శనివారం, ఫిబ్రవరి 21, 2009

తెలుగుభాషను నవీకరించాలా?

నేడు ప్రపంచమంతా మాతృభాషా దినోత్సవం జరుపుతున్నారు. మన తెలుగు ఆధునికమైనదేనా? తెలుగులో ఉన్నత విద్య ఎందుకు అభ్యసించలేకపోతున్నాము? తెలుగును నవీకరించాల్సిన అవసరం ఉందా? ఈ విషయాలపై ఇన్నయ్య గారి ప్రత్యేక వ్యాసం మీ కోసం, ఆంధ్రజ్యోతి సౌజన్యంతో . ఇది ఈ రోజు (21 st Feb 2009) ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో ప్రచురించబడినది.

-cbrao

Click on image to enlarge

13 వ్యాఖ్యలు:

రావు వేమూరి చెప్పారు...

Telugu is too important to be left alone in the hands of Telugu language specialists. (మరొకరి వాక్యాన్ని అవసరానికి అనువుగా మార్చేను కనుక దీనిని ఇంగ్లీషులోనే ఉంచేను.) ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? విజ్ఞాన సాంకేతిక రంగాలలో ఉన్న నిపుణులు తెలుగులో - పాఠ్యాంశాలు కాకపోతే పోయె - కనీసం జనరంజకమైన వ్యాసాలు, కథలు రాయొచ్చు కదా. ఇవి భాషాపరంగా గొప్ప రాతలు కాకపోవచ్చు; కాని ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడే భాషలో పదసంపద పెరుగుతుంది. భాష ఎదుగుతుంది. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారు బహు కొద్ది మంది. వారిని ప్రోత్సహించటానికి బదులు "మీరు అధికార నిఘంటువులో ఉన్న మాటలు వాడలేదు," మొదలయిన అభ్యంతరాలు పెడుతూ ఉంటే (స్వానుభవంతో చెబుతున్నాను) మనం ముందుకి వెళ్ళలేము. ఏ భాష అయినా సరే వాడుతూన్న కొద్దీ వాడిగా తయారవుతుంది, వాడకపోతే వాడిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇలా వాడిపోతోంది. సాంకేతిక విద్య ఇప్పుడేనా వచ్చింది? మేము చదువుకున్న రోజులలో కూడ ఉన్నత పాఠశాల వరకు లెక్కలు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం తెలుగులోనే చదువుకున్నాము. ఇంటర్‌లో చేరిన ఏడాది తిరగకుండా ఇంగ్లీషు అలవాటయిపోయింది. కాకపోయినా తెలుగు నేర్చుకోమన్నంత మాత్రాన ఇంగ్లీషు క్షుణ్ణంగా నేర్చుకోవద్దని ఎవ్వరన్నారు? మార్చి 2003 "ఈ మాట" మార్చి 2003 సంచికలో స్వీడన్‌లో మాతృభాష వాడకం మీద వ్యాసం చూడండి. http://www.eemaata.com/em/index.php

Aruna చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శాక్య ముని చెప్పారు...

నవీకరణ సరి అయినదా, నవీనీకరణ సరి అయినదా?

Bhaskar చెప్పారు...

అరుణ గారు,
జ్యొతిష్యం , వాస్తు శాస్త్రాలు కావు. వాటిని సైన్స్ పరంగా నిరూపణ చేయలేము. ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించలేదు. భారతీయ శాస్త్రాలయిన ఖగోళ శాస్త్రం , భవననిర్మాణ శాస్త్రంలను ఒక వర్గం ప్రయోజనం కోసం వాటికి అనుగుణంగా జ్యోతిష్యాన్ని, వాస్తుని చొప్పించి సామాన్య ప్రజలకు భయాన్ని కలిగించి డబ్బుని సంపాదించడమే వారి ధ్యేయం. మీరూ ఆ వర్గానికి చెందినవారనుకుంటా అందుకే అంత ఘాటు వ్యాఖ్య చేసారు. మీ చిన్నప్పటి నుండి మీలో నూరి పోసిన భావాలనుండి బయటకు రండి. స్వతంత్రంగా ఆలోచించండి.

Aruna చెప్పారు...

నేను డబ్బు దండుకునే వర్గానికి చెందను అండీ. వ్యాఖ్య లో ఘాటు వున్నది అనిపించి అనవసరం గా ఇంకో గొడవ రేపడం ఎందుకులెమ్మని డిలీట్ చేద్దామని వచ్చాను. Btw, జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రపు లొతులు తెలిసిన వాళ్ళెవ్వరూ వాటిని నిరసించరు. ఈ రోజుల్లో కుహనా మేధావులు ఎక్కువ అయ్యి జ్యోతిష్యం తో పాటు హేతువాదం అన్నా విరక్తి వస్తోంది జనాలకి. అన్ని శాస్త్రాలు ఒకదానితో ఒకటి interlinked. ప్రస్తుతానికి వివరణ ఇచ్చే ఓపిక లేదు. నేను సమీప భవిష్యత్తులో వీటి మీద ఏదైనా టపా రాసినప్పుడు మీకు లింక్ ఇస్తాను. మీకు ఆసక్తి వుంటే చదవండి.

Sai Brahmanandam Gorti చెప్పారు...

అయ్యా రావుగారూ,

"మాత్రుభాషా" కాందండీ "మాతృభాషా" అని రాయాలి.మాతృభాషాదినోత్సవపు రోజు అన్నది "గేటు గుమ్మం"లా వుంది.

కనీసం ఈ వ్యాసంలోనయినా ఆంగ్ల పదాలు దొర్లకుండా రాయచ్చు కదా? మనం వదులుకోల్ని కొన్ని అలవాట్లవి. యూనివర్శిటీ, రెఫరెన్స్, సిలబస్, రూల్స్ వీటికన్నింటికీ చక్కటి తెలుగు పదాలున్నాయి. మనం ఒదులుకోలేనిది ఇతరులు చేయాలనుకోడం ఎంతవరకూ సమంజసం?

-సాయి బ్రహ్మానందం

cbrao చెప్పారు...

@సాయి బ్రహ్మానందం: శ్రమ తీసుకుని వ్యాసం లో ఉన్న తప్పులు చూపినందులకు ధన్యవాదాలు. వాటిని సరిదిద్దుతున్నాను. అచ్చులో నున్న వ్యాసం విషయం లో తప్పులను సరిపెట్టుకొనవలసినదే.

అజ్ఞాత చెప్పారు...

రావుగారూ ! వర్గం అంటే ఏమిటి ? మీరనేది బ్రాహ్మణులనా ? మరి ఇతరదేశాల్లో బ్రాహ్మణులు లేరు కదా ! మరి అక్కడ ఏ వర్గస్వార్థం కోసం జ్యోతిష్యం ప్రచారంలోకి వచ్చిందో చెప్పగలరా ? ఈ దేశంలో బ్రాహ్మణులనే ఒక పేదకులం మీద ఉన్న కులద్వేషం అనేక ముద్దుపేర్లతో చెలామణీ అవుతోంది.. అది కొన్నిసార్లు హేతువాద ముసుగులో, మఱికొన్ని సార్లు మార్క్సిజం ముసుగులో, మఱికొన్నిసార్లు సామాజిక న్యాయం వేషంలో - ఇలా అనేక మోసపూరిత అవతారాలు ధరించి మన ముందుకొస్తూంటుంది. త్రిపురనేని రామస్వామి కాలంలో జన్మించినవారి సంగతెలా ఉన్నా ఒక విషయం మాత్రం చెప్పగలను. హేతువాదులూ, నాస్తికులూ మాత్రమే తెలివైనవాళ్ళనీ, ఇతరులంతా మూర్ఖులనీ అనుకోరాదు. అసత్యాన్ని సత్యమని ఎన్నివేల సంవత్సరాల పాటు గొంతు చించుకున్నా గుడ్డిగా నమ్మేసేంత వెఱ్ఱిమొఱ్ఱి సమాజం కాదిది. వాస్తులోను, జ్యోతిష్యంలోను నిజం ఉందని ఎవరికి వారు తమ స్వానుభవంతో నిర్ధారించుకునే నమ్ముతున్నారు తప్ప బ్రాహ్మణులు పనిగట్టుకొని వారిని నమ్మించడం లేదు. మేము స్వయంగా బ్రాహ్మణులం, జ్యోతిష్కులం కూడా. మేము మా గుఱించి ఎప్పుడూ ఏ వ్యాపార ప్రకటనలూ ఇచ్చుకోము. మా దగ్గఱికి వచ్చేవారు - అన్ని ఇతర మార్గాలూ ప్రయత్నించి విఫలమైన తరువాతనే తమంతట తాము మా దగ్గఱికి వస్తున్నారు. మేము చెప్పే విషయాలతో సంతృప్తి చెందితేనే మమ్మల్ని పోషిస్తున్నారు. లేకపోతే లేదు. అన్ని యుగాల్లోను పరిస్థితి ఇదే. కొత్తగా హేతువాదులొచ్చి పొడిచేసిందేమీ లేదు, సామాన్య మానవుల కంటే !

ఒక శాస్త్రాన్ని ఇంకో శాస్త్ర పరిభాషతోను, ఇంకో శాస్త్రపు ప్రయోగపద్ధతులతోను నిర్వచించడమూ, నిరూపించడమూ సాధ్యం కాదు. ప్రతి శాస్త్రానికీ తన సొంత పారిభాషిక పదజాలమూ, ప్రయోగపద్ధతులూ ఉంటాయి. దాని తెలుసుకోవాలంటే ఆ పరిభాషే వాడాలి. అది నిర్దేశించిన ప్రయోగపద్ధతుల్నే అవలంబించాలి. అంతే తప్ప ఒక శాస్త్రాన్ని stand point గా చేసుకొని ఇంకో శాస్త్రాన్ని "అబద్ధం" అనడం అశాస్త్రీయం, అర్ధరహితం. గణిత శాస్త్రానికి సంబంధించిన పద్ధతుల్లో, పరిభాషలో మీరు జీవశాస్త్రాన్ని నిరూపించజాలరు. గణితశాస్త్రంలో 1+1 = 2 అయితే జీవశాస్త్రంలో మాత్రం అది ఎంతైనా కావచ్చు.

జ్యోతిష్యం గురుముఖతా నేర్చుకోవాలి, వాస్తవ జీవితానికి అనువర్తించి చూసుకోవాలి. తెలుసుకోవాలి. అంతేగానీ అదేమీ చెయ్యకుండా "అది అబద్ధం, వర్గకుట్ర, కులకుట్ర" అని ఆరోపించడం కేవలం బౌద్ధిక సోమరితనమౌతుంది. పాపం, హేతువాదులకి అది సాధ్యపడని విషయం. ఎందుకంటే ఒక సబ్జెక్టు నేర్చుకోవడం చాలా కష్టమైన విషయం. దానికి ఓర్పు కావాలి, వినయం కావాలి. శ్రమ పడాలి. మఱి అలవోకగా నిందలు వెయ్యడమో ?

--తాడేపల్లి

cbrao చెప్పారు...

@LBS : "వర్గం అంటే ఏమిటి ? మీరనేది బ్రాహ్మణులనా ? " -ప్రధాన వ్యాసంలో వర్గాల ప్రసక్తి లేదు. బహుశా మీరు పాఠకుల వ్యాఖ్యలు నావని పొరబడి వుండవచ్చు. ఈ నాడు జ్యొతిష్యం, వాస్తు బ్రాహ్మణేతరులు కూడా చెప్పుతున్నారు కదా. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఈ విషయమై చర్చించాలంటే అది ఈ వ్యాస, వ్యాఖ్య పరిధి దాటుతుంది. ఈ విషయమై ఆసక్తి ఉన్నవారు ఇన్నయ్య గారు వ్రాసిన " Is astrology scientific? -scietific method " అనే వ్యాసం చూడవచ్చును. "పురాణ ప్రలాపం " అనే పుస్తకం చదువవచ్చు. ఇంకా నాగ మురళీకృష్ణ గారు వ్రాసిన "జ్యోతిషమూ - లోపలి సంగతులూ - 1" కూడా చూడవచ్చు. జ్యోతిష్యం, శాస్త్రీయంగా ఋజువుపర్చబడని ఒక వ్యక్తిగత నమ్మకం. ఎవరి నమ్మకం వారిది. చర్చల ద్వారా ఎదుట వ్యక్తి నమ్మకం మార్చటం సాధ్యమా?

అజ్ఞాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

@భాస్కర్ గారు,
ఏ రొజుల లో ఉన్నారు మీరు? మీరు ఎప్పటి కాలం నాటి సైన్స్ మాత్లాడుతున్నారు? అసలికి మీకు ఇప్పుడు సైన్స్ లో పరిశొదన ల జరిగే విషయాలు మిద ఎమైనావగాహన ఉన్నదా?. చూడబొతే మీరు న్యుటన్, ఐన్స్టీన్ దగ్గరే ఆగి పొయింట్లున్నారు.

*మీ చిన్నప్పటి నుండి మీలో నూరి పోసిన భావాలనుండి బయటకు రండి. స్వతంత్రంగా ఆలోచించండి. *
వాస్తవంగా మీరు కళ్లు తెరచి నిస్పక్ష పాతం గా స్వతంత్రంగా చూడావలిసిన అవసరం మికు ఉన్నది.
* భారతీయ శాస్త్రాలయిన ఖగోళ శాస్త్రం , భవననిర్మాణ శాస్త్రంలను ఒక వర్గం ప్రయోజనం కోసం వాటికి అనుగుణంగా జ్యోతిష్యాన్ని, వాస్తుని చొప్పించి సామాన్య ప్రజలకు భయాన్ని కలిగించి డబ్బుని సంపాదించడమే వారి ధ్యేయం. *

ఆ వర్గం వారు ఎంత డబ్బులు సంపాదించారో (http://www.youtube.com/watch?v=pADUEUGD8RI), వాళ్ల సంస్కృతి ని వ్యతిరేకిస్తు ప్రభుత్వాలు ఎర్పాటు చెసిన అభ్యుదయ వాదులు ఎంతా సంపాదించారో మీరు కొంచెం పరిశిలించి మాట్లడండి. తమిళనాడు ముఖ్య మంత్రి గారి భార్య సత్య సాయి బాబా గారికి పాద పూజ చేశారు మరి. ఆయన కూడా హేతు వాది. జీవిత కాలం లోనె ఒక మాయవతి, కరుణానిధి మొ|| అభిప్రాయాలు మర్చుకొన్నవాళ్లు (వీరు దేని కోసం అనుకుంటారు అధికారం కోసం ). ఆవర్గం వాళ్లు చెత్త పని ఇచ్చిన ఒక కల్చర్ క్రియేటె చెస్తారు గుర్తింపు తీసుకొస్తారు ( ఊదా|| సులభ్ )కూచొని మా వర్గానికి అన్యాం జరిగినది అని పుస్తకాలు రాయరు. Open your eyes think How and why India is different from other countires? First understand our country and its culture. Incase if you want to know more about science give your email ID . I will sahre information with you.
రావు గారు, నా క్రితం వ్యాఖ్యల లో అచ్చు తప్పులు ఉన్నాయి. అది సవరించాను.

Hari Dornala చెప్పారు...

ఇక్కడ విషయం తెలుగు భాష నవీకరణ. అంటే గాని కులాల కుమ్ములాటలు కావు. తెలుగు భాష ఇంత దీన స్థితిలో ఉండడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. తెలుగు విశ్వవిద్యాలయంలో వాస్తు, జ్యోతిష శాస్త్రాలు ఉండే అవసరం గురించి ప్రశ్న వస్తే కొంతమందికి అమితమైన కోపం వస్తుంది. వాస్తు మీరనేటంత గొప్పదే అయితే ఇంజనీరింగ్ లో కలపండి. జ్యోతిష్యం అంత గొప్పదైతే ఇంకెక్కడైనా ప్రయత్నించుకోండి. తెలుగుపై రుద్దడం ఎందుకు? తెలుగుకి, వీటికి ఉన్న సంబంధం ఏమిటి? అవి అంత గొప్ప శాస్త్రాలైతే శాస్త్రాలుగానే చదవండి. తెలుగు శాస్త్రం కాదే మరి? వీటిని తెలుగు విశ్వవిద్యాలయంలో విభాగాలుగా వుంచడం అంటే అది తెలుగును నిర్లక్ష్యం చేయడం తప్ప మరోటి కాదు.

ఇంతకాలమైనా సంస్కృతం సహాయం లేకుండా ఒక్క పదం తయారు చేసుకోలేక పోతున్నాం. ఆ సంస్కృత పదాలను పలక లేక తిరిగి ఇంగ్లీషు పదాలవైపు మొగ్గుతున్నాం. ఇక తెలుగు అకాడమీ ప్రచురించే పుస్తకాలు చూస్తే... విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాలు నేర్చుకోవాలా, సంస్కృత సమాసాలు నేర్చుకోవాలా అర్థం కాని స్థితి లో మరింత గందరగోళం లోకి నెట్టివేసేలా ఉంటాయి. ఇది తెలుగుకి సంబధించిన ప్రభుత్వ విభాగాల సమిష్టి వైఫల్యం కాదా?

వర్గాల విషయం ఎటూ వచ్చింది కాబట్టి వివరాలలోకి వెళ్తున్నాను. యూరప్ లో విద్యా వంతులైన సోక్రటిస్, డెమొక్రటిస్, అరిస్టాటిల్ వంటి వారు వర్గ విచక్షణ లేకుండా తమ విజ్ఞానాన్ని పంచి పెట్టారు. ఫలితంగా ఒకప్పుడు మనకన్నా వెనుక బడిన యూరప్ పారిశ్రామిక విప్లవంలో ముందుకు దూసుకు వెళ్ళింది. అదే ఇక్కడ కొన్ని వర్గాలు విద్యని తమ గుప్పెట్లో పెట్టుకొని సామాన్య జనానికి అందుబాటులోకి రానీయకుండా అడ్డుపడ్డాయి. వేదాలు, ఇతర శాస్త్రాలకు ఏదో అసంబద్ధమైన పవిత్రతను ఆపాదించి రహస్యంగా వుంచాయి. ఫలితంగా ఆ శాస్త్రాలేవీ శైశవ దశ దాటి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు అవే వర్గాలు అవేవో గొప్ప శాస్త్రాలుగా వర్ణించి తిరిగి ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి.

చర్చ లో రుత్వానికి బదులు క్రావడిని వాడినందుకు ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. రెండింటి పలుకుబడిలో ఉన్న తేడా ఏమిటి? సరిగ్గా ఇలాంటి మార్పును వ్యతిరేకించే భావాల వలననే తెలుగుకి ఈ గతి పట్టింది అని చెప్ప వచ్చు. చేతనైతే తెలుగును సరళీకరించడంలో తోడ్పడండి. అంతే కాని మీ ఛాందస భావాలతో తెలుగును తెరమరుగు చేయకండి.

అజ్ఞాత చెప్పారు...

"వర్గాల విషయం ఎటూ వచ్చింది కాబట్టి వివరాలలోకి వెళ్తున్నాను. యూరప్ లో విద్యా వంతులైన సోక్రటిస్, డెమొక్రటిస్, అరిస్టాటిల్ వంటి వారు వర్గ విచక్షణ లేకుండా తమ విజ్ఞానాన్ని పంచి పెట్టారు. ఫలితంగా ఒకప్పుడు మనకన్నా వెనుక బడిన యూరప్ పారిశ్రామిక విప్లవంలో ముందుకు దూసుకు వెళ్ళింది. అదే ఇక్కడ కొన్ని వర్గాలు విద్యని తమ గుప్పెట్లో పెట్టుకొని సామాన్య జనానికి అందుబాటులోకి రానీయకుండా అడ్డుపడ్డాయి. వేదాలు, ఇతర శాస్త్రాలకు ఏదో అసంబద్ధమైన పవిత్రతను ఆపాదించి రహస్యంగా వుంచాయి. ఫలితంగా ఆ శాస్త్రాలేవీ శైశవ దశ దాటి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు అవే వర్గాలు అవేవో గొప్ప శాస్త్రాలుగా వర్ణించి తిరిగి ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి.
"

నేను దీనికి మాత్రమే స్పందిస్తున్నా! యూరోప్ లో విద్యావంతుల కాలం లో ఏ ఏ వర్గాలున్నాయని వారు కొన్ని వర్గాల నుంచి విజ్ఞానాన్ని దాచి పెడతారు? నేను చదువుకున్న పుస్తకాల్లో అలాంటిదేమీ లేదు మరి మీరు ఎక్కడి నుంచి సంగ్రహించారు ఈ "విజ్ఞానాన్ని" ? ఏది వర్గం, ఏది కులం, ఎక్కడి కుల వ్యవస్థ? వీటి మీద కూడ మీ దృష్టి సారించి ఇక్కడ అందరిని అనుగ్రహించండి.

శాస్త్రాల గురించీ, హేతుబధ్ధత గురించీ, శాస్త్రీయత ఉచితానుచితాలగురించీ కుండబద్దలు కొట్టిన మిమ్మల్ని చూస్తే ముచ్చటేసినా, పారిశ్రామిక విప్లవం తో ముందుకు దూసుకుపోయింది అని మీరు వక్కణించిన తీరు చూస్తే, పారిశ్రామిక విప్లవం మనం అందుకోలేక పోయిన అద్భుతమైన ఒక "పుల్లని ద్రాక్ష" అని మీరు బోధిచటం చూస్తే మీ మీద జాలి వేస్తోంది. పారిశ్రామిక విప్లవం ఏఁవిటో అది అంథ అధుతమైనది ఎందుకో కాస్త సెలవిస్తారా?

ఏవ్ వర్గాలు "విద్య" ను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి? వేదాలనూ, ధర్మశాస్త్రాలనూ ఎంతమంది బ్రాహ్మణులు చదివారో మీరు పరిశోధించి చూసారా? మీదగ్గర ఆ సంఖ్యలు ఉన్నాయా? ఏ శాస్త్రీయత గురించి మాట్లాడేది మీరు?

స్వార్థపరులైన వ్యక్తులు ఏ వ్యవస్థ లో లేరు? భ్రష్టత్వం ఎక్కడ లేదు? మీరు ఒక విషయం చెప్పండి అక్కడ నేను భ్రష్టత్వం చూపిస్తాను. మరి దురాచారం అన్నిచోట్లా ఉన్నప్పుడు, చెడు మంచీ అన్నిట్లో ఉన్నప్పుడు, చెడు ను గురించి మాత్రమే మాట్లాడక వర్గాలు, ఒక వరగం చేసిందంటారెందుకు?

పారిశ్రామిక విప్లవానికీ, సైన్సుకూ, పాశ్చాత్య విషయాలనూ ప్రశ్నించకుండా ప్రామాణికం గా చూపించే జనానికి "శాస్త్రాలకు ఆపాదించబడిన పవిత్రతలో అసంబధ్ధతను" వెదికే హక్కు లేదు. ప్రశ్నిచటం తెలిసినప్పుడు, సరైన ప్రశ్నలు అడగదలచుకున్నపుడు, మనిషీ! అన్నిటినీ ప్రశ్నించు.

శాస్త్రాలేవీ శైశవ దశను దాటి వెళ్ళలేదా? మళ్ళీ ఇక్కడో అభాస. పాశ్చాత్య సైన్సు ప్రపంచం కంటే కొన్ని కాంతి సంవత్సరాలు ముందు ఉన్న భావాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి బూజు పట్టిన కళ్ళను విదిలించి చూస్తే తెలుస్తుంది, చూడకపోయిన పర్లేదు మీకున్న పరిమిత జ్ఞానం తో మొత్తం విషయమ్మీద తీర్పులివ్వకండి

ఏ శాస్త్రాలను ఎవరు ఎవరి మీద రుద్దుతున్నారు? వాస్తును అశాస్త్రీయం అని నిరూపించటానికి కావలసిన మొదటి అర్హత - మీరు శాస్త్రమనబడే సైన్సు ను, వాస్తు ను రెండింటినీ అధ్యయనం చేసి, ఏది ఎందుకో శాస్త్రమో ఏది ఎందుకు కాదో చెప్పగలగడం. అలా మీరు చెసారా? చేసిన వారి పరిశోధనలు చదివారా? మరి మీ స్వరం లో సాధికారత ఎక్కడినుంచి వచ్చింది? మీ శాస్త్రం లో శాస్త్రీయత ఎంత?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి