మంగళవారం, ఫిబ్రవరి 10, 2009
స్పందన -7
San Jose,CA Winter annual flowers Photo:cbrao
మా ఊరు వెళ్తున్నా
మా ఊరు అంటే పాత మధుర స్మృతులు గుర్తుకు రావటం ఖాయం. మన ఊరు వెళ్తున్నాము అనగానే చిన్ననాటి సంగతులు మనసు నిండా ముసురుకోకుండా ఎలా వుంటాయి? అవి వెంటాడే జ్ఞాపకాలు. అప్పటి పాత స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నరో, ఏమి చేస్తున్నారో అని మనసు విలవిలలాడటం ఖాయం. ఇంతకూ ఏ వూరు వెళ్తున్నారు ?
http://bhavadeeyudu.blogspot.com/2009/02/blog-post.html
ఆడ దెయ్యాలు
ఈ సారి మళ్లా మీ అమ్మమ్మా వాళ్ళ ఊరు కి వెళ్లినప్పుడు ఆడ దెయ్యాలు కనపడితే వాటికి తెలుగు బ్లాగులు గురించి చెప్పి, మహిళా బ్లాగరిణులపై అసభ్యం గా రాస్తున్న ముష్కరుల పని పట్టమని చెప్పండి.
http://nenu-laxmi.blogspot.com/2009/02/blog-post_09.html
ఇంటింటి బ్లాగోతం
"ఆరు సార్లు చదివా ఈ కవితని తెలుసా అన్నాను ....
ఆరుసార్లా!!!!! ఇప్పుడు అన్ని సార్లు వినిపిస్తావా అన్నారు..
అర్దం అయ్యేంతవరకూ చదివి వినిపిస్తా అన్నాను పట్టుదలగా ..
నిజం చెప్పవే సినీ నటి శ్రీలక్ష్మి మీకు బంధువులు కదా అన్నారు అనుమానంగా." -పడి పడి నవ్వా చదువుతున్నప్పుడు.
http://jaajipoolu.blogspot.com/2009/02/blog-post_09.html
When NOTHING is better?
ఇంతకూ బ్లాగులో రాసినది కనబడకుండా ఎలా మాయం చేశారు? మరలా ఎలా తెప్పించారు? e-తెలుగు స్టాల్ పుస్తక ప్రదర్శనశాల వద్ద మిగతా బ్లాగరుల గురించి మీరు గమనించి రాసిన విషయాలు కొంతమందిని ఇబ్బందిలో పెట్టుంటాయనిపిస్తుంది.
http://bhavadeeyudu.blogspot.com/2008/09/blog-post_11.html
"తెలుగు సాహితి" తొలి సమావేశం
సమావేశ నివేదిక ద్వారా ఐ.బి.ఎం. ఉద్యోగస్తుల, తెలుగు సాహిత్యం పై కల ఆసక్తి తెలుస్తూంది. తెలుగు బ్లాగులు చదివి, ఎవరైనా తెలుగులో కొత్త బ్లాగు ప్రారంభించడానికి ఉత్సాహం చూపారా? మీ ప్రణాళిక ప్రకారం ఈ నెల 12 న జరగబోయే సమావేశం విజయవంతం కావాలని అభిలషిస్తున్నాను. కొత్త బ్లాగు ప్రారంభించటానికి ఏమైనా సహాయం కావాలంటే తెలుగు బ్లాగు గుంపు ను సంప్రదింపవచ్చు.
http://ibmtelugusaahiti.blogspot.com/2009/01/blog-post.html
"అంధ విద్యార్ధులకు ఉన్నత చదువులకు చేయూత"
మీ ఆశయాలు బాగున్నాయి. హైదరాబాదు లో మీ చిరునామా, ఫోన్ సంఖ్య ఇవ్వగలరు. మీకు TMAD వారు పరిచయమేనా?
http://sahaayafoundation412.blogspot.com/2009/02/blog-post_09.html
బ్లాగరులే మహనీయులు
అచ్చు రచనలకు, బ్లాగులో రచనలకు మౌలికంగా రెండు ముఖ్యమైన తేడాలున్నాయి. బ్లాగులో రాసినవి Search Engine కు దొరుకుతవి. పాఠకులకు తాము చదవదలచుకున్న విషయాలపై ఒక పెద్ద ఖజానా వారి ముందర ఉంటుంది. బ్లాగరులకు పాఠకులనుంచి వచ్చే స్పందన ఉభయత్రా లాభదాయకమైనది. రచనలో లేని విషయాలు కూడా, వ్యాఖ్యలు ద్వారా సత్వరం తెలుసుకోవచ్చు. అచ్చులో ఈ రెండు సదుపాయాలూ లేవు.
http://www.tadepally.com/2009/02/blog-post_10.html
Slumdog Millionaire (2008)
భారతదేశంలోని మురికివాడలు చూపిస్తే వారి చిత్రాలలో వాస్తవికత ఉట్టిపడగలదని ఈ దర్శకుల భావన అయ్యుండొచ్చు. అలా తీయడం చిత్ర వ్యాపార విజయానికి తోడ్పడితే ఏ నిర్మాత కాదంటాడు? సినిమాకు దారిద్ర్యం కూడా ఒక బాక్స్ ఆఫీస్ సూత్రమై కూర్చుందిప్పుడు.
http://anilroyal.wordpress.com/2009/02/09/%e0%b0%ae%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి