శుక్రవారం, ఫిబ్రవరి 06, 2009

స్పందన -5Point Arena Lighthouse In Fog, North California Photo: cbrao

మరోప్రపంచం..

ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యానబ్బా? చదువుతున్నంత సేపూ నవ్వాగలేదు. ఏమి ఊహ!

http://pappusreenu.blogspot.com/2009/01/blog-post.html


బ్లాగోత్సాహం

@prasadcvln: "స్త్రీలు కుటుంబం, భర్త, పిల్లల నుంచి ఐడెండిటీని పొందటానికి ప్రయత్నిస్తారనేది ఒక సిద్ధాంతం. ప్రస్తుత ఒరవడి చూస్తుంటే బ్లాగులు కూడా ఆ కోవకి చేరాయనిపిస్తోంది." - ఈ అపప్రధ రాకూడదనే మహిళలు భర్త పేరు ఉదాహరించకుండా బ్లాగులు రాస్తున్నది.
"అరకొర జ్ఞానాన్ని.. అపరిమితమయిన విజ్ఞానంగా ఫీలయ్యి.. తమ గాఢ అజ్ఞాన తిమిరాన్ని అందరికి పంచాలని ప్రయత్నిస్తున్న బ్లాగర్ల సంఖ్యా పెరుగుతోంది. " -బ్లాగు ప్రక్రియ కేవలము విజ్ఞులకు మాత్రమే కాదు. బ్లాగు అనేది web log అని మీకు తెలుసు. ఇక్కడ (అమెరికా లో) హోటల్ సర్వర్, మంగలి, నర్సులకు కూడా బ్లాగులున్నాయి. వ్యక్తిగత అనుభవాలను రాయటానికి ఉద్దేశించినది బ్లాగు. మీరు రాసిన దాంట్లో తప్పులుంటే పాఠక మిత్రులు అవి మీ దృష్టికి తెస్తారు. తద్వారా మీరు improve అవవచ్చును.
"నలుపులో టెంప్‌లెట్‌ పెట్టుకుంటే- అది అడెల్డ్‌ కంటెంట్‌కు అన్న కనీస స్పృహ లేని వాళ్లు అనేకం. " -నలుపు మంగళకరం కాదని శుభలేఖలలో మన వారు వాడరు. దీనికర్ధం పెద్దలకు మాత్రమే అన్న విషయం నాకు తెలియదు. మరి ఇతర రంగులకు ఏమి అర్థం వస్తాయి? నీల రంగు టెంప్లేట్ పెట్టుకుంటే ఆ బ్లాగర్ romantic అనో లేక pink రంగు పెట్టుకుంటె ఆ బ్లాగు మహిళదనో అర్థాలున్నాయా? ఈ విషయం లో నా అజ్ఞానం అపారం.

http://arunam.blogspot.com/2009/01/blog-post_21.html


మాంగళోర్ లో స్త్రీలపై దాడి

"దాడి చేసి కొట్టడం తప్పే కావచ్చు.. మరి, పబ్బుల్లో మగాళ్ళతో కలిసి తాగి తందనాలాట్టం, ఎకిలేషాలెయ్యడం తప్పు కాదా? "- ఈ వ్యాసంలో స్త్రీలపై అమానుష ప్రవర్తన ఖండించటం జరగలేదు. ఆడవారు పబ్ కు వెళ్లటము చట్టసమ్మతము. రామసేన లు మహిళలతో వ్యవహరించిన విధానము ఏ విధముగా సమర్ధిస్తాము?

http://chaduvari.blogspot.com/2009/01/blog-post_29.html


ఎవరీ వరూధిని?

మీ బ్లాగుకు వరూధిని అని సిరిసిరిమువ్వ బ్లాగరి పేరు ఎందుకు వుంచారో వివరించగలరు. మీరు మహిళయో, పురుషుడో చెప్పటం ఇష్టం లేకపోతే, చెప్పవద్దు.

http://varudhini.blogspot.com/2009/01/blog-post_30.html


చాతక పక్షులు 12

"రమణ గీతనీ, హరినీ తీసుకుని Statue of liberty, white house, museum చూపించాడు గీతకి అవన్నీ చూస్తుంటే ఏదో మాయలోకంలో వున్నట్టు అనిపించింది. " -న్యూ యార్క్ లో White House ? దీని ప్రాముఖ్యతను వివరించండి. ఆ ఊళ్లో మూడు రోజులున్నా. దీని గురించి ఒక్కరు చెప్పలేదేమిటి?

http://tethulika.wordpress.com/2009/02/01/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95-%E0%B0%AA%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-12/

e-తెలుగు ఎలా ఏర్పడింది?

"ప్రవాస భారతీయులు ఎన్నికలలో పోటీ చేయగలరా అన్నది స్పష్టంగా లేదు. "- ప్రవాస భారతీయులు వారు నివసించే ప్రదేశంలో ఏర్పరుచుకునే affiliated assocciation తరపున అక్కడి స్థానిక ఎన్నికలలో పాల్గొనవచ్చు. Affiliated assocciations స్వతంత్ర సంస్థలు. వీటికి కేంద్ర సంస్థనుంచి సాంకేతిక, ఇతర సలహాలు అందచేయబడతాయి. కేంద్ర e-telugu.org లో సంస్థ కేంద్రమైన హైదరాబాదు వారే ఎన్నికలలో పోటీ చేస్తారు. భారతీయ Registrar of companies & Societies వారి చట్టాలకు అనుగుణంగా కేంద్ర సంస్థ పనిచేస్తుంది.

http://veeven.wordpress.com/2009/02/01/who-etelugu-started/


బేతాళ కధలు

చక్కటి సటైర్. ఇది చదువుతుంటే ముళ్లపూడి రాజకీయ భేతాళ పంచ వింశతిక గుర్తుకు వచ్చింది.

http://blog.vikatakavi.net/2009/02/02/%e0%b0%ad%e0%b1%87%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3-%e0%b0%95%e0%b0%a7%e0%b0%b2%e0%b1%81-1-2/

1 వ్యాఖ్య:

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

మహానుభావా గుర్తుపెట్టుకున్నారు..చాలా సంతోషం..ధన్యుడ్ని.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి