శుక్రవారం, మార్చి 18, 2011
Facebook కబుర్లు
Madam: Useless Bai !!!.. Why didn’t you come last week? And that too without informing me??????
Kamwali Bai: O Myadam... I had updated my Facebook status as "Will be out of town for a week..". Saaheb knows.
He even commented "Come soon... Miss U!!"
ఫేస్‌బుక్ ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్. కాలేజ్ విద్యార్ధులకోసం ప్రారంభించినా, నేడు ఇది ఆ బాల గోపాలానికి కబుర్లు, చిత్రాలు, వీడియోలు పరస్పరం పంపుకోవటానికి అనువైన వేదికగా తయారయ్యింది. అంతే కాదు తెలంగాణా ఉద్యమం నుంచి టునీసియా, ఈజిప్ట్ , లిబ్యా వగైరా దేశాల ప్రజా ఉద్యమాలకు కారణభూతమయ్యింది. జపాన్ లాంటి దేశాల్లో జరిగిన ప్రకృతి వైపరీత్యాలు వగైరా వార్తలను ప్రపంచ వ్యాప్తంగా, సత్వరం పంపటానికి దోహదపడుతూంది.
మొన్న మా ఇంటికొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని ప్రియాంక తో పిచ్చాపాటి మాట్లాడుతూ, నేనన్నాను ' సగటున వారానికి ఒక Friendship request నాకు వస్తూంటుంది '. ప్రియాంక అన్నది ' అంకుల్, ఇదే ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువగా వస్తాయి ' అని. మీరు కూడా ఇలాగే అసంఖ్యాకమైన అభ్యర్ధనలు అందుకుని ఉండవచ్చును. నాకు అభ్యర్ధన పంపే వారు చాలా సందర్భాలలో,తెలియనివారే. తెలియనివారి అభ్యర్ధన ఎలా మన్నించటం? Yes చెప్పకపోతే అవతలవారు నొచ్చుకొంటారేమోనని సందిగ్ధం మనసులో పీకుతూ ఉంటుంది. కొన్ని పర్యాయాలు, తెలిసినవారిని కూడ వారి వాడుక పేరు భిన్నంగా ఉండటంతో, గుర్తించక అభ్యర్ధనకు బదులివ్వని సందర్భాలు కూడా నాకు అనుభవమే.
అభ్యర్ధనలకు బదులివ్వకపోవటం మర్యాద కాదు. అయితే తెలియనివారిని స్నేహితులుగా అంగీకరించటం మనసుకు నచ్చని పని. అందుకని మధ్యే మార్గంగా, అభ్యర్ధనలు పంపే వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, వారిని గుర్తించలేకపోయానని, వారి పరిచయం పంపమని అభ్యర్ధిస్తూ ఆంతరంగిక సందేశాలు ఫేస్‌బుక్ ద్వారా పంపేవాడిని. ఇలా పది ఉత్తరాలు వ్రాస్తే ఒక బదులు వచ్చేది. వారిని వెంటనే నా మిత్రులుగా అంగీకరించేవాడిని. అయితే మిగతా తొమ్మిది మందికి ఎన్ని reminders పంపినా జవాబొచ్చేది కాదు. వారి పరిచయం పంపటం ఇష్టం లేని వారు,నా స్నేహితులుగా అనర్హులు అని నిర్ణయం తీసుకుని వారి అభ్యర్ధన hide లో ఉంచటం జరిగింది. అభ్యర్ధన పంపే వారి స్నేహితుల సంఖ్య ఎంతో చూసేవాడిని. కొంతమందికి రెండు వేలు పైచిలుకు మిత్రులుంటే, స్నేహితుల status లను గమనించే స్థితి కాని వారికి బదులిచ్చే వ్యవధి కాని వారికుండదని గమనించి వారి స్నేహపు అభ్యర్ధనలను hide లో ఉంచాను. నాకు ఇంతమంది స్నేహితులున్నారని బడాయిగా చెప్పుకోవటానికి ఆ సంఖ్య వారికి ఉపయోగపడకలదు, అంతే.
అపరిచితులను స్నేహితులుగా అంగీకరిస్తే వచ్చే అనర్ధాలకు గురి కాకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
:) -- మీ జోక్ కి.
ఫేస్ బుక్ లో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లు నేనైతే బాగా తెలిసిన వాళ్ల దగ్గరనుండి తప్ప అంగీకరించను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి