మంగళవారం, జనవరి 09, 2007

సంక్రాంతి కానుక

పాపాయి పుట్టింది - పాప పేరు - ఈతెలుగు.ఆర్గ్ (org)


Click on photo to enlarge

తెలుగు బ్లాగరుల సమావేశం జనవరి 7, 2007 న హైదరాబాదు కేంద్రియ విశ్వవిద్యాలయావరణలో జరిగింది. ఎప్పటిలా కాకుండా, డిసెంబర్ మాసపు ప్రతిపాదనలు తెలుసుకొన్న మిత్రులు, దగ్గర, దూరం నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. నూతన సంవత్సరపు తొలి సమావేశం చారిత్రాత్మకంగా నిలిచిపోగలదు.

చావా కిరణ్ తెలుగు బ్లాగు అనే విత్తనం నాటితే, వెంకట రమణ నీళ్లు పోశాడు. మొలిచిన మొక్కకు పాదు చేసి నీరు, వెలుతురు సమృద్ధి గా అందేట్లు చేసింది వీవెన్, నిద్రలో లేపినా తెలుగు అని పలవరించే కిరణ్ (Veetel). వీరు కాక కంప్యూటర్లో తెలుగు అక్షరాల వృద్ధికి పాటు పడిన అక్షర శిల్పులు,బాషా ఇండియా పురస్కార గ్రహీతలు, నూరు బ్లాగుల అందగాడు సుధాకర్,చక్కటి తెలుగు బ్లాగులు మనకు నిత్యం అందిస్తున్న తెలుగు మిత్రులు, ఇంక ఎందరో మహాను భావులు, అందరికీ వందనాలు.

ఈ సందర్భంలో దిసెంబర్ 2004 లో మొదలయిన తెలుగు విజ్ఞాన సర్వస్వం వికిపిడియా నిర్మాణానికి దోహదపడిన మిత్రులగురించి రెండు ముక్కలు చెప్పుకుందాము. వెన్న నాగార్జున ఆధ్వర్యం లో మొదలయిన ఈ విజ్ఞాన సేద్యం చావా కిరణ్, త్రివిక్రం, దాట్ల శ్రీనివాస రాజు, G.S.నవీన్, మాకినేని ప్రదీపు, T.సుజాత,వివిన మూర్తి,చిట్టెల కామేష్,వర్మ దాట్ల,కాజ సుధాకర్ బాబు మొదలగు కృషీవలురు దుక్కి దున్ని తే, వచ్చిన ఫలసాయాన్ని మనకు అందిస్తున్నారు వైజాసత్య, చదువరి. గతంలో ఎంతో చురుకుగా పనిచేసిన, ఇప్పుడు పనిచేస్తున్న వారందరికీ వందనాలు. ఈ నిత్య కృషీవలురు మన తెలుగు వికిపిడియా కు మరింత శోభ తీసుకు వస్తారని ఆశిద్దాం.


Click on photo to enlarge
Members with gifts – Left to right – Trivikram, Sriharsha, Veeven, Chaduvari, cbrao, Venkata Ramana, Chandra Sekhar, Srinivasa Raju and Kashyap

సమావేశం ఆరంభమవుతూనే అందరికీ చదువరి అంద చేశారు నూతన సంవత్సర కాలెండర్లు. ఉచిత పుస్తక ముద్రణ లో మనకు సాయ పడిన మురళీధర్ గారి సౌజన్యంతో. అవి మురళీధర్ గారి travel agency calendars. తరువాత సుధాకర్ అందరికీ అంద చేశారు ఒక అందమైన బంతే కాక visiting card holder ను. బంతులు అందాయి http://www.mugh.net/ వారి సౌజన్యంతో.ఈ బంతులతో exercise చేస్తే మన చేతి వేళ్లు ఉంటాయి మంచి working condition లో.ఇక అందరికీ శీతల పానీ యాలు అందాయి సి.బి.రావు సౌజన్యంతో.


Click on photo to enlarge
Let us go to peacock lake


Click on photo to enlarge
Medium Egrets

హైదరాబాదు కేంద్రియ విశ్వవిద్యాలయావరణలో balancing rocks, peacock lake, lotus lake వగైరా సుందరమైన ప్రదేశాలున్నాయి. తొలి కలయిక తర్వాత అందరం బయలు దేరాము నెమళ్ళ సరస్సు దగ్గరికి. నెమలి కనిపించలేదు కాని సరస్సులో కొన్ని Median Egrets తెల్ల కొంగలు, Bronze-winged Jacana, Little Cormorants నీటి కాకులు కనిపించాయి.


Click on photo to enlarge
Bronze – winged Jacana


Click on photo to enlarge
Little cormorants on the lake

సరస్సుకావల కనిపించిది sports complex దూరంగా.


Click on photo to enlarge
Sports complex –behind the campus of University of Hyderabad

సరస్సు కనిపిస్తూ ఉండే ఎత్తైన కొండ రాయిపై అందరం ఆసీనులమై కబుర్ల లో పడ్డాము. కాశ్యప్ కొత్త నినాదం - 'తెలుగు బ్లాగులు చదవొద్దు,వినండీ’ అని. వివరాలకు చూడండి http://kaburlu.wordpress.com/2007/01/07/13/


Click on photo to enlarge
Left to right 1st row Kashyap, sudhakar
2nd row Chandrasekhar, Chaduvari, Sriharsha, Veeven
3rs row Srinivasa Raju, Venkata ramana, Trivikram

చదువరి అభ్యర్ధనపై సి.బి.రావ్ వివరించారు తెలుగు బ్లాగరుల ఐక్యత వలన కలిగే లాభాలు. మన సభ్యులు ఎవరిని కలిసి తెలుగు బ్లాగులు, వికిపిడీ గురించి చెప్పబోయిన ప్రతిసారీ, వారిని వారు పరిచయం చేసుకునే సందర్భంలో 'identity crisis' వస్తూ ఉంది. మనము సంఘము ఏర్పర్చుకుని ఉంటే ఈ సమస్య రాదు కదా. ఇక సంఘంగా ఏర్పడ్డాక మన ప్రధాన గమ్యాలు ఇవిగో.

1) కంప్యూటర్లో తెలుగు వాడకానికై చేయూత.
2) తెలుగు బ్లాగుల అభివృద్ధికై కృషి.
3) తెలుగు వికిపిడియ గురించి నలుగురికి చెప్పటం, కొత్త సభ్యులకై కృషి, విస్తృత పరచటం.

చీకటి పడబోతుంది, చుట్టూ ఉన్న చెట్ల పొదల్లోంచి పాములు బయటకు వచ్చే వేళవటంతో, సమావేశ స్థలిని అల్పాహారశాల కు మార్చాము. సి.బి.రావు సభ్యులకు సంఘ నియమావళి గురించి వివరించాక కార్యనిర్వాహక సభ్యుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. తనను సంఘ అధ్యక్షుడిగా ఉండమన్న అభ్యర్ధనకు సి.బి.రావు జవాబిస్తూ తాను అప్పటికే చాల సంఘాలలో ముఖ్య పదవుల్లో వుండటం వలన, ఇంకేమి పదవులు వద్దనీ, సంఘానికి అవసరమైన పనులు చేయటానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఆ తదుపరి జరిగిన ఎకగ్రీవ ఎన్నికలలో ఎన్నుకున్న వారి వివరాలివి.

అద్యక్షుడు శిరీష్ కుమార్
ఉపాధ్యక్షుడు త్రివిక్రం
కార్యదర్శి సుధాకర్
కోశాధికారి వెంకట రమణ
కార్యనిర్వాహక సభ్యులు
వీవెన్
సి.బి.రావ్
శ్రీహర్ష
కాష్యప్

కొత్త సంఘమునకు ఈతెలుగు.ఆర్గ్ అనే పేరు సముచితముగా ఉండగలదని,సమావేశానికి హాజరైన వారు అభిప్రాయ పడ్దారు. ఇందులో చేరుటకు అభిలషించు వారు ప్రవేశ పత్రాన్ని నింపి కార్యదర్శికి దరఖాస్తు చేసు కోవాలి. ప్రవేశ రుసుము నిర్ణయింప బడలేదు. Rs.500/- ప్రవేశ రుసుము సముచితంగా ఉండగలదని భవదీయుని అభిప్రాయము. సభ్యుల రచనలతో ఆకర్షణీయమైన పుస్తకమచ్చు వెయ్యవలెననే ప్రణాళిక గలదు. మన సంఘము పేరు మీకు నచ్చగలదని ఆశ. సంఘ నియమావళి తయారు చేసే పని సభ్యులు సి.బి.రావ్ కు అప్పచెప్పారు. పది రోజుల్లో నియమావళి (Bye-laws) తయారు కాగలదని అంచనా. మరి ఇక్కడి మన కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. etelugu.org తరపున మీ అందరకూ సంక్రాంతి శుభాకాంషలు.

Text & Photos: cbrao

4 కామెంట్‌లు:

స్వేచ్ఛా విహంగం చెప్పారు...

తెలుగు వెలుగుల కోసం క్రుషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. సభ్యుడి గా చేరటానికి నేను సిధ్ధం

Bhasker చెప్పారు...

తెలుగులొ కొత్తగా బ్లాగులు మొదలు పెట్టే వాళ్ళకు మీరందించే ప్రొత్సాహం, సహాయం అభినందనీయం.
నేను కూడ సభ్యుడి గా చేరాలనుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

రావ్ గారూ,

ఈ సారి ఇంకో మంచి వార్త చెప్పారు.

ప్రియమైన కార్య వర్గ సభ్యులారా,

కార్యవర్గ సభ్యులందరికి పేరు పేరునా అభినందనలు.

మీ భుజాల మీదికి ఎంతో బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని ఎత్తుకున్నందుకు ఎంతో సంతోషంగా వుంది. మన తెలుగు భాషకు మీరు చేస్తున్న కృషి ఎంతో మందికి ఆదర్శమయ్యేలా ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకుపోగలరని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న ఉత్సాహాన్నే ఇలాగే కొనసాగిస్తూ మున్ముంది వచ్చే అడ్డంకులనన్నీ అధిగమిస్తూ ముందుకు సాగి పోగలరని అభిలాషిస్తున్నాను. వ్యక్తులు గా వున్నప్పుడు మన మనుకున్నది అనుకున్నట్లు చెయ్యవచ్చు. కానీ సమిష్టి గా వున్నప్పుడు మరింత జాగరూకతతో వ్యవహరించ వలసి వుంటుంది. ఎందుకంటే మన గమ్యమమొకటే అయిన చేరుకునే మార్గాల్లో కొంత వ్యత్యాసముంటుంది. క్షమించాలి ఇంకా ఆ సంఘం లో సభ్యుడు కాకుండా కొంచెం చనువు తీసుకుని చెప్పినందుకు.

మీకెటువంటి సాయం కావాలన్నే చెప్పండి తప్పకుండ చేస్తాను. ఇప్పటికే అమెరికా లో పెద్ద తెలుగు సంఘాలయిన TANA, ATA లు తెలుగు కు రాబోయే ప్రమాదాన్ని పసికట్టి చర్యలు తీసుకునే దిశ గా ప్రయత్నాలు మొదలు పెట్టారు. నాకు తెలిసిన పరిధి లో చెపుతున్న విషయాలు ఇవి. ఇంకా ఎంతో చెప్పాలని వుంది ఇది సమయం కాదేమోనని చెప్పడం లేదు. అన్యధా భావించకండి.

etelugu.org నిన్ననే నమోదుకావించ బడింది. ఇది మన బ్లాగర్ల సభ్యులెవరో చేసి వుంటారని అనుకుంటున్నాను.

సభ్యత్వ విశేషాలతో తొందరగా వస్తారని ఆశిస్తూ.

విహారి.
http://vihaari.blogspot.com

Pandu చెప్పారు...

చాలా మంచి పని చేశారండి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి