శనివారం, మార్చి 26, 2011

హైదరాబాదు లో ఇంట్లో పాక్షిక పనిచేస్తూ $8795/- ల నెలసరి సంపాదన

అవునండీ మీరు ఏ వస్తువులు అమ్మనవసరం లేదు, అవతలివారు ఎలాంటి వస్తువులు కొన అవసరం లేదు. ఇంట్లో       పార్ట్ టైం పని చేస్తూ  నెలకు సుమారు   $8795/- లు సంపాదించటం సాధ్యమే నంటున్నారు ఇక్కడి  కెల్లి రిచర్డ్స్. నమ్మశక్యం గా లేదు కదూ. USA Times daily  వారి వ్యాసంలో ఈ విషయమై మరింత సమాచారం మీరు ఇక్కడ చూడవచ్చు.

20 కామెంట్‌లు:

nonentity చెప్పారు...

Just google before the anti-climax, will ya?! :)

http://www.google.co.in/search?rlz=1C1SKPL_enIN422IN422&sourceid=chrome&ie=UTF-8&q=%22kelly+richards%22

Unknown చెప్పారు...

This is Fraud!!

Do not fall into it...Its just not real

Bhardwaj Velamakanni చెప్పారు...

Its a scam. The first activation fee of $3 is only for a week and if you dont cancel after a week then you will be charged $139 and then $10 every month. Cancellation is not easy.

శుభకరుడు చెప్పారు...

Rao gaaru,
It's scam... don't fall for it. Once you pay the 3$, using the same credit card information they will charge you more and more till you cancel your card... read the fine print in their ad.

In fact KellyRichards lives literally in every big city in the world. Check this link for more information.. they even created a fake advertisement by mimicking CNN website.

http://www.frogenyozurt.com/2010/05/cnnews-supports-online-work-at-home-program-scam/

for more information search in google for below line.

"Work At Home Mom Makes $8,795/Month Part-Time scam"

Rajendra Devarapalli చెప్పారు...

రావు గారు ఈ కెల్లీ రిచర్డ్స్ ఎక్కడి వారు?

cbrao చెప్పారు...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి    :  కెల్లి రిచర్డ్స్ అనే వ్యక్తి ఒక ఊరి  మనిషి కాదు.  మీరు స్టంబులపాన్  అనే వెబ్ సైట్ కు వెళ్లినప్పుడు అది మీ కంప్యూటర్ i.p. address catch చేసి కెల్లి రిచర్డ్స్ ను విశాఖపట్టణం వ్యక్తిగా చూపిస్తుంది. ఆ వెబ్సైట్ కు మీ i.p. చిరునామాను పట్టుకోవడం చిటికెలో పని. కెల్లీ రిచర్డ్స్  గురించిన మరింత సమాచారానికై ఈ వీడియో చూడగలరు.అబ్రకదబ్ర.

cbrao చెప్పారు...

@nonentity, chaitu, Bhardwaj Velamakanni: మీ హెచ్చరికలకు ధన్యవాదాలు. కెల్లీ రిచర్ద్స్ అంటే గోల్‌మాల్ గోవిందమ్మ, భం భం బసవమ్మ అని చక్కగా చెప్పారు. నెనర్లు.

అజ్ఞాత చెప్పారు...

కెల్లి రెచర్డ్ ఓ వ్యక్తి కాదు, గొప్ప దొంగశక్తి. :)

సి.బి రావుగారు, మీలాంటి పెద్దమనుషులు బ్లాగుల్లో ఇలా 420 గాళ్ళను పరిచయం చేసి ప్రచారం చేయడంలోని వుద్దేశ్యం?

cbrao చెప్పారు...

@Snkr: మీరు మీ Profile ఎందుకు disable చేశారో తెలుపగలరు. anonymous కు మీకు ఏమిటి తేడా? ఈ పోస్ట్ లో ప్రచురించిన వ్యాఖ్యలు చదవండి. మీ ప్రశ్నకు సమాధానం వాటిలో ఉంది.

cbrao చెప్పారు...

మరో పాఠకుడి (పేరు గుర్తులేదు) వ్యాఖ్య Spam వ్యాఖ్యలలో ఉన్నదానిని Not spam అని Mark చేస్తే Comment Published అని సందేశం వచ్చింది కాని వ్యాఖ్య ప్రచురితం కాలేదు. కారణం తెలియదు. పాఠకుడికి కలిగిన అసౌకర్యానికి విచారం. వ్యాఖ్య మరలా పంపగలరు.

Sudha Rani Pantula చెప్పారు...

రావుగారు,
శంకర్ గారు ప్రశ్నించినదానిలో ఆక్షేపణ నాకేం కనిపించలేదు. మీరు బ్లాగు పోస్టులో ఎక్కడా ఇది మోసమా అని కాని, మోసంకాదు కదా అన్న అనుమానం కానీ వెల్లడించకుండా...అది నిజమే కావచ్చు అన్న భ్రమకలిగించేలాగ టపా రాసారు. వ్యాఖ్యలు చూస్తే గాని అది ఉఠ్ఠి స్కామ్ అని తెలియడంలేదు. మీకైమీరు దీన్ని ఒక టపాగా ప్రచురించడంలో అర్థం ఏమిటి...కాదు వ్యాఖ్యలు చూసి నిజం తెలుసుకోమనడం ఏమిటి.మీరు పెద్దమనుషులు అన్నగౌరవంతోనే కదా శంకర్ గారు ప్రశ్నించారు. శంకర్ గారి ప్రొఫైల్ ఎనేబుల్ అయినా డిసేబుల్ అయినా దీనికి సంబంధం ఏమిటి. ఆయనకి జవాబు చెప్పండి.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ నమ్మలేదు ,cbraoగారు చెప్పారుకదా నిజమే ఉంటుందేమోనని క్లిక్ చేస్తే this site has poor reputation అని మా epic browser warning ఇచ్చింది. కెల్లీ రిచర్డ్స్ అనంతపురం అని వచ్చింది.అప్పుడర్థమయింది ఇదేదో బోగస్ అని.

అజ్ఞాత చెప్పారు...

Exactly! Thanks Sudha garu. :)

నా ప్రొఫైల్ ఎందుకు disable చేశానా? :) ఐతే ఏంటంటారు? నా ప్రొఫైల్ ఓపన్‌గా లేకపోవడానికి, మీ postకి ఏమైనా సంభంధం వుందా?

హూ .. నిప్పులు కడిగిన వంశం మాది, ప్రొఫైల్ విప్పుకుని తిరగడం మా ఇంటా వంటా లేదు, నాకూ అందులో సరదా అనిపించలేదు. ఎనీ అబ్జక్షన్? :P :))

Unknown చెప్పారు...

I would also suggest u to scan ur comp for any spyware, adware, scareware or a virus!

cbrao చెప్పారు...

@సుధ: Profile enable చేయని వారు ఆకాశరామన్న లేక anonymous ల కు సమానం నా దృష్టిలో. వారి ఉత్తరాలకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు. మీకైతే జవాబు చెప్పాలి. ఈ టపా చదివాక, వ్యాఖ్యలు చూడక ముందు, టపాలోని విషయాలు మీరు నమ్మారా? కనీసం ఇందులో ఏదో ఆసక్తికర విషయం లేక తెలియని సంగతి ఉందని మీకు అనిపించిందా?

కెల్లీ రిచర్డ్స్ గురించిన ఒక ఉత్తరాన్ని అమెరికాలోని ఒక మిత్రుడు నాకు forward చేశాడు. అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఏదో మార్మికత ఉందనిపించింది. పాఠకులకి ఆసక్తికరంగా ఉంటుందని టపా గా వెలువరించాను. టపా ప్రచురించే సమయం లో కెల్లీ రిచర్డ్స్ అనే వ్యక్తి కేవలం fictious person అనే విషయం నాకు తెలియదు. తెలిస్తే నా టపా పరిచయ వాక్యాలు మరోలా ఉండేవి. అంతర్జాలం లో ఇంటినుంచి పనిచేయటం గురించి ఎన్నో సంస్థలున్నాయి. ఏవి మంచివో, ఏవి మోసకారులో, తెలుసుకోవటం సులభం కాదు. జాగరూకత చాలా అవసరం.

cbrao చెప్పారు...

@చిలమకూరు విజయమోహన్: మీ జాబుకు మప్పిదాలు. సుధకు ఇచ్చిన జవాబును చదువ కోరుతాను.

cbrao చెప్పారు...

@చైతు : నా కంప్యూటర్ కు వైరస్ సాధారణంగా రాదు. రెండేళ్ల పై నుంచి వాడుతున్నాను. ఇంతవరకూ రాలేదు. నా కంప్యూటర్ లో ఎలాంటి antivirus software ప్రతిష్టించలేదు. నా Operating System: Mac OS X Version: 10.6.7 Browser: Firefox Version 4

అజ్ఞాత చెప్పారు...

/ Profile enable చేయని వారు ఆకాశరామన్న లేక anonymous ల కు సమానం నా దృష్టిలో. వారి ఉత్తరాలకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు. /
ఓహో.. అట్లానా! బాగున్నాయి మీ అభిప్రాయాలు.

Unknown చెప్పారు...

No worries if its Mac/Linux :-)

Unknown చెప్పారు...

i have more dittels

కామెంట్‌ను పోస్ట్ చేయండి