మంగళవారం, జనవరి 16, 2007

పండగ నాడు కూడా పాత మొగుడేనా?

ఇది ఎక్కువమందికి తెలిసిన తెలుగు సామెత. కాని ఈ సామెత పుట్టు పూర్వోత్తరాలు మనలో ఎంతమందికి తెలుసు? ఈ సామెత వెనకున్న కథే ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కంచుకోత్సవం అనే పండగ జరిపే వారు. ఇందులో గ్రామం లోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే వారు. దీనిని మనం రవికల పండుగ అని కూడా పిలవవొచ్చు. కంచుకం అంటే రవిక అని అర్థం. ఆ పండగ నాటి సాయంత్రం గ్రామ స్త్రీ, పురుషులంతా ఒక చొట కలిసే వారు. సాధారణంగా ఇది గుడి ప్రాంగణంలోనో లేక బయటో ఉంటుంది. స్త్రీలంతా రవికలు విడిచి ఒక చోట గుట్టగా పోస్తారు. పురుషులు ఆ గుట్టలోంచి తలా ఒక రవికను గ్రహించి, ఆ రవికను ఎత్తిచూపుతూ, ఎవరిదీ రవిక అని అడుగుతూ ఆ రవిక స్వంత దారు ఎవరో కనుగునే ప్రయత్నం చేస్తారు. ఆ రవిక నాదే అంటూ వచ్చే స్త్రీకి, ఆ రవిక తెచ్చినవాడే, ఆ రాత్రికి రమణుడు. ఒక సారి ఒకతను ఇలానే రవికనెత్తి చూపుతూ ఎవరిదిది అంటూ కేకవేస్తె ఆ రవిక స్వంతదారు ముందుకొచ్చి నాదే అందట. ఆ రవిక తెచ్చిన వాడు దురదృష్టవశాత్తు ఆమె విభుడే అవటంతో ఆమె ' పండగ నాడు కూడా పాత మొగుడేనా ' అని నిట్టూర్చిందట.

ఈ విషయమై మరింత సమాచారం కోసం తాపీ ధర్మారావు గారి 'దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?' చదవండి.

27 కామెంట్‌లు:

రానారె చెప్పారు...

ఒక విధంగా ఇది పాశ్చాత్యుల WifeSwaping లాంటిదన్నమాట. దీని వెనకున్న పరమార్థమేమిటో, ఎందుకో ఈ పండగ?

Sriram చెప్పారు...

rao garu...i dont want to post here my opinion about that book. I read that book long ago.

But can we just think about the practicality of this story behid that "saameta".

the wording of the line looks pretty recent, in the sense that its post-nannayya language. is there any mention of such event in any of the literature we have? if that "ravikela panduga" was so popular that a "saameta" born out of it, how come no one heard of it? btw, is there any proof for this?

that book you mentioned has so many such dubious stories and things written with some hidden agenda.

ofcourse, each one to his view/opinion. i completely respect that. but to propagate dubious stories as if they are true is something that can be avoided.

Vissu చెప్పారు...

evaranna links istara aa source ki.

అజ్ఞాత చెప్పారు...

aa pustakam oka ardham pardham lEnidi...ee raatalu antakanna..

అజ్ఞాత చెప్పారు...

This is kind of ridiculous post. Looking at pictures of CB Rao, he seems to be a elderly person and writing these type of things in the blogs is not good for a person of his age.

This is my opinion, no one needs to agree with me and I don't care too. But ethically when standing in koodali, you should be a guide to other people, not distract them with ridiculous facts - atleast for the age group he is in.

cbrao చెప్పారు...

సాంప్రదాయాలు, కట్టు - బాట్లు, అలవాట్లు, మానవ పరిణామ క్రమంలో మారుతూ వస్తున్నాయి. ఒకనాటి సాంప్రదాయాలు, నేడు సభ్య సమాజం హర్షించదు. ద్రౌపదిని పతివ్రత అని ఆకాలంలో అన్నారు. ఈనాడు ఒక స్త్రీ ఐదుగురిని వివాహమాడితే, ఆమె పతివ్రత అని ఒప్పుకొంటామా? పెళ్ళికూతురిని బుట్టలో పెట్టి పెళ్ళి పీటల పైకి ఎందుకు తీసుకు వస్తున్నాము? పెళ్లికూతురు నడుముకు తాడు ఎందుకు కడుతున్నారు? మంగళసూత్రం వెనక కథేమిటి? పెళ్ళి అనే ప్రక్రియ పుట్టడానికి ముందు మానవ సంబంధాలు ఎలాగుండేవి? దేవదాసి వ్యవస్థ ఎలా, ఎందుకు వచ్చింది? హిందువులు అక్క కూతురుని చేసుకుంటారు. మహమ్మదీయులకు అది కాని వరస. చరిత్ర చదివి కలవరం చెందరాదు. కాల మాన పరిస్తితులను బట్టి నీతి నియమావళి నిరంతరం మారుతూనె ఉంది. ఎన్నో చారిత్రాత్మక అంశాలున్నాయి. వాటి గురించి రాసే స్థలం కాదిది. మీ సందేహాలకు సమాధానాలు ' పెళ్ళి దాని పుట్టుపొర్వొత్తరాలు ‘, ' దేవాలయాల పై బూతు బొమ్మలెందుకు? ‘-తాపీ ధర్మరావు గారు రాసిన పుస్తకాలలో లభ్యమవుతాయి.

అజ్ఞాత చెప్పారు...

Looking at the trend of this blog, it appears that this elderly man is needing attention which he might be deprived of for some reason and posting some useless stuff.

This post in particular is kind of over the board. Ravikala Panduga is all bogus as some of tapi dharma rao's books are.

He could have opened an adult blog instead and could have posted this stuff there. And all useless fellows who always ponder for this kind of stuff would have enjoyed the same post along with Mr Rao.

This is just a opinion of difference. He can continue the same kind of posts to be published since this is his personal diary and people will know what they will face when they meet him in person.

Thanks for keeping the comments open letting me write this opinion though.

Kiran Chennabattula

oremuna చెప్పారు...

sumanth Reddy gaaru,

>>This is kind of ridiculous post.

This is not cb Rao gaari theory. This is from a book. how can this post be ridiculous? In case you don't agree with the content you need to give counter examples and proove that it is ridiculous (read not the post, but the content);

# aMtE kaanI idaMtaa pratipaxaala vaaLLa kuTra annaTTu, idaMtaa raamOjI raavu kuTra annaTTu maaTaaDitE elaa? #

>> he seems to be a elderly person and writing these type of things in the blogs is not good for a person of his age

Personally I don't see any reason not writing this in his blog. idEmannaa bootu kathaa?

can you give us more details why he should not write this?

I strongly believe he has that freedome.

>> This is my opinion, no one needs to agree with me and I don't care too.

__ that't a cool way of escaping a reply :) __

>> But ethically when standing in koodali,

There are no rules for koodali. we don't blog to put them in koodali. Koodali is just a tool, so that you can read them easily. any rss feed can do it. But blogging is different. It is personal.

>> not distract them with ridiculous facts

Hope to see a blog from you how ridiculous is this book, not this blog.

>> atleast for the age group he is in.



AGain I don't see anything wrong putting it here, But I have freedom to see the wrong in the content.

-------
Kiran gaaru,

>> Looking at the trend of this blog, it appears that this elderly man is needing attention which he might be deprived of for some reason and posting some useless stuff.


I personally know he has lot of attention other than this blog. As a blogger he has every right to putup about the book he is currently reading.

>> This post in particular is kind of over the board. Ravikala Panduga is all bogus as some of tapi dharma rao's books are.

Interested to know more facts about how this book is bogus, I mean it.

>>This is just a opinion of difference.

I agree. But you are missing link, this is not his opinion, this is from a book. I wish to see blog posts / comments from you guys about that book.

oremuna చెప్పారు...

Sriraam gaaru,

#saametalu padaalu maaravaccu arthamu nilabeDutU

#

Do you have any meaning about this saameta? which I believe is so popular in Telugu land.

చదువరి చెప్పారు...

ఈ జాబులో అంత అభ్యంతరకరమైనది, రాయకూడనిది, నాకేమీ కనిపించలేదు. ఆయన రాసినది తప్పైతే ఆ సంగతి రాయొచ్చు కానీ, ఇదేంటిది.. బ్లాగరి గురించి వ్యాఖ్యలు రాస్తారేమిటి? అలా రాయడమూ తప్పే, రాసినదీ (గుర్తింపు కోరుకుంటున్నారనడం.. వగైరా) తప్పే! అనుచితమైన విమర్శలు ఇవి.

Sriram చెప్పారు...

i am glad to see fellow bloggers chipping in when unwanted personal attacks are made on the blogger. Keep up the spirit!

Kiran gAru,
meeru cheppinadi naaku correct anipinchatledu. may be i will write a post on this sometime in my blog. i dont want to mess this place up. i think i made my point clear in my first comment.

Sriram చెప్పారు...

rao gaaru, inkokka vishayam...
draUpadi was an exception even in her time. there was a big discussion before the marriage and lord krishna had to convince and make that happen.
so it was not a 'saampradaayam' even in that time.

in hindu society, from time immemorial, for a family lady, chastity was supreme and she was bound by the institute called marriage. whether this was fair, as men had different rules, is a totally different topic, lets not get into it.

given this context, i found this story very unrealistic.

cbrao చెప్పారు...

Sriram -"that book you mentioned has so many such dubious stories and things written with some hidden agenda."
Is there any proof that the stories mentioned in the book are dubious?
What is the hidden agenda? I will be glad if you can enlighten me on these points.

Sriram చెప్పారు...

"Is there any proof that the stories mentioned in the book are dubious?"

same question from me also ...is there any reliable proof for these stories. thats why i call them dubious. not at all realistic.

Just look at the statement you made. you said polyandry was 'saampradaayam' in mahabharatam times. now isnt that a false statement...its just taking things out of context and misquoting facts. similar case for those stories also.

and about hidden agenda. no, i dont want to say anything on that and rake up a hornet's nest. i take my words back if you want. my apologies.

అజ్ఞాత చెప్పారు...

hmm! a long chain of comments, complaints and arguments. The topic is such ofcourse.
Pls don't blame the person when something he just reproduces does not suit your values.
Using words like "Useless fellows" in comments etc. is objectionable.

వెంకట రమణ చెప్పారు...

Sumanth Reddy మరియు Kiran Chennabattula గార్లకు,

మీకు ఈసమాచారం తప్పనిపిస్తే ఎందుకు అలా అనిపించిందో వివరించాలి గాని, ఇలా బ్లాగరి మీద వ్యక్తిగత ఆరోపణలు చెయ్యడం పద్దతి కాదు. ఇది రావుగారి సొంత బ్లాగు కాబట్టి ఆయన ఇష్టమెచ్చిన ఏ విషయం గురించైనా వ్రాసే హక్కు ఆయనకుంది.

cbrao చెప్పారు...

శ్రీరాం - తాపీ ధర్మారావు గారు తాను రాసిన దానికి ఆధారాలు తన పుస్తకంలో ఇచ్చారు. బహుభర్తుత్వం సాంప్రదాయమని కాదు, నేను రాసినదానికి అర్థం. నేను రాసాను ద్రౌపది పతివ్రత అని. బెంగళూరు సమావేశంలో చర్చిద్దాము మీకు ఆసక్తి ఉంటే.

స్వాతి,వెంకట రమణ - విమర్శ చెయ్యాలి; అవసరమే. అయితే అది వ్యాసంలోని అంశాలపైనే కాని వ్యక్తి దూషణ తగదు. telugupeople.com లో వ్యక్తి దూషణ ఎక్కువ వున్నట్లుగా అక్కడి సభ్యులు చెప్పారు.ఈ దుస్సాంప్రదాయం మన కూడలికి కూడా వచ్చింది.మీలాంటి సహృదయులు వ్యక్తి దూషణలను ఖండించంటం ఆశా జనకంగా ఉంది. వీవెన్ మౌనంగా ఉన్నారేమిటి?

Sriram చెప్పారు...

"ఒకనాటి సాంప్రదాయాలు, నేడు సభ్య సమాజం హర్షించదు. ద్రౌపదిని పతివ్రత అని ఆకాలంలో అన్నారు. ఈనాడు ఒక స్త్రీ ఐదుగురిని వివాహమాడితే, ఆమె పతివ్రత అని ఒప్పుకొంటామా?"

ఈ వాక్యం చదివితే నాకు అనిపించింది ఏమిటంటే ఆ కాలంలో అది సంప్రదాయం కాబట్టి ఆమెని పతివ్రత అన్నారని. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లోది సభ్య సమాజం కాదని మీ అభిప్రాయం అని కూడా అనిపించింది. అందుకే అలా రాసాను.

ఏమైతేనేం, ఇక్కడ ఇంతటితో ఆపుదాం. తప్పక సమావేశంలో చర్చిద్దాం. ఆశక్తి చాలా ఉంది, శక్తి ఉందో లేదో తెలీదు :)

Sujata M చెప్పారు...

Good! Interesting Comments. Its anthropolgy!

అజ్ఞాత చెప్పారు...

Ravikala panduga type celebrations are common still in Sub Saharan Affrican Tribes. Recently I had watched a documentory in PBS channel, that reminded me of Ravikala panduga.

Cultural Values change over time. I am not surprised when I see some of the youth laugh at the pactice of "Gobbemmalu"...

-Prasad

cbrao చెప్పారు...

@Prasad Y: "పండగ నాడు కూడా పాత మొగుడేనా?" వ్యాసాన్ని దీప్తిధార లో ప్రచురించినప్పుడు పాఠకులు విస్మయానికి లోనయ్యారు. చాలమంది నమ్మలేదు. శివరాత్రినాడు రాత్రంతా జాగారం చేస్తూ, శివాలయం లోపల ఆడ, మగ భక్తులు ఏమి చేసేవారో రాయలేదు అప్పుడు. రాస్తే అర్థం చేసుకునే maturity కి మన యువ పాఠకులు ఇంకా వచ్చినట్లగుపించదు.

అజ్ఞాత చెప్పారు...

శ్రీరామ్ గారు రాసిన ఒక అంశాన్ని గంభీరంగా పట్టించుకోక తప్పదు.

౧. ఈ సామెతలోని తెలుగు భాషాశైలి ప్రాచీనమైనది కాదు. ఇది బహు ఇటీవలి శైలి. అందులోను ఒక ప్రత్యేక మాండలికానికి చెందినదిగా తోస్తున్నది. కానీ ఇటీవలి ఆంధ్రదేశ చరిత్రలో (అనగా గత వెయ్యేళ్ళ కాలంలో) ఇటువంటి స్వేచ్ఛాసమాజాలేవీ మనలో ఉన్నట్లు దాఖలాలు కనిపించడం లేదు. మన దృష్టికి ఏ చరిత్రకారుడూ తేలేదు. పైగా ఈ సామెతకి యావద్ ఆంధ్రదేశంలోను ప్రాచుర్యం ఉన్నట్లు కనిపించడంలేదు.

౨. అటువంటప్పుడు ఈ సామెతని ఏ సందర్భంలో వాడతారనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ సందర్భానికీ ఈ సామెతకీ సంబంధం ఉందా ? అంటే ఈ సామెత నిజంగా లైంగికార్థం (sexual connotation) కలిగినదేనా ? కాదా ? లేదా, లైంగికార్థం ఉందని మనం అనవసరంగా భ్రమిస్తున్నామా ? (వాస్తవానికి దీనికి ఆ విధమైన లైంగికార్థం ఉన్నట్లు తాపీ ధర్మారావుగారు రాసేదాకా ఎవరూ అలా అనుకోలేదు)

౩. ప్రతి సామెతకీ ఒక అసాంప్రదాయికమైన లైంగికార్థాన్ని ఆపాదించే పక్షంలో
"అమ్మన్న అమ్మకు మొగుడు, తిమ్మన్న తల్లికి మొగుడు" మొదలైన సామెతలక్కూడా అలాంటి అర్థాలు చెప్పుకుందామా ? అలా మనం చెప్పుకుంటే సరిపోతుందా ? ఆ భాష్యానికి చారిత్రిక, సాహిత్యక ఆధారాలేమీ ఉండాల్సిన అవసరం లేదా ?

౪. నీతులూ, ధర్మాలూ దేశకాలానుగుణంగా మారతాయనేది నిజమే. కానీ గడిచిన ౧,౫౦౦ సం||లుగా ఈ గడ్డ మీద అవి మఱీ అంత నాటకీయంగా మారిపోయినట్లు కనిపించడంలేదు.

అజ్ఞాత చెప్పారు...

సిబిరావు కి మద్దతుగా పరుగెత్తుకొచ్చిన బ్లాగర్లంతా అనవసరంగా మహిళా బ్లాగర్ల మీద విరుచుకు పడి అసభ్య అశ్లీల రాతలు రాస్తోన్న ముష్కరుల పాలిట ఏమైపోయారో?

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత: అలా పరుగెత్తుకు వచ్చింది నేనే! ఇవ్వాళ ఈ జాబు చూసాక నాకూ మీరన్నదే అనిపించింది. ఇవ్వాళ్టి దాడులతో పోల్చితే, అప్పుడు ఇక్కడ రాసింది అసలు లెక్కలోదే కాదు. మీరు నన్నన్నమాట సరైనదే!

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత గారి చలువ వల్ల ఈ పోస్తు చదివే మహాభాగ్యం కలిగింది... ఒకసారి రావు మహాశయుడి బ్లాగంతా చదవాలేమో.. చాలా జ్ఞాన గుళికలు మిస్సయ్యాము. చదివిన తర్వాత రావు గారి మీద జుగుప్స ఎక్కువయ్యింది.

"మందీ ఒక బ్రతుకేనా కుక్కల వలె, నక్కల వలె సందులలో పందులవలె" గుర్తుకొస్తోంది!!

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి ప్రతి చెత్త విషయాన్ని అవసరం ఉన్నా లేకున్నా అనవసరం గా వెనకేసుకుని రావడం వల్ల. రావు ఏదో వాగాడు, ఎవరో దానికి కోపంగా ప్రతిస్పందిచారు, విషయాన్ని వదిలేసి ఇలాంటి వాటిని డిఫెండ్ చేయటం వల్లనే ఈరోజు బ్లాగుల్లో ఈ విష సంస్కృతి.

ఆడవాళ్ళ మీద అనామకంగా ఉంటూ అసభ్య రాతలు రాసే మతిలేని వెధవలకు ఎలాంటి excuse లేదు. చెత్తగాళ్ళు. కానీ అందరితో మంచిగా మెలగాలనుకునే వాళ్ళూ, ప్రశాంతం గా బ్లాగులు రాసుకుంటూ సహజం గా స్పందిచే వాళ్ళూ కూడా చాలా మంది అసంతృప్తి తో ఉన్నారు. దీనికి కారణం ఇలాంటి incidents వెనకేసుకుని రావడమే.

కొత్తపాళీ మొదటరోజే చెబుతాడు మీరు బ్లాగుల్లో ఎలా మసలుకోవాలో. చెప్పడానికి ఎవ్వరాయన? సుజాత గారు తనకు నచ్చని వాళ్ళు వ్యాఖ్య రాస్తే తరిమేస్తారు. ఒకరినొకరు సంప్రదించుకుని ఎగతాళి చేస్తారు. ఆవిడ కు మిగతా వాళ్లతో పని ఏమిటి? ఇలా చెయ్యడం తప్పు కద, ఎదుటి వారు బాధ పడతారు కదా? ఎవరు ఏమి రాసిన కొత్తపళీ వెళ్ళి ఒకటో రెండో అనవసరమైన మాటలు అంటాడు. ఆయన ఎవరికి గొప్ప? పోనీ జ్ఞాన సంపన్నుడా అదీ కాదాయె? నాలాంటోడు అయితే పోనీలే అని నవ్వుకుని వదిలేస్తాడు, కొంచెం కాలితే "నువ్వెడు బెయ్" అని అంటారు. ఇంకా కొంతమంది మూర్ఖులు కొత్తగా బ్లాగులు మొదలెట్టి తిట్టడం మొదలెదతారు(దీన్ని నేను సమర్థించను). ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ బ్లాగును వ్యాపకం గా అభిరుచి గా కాకుండ మూర్ఖత్వాన్నీ అహాన్నీ తృప్తి పరచుకునే మానసిక వ్యాపారంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సమూహాలలో ఎలా మసలుకోవాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు.

చదువరి గారు ఇలాంటి విష సంస్కృతిని ఎక్కడ చూస్తే అక్కడ ప్రశ్నించండి సమర్థులైన వారు కాబట్టే మీకీ సలహా. అప్పుడు మనస్తాపాలూ, గొడవలూ ఉండవు. ఆటవిక దాడులు చేసే కాగడా కుక్కలని జనం తమంతట తామే తరిమికొడుతుంది. ఛీత్కరిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

ఆరుద్ర గారు వ్రాసిన "గుడిలో సెక్స్" అనే పుస్తకం కూడా చదవండి. మత గ్రంథాలలో ఉన్న అశ్లీలత గురించి మరింత తెలుస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి