శనివారం, ఫిబ్రవరి 14, 2009

విదేశీ శక్తుల కుట్ర - 2

ID theft in blogs గురించి రాసిన దీప్తిధార టపా "విదేశీ శక్తుల కుట్ర " ను మక్కికి మక్కి కాపీ చేసి, TELUGU BLOGS అనే బ్లాగులో Article lift అనే మోసపూరిత పద్ధతిలో ప్రచురించారు. ఆ టపా URL దిగువ ఇస్తున్నా.
http://telugugossipsq.blogspot.com/2009/02/blog-post_2854.html
ఈ విషయం నా దృష్టికి తెచ్చిన "తెలుగు'వాడి'ని " గారికి ధన్యవాదాలు. వ్యాసాలలో ఏది అసలు, ఏది నకలు అనేది గుర్తించటానికి నేను గమనించిన విషయాలివి.
1) మీరు గూగుల్ లో "విదేశీ శక్తుల కుట్ర" ను అన్వేషించండి. Genuine Article పైన ఉండగలదని భావిస్తాను.
2) రచయిత శైలి ఇంకా అదే విషయం పై గతంలో రాసిన వ్యాసాల ద్వారా కూడా ఏది అసలో ఏది నకలో తెలుసుకోవచ్చు.
3) Time Stamp అసలు పాత తేది, సమయంతో ఉంటే నకలు ఆ తరువాతి సమయంతో నమోదవుతుంది. ఇది అన్నివేళలా నిజం కాదు. ఆది బ్లాగరును నిర్ణయించే సమయంలో తెలిసిన విషయాల ఆధారంగా Time Stamp ను కూడా మార్చవచ్చు కాపీరాయుళ్లు.

ఈ కాపీలను ఎలా నివారించాలి?


ఇంతవరకు దీప్తిధార లో పాఠకుల ఉత్తరాలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. అది దుర్వినియోగమవటంతో నేను కూడా, నా ఇష్టానికి వ్యతిరేకంగా Comment Moderation ప్రవేశపెట్టాల్సొచ్చింది. ఆటంకవాదులతో సమస్య లేదనుకున్నప్పుడు ఈ Comment Moderation తీసివేయగలను. అంతదాకా ఈ అసౌకర్యానికి మన్నించండి.

మిమ్ములను కించపరస్తూ నా i.d తో వ్యాఖ్యలు వస్తే కినుక వహించవద్దు. ఆ ఉత్తరం Genuine letter అవునా కాదా అని పరీక్షించగలరు. ID theft ను ఎలా గుర్తించాలి? నివారించాలి? ఈ ప్రశ్నలకు కొత్తపాళీ గారు తమ టపా ID theft in blogs లో కొన్ని ప్రాధమిక సూచనలిచ్చారు. ఇలా చెయ్యాలంటే anonymous వ్యాఖ్యలను అనుమతించకూడదు. Comment Settings లో Who Can Comment? అనే చోట Registered Users - includes OpenID ను మీరు సచేతనం చెయ్యాలి. మరిన్ని వివరాలకై శ్రీధర్ గారి టపా

"కామెంట్లలో మీ పేరు దుర్వినియోగం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి " చూడగలరు.

ఆటంకవాదుల కొత్త దుశ్చర్యలను ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది, వారి లక్ష్యం, బ్లాగులని. మీరు వారి చర్యలకు వెరవక బ్లాగును కొనసాగిస్తే, వారి దుష్కార్యాలను సమర్ధంగా తిప్పికొట్టినవాళ్లవుతారు.


3 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

idoka pramaadamaa maralaa ? maalaa samaaketika parignaanam lenivaari gatemiti?

Hollywood Actors చెప్పారు...

sorry for that content nacchi pettamu mee bhavalu challa bavunnai

శరత్ కాలమ్ చెప్పారు...

@ హాలీవుడ్,
అలా పెట్టుకున్నప్పుడు కనీసం మూల రచయితకి క్రెడిట్స్, అసలు లింక్ కూడా ఇవ్వడం మంచి పద్ధతి. అయినా ఆ టపా రాసిన వెంటనే అదే టపాని మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? నచ్చితే మీ బ్లాగులో మెచ్చుకోండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి