శనివారం, జనవరి 06, 2007

స్పానిష్ మిత్రుడుఈ రోజు మీకు ఒక మంచి Spanish photo blog ను పరిచయం చేస్తాను. నాకు ఈ స్పానిష్ బ్లాగు ఎలా తెలిసింది అనే కుతూహలం మీలో ఉండటం సహజం. దాని వెనక ఉన్న చిన్న కథే ఇది. నేను ఈ మధ్య రాసిన అడవిలో అర్థరాత్రి అనే వ్యాసానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. దాదాపుగా 50 hits per day వచ్చాయి. నిన్న నా mail box చూస్తుంటే Spain blogger Joan González అడవిలో అర్థరాత్రి వ్యాసంపై తను రాసిన వ్యాఖ్య నన్నాకర్షించింది. అతని వ్యాఖ్య 'bonitas fotos salut joan' చూడగానే బెంబేలెత్తిపోయా. మెచ్చుకుంటూ రాశాడా, చిత్రాలు బాగా లేవని రాశాడా, లేక ఇంకేమైనా రాశాడా? అని కుతూహలం కలిగింది. కాని నాకు Spanish language రాదే, ఎలా అని ఆలోచన లో పడ్డాను. అలా మేధొమధనం జరుగుతుండగా ప్రత్యక్షమంది Google. అంతే కాదు నాకు గూగులోపదేశం చేశింది.
స్పానిష్ రాదనీ దిగులు చెందకూ,
పక్షికెవరు ఎగుర నేర్పిరి ,
చేపకెవరు ఈత నేర్పిరి,
మనిషికెవరు మాప్స్ Maps నేర్పిరి,
నేనున్నానని, నీ తోడుంటానని,
అని అన్నదీ నా గూగుల్,
ఇచ్చిందీ అభయహస్తం.

అంటూ Google language tools నాకు ప్రసాదించింది. ఇదుగొ అది - మీ ముందు.
http://translate.google.com/translate_t

ఈ Google launguage tool సహయం తో అతను రాసింది స్పానిష్ నుంచి ఆంగ్లం లోకి అనువదిస్తే ఇలా వచ్చింది.
Original text: Automatically translated text:
bonitas fotos salut joan pretty photos salut Joan

అమ్మయ్య చాయా చిత్రాలు బాగా ఉన్నాయని రాశాడని గ్రహించాక మనసుకు ఊరట కలిగింది. Joan González ఇచ్చిన లింక్ తో అతని బ్లాగుకు వెళ్లాను. ఆశ్చర్యం - అద్భుతమైన చాయా చిత్రాలు కనిపించాయి, ఆ బ్లాగులో. కుతూహలంతో అతని profile చూస్తే ఇలా కనిపించింది.

About Me

Vive y deja vivir

Interests
•Montaña
•Naturaleza
•Viajar

మరలా Google translator సహయంతో వీటి అర్థం తెలుసుకున్నా.

About Me

Vive y deja vivir it lives and it lets live

Interests
•Montaña • Mountain
•Naturaleza • Nature
•Viajar • Viajar


Google translation perfect కాదు. ఒక rough idea మాత్రం మనకు దొరుకుతుంది. Viajar అనే పదానికి గూగుల్ అనువాదం చెయ్యలేక పొయ్యింది. బహుశా ఇది voyager అనే పదం కావచ్చు. Spanish to english dictionary –
http://www.spanishdict.com/AS.cfm?e=Viajar+
సాయంతో (ఇది కూడ google search లో తెలుసుకొన్నా) దీని అర్థం కనుక్కున్నా.

Spanish Word English Word
viajar to travel

గూగుల్ చేసిన సాయంతో కృతజ్ఞతగా పాడుకున్నా 'అంతా గూగుల్ మయం' అని. సరే, ఇక ఆ బ్లాగరి చిరునామా ఇదిగో.
http://j-gonzalez.blogspot.com/

ఇందులోని చక్కటి చిత్రాలు మీరూ చూసి ఆనందించండి. మీకూ నచ్చితే,అతనిని అభినందిస్తూ ఒక జాబు Spanish లో ఎలా రాయాలో ఇప్పుడు మీకు తెలుసు.

1 వ్యాఖ్య:

నాగరాజు చెప్పారు...

చాలా పరిశోధనాత్మకంగా ఉందీ టపా... gracias.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి