శనివారం, జనవరి 31, 2009

స్పందన -4


An exhibit before a shop in Mendocino, North California Photo:cbrao

కన్నడ పుస్తకం పర్వ సమీక్ష

"ఆధునిక హేతువాద దృక్పధంతో మహాభారతాన్ని చదువుతుంటే ఉదయించే అనేకానేక ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానం ఇవ్వకపోయినా ఒక అంగీకారాత్మక కోణాన్ని ముందుకు తీసుకురావడంలో ఈ నవల సఫలమయ్యిందని చెప్పొచ్చు. " -మంచి విషయ వస్తువును ఎన్నుకున్న పుస్తకమే ఇది. హేతువాద దృక్పధంలో రచయిత ఎస్.ఎల్.భైరప్ప ఇచ్చిన అనేక సమాధానాలలో ఒక్కటైనా మచ్చుకి ఇచ్చిఉంటే పుస్తక స్వరూప, స్వభావాల నాణ్యత పాఠకులికి తెలిసిఉండేది. సాహిత్య అకాడెమీ వారే ఈ నవల ధర రూ. 250/- పెడ్తే ఎలా? ఇది కొనే ఆసక్తిని తగ్గిస్తుంది. అనువాద పుస్తకపు ముఖచిత్రాన్ని ప్రచురించిఉండాల్సింది, కానడ పుస్త ముఖ చిత్రం కాక. తెలుగు ముఖ చిత్రం ఇది మనది అనే అనుభూతుని కలుగచేస్తుంది. ఒక విభిన్నమైన పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

http://parnashaala.blogspot.com/2009/01/blog-post_14.html



~~ కలకాలమొకటిగా ~~

అందరికీ కలలొస్తాయి. కలలో నిత్యం మనము ఆలోచించే లేక అభిలషించే విషయాలే గోచరమవుతాయి. కలకు అక్షర రూపమివ్వటంలో మీ ప్రయోగం సఫలం. మీ కలల రాణి ని కూడా ఇలాగే పరిచయం చేయ కోరుతాను.

http://mynoice.blogspot.com/2009/01/blog-post_15.html



అమృతం కురిసిన రాత్రి

తొలుత మీ కధనాన్నే ఒక కథగా తలిచా. కథలో కథ అనుకుంటూ చదివా. చక్కటి కథను అలవొకగా పరిచయం చేశారు. మీ శైలి మీ టపాను తుదికంటా చదివేలా చేసింది. ఆ కథా రచయిత పేరు, సంచిక తేదీ ఇవ్వగలరు.

http://virajajulu.mywebdunia.com/2009/01/15/1232025720000.html


బ్లాగు విలాప కావ్యం…

అవును, ఈ మధ్య ఒకదాని తరువాత ఒకటిగా బ్లాగులు మూత పడటం విచారకరం. ఇలా బ్లాగుహత్యలు చేసుకునేవారికై, తక్షణమే ఒక సహాయ కేంద్రము నెలకొల్పవలసిన అవసరం ఉంది. బ్లాగు విలాపము ఈ ఆలోచన కలిగించుటలో సఫలమైనది.

http://uniqcyberzone.com/svennela/?p=120


ఎవరికి తెలియని కథలివిలే!

దేవుడా లేక బ్లాక్ మైలరా అనిపిస్తుంది ఆ కథలు వింటుంటే.

http://manishi-manasulomaata.blogspot.com/2009/01/blog-post.html


Stray Thoughts

"If you have no story to tell, that only means you have no meaning left in life అనిపిస్తుంది. " - బ్లాగటం సరే! ఆ బ్లాగే సమయం ఒక కొత్త పుస్తకం చదువుకుంటానికో, మంచి సంగీతం వినటానికో వినియోగించి ఆ క్షణాలను మనవి గా చేసుకుని -ఆనందిస్తే. కెనడా, అమెరికాల లో ఎన్నో ప్రదేశాలు చూశా. చూస్తున్నా. ఈ సమయంలో బ్లాగు రాయలేకపోయానన్న విచారం లేదు. ఇది స్వార్థమా?

బ్లాగు తలుపులు మూసివేసి కొందరికే ఆహ్వానం పంపే కొత్త దశకు చేరింది బ్లాగ్లోకం. ఇంకొన్నాళ్లకు ఫలానావారు బ్లాగు మూసివేత ప్రకటన ఇస్తే ఆశ్చర్య పోయేవాళ్లు తక్కువయితే-దానికి ఏమిటనర్ధం? మనం మరికొన్ని కాగడాలు, దివిటీలు, టార్చ్ లైట్ బ్లాగులకు అలవాటు కూడా పడతామేమో!

http://parnashaala.blogspot.com/2009/01/blog-post_25.html


టెనిస్ చూడ్డం ఓ తమాషా

"మొదటిది ఏస్ కొట్టినప్పుడు అది అయాచితంగా, ఆనాలోచితంగా జరుగుతుందా? లేక వ్యూహరచనలో భాగంగా ఏసులేస్తారా? " -టెనిస్ అంటే ఎంతో గ్లామర్, డబ్బు, పేరు ఇంకా ప్రతిష్ట. పేరొచ్చాక లింకా తాగుతూ కనిపిస్తూ కూడా డబ్బు చేసుకోవటం టెనిస్ తారలకు అతి సులభం. మరి ఇంత పేరు రావాలంటే ఆట గెలవాలి కదా. టెనిస్ లో ఏసులు, క్రికెట్ లో కాచ్లు (Catches win the matches) ఆటను గెలిపిస్తాయి. నిస్సందేహంగా ఏసులు ఆట గెలిచే వ్యూహంలో భాగమే. మీ వ్యాసంలో లేని విషయమైన టెనిస్ తారల దుస్తుల గురించి మీరు మరొక ప్రత్యేక వ్యాసం రాయవలసిన అంశం.

http://tethulika.wordpress.com/2009/01/25/%e0%b0%8a%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8b%e0%b0%95-%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%82-%e0%b0%93-%e0%b0%a4%e0%b0%ae/

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఏ మధ్య నీ బ్లాగులో నిన్ను కిక్కురుమనకుండా చేసిన స్పందనలను కూడా పంచుకో బెదరూ..

అజ్ఞాత చెప్పారు...

చనిపోయిన రచయితల గురించి వాదించుకోవడం, రవికల పండగ , రాజకీయనాయకుల బ్లాగులు, అపార్ట్‌మెంట్ తిప్పలు తప్ప మీ తోటి మహిళా బ్లాగర్ల మీద జరుగుతున్న హేయమైన దాడి బ్లాగ్ ప్రముఖులెవరికీ చీమకుట్టినట్టు కూడా లేనట్టుంది. మీరందరూ కుటుంబంలా ఉంటారని చెప్పుకుంటారు. మరి మీ కుటుంబంలో ఆడవాళ్లను ఇంత అవమానకరంగా మాట్లాడితే ఇలాగే ఏమీ పట్టనట్టు మీ పని మీరు చేసుకుంటారా. ఒక్క మహేశ్ గారు తప్ప ఎవరూ ఖండించడం మాట అటుంచి, కనీసం స్పందించనూ లేదు, నిరసించడంలేదు. ఆ మహిళలు ఎంతా బాధపడుతున్నారో ఎవరైనా ఆలోచించారా. ఎంతమంది బ్లాగులు మూసేసారు మీకు తెలుసా. రమని గారి తర్వాత ఇప్పుడు జ్యోతిగారి బ్లాగులన్నీ మూతబడ్డాయి. నేను జ్యోతిగారి వ్యాసం చదివి బ్లాగ్ లోకంలోకి వచ్చాను. బ్లాగు మొదలెడదామనుకుంటుండగానే ఈ గొడవ చూడ్డం జరిగి అసహ్యం వేసి నా ఆలోచన విరమించుకున్నాను.

ఇక మీరు పండగ చేసుకోండి ఆ చెత్త బ్లాగులు చదువుకుంటూ..

cbrao చెప్పారు...

@అజ్ఞాత:మీరు ఎవరు? "మీ తోటి మహిళా బ్లాగర్ల మీద జరుగుతున్న హేయమైన దాడి బ్లాగ్ ప్రముఖులెవరికీ చీమకుట్టినట్టు కూడా లేనట్టుంది. " -ఎక్కడ జరిగింది? ఏమి జరిగింది? లింక్ ఇవ్వగలరు.

సుజాత వేల్పూరి చెప్పారు...

రావు గారు,
మీరు బ్లాగులు రాయడం తప్ప చదవడం మానినందుకు విచారంగా ఉంది.!

అజ్ఞాత చెప్పారు...

రవికల పండుగ టాపిక్ లో అభ్యంతరకరమైన రాతలేమీ కనిపించలేదు. తాపీ ధర్మారావు, సుజరె వంటి వారి రచనలు చదివితే మత గ్రంథాలలో ఎంత బూతు ఉందో తెలుస్తుంది.

Bolloju Baba చెప్పారు...

అయ్యా/అమ్మా అజ్ఞాతగారు

మీరు మంచి పాయింటు లేవదిసారు. ఈ మధ్య కాలంలో మహిళా బ్లాగర్లపట్ల ఒక రకమైన దాడి కొనసాగుతున్నది. జ్యోతిగారు, రమణిగారు, సుజాతగారుల ను వ్యక్తిగతంగా వారి గౌరవాలకు భంగం కలిగేలా కించపరుస్తూ వాఖ్యలు, టపాలు వెలువడుతున్నాయి. ఇది హేయం. దారుణం.

వీరెకాక కొత్తగా కొత్తపాళీగారిని మరింత జుగుప్సాకరంగా కించపరచటం జరుగుతున్నది. పెద్దవారు కనుక సంయమనంతో వ్యవహరిస్తున్నారని అనుకొంటున్నాను.

నా బ్లాగులోకూడా నాపై అవమానకర ధోరణిలో కామెంటు పెట్టారు.

ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్లు? బహుసా కొత్తగా బ్లాగులోకంలో ప్రవేసించిన వారు లేనిపోని అపోహలతో ఏవేవో ఊహించేసుకొంటూ, రాళ్లురువ్వటమే వ్యాపకంగా పెట్టుకొన్నట్లున్నారు.

దీనిపై మరింతమంది స్పందించి ఇట్టిపోకడలను నిరసించి, బాధితులకు మద్దతు పలకకపోయినట్లయితే ఇలాంటి ధోరణులు మరించ పెచ్చరిల్లి, మర్యాదస్తులు బ్లాగులకు దూరంఅయ్యే ప్రమాదం ఉన్నది.

భవదీయుడు
బొల్లోజు బాబా

చైతన్య.ఎస్ చెప్పారు...

బాబా గారు మీతో ఏకీభవిస్తున్నాను.

అజ్ఞాత చెప్పారు...

http://netijen.blogspot.com/2009/01/blog-post_29.html#comment-form
c.B raavu గారు ఈ లింక్ చదివితె చాలా తెలుస్తుంది.. నేను కొత్తగా వచ్చిన బ్లాగరుని.. కాని ప్రమదావనం లో సభ్యురాలిని కాదు .. ఈ కొందరి మగాళ్ళ కు భయపడి నా పేరుతో మీకు వాక్య ఇవ్వలేక పోతున్నందుకు క్షమించాలి.. గత కొన్ని రోజులుగా మహిళల మీద ఎంత హేయం గా దాడి జరిగిందో ఎవరికన్నా పట్టిందా ..ఒక వేళ చూసినా మనకెందుకు లే అని వదిలేసారా.. ఒక్క కత్తి గారు ,జీడి పప్పు గారు తప్ప మరెవరు ఖండిచలేదు.. ఎవరో కాగడా శర్మ అంట తన వాక్యలతో టపాలతో ఎంత నీచంగా రాసారంటే ..బ్లాగు రాయలంటే భయం కాదు అసహ్యం వేస్తుంది..జ్యోతిగారిని సుజాత గారిని రమణి గారిని ఎంత నీచంగ వర్ణిస్తూ రాసారో పైగా ఆడవాళ్ళను అందరిని రవి గారి బాలగులో నీచంగా మాట్లాడుతూ వాక్యలు రాసారు..మీరందరు గొప్ప గొప్పవాళ్ళు మంచి మంచి విషయాలను చర్చించి బ్లాగు లోకానికి మహత్తర సేవ చేస్తున్నారు కదా ..ఈ విషయం మీకు మొదటి అఙ్ఞాత గారన్నట్లు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు కదా..ఎవరండి మహిళలకు మహిళలే శత్రువులు అన్నాది ?. నేటిజన్ గారి టపా చూడండి ఎంత గా మిగిలిన మహిళలకు ఓదార్పు దైర్యాన్ని ఇచ్చారో ..నాకు బ్లాగు లోకం కొత్త ఈ మద్యనే వచ్చాను .. సరే రవిగారికి ఏదన్న అపోహలుంటే జ్యోతిగారిని అడగాలి గాని తన బ్లాగులో వేరెవరో వ్యక్తి , ఆడవాళ్ళను నీచంగా కామెంటుతుంటే ఏమీ పట్టనట్లు ఊరుకున్నారు కనీసం అలాంటి భాష వాడద్దు అని సూచించనైనా సూచించలేదు..ఇలాగే జరిగితే ఈ బ్లాగ్ లోకం లో మగవాళ్ళు మాత్రమే మిగులుతారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి