియ ప్రేమను ఆమె తండ్రి ఆమోదించక డెమిత్రయస్ ను వివాహం చేసుకోవాలని అజ్ఞాపిస్తాడు. అప్పటి అథెన్స్ చట్టం ప్రకారం హెర్మియా తండ్రి మాట ఉల్లంఘించితే మరణ శిక్ష లేక పోతే కన్యగా ఉంటూ భగవంతుని సేవలో గడపాలి.
ఈ ప్రేమ కథలలో విషాదాలు చాలా ఉంటాయి. అబ్బాయి, అమ్మాయిల ఇద్దరి తప్పిదాలూ ఈ కథలలో మనకు కనిపిస్తాయి. అమ్మాయిలను మోసగించే అబ్బాయిలున్నట్లే, మరో better కుర్రాడు దొరకగానే మొదటి boy friend కు టాటా చెప్పే అమ్మాయిలూ ఉన్నారు. విపత్కర పరిస్థితులలో, ధృఢమనస్కులై మనో వ్యాకులతలకు లోను కాకుండా సర్దుకుపోయి, ముందుకు పోవటం ప్రేమికులకు అభిలషణీయం.
వయస్సు ప్రభావం వల్ల అబ్బాయిలు, అమ్మాయిలు పరస్పర ఆకర్షణలో పడటం సహజం. వీరికి ఏది మంచి, ఏది చెడు అనే తల్లి తండ్రుల విచక్షణ వలన, వారి సలహా, ఒత్తిడి కి లొంగి ప్రేమ అనే ఆకర్షణలోంచి బయటపడటానికి, ప్రేమికులు ఎంతో క్షొభ అనుభవిస్తారు. అమ్మాయిలు తట్టుకుని, మనసు కుదుటబడ్డాక తల్లి తండ్రులు చూసిన సంబంధం ఖాయం చేసుకుంటే, అబ్బాయిలు అంత త్వరగా ఆ relationship లోని ప్రేమను మరవటానికి క్షోభ పడతారు. ప్రేమికులు వివాహానికి తల్లితండ్రుల ఆశీర్వాదం కావాలని ధృఢంగా కోరుకొంటారు. దీనికి చాల కారణాలు - తల్లి తండ్రులపై ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాంధవ్యం, వారిచ్చే support, ఆస్తి హక్కు వగైరా కారణాలు. పిల్లలు ప్రేమించటము, తల్లి తండ్రులు వారించటం - ఇవన్నీ ఇప్పటికి, గణిత భాషలో చెప్పాలంటే 'n' times జరిగుంటాయి. అయినా చరిత్ర నుంచి యువతీ యువకులు ఏమి నేర్చుకున్నారన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోతూనే ఉంది. ఇవే కథలు పునరావృతమవుతాయని, వీటిని ఆపటం ఎవరితరం కాదని చరిత్ర నేర్పిన పాఠం.
తల్లి తండ్రులు పిల్లలను స్నేహితులుగా భావిస్తూ, వారి మంచి చెడులను పట్టించుకొంటూ, వారిలోని మార్పులను గమనిస్తూ, అవసరమైన సలహాలు ఇవ్వటమే, యువతీ యువకులను ప్రేమ బారిన పడకుండా తద్వారా ప్రేమల వలన రాగల దుష్పరిణామాల నుంచి వారిని కొంత వరకూ కాపాడవచ్చు.
7 కామెంట్‌లు:
మొదట్లో అవి రెండూ ఒకటి కాకపోవచ్చు, మొదటిది ముదిరితే రెండోదవుతుందేమో ;)
"విపత్కర పరిస్థితులలో ధృడ మనస్కులై మనో వ్యాకులతకు లోను కాకుండా సర్దుకు పోయి ముందుకు పోవడం ప్రేమికులకు శ్రేయస్కరం.."..ఇలాంటి మటలు ఇవాళ్టి ప్రేమికులకు రుచించటం లేదు.
ఒకరిని ప్రేమించి మరొకరితో వివాహమైతే సర్దుకు పోయి త్వరలోనే కొత్త పెళ్ళిలో సంతోషం వెదుక్కునే తత్వం నేను అమ్మాయిలలో ఎక్కువగా గమనించాను. అబ్బాయిలకు మరొక కొత్త ప్రేమ దొరికే దాకా ఆ పాత అమ్మాయి పై (పైగా సంతోషంగా ఉందని తెలిస్తే మరీ) కోపం, కసి ఉంటుందన్నమాట.
పిల్లల ఆలోచనలు ఎటువైపు దారితీస్తున్నాయో, ఎలా పరిణమిస్తున్నాయో గమనిస్తూ, వారికి మార్గదర్శనం(మరీ వారి జీవితాల్లోకి చొరబడుతున్న ఫీలింగ్ వాళ్లకు కలగనివ్వకుండా)చేసి దారిలో పెట్టాలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద చాలా వరకూ ఉంది.
"వీటిని ఆపటం ఎవరితరం కాదని చరిత్ర నేర్పిన పాఠం" ఇది కరెక్టు!
అసలు ఈ వ్యాసాన్ని ఎవరైనా మీరు చెప్పే రకపు ప్రేమికులు చదువుతారా? నాకు తెలెసి వాళ్లు బ్లొగ్స్ చదవరు. ఈ బ్లొగ్స్ లో అందరు ఒకే రకపు భావాలు కలవారు. వాళ్ల భావాలకి మీ వాటికి పొతన కుదరదు.
"ప్రేమ బారిన పడకుండా" - :)
yee kroora ghora paasavika charyalu,toti manishini manishigaa bradike hakkunu chidimese rakshasa charyalu tappa ..
mee creativity chaala nachindi. aa prakriya vadalavaddu.
paina mee bhaavanaku naa vyaakya...
PAISAACHIKAM:
saareeraka vaanchala to
tanuvantaa nindipoyi
vichakshana kolpoyina..
mruga maansa bhaava bharita..
vikruta maanava chaharya tappa
mari yedi kaane kaadu.
..Nutakki Raghavendra rao
@ రాఘవేంద్ర రావు: మీ స్పందనకు ధన్యవాదాలు. మీ బ్లాగులో చక్కటి కవితలు రాస్తూ ఎప్పుడూ చుక్కలలో తేలకుండా అప్పుడప్పుడూ భువికి వచ్చి కాస్త గద్యం కూడా రాయాలని వినతి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి