సోమవారం, జనవరి 22, 2007

అడవిలో అర్థరాత్రి -2



డాక్టర్ ప్రవీణ్ E.N.T., Surgeon గా ఒక Corporate hospital లో పని చేస్తున్నారు. రాజీవ్ Nature tours conduct చేసే travel agency నడుపుతున్నారు. ఇద్దరికీ పక్షులంటే ప్రాణం. వీరితో డాక్టర్  గారమ్మాయి దీప్తి కూడా వచ్చింది. ఆమెకూ పక్షులంటే అనురక్తి. నిర్మల్ అటవీప్రాంత క్షెత్ర ముఖ్య అధికారి (D.F.O) వహీద్ గారు. వారి సలహాపై నిర్మల్ అటవీ ప్రాంతంలోని మామడ రక్షిత అడవి వైపు వెళ్ళాయి మా జీపు, డాక్టర్ గారి కారు. ఈ దారి నిన్న వెళ్ళిన దారికి వ్యతిరేక దిశలో ఉంది. మా జీపు నిర్మల్ పట్టణం లోంచి బయటకు అతి తక్కువ వ్యవధిలో రాగలిగింది. కారణం నిర్మల్ చిన్న ఊరవటమే. తెలంగాణలో పట్టణాలు కోస్తా జిల్లాలతో పొలిస్తే చిన్నవిగా అగుపిస్తాయి. ఇప్పుడిపుడే అభివృద్ధి చెందుతున్నాయి.

రహదారి వెంట అలా 20 K.M లు పరిగీత్తిన మా వాహనాలు అక్కడ దారి మళ్ళి, కుడి వైపుగా అడవిలోకి పరుగు తీశాయి. తారు రోడ్ పై వెళ్తున్న వాహనాలు కుడివైపుని చిన్న మట్టి దారి గుండా వెళ్ళి ఒక సరస్సుకు దగ్గరగా ఆగాయి. జీపు దిగి సరస్సు వైపు నడిచాము. సరస్సులో ఎడమవైపు దూరంగా రాతిపై రెండు తీతువు పిట్టలు ( Red - Wattled Lapwing ) కనిపించాయి. ఇవి, ఆడ, మగ పక్షులు ఒక మాదిరిగానే ఉంటాయి. ఆ రెండూ జంట కావచ్చు. నా ఎదురుగా ఉన్న సరస్సు దగ్గరి కెళ్ళాను. సరస్సు కావల కొన్ని River Tern పక్షులు కనిపించాయి. ఇవి సరస్సు చుట్టూ, సరస్సు పై పరిభ్రమిస్తూ, తమ ఆహారమైన చేపలు, చిరు కప్పలకై అన్వేషిస్తూ నా దగ్గరిదాక వచ్చాయి. నా కెమారా తో చాయ చిత్రం తేసే లోపల కెమరా కు అందనంత దూరంగా వెళ్ళిపొయాయి. సరస్సు చుట్టూ తిరిగి ఇంకో పర్యాయం నా వద్దకు వచ్చినా రెండో సారీ వాటి చిత్రం తీయ లేక పోయాను. కెమరా కు అందనంత వేగంగా ఉంది వాటి ఆహార అన్వెషణ.


Grey Heron

కొద్ది దూరంలో, రాళ్ళ పక్కన, నీటిలో కనిపించింది నారాయణ కొంగ (Grey Heron). సరస్సు అంచునే నడుస్తూ నెమలి నార చెట్టు (Holoptelia integrifolia) దగ్గరికి వచ్చాను. ఈ చెట్టుపై Blue tailed Bee eater వయ్యారాలు పోతూ కనిపించింది. మనకు హైదరాబాదు సమీపంలో ఎక్కువగా Green Bee eater కనిపిస్తుంది. Blue tailed Bee eater చూడటం నాకిదే ప్రథమం. అందంగా కనిపించింది.


Holoptelia integrifolia This tree is useful for making ropes.

Blue tailed Bee eater కి ఆశ్రయమిచ్చిన Holoptelia integrifolia చెట్టుని చూడండి. దీనిని నెమలి నార చెట్టు అంటారు. ఈ చెట్టులో మంచి నార ( fibre ) ఉండటం వలన తాళ్ళు పేనటానికి బాగా ఉపయుక్తంగా ఉంటుందీ చెట్టు. ఈ చెట్టు మొదలు చూడండి.


Look at roots – It indicates water level in rainy season.

నేల పై భాగాన కూడా వేళ్ళు ఉన్నాయి కదూ. దానికి కారణం ఊహించగలరా? సరస్సు నీటి ఎత్తు పెరిగినప్పుడు చెట్టుకు వేళ్ళు కనిపించేంత ఎత్తుదాకా నీటి మట్టం ఉంటుంది.

ఆ సమయాన నిర్మల్ అటవీప్రాంత క్షెత్ర ముఖ్య అధికారి (D.F.O.) వహీద్ గారు అక్కడికి వచ్చారు. వారు మాకు అడవి లోని ఎన్నో విశేషాల గురించి చెప్పారు. వారే స్వయంగా మా అందరికీ మార్గదర్శకులు అయ్యారు. అడవిలోని రక రకాల చెట్లను చూపుతూ వాటి గురించి వివరించ సాగారు. మొదటగా వారు మాకు బిల్లుడు (yellow chloroxylon swietenia) చెట్టు గురించి వివరించారు.
Furniture చెయ్యటానికి ఈ చెట్టు కలప వాడతారు. తరువాత మాకు Boswellia Serrata చూపించారు. దాని కాండం పై గీరితే ఎర్రటి స్రావం ద్రవించింది. దీనిని మందులలో వాడతారని చెప్పారు. అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. వంట వారు వారి పనిలో నిమగ్నమయ్యారు. వంట తయారు కావటానికి ఇంకా వ్యవధి ఉన్నందున వహీద్‌గారు మమ్ములను అడవిలోకి తీసుకు వెళ్ళారు.


Termite Mounds

దారిలో మాకు కనిపించాయి చెద పురుగుల పుట్టలు. అవి దాటి ఇంకా ముందుకెళ్ళాము. అడవిలో సరస్సు గట్టుపై నున్న సన్నని కాలి బాటలో నడుస్తున్నాము. దారికిరువైపులా చెట్లను చీల్చుకుంటూ ముందుకు నడుస్తున్నాము.


Golden Laburnum – Seeds are laxative for wild bears. Sri Waheed on extreme left

దారిలో కనిపించింది Golden Laburnum (Casia fistula). ఈ చెట్టు విత్తనాలను ఎలుగుబంట్లు విరోచన కారిగా వాడతాయని వహీద్ గారు మా అందరికీ వివరించారు. ఆ కాలి బాట వెంటే నడుస్తూ tank bund anicut వద్దకు చేరుకున్నాము. ఆ bund దాటి నేను, చౌదరి, గీత ఇంకా ముందుకెళ్లాము. అక్కడ సరస్సు దగ్గరగా కూర్చుని కాసేపు సేదతీరి అక్కడి చెట్లను, పిట్టలను వీక్షించి మరల anicut వద్దకు చేరుకున్నాము. ఎప్పుడో 1904 లో కట్టినట్లుగా అక్కడ ఒక శిలాఫలకం కనిపించింది. దానిపైగల వివరాలపై మకిలి చేరటంతో అందలి అక్షరాల వివరం తెలియరాలేదు. ఈ సరస్సు పేరు తురక చెరువు అని తెలిసిందీ శిలాఫలకం ద్వారా.


Birders in action

Anicut పై పక్షివీక్షకులు ఆశీనులై ఎదురుగా ఉన్న నెమలి నార చెట్టుపై గల పక్షులను వీక్షిస్తూ కనిపించారు. ఆ చెట్టు ఎన్నో రకాల పక్షులకు నివాసమై ఉన్నది. ఆ చెట్టుపై గల Verditer Flycatcher మిత్రులను ఎంతగానో ఆకర్షించింది.

మధ్యహ్నం 3.30 గంటలు కావస్తుంది. ఆకలి వేస్తుండటంతో తిరుగు ప్రయాణమయ్యి, మరల చెట్లను చీల్చుకుంటూ, సరస్సు ఒడ్డున వంటలు చేసే చోటికి చేరుకున్నాము. సన్నని కాలి బాటపై ప్రయా ణంలో నా binoculars caps ను ఏ చెట్టు రెమ్మలో గీచుకుని తమలో దాచుకున్నై. ఇవి సరికొత్తవి. అమెరికా నుంచి వచ్చిన ఈ Celestron Rooftop Prism Binoculars ఈ అడవిలోనే ప్రధమంగా వాడటం, వాటి మూతలు ఇలా పోవటం జరిగాయి. ఏమి చేస్తాము? మరల వెనుదిరిగి ఆనకట్టకు ఒంటరిగా వెళ్ళే సాహసం లేదు. భొజనం తయారవటంతో అందరం పళ్ళాలు తీసుకొని కావలిసినవి వడ్డించుకుని రాళ్ళపై కూర్చుని, సరస్సు అందాన్ని వీక్షిస్తూ భొజనం చేశాము. అప్పటికి సమయం నాలుగు దాటింది. అప్పుడు వహీద్ గారు చెప్పారు. మా అందరికీ రాత్రి బస అడవిలోనే అనీ అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయనీ, అర్థరాత్రి సమయాన అడవిలో జంతువులను చూడటానికి ప్రత్యేక విహారం ఉంటుందనీ. నేనడిగాను.' అడవిలో పులి, చిరుత పులి ఉన్నాయా అని? ‘ దానికి వహీద్ గారు నా ప్రశ్నకు సమాధానం, రాత్రి అడవికి వచ్చినప్పుడు చెపుతామన్నారు. అడవిలో రాత్రి బస విషయం మాకు ముందుగా తెలియదు. మా బట్టలు, మిగత వస్తువులు అన్నీ నిర్మల్ అతిధి గృహంలోనే ఉన్నాయి. మా బట్టలు, sleeping bags వగైరా తెచ్చుకోవటనికి నిర్మల్ వెళ్లాము. నిర్మల్ లో ఆదివారం సాయంత్రం, అత్యవసర వస్తువులైన mosquito coils, toilet tissue paper వగైరాలకు షాపింగ్ లో మాకు వస్తువులు పాక్షికంగానే లభ్యమయ్యాయి. Toilet tissue paper గగన కుసుమమే అయ్యింది. అతిధి గృహానికి చేరి, మా సామాను సర్దుకొని అడవికి రాత్రి బసకై బయలు దేరాము.

అడవికి చేరుతూనే మాకు స్వాగతం పలికాయి search lights. ఆ వెలుతురులో సరస్సు చేరి, అప్పటికే అక్కడ ఏర్పాటు చేయబడిన గుడారము (tent) వద్దకు చేరాము. మా వెనుకే దాక్టర్ గారి కారు వచ్చి చేరింది. ఆ తరువాత వహీద్ గారు వచ్చారు.


Camp fire in forest: Left to right Sweta, D.F.O., Waheed, Sheetal

Tent ముందర camp fire చుట్టూ అందరం చేరి కబుర్లలో పడ్డాము. ఈ తీరిక సమయంలో సభ్యులందరూ వారిని వారు పరిచయం చేసుకున్నారు వహీద్ గారితో. వహీద్ గారు నిర్మల్ data book చూపించి వారు సేకరించిన విషయాలను అందులో చూపెట్టారు. నిర్మల్ అటవీ సంపద, వన్యప్రాణుల, పక్షుల వివరాలు అందులో ఉన్నాయి. అర్జున్ మేము చూసిన పక్షుల వివరాలన్నీ ఒక పుస్తకములో నమోదు చేస్తూ ఉన్నాడు. ఆ వివరాలను అర్జున్ వహీద్ గారికి వివరించటం జరిగింది.


Rajeev inspecting the tent. Shafatulla, Vice-President of BSAP in Olive green military uniform, looks on.

రాజీవ్ తనతో పాటు తెచ్చిన, విదేశాల నుంచి దిగుమతి కాబడ్డ గుడారాన్ని తక్కువ వ్యవధిలో ఎలా ఇల్లు గా మార్చవచ్చో వివరంగా చేసి చూపారు. అలాగే ఒక మంచాన్ని కూడ కూర్చే ప్రయత్నం చేశారు కానీ, తనకూ అభ్యాసం లేకపోవటం తో కొద్ది సేపు ప్రయత్నించి ఆ పై విరమించారు. ఈ tent ను ఆ రాత్రి స్త్రీలకు కేటాయించారు.

ఆ రాత్రి భోజనాలయ్యాక మరలా camp fire చుట్టూ చేరాము. కాసేపు కబుర్లయ్యాక సభ్యులందరినీ రెండు భాగాలుగా చేసాక, మొదటి భాగం వారు వహీద్ గారి నాయకత్వంలో అడవిలో వన్య ప్రాణులను చూడటానికై బయలుదేరి వెళ్ళారు. వారు తమ వెంట శక్తివంతమైన search light తీసుకుని వెళ్ళారు. అడవిలో వన్యప్రాణులు మనము పట్టణంలో zoo లో చూసినంత సులభంగా కనపడవు. కానీ మనం ఏమాత్రం ఊహించని సమయంలో ఏ చిరుతపులో అకస్మాతుగా ఎదురు కావచ్చు. పక్షులను చూడటానికి రాజాజి అభయారణ్యానికి (హరిద్వార్ వద్ద వుంది) వెళ్ళినప్పుడు మాకు అకస్మాతుగా జీపు కెదురుగా చిరుతపులి రోడ్ దాటుతూ కనిపించింది. అదృష్టం అంటారే అది కూడా జతైతేనే మనకు వన్య ప్రాణులు కనిపిస్తాయి. ఈ మొదటి batch వారికి ఎలాంటి జంతువులు అగపడలేదు. రెండవ batch రాజీవ్ ఆధ్వర్యంలో, forest guards తోడు రాగా బయలుదేరింది; తమ అదృష్టాన్ని పరీక్షించు కోటానికై. నేను రెండవ batch లో ఉన్నాను.
- సశేషం

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

రావు గారు,

మరొక్క సారి మంచి అటవీ సందర్శనాన్ని ముందుంచారు. వాటిని చూస్తే నేను కూడ అలా వెళ్తున్నట్టు అనిపించింది. ఇలా అడవుల్లో క్యాంపింగ్ చేసే సదుపాయముంటుందని నాకింత వరకు తెలీదు. ఇక్కడం క్యాంపింగ్ టెంట్ చూసినప్పుడల్ల అనుకునే వాడిని ఒకటి కొని భారత్ తీసుకెళ్తే చక్కగా ఎంజాయ్ చెయ్యొచ్చని. ఇప్పుడు అక్కడే అన్నీ దొరుకుతున్నాయనుకుంట.

మీకు చిరుత ని ఫోటో తియ్యడానికి కుదర్లేద?

విహారి

తెలు'గోడు' unique speck చెప్పారు...

quite interesting! even i wish to go on a safari/jungle camp like that. awesomely described..

అనిల్ చీమలమఱ్ఱి చెప్పారు...

నాకు కుళ్ళుగా ఉంది...

cbrao చెప్పారు...

వ్యాసం బాగా లేదా? మీరు ఆ యాత్రలో లేరనే బాధా?

cbrao చెప్పారు...

ధన్య వాదాలు. మీరు చూడని అడవిని మీ కళ్ళెదుట సాక్షాత్కరింప చేయాలనే నా ప్రయత్నం సఫలమైందని భావిస్తాను.

అజ్ఞాత చెప్పారు...

Buy Binoculars If you need to buy binoculars you need this site.

కామెంట్‌ను పోస్ట్ చేయండి