Click on image to enlarge
ఆనాటి గుంటూరు జిల్లా (1788 -1848) రచన ఒక నిశిత పరిశీలన.1965 లో ఆక్స్ఫర్డ్ ప్రచురించిన ఈ చారిత్రక గ్రంధం మిగిలిన జిల్లాలకు నమూనాగా పనికి వస్తుంది. అప్పటి గుంటూరు పరిపాలనలో తిరిగిన మలుపులు, జమిందారీల ఒడుదిడుకులు,విలాస పాలకులక్రింద సామాన్య జనజీవితం,కళ్ళకు కట్టినట్లు రచయిత ఆధార సహితంగా పాఠకుల ముందు పెట్టారు. కృష్ణా బరాజ్ నిర్మాణం ముందు జిల్లా ఎలా వుండేది ,దాత కరువు ప్రజల్ని కుదిపి పారిపోయెట్లు చేసిన దారుణం కళ్ళకు కట్టినట్లు చూపారు.ఆనాడు ధర్మం నాలుగు పాదాల పై నడిచేదనే భ్రమను పటాపంచలు చేశారు. మహారాష్ట్ర నుండి తరలి వచ్చిన బ్రాహ్మణులు పదవులు స్వీకరించి బ్రిటిష్ పాలకులను ముప్పు తిప్పలు పెట్టిన తీరు, నోరు నొక్కుకునేట్లు చేస్తుంది. బ్రిటీష్ పాలకుల పరిపాలనా అసమర్ధత , బంధు పక్ష పాతం, అవినీతి కనువిప్పు కలిగిస్తుంది.
వాసిరెడ్డి జమిందారు, మిగిలినవారు ఎలా వున్నారనేది ఆకర్షణీయంగా రాసారు.16 అధ్యాయాలలో 300 పుటల చరిత్ర చదివించేదిగా సాగింది. జమిందారీలను అతి జాగ్రత్తగా హరించిన బ్రిటీష్ పాలనాతీరు బాగున్నది. గ్రామాలలో కరణాలు, బ్రిటీష్ పాలకులను ఏడిపించిన తీరు అబ్బురంగా వున్నది. గ్రామ పాలన లోతుపాతులను ఇంత బాగా ఎలా అధ్యయనం చేశారో అనిపిస్తుంది.రెవిన్యూ పాలన లొసుగులను చక్కగా కనబరిచారు. కలక్టర్లను నిలకడగా వుంచకుండా తరచూ మార్చడం వలన జరిగిన ప్రమాదాన్ని అవగాహన చేసి చూపారు. ఆనాటి జిల్లా పటాలను , ప్రముఖ కట్టడాలను నమూనాగా ఇచ్చారు . పరిశీలక ప్రమాణ గ్రంధాల పట్టిక గమనార్హం.
ఇదే తీరులో ఇతర జిల్లాల చరిత్ర రాస్తే, రాష్ట్ర చరిత్ర శాస్త్రీయంగా
వుంటుందని రచయిత వెలిబుచ్చిన మాట సబబుగా వున్నది. రచయిత రాబర్ట్ ఎరిక్ ఫ్రికన్ బర్గ్, ఊటీలో పుట్టి, గుంటూర్ జిల్లాలో, బాల్య దశ లో 12 ఏళ్ళు గడిపారు. తెలుగు మాట్లాడడం వచ్చు.అమెరికా వెళ్ళి విస్కాన్సిన్ యూనివర్సిటిలో వుంటూ, అనేక పర్యాయాలు ఇండియా పర్యటించి రికార్డులు సేకరించి తన తొలి గ్రంధం గా గుంటూర్ జిల్లా రాశారు . తెలుగులో తన మొదటి రచన రావాలనే రచయిత కోర్కె ను, ఇన్నయ్య, ఈ అనువాదం ద్వారా తీర్చారు.

తెలుగులో తొలి ప్రచురణ: మార్చ్ 2011. ఈ పుస్తకం అక్షర,బంజారా హిల్స్, నవోదయ, కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాదు లో లభ్యమవుతుంది. ధర రూ.500/-
4 కామెంట్‌లు:
I vaguely remember reading one such book in which Venkoba Rao and Lakshmoji Rao (approximate names)gave a lot of trouble to the district collector through litigations. Can you please give the title of the original book. Thanks.
@గద్దె స్వరూప్: మీరు ఉదహరిస్తున్నదీ పుస్తకమేనా?
Rao, V. Venkata. The Administration of the District Boards in the Madras Presidency: 1884-1945 (Bombay: Local Self-Government Institute,1953).
ఆనాటి గుంటూరు జిల్లా పుస్తకం చివర్లో విపులమైన bibligraphy ఉంది. మరింత సమాచారానికై దానిని చూడవచ్చు.
-cbrao
రావు గారు చాలామంచి పుస్తకం.చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నాను.అయితే మీరు ఆ పుస్తకాన్ని ఇక్కడే ఎంబెడ్ చెయ్యాల్సింది.స్క్రిబ్డ్ చాలామందికి ఖాతావున్న సైట్.ఈ ఇ-స్నిప్స్ పుస్తకాన్ని దించుకోవాలంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ ను దిమ్చుకోమ్మంటుంది.ఈ తిప్పలేమీలెకుండా ఇక్కడే ఎంబెడ్ చేస్తే నాలాంటివాళ్లకి పనిసులువు.
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: eSnips Downloader అనే ఉచిత సాఫ్త్వేర్ మీరు ఒక్కసారి మాత్రమే దిగుమతి చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేశాక మీరు ఎన్ని e-books నైనా e-snips నుంచి దిగుమతి చేసుకోవచ్చు. scribd ద్వారా ఎంబెడ్ చేసినా, పుస్తకం డౌన్లోడ్ చేసుకున్నప్పుడే, చదవటానికి సౌలభ్యంగా ఉంటుంది. నెనర్లు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి