బుధవారం, అక్టోబర్ 03, 2007
తెలుగుబ్లాగు చరిత్ర -2
ఈ విషయంపై, నా మొదటి టపా చదవని వారు దానిని ఇక్కడ http://deeptidhaara.blogspot.com/2007/05/blog-post_21.html చదవవొచ్చు.మీకు తెలుసా,ఘనత వహించిన బ్రిటీష్ రాజ్యానికి లిఖిత రాజ్యాంగం లేదని? తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో? తాజ్‌మహల్ మార్పు చెందిన ఒక హిందూ కట్టడమని? తిరుమల(తిరుపతి) 250 కోట్ల సంవత్సరాల క్రితం నీళ్లలో ఉండేదని? సముద్రంలో పెరిగే మొక్కలు కొన్ని, తిరుమల కొండల పై పెరుగుతున్నాయని? తిరుమల కొండపై గల ఈ మొక్కలు అక్కడ ఎలా వచ్చాయంటే, ఆ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదన్న చరిత్ర తెలియక పోతే, ఎలా బదులివ్వగలరు?
1493 లో ఉత్తర అమెరికా లో కాలిడిన క్రిస్టాఫర్ కొలొంబస్ తరువాతే అమెరికా చరిత్ర మొదలయ్యింది. అంతకు క్రితం అక్కడే ఉంటున్న తెగలవారిని కొలొంబస్ ఇండియన్స్ గా భావించాడు. అమెరికానే హిందూ దేశం గా కొలొంబస్ పొరబడటం వలన అమెరికా లో తెగలవారు ఇండియన్స్ గా గుర్తించబడ్డారు. కొలొంబస్ ముందు అమెరికా చరిత్ర అతి కొద్దిగా నమోదయ్యింది. ఈ 500 సంవత్సరాలు గానే అమెరికా చరిత్ర ఉంది. ఈ నేపధ్యంలో ఈ మధ్యనే మొదలయిన,చారిత్రాత్మక విషయాలను మనకు వివరించే ఈ తెలుగు బ్లాగు చూడండి.
http://theuntoldhistory.blogspot.com/
చరిత్ర ఒక సారి రాస్తే అయ్యేది కాదు. ఇది నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది.దీనికి భారత దేశ చరిత్రే ఒక ఉదాహరణ.స్వాతంత్ర్యం వచ్చిందాకా భారత దేశ చరిత్ర రాస్తే సరిపోతుందా? ఆ తరువాత చరిత్ర లేదా? తెలుగు బ్లాగుల చరిత్ర ఇప్పటి దాకా ఉన్నది సరిపోతుందా? తెలుగుబ్లాగు మొదట ఉన్నట్లుగానే ఇప్పుడు ఉందా? భవిష్యత్ లో కూడా ఇలాగే ఉంటుందా? మనం ఊహించే దానికన్నా తలదన్నే మార్పులు వస్తాయి. ఈ చరిత్ర మనం పదిలం గా సంరక్షించు కోపోతే, చరిత్ర హీనులము కామా?
తెలుగుబ్లాగు చరిత్ర విషయాలకై మీకు
1)కొత్త గుంపు కావాలా?
2) చరిత్ర లేకపోతే, తరువాత వారికి మన బ్లాగు చరిత్ర ఎలా తెలుస్తోంది? తెలుగు బ్లాగు గుంపు లోనే ఈ విషయాలు నమోదు చేద్దాము.
3) ఈ చరిత్ర వలన ఏమిటి ఉపయోగం? తెలుగు బ్లాగు గుంపులో రాయవద్దు. ఇంకెక్కడా అవసరం లేదు.
4) కొత్త బ్లాగు ప్రారంభించి, అందులో తెలుగు బ్లాగుల చరిత్ర రాద్దాము.
మీ అభిప్రాయాలు తెలియ చేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
14 కామెంట్‌లు:
4) కొత్త బ్లాగు ప్రారంభించి అందులో తెలుగు బ్లాగుల చరిత్ర రాయండి.
నా ఎంపిక 4.
చరిత్ర సృష్టించడం ఎంత అవసరమో, చరిత్రను వ్రాసి భద్రపరచటం అంతే అవసరం. అయితే అది కేవలం గణాంకాలకే పరిమితం కాకపోతే బాగుంటుంది. నా ఎంపిక కూడా 4)
నా ఓటు కూడా కొత్త బ్లాగుకే.
చరిత్ర విలువైనదే! అందుకే ఒక కొత్త/ప్రత్యేక బ్లాగులో దానిని నిక్షిప్తం చేయండి.
2,4
నా ఓటు కూడా (4) కే....
నా ఎంపిక 4.
నా నెంబెర్ నాలుగు
3
అసలు బ్లాగులు అనేవి ఒకరకమయిన తెలుగు వెబ్లు. వాటికి చరిత్ర రాయటమేంటి. మొదటి తెలుగు బ్లాగేదో మీకు తెలుసా? లేదా మీరనుకునేదే మొదటి బ్లాగా?
ఇలా అనవసరమనుకొనే మన చరిత్రకు ఫరిస్తా, న్యూనిజ్, హ్యూయన్ త్సాంగ్, మెగస్తనీస్, మార్కోపోలో, అబ్దుల్ రిజాక్ వంటివారు పెద్దదిక్కయ్యారు.
చరిత్ర ఉండాల్సిందే. కానీ దానికి మరో బ్లాగు అవసరమా!!? ఈతెలుగు.ఆర్గ్ లో రాస్తే పోలా. దానికది సరైన వేదికేగా!
తెలుగుబ్లాగు చరిత్ర చర్చలు ఎక్కడ చెయ్యాలి? e.telugu.org చూసేవాళ్లు తక్కువ . ఎక్కువ మందికి చర్చలు ఎలా చేరాలి?
తెలుగు బ్లాగు అనుబంధ లక్ష్యాలలో,తెలుగుబ్లాగు చరిత్ర కలపడం వలన వచ్చే నష్టాలేమిటి?
నామటుకు నేను ఎప్పుడూ కూడలి వ్యాఖ్యలను పట్టుకొని వ్యాసాలలోకి వెళుతుంటాను. ఈ-తెలుగు.ఆర్గ్ లోని వ్యాఖ్యలు కూడా కూడలిలో వస్తే చాలామంది చర్చలో పాల్గొంటారు. అలా ఈ-తెలుగులో కూడా సందడి పెరుగుతుంది.
ఈ-తెలుగు.ఆర్గ్ అనేది వెబ్ సైట్. ఇక్కడి నుంచి rss feed రావటం సాధ్యమా? కానప్పుడు ఏమి చెయ్యాలి?
ఈ-తెలుగు సైటులో వ్యాఖ్యలకు ఫీడులేదు. కథనాలకు ఫీడు ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి