గురువారం, ఫిబ్రవరి 05, 2009

మహిళా బ్లాగర్ల పై జరుగుతున్న హేయమైన దాడి



"మీ తోటి మహిళా బ్లాగర్ల మీద జరుగుతున్న హేయమైన దాడి గురించి బ్లాగ్ ప్రముఖులెవరికీ చీమకుట్టినట్టు కూడా లేనట్టుంది. మీరందరూ కుటుంబంలా ఉంటారని చెప్పుకుంటారు. మరి మీ కుటుంబంలో ఆడవాళ్లను ఇంత అవమానకరంగా మాట్లాడితే ఇలాగే ఏమీ పట్టనట్టు మీ పని మీరు చేసుకుంటారా. ఒక్క మహేశ్ గారు తప్ప ఎవరూ ఖండించడం మాట అటుంచి, కనీసం స్పందించనూ లేదు, నిరసించడంలేదు. ఆ మహిళలు ఎంతా బాధపడుతున్నారో ఎవరైనా ఆలోచించారా. ఎంతమంది బ్లాగులు మూసేసారో మీకు తెలుసా. రమణి గారి తర్వాత ఇప్పుడు జ్యోతిగారి బ్లాగులన్నీ మూతబడ్డాయి. నేను జ్యోతిగారి వ్యాసం చదివి బ్లాగ్ లోకంలోకి వచ్చాను. బ్లాగు మొదలెడదామనుకుంటుండగానే ఈ గొడవ చూడ్డం జరిగి అసహ్యం వేసి నా ఆలోచన విరమించుకున్నాను." -ఇది దీప్తిధారకు ఒక అజ్ఞాత మహిళ పంపిన సందేశం. మహిళల మీద దాడి ఎందుకు జరుగుతున్నదో బోధ పడ లేదు.

కారణమడిగితే, దాడికి కారణం వివరిస్తూ పేరు వెళ్లడించటానికి భయపడ్డ ఇంకో మహిళా బ్లాగరు ఈ link పంపారు. "రవిగారికి ఏవన్నా అపోహలుంటే జ్యోతిగారిని అడగాలి గాని తన బ్లాగులో వేరెవరో వ్యక్తి , ఆడవాళ్ళను నీచంగా కామెంటుతుంటే ఏమీ పట్టనట్లు ఊరుకున్నారు కనీసం అలాంటి భాష వాడద్దు అని సూచించనైనా సూచించలేదు.."

మన సభ్యులలో రవిగారు ను ఎరిగినవారెవరైనా వున్నారా? ఈ రవి తన సైట్ వచ్చిన సాంకేతిక సమస్యలకు జ్యోతక్క కారణమని రాస్తున్నారు. ఈ టపాకు స్పందనగా వచ్చిన వ్యాఖ్యలు మహిళలను గాయపరిచేవిగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు తొలగించేలా రవిగారిని ఎరిగినవారు తక్షణం పూనుకోవాలి.

బొల్లోజు బాబా స్పందిస్తూ "జ్యోతిగారు, రమణిగారు, సుజాతగారుల ను వ్యక్తిగతంగా వారి గౌరవాలకు భంగం కలిగేలా కించపరుస్తూ వాఖ్యలు, టపాలు వెలువడుతున్నాయి. ఇది హేయం. దారుణం.

వీరేకాక కొత్తగా కొత్తపాళీగారిని మరింత జుగుప్సాకరంగా కించపరచటం జరుగుతున్నది. పెద్దవారు కనుక సంయమనంతో వ్యవహరిస్తున్నారని అనుకొంటున్నాను." అని రాస్తున్నారు.

ఈ బ్లాగులు మూతపడటానికి ఎవరు బాధ్యులు? మనము ఏమి చెయ్యాలి వీటిని నివారించటానికి? మహిళలపై అన్యాయంగా కత్తులు రువ్వుతున్నవారిని ఏమీ చెయ్యలేమా?

35 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Ramani gari blog enduku close chesesaru.

అజ్ఞాత చెప్పారు...

yevaridi varu musukunte manakenduku anta badha . manakelagu invitation ivvalane ga e bhajana.asalu manam raasina aa ravikalapandaga post valle adavallu blogs musukuntunnarani peru cheppadaniki istapadani oka blagini annaru.

శరత్ కాలమ్ చెప్పారు...

ఇంకో బ్లాగులోని టపాలు, వ్యాఖ్యలు చదివితే బ్లాగులు మూతపడటమే కాదు - ఆత్మహత్యలు కూడా జరిగే అవకాశం వుంది.
నా వంతు బాధ్యతగా వారి బ్లాగులో ఇలా కోరాను:
"మీ బ్లాగ్ - మీ ఇష్టం అనుకోండి, కానీ ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను. నాకు గుర్తుకు వున్నంతవరకు (అసలు) (edited) ఆడవారిని అరాధించాడనుకుంటాను కానీ చులకనగా చూసినట్లు నాకు గుర్తుకులేదు. ఆడవారిలో అల్పబుద్ధి వున్నవారులేరని కాదు గానీ వాళ్ళను ఖండించడం కోసం మనం ఇంతగా దిగిపోవాలంటారా? మరీ ఇటువంటి భాషను ఉపయోగించాలా అనిపిస్తోంది. ఎన్నో చక్కటి భావాలు కల మీరు ఇలాంటి పంథా ఎంచుకోవడం విచారం కలిగిస్తోంది. దయచేసి ఒక సారి మిమ్మల్ని మీరు సరి చూసుకోండి. ఎనీ వే - మీ బ్లాగ్ - మీ ఇష్టం"

దానికి వారి స్పందనలో కొంత ఇది:

"వాళ్ళలో హిపోక్రసీ నాకు గిట్టదు. అమెరికా గనక వోల్ వరల్డు మొత్తానికీ పోలీసు అయినట్టు, వీళ్ళు బ్లాగు లోకం మొత్తానికీ చీడ గా తయారయ్యారు నాయనా. వాళ్లు రాస్తే శృంగారం, మనము రాస్తే బూతు. ఒకామె అలసిపోయి ఇంటికొచ్చిన మొగుణ్ణి నువ్విప్పుడు రెడీనా అంటుంది కాళ్ళు పడుతూ . ఇంకొక ఆమె ఎక్కడ నొక్కాలో మనకు తెలీదా అంటుంది. ఇంకొకటి ఏకంగా శృంగార నాయికల శ్లోకాలు ఏకరువు పెడుతోంది. ఎంత ఎక్స్ పీరి ఎన్సో. ఇంటర్వ్యు లలో ఎంతసేపు లవ్వు, సెక్స్, అక్రమ సంబంధాలు ఇదే వరస. వాళ్లు రాస్తే రామాయణం, అదే మనము రాస్తే రంకు. ఇదే నాకు నచ్చంది."

Malakpet Rowdy చెప్పారు...

Not just women - there were comments on men too .. Dont understand why people are making it a male vs female issue.

asha చెప్పారు...

అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు. నేనెప్పుడూ ఊహించలేదు కూడా. వాళ్ళను తిట్టడం వల్ల, ఆ చర్యలను ఖండించటం వల్ల ఏ లాభమూ లేదు. అందుకే ఏం చెయ్యాలో తెలియక ఊరుకుండిపోయాను.
రవిగారేదో అతని టెంప్లేట్ విషయంలో తొందరపడి ఒక టపా రాసారు. దానిని అవకాశంగా తీసుకొని వీళ్ళకు నచ్చని వాళ్ళందరి మీదా ఇంత హేయమైన దాడులు చేశారు. ఏదైనా చర్చించే వాళ్ళతో మాట్లాడవచ్చు. కానీ హేయమైన దాడులు చేయటానికి
సిద్ధమైన వాళ్ళతో ఏం మాట్లాడగలం? అప్పటికీ అబ్యూజ్ అని రిపోర్ట్ చేయటానికి ప్రయత్నించాను. కానీ, గూగుల్ అనుమతించలేదు. వీటిని అరికట్టటానికి ఇంకే మార్గమున్నా తెలుపగలరు(అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను).

Kathi Mahesh Kumar చెప్పారు...

బ్లాగులు రాసుకునేది వ్యక్తిగత సంతృప్తికోసం.అలా కాకుండా వేరొకర్ని ఎక్కిరించడానికీ,ఎద్దేవా చెయ్యడానికీ,అసహ్యంగా అపహాస్యం చేసి హానికలిగించడానికో అయితే అది ఆ వ్యక్తుల సంస్కారాన్నే తెలుపుతుంది.అలాంటి వారితో కలిసి అనామకుల్లా అరిచి గోలచేసే మరికొందరు అజ్ఞాత వ్యక్తుల దౌష్ట్యాన్ని చూస్తుంటే వారి మన:స్థితి మీద అనుమానంతోపాటూ జాలి కలుగుతోంది.

మహిళా బ్లాగర్లతోపాటూ, వారికి మద్ధత్తుగా వ్యాఖ్య చేసిన నా మీద కూడా అవాకులూ చవాకులూ రాశారు.ఇలాంటి అరాచకం నాకు కొత్త కాదుగానీ,ఈ విధానం చూసి మాత్రం జుగుప్స కలిగింది.

నేనిప్పటికీ చెప్పేది ఒక్కటే, ఇలాంటి చిన్నబుద్దుల అక్కసు మాటలూ,అసహ్యమైన రాతల వల్ల బ్లాగింగ్ మానుకోవడం వాళ్ళకు విలువ ఇవ్వడం వంటిదే. వారి ఉద్దేశాన్ని సాకారం చెయ్యడం వంటిదే. కాబట్టి అలాంటి పని చెయ్యొద్దని నా మనవి.

Malakpet Rowdy చెప్పారు...

Be it men or women, the best way is to ignore those folks, I repeat GENDER HAS NOTHING TO DO WITH IT. Even if you guys succeed in blocking somebody's IP address (Which is extremely tough, keeping in mind the fact that if one posts an abusive message hiding behind a proxy, all the users behind that proxy get blocked) the person can either mask his IP, find some anonymous proxy or use some Airport or a coffeeshop server to open a new account and post the messages. How many people can you guys go after?

Malakpet Rowdy చెప్పారు...

This was my complete response on a couple of other blogs - I apologize for the spam but my blog is not listed on Koodali for some reason - (May be they didnt find it good enough) So, no point in writing the response on that blog.

_________________________________________________

I'm a rookie here and may not know about the issue completely - so pardon me if I am getting the things wrong. From whatever I heard and read over the last 2-3 days, I think this issue has been blown out of proportion (mainly by the middle-men and women involved). A simple issue between two individuals has been made an international issue and a male vs female issue.

I did read those blogs that hurled offensive comments against the bloggers and and the authors DID NOT SPARE even the men. Mahesh Kumar was insulted, Baba was abused and Sridhar was mocked at too. But I am surprised at the deliberate attempts to project this as a Male Vs Female issue.

And about the "Freedom to write whatever we want" - Aint the misuse of this freedom the root cause of this problem? While one side is allegedly abusive, the other other side allegedly consists of bullies.

The other thing - I know, you being the expert bloggers, would have realized it better than me - I wouldnt have read Kagada Sharma's blog had this not been such a big issue. When I clicked on it, it should be "Adult Content" warning and I closed the window assuming that to be a Porn Site. But then, after going through the series of comments, I knew there was something else in his blog and went thru the whole that - This issue contributed to one additional hit to his blog from my side :))

I have been on the Internet for the last 15 years (Yes, even before Internet Explorer was born) and have been a regular on many chatrooms since 95 and the issue of abusive chatters (who underwent a metamorphosis as bloggers) has had no solution. Be it men or women, the best way is to ignore those folks, I repeat GENDER HAS NOTHING TO DO WITH IT. Even if you guys succeed in blocking somebody's IP address (Which is extremely tough, keeping in mind the fact that if one posts an abusive message hiding behind a proxy, all the users behind that proxy get blocked) the person can either mask his IP, find some anonymous proxy or use some Airport or a coffeeshop server to open a new account and post the messages. How many people can you guys go after?

And coming to the man in the centerstage, Ravigaru (Who never fails to amaze me with his ability to get into a controversy when there exists none) - looks like people dont have too many issues with whatever he writes but only with the comments pertaining to them. I am not sure whether a blogger can be ridiculed for the comments his blog receives. If he has his freedom to keep whatever he wants then he is legally entitled to do it, just as somebody else had the right to delete a comment posted.

About resolving the issues amicably, (Please pardon me if I am overstepping the line again but cant resist posting it) - somebody suggested that Ravigaru should have talked to Jyoti to resolve the template issue. I second that thought and feel that an effort should have been made to resolve that issue peacefully. But applying the same logic, wouldnt it have been better had Aruna requested Ravigaru to remove the comment he posted on her blog, instead of removing it herself? I am not saying she doesnt have any right to do it - but as somebody was talking about "Amicable resolution" in the second case, I thought it could have been applied in the first case as well.

If I remove my own comment, nobody cares, but if someone else removes my comment, then people will definitely wonder what filth I might have written. May be Ravigaru felt too sensitive about it and that resulting in the copy-paste. (I dont know for sure - thats why I said "May be")

and finally, Ravigaru: Why don't you delete those filthy comments posted on your blog and settle the issue once and for all? GOTI TO POYEDAANIKI GODDALI DAAKA ENDUKU SAAR?

అజ్ఞాత చెప్పారు...

Malakpet Rowdy garu

You seem to be new to this arena. Slowly but surely you'll understand that telugu bloggers are in their infancy and its only but natural that things like this happen. They happen for a reason. What that reason is, and how to interpret it, you'll surely know. For now, concentrate on your blog and have a wonderful time. Just an advise.

Aruna చెప్పారు...

అత్యంత హేయం. ఒక్కసారి గా స్తబ్దు అయిపోయాను అక్కడ టపా చూసి. ఏమన్నా అందాం అంటే అడల్ట్ కంటెంట్ అని తెల్సీ ఎందుకు వచ్చావు అని అంటారు అని వూర్కున్నా. మరుసటి రోజు జ్యోతి గారి బ్లాగు నుండి టపా చూసి ఆనందం అనిపించింది. వీళ్ళకి భయపడకుండా ముందుకు వెళ్తున్నారు అని. ఇలాంటివి చూసి వెనకాడద్దు అని జ్యోతి గారి కి చెప్దాం అంటే అనవసరం గా గుర్తుకు తెచ్చి బాధ పెట్టినట్టు అవుతుంది ఏమో అని వూర్కున్నా.

ఆ బ్లాగు, టపా ఎవరిది అయినా సరే, వాళ్ళు చేస్తోంది తప్పు. వెంటనే ఆ టపాలని తొలగించండి. మీకు భేధాభిప్రాయాలు వుంటే వాటిని ప్రస్తావించాలి కాని ఇలాంటి పనులు ఎంత దారుణం గా వుంది.

జ్యోతి గారు మీకు నా సప్పోర్ట్ ఎలా తెలియచెయ్యాలో తెలీక ఇన్నాళ్ళూ వూర్కున్నా. ఇలాంటివి చూసి మీరు బ్లాగడం ఆపద్దు. మీరు చెయ్యని తప్పు కి మీరు శిక్ష అనుభవించకండి.

మిగిలిన బ్లాగర్లకు కూడా నా విన్నపం ఇదే.

అజ్ఞాత చెప్పారు...

శరత్ గారు భర్త అలసివస్తే కాళ్ళు పట్టనా అని అడగడం లో ప్రేమ కనబడుతుంది కాని కామం తో ముడివేయడం ఎంతవరకూ సభబంటారు.. నేను ఈ తెలుగు బ్లాగ్లోకం లో ఎన్నొ రకాల కవితలు చదివాను మోతాదుమించి ఆడ మగా ఎవరూ రాయలేదు ..ఇక ఇంటెర్వ్యూలు అంటారా అసభ్యంగా ఏమి అడగలేదే ?? రేపు నీకు ఇలాంటి సమస్య వస్తే ఏలా ఎదుర్కుంటావ్ అని అడిగారు.. అది సమాధానం చెప్పే వారి ఇస్టాఇస్టాల మీద ఆదార పడి ఉంటుంది.. మీరు ఇలాంటి విషయాలను .. (ఆడవారినందరిని ఉద్దేసించి రవిగారి బ్లాగులో కాగడ శర్మగారు బోగం...లు అని,లంగా బొందులని ఇంకా చాలా చాలా అసభ్యంగా అన్నారు.. )అలాంటి భయంకరమైన వాటితో కంపేర్ చేసుకుని చూస్తారా.. వాళ్ళ బ్లాగులకు హిట్లు రావలంటే ఇదా పద్దతి ??? వారికి వేరే బ్లాగర్ తో గొడవలుంటే సరళయమైన భాషలో మాట్లాడి తేల్చుకోవాలి.వీళ్ళు రాస్తే రామయణం అవుతుందా..అంటే ... కావాలని లేని అసభ్యాన్ని ఊహించుకుంటే ఎవరు ఏం చేయలేరు..మొన్న రామ సేన చేసిన గొడవలో స్త్రీలు తాగడాన్ని మగవారికంటే ఆడ వాళ్ళే ఎక్కువ ఖండించారు..ఏది సబయతో ఏది అసభయతో చదివే వారికి కచ్చితం గా తెలుస్తుంది.. కావలని గోడవ చెసేవారికి చెప్పినా వేస్ట్

Malakpet Rowdy చెప్పారు...

Agnyata garu,

Yes, I did mention that I am a rookie - Just 3-4 days old over here .. though I created this id long back, I never used it.

I know they are in their infancy and thats why I typed that long text although its boring. I feel that this is the first time these people are facing this issue and getting unsettled a lot.

But I did see worse situations and politics on chatrooms and discussion boards. What surprised me was this simple issue creating such a ruckus.

Yeah I wanna concentrate on my blog but looks like all the topics I thought of, have been covered by the existing blogers in their blogs. May be I can start my blog with a post on Blog-fights ..

WHO LET THE BLOGS OUT ... WOOOF WOOF .. Jus kiddin :))

krishna rao jallipalli చెప్పారు...

నాకున్న కుంచెం పరిజ్ఞానం ప్రకారం -- బ్లాగులంటే ఫ్రీ గా చదువుకునే పత్రిక లాంటిది (పాఠకులకి), తమ తమ ఆలోచనలని, అనుబూతులని (బూతులు కాదు) పబ్లిక్ గా రాసుకునే డైరీ లాంటిది - బ్లాగర్లకి. ఎవరి బ్లాగు వారికే సొంతం, సర్వ హక్కులు వారివే. బ్లాగర్లు ఎవరూ ఎవరినీ తమ బ్లాగు చదవమనీ, కమేంటమనీ ఎవరిని బలవంతం చేయరు. చేసినా ఎవరూ చదవరు. అలాగే కూడలి, జల్లెడ. ఇవికూడా బ్లాగర్లకి ఫ్రీయే. ఫ్రీ ఉన్నచోట ఎవరకి ఏమి హక్కులు ఉండవు. నా లెక్క ప్రకారం తెలుగు బ్లాగర్లు మరియు పాఠకులు (ప్రస్తుతం) 2000 మించి లేరు. వీరిలో active గా ఉండేది 500 మంది ఉంటారేమో. నేను కొన్ని బ్లాగులను క్రమం తప్పక చదువుతాను. మరికొన్ని బ్లాగులను అప్పుడప్పుడు చదువుతాను. అలాగే కామెంట్లు కూడా. టపాలోని సరుకుని బట్టి కామెంటు రాస్తాను. కొన్ని టపాలు చదివినా అనేక కారణాల వలన కామెంటు రాయలేను. బ్లాగ్ వరల్డ్ లో, బ్లాగర్లకి - పాఠకులకి ఉన్న స్వేఛ్చ దేనిలోనూ లేదు. ఇంతటి స్వేచ్చాయుతమైన ఈ బ్లాగుల ప్రపంచాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాని ఎందుకు పనికిరాని, పనికిమాలిన విషయాలతో కలుషితం చేయడం quite meaningless. ఒక టపాకి ఎన్ని హిట్లు వచ్చినా ఒరిగేది ఎవరికీ ఏమి ఉండదు. కామెంట్లు రాకపోయినా ఊడేది అంతకన్నా ఉండదు. అలాగే పాఠకుల కామెంట్లు కూడా - బ్లాగరులు ప్రచురించినా, ప్రచురించకపోయినా ....... అందుకని రాసే వాళ్లు రాసుకుంటూ పొండి, చదివే వాళ్ళు చదువుకుంటూ పొండి.

కొత్త పాళీ చెప్పారు...

@Malakpet Rowdy .. I hear you. Agree that internet is not a particularly logical place or even a tolerant space. Still, that doesn't mean that one needs to take things lying down.

అజ్ఞాత చెప్పారు...

Hello All,

I am really shocked to see such pathetic comments in the recent time. Everyone has got a right to express their views in their own way, however they should maintain ethics. I don't find any reason why the blog moderator(Ravigaru) has entertained such vulgar comments.

People who have commented on lady bloggers didn't leave male bloggers like Kottapaali and Katti Mahesh Kumar.

We really don't need to care about people who comment as "Anonymous" or with pseudo names( not dare enough to disclose their details).

I'm supporting the lady bloggers irrespective of the situation at anytime and anywhere.

I request those bloggers to care a damn for these comments& people, and keep blogging. I have a solution to fix this kind of issues (I'm working on it).

Just wait and see what is going to happen.

-- Sateesh Kumar Yanamandra

అజ్ఞాత చెప్పారు...

@ కత్తి మహేష్ కుమార్ - మీరు, చదువరి ఈ మధ్య ఒక బ్లాగరిని ఆమె ఇంగ్లీష్ భాషపై వెక్కిరించారు? మీ సంగతేం చెయ్యాలి?

అజ్ఞాత చెప్పారు...

Malakpet Rowdy garu,

I am impressed. Its really really refreshing to meet someone who uses brains to think in telugu blogosphere. (I was the same agnatha that posted you the advise)

Since advises are free(free as in beer), since I am 4 months senior to you, this is my sincere suggestion to you. I see that you have lot to offer. Please start writing them down, do not add your blog to koodali, write it for yourself. I dont want another reasonable person waste his time with CB raos, Mahesh kumars and kottapaalis of this narrow telugu blog world. :)

I wish you peace of mind ;)

Kathi Mahesh Kumar చెప్పారు...

@అజ్ఞాత:నా ఇంగ్లీషే అంతంత మాత్రం అలాంటిది నేను వేరొకరి భాష గురించి వెక్కిరించడమా! ఎక్కడా? ఎప్పుడు? లంకె ఇవ్వగలరా ప్లీజ్!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇదే విషయాన్ని నేను చాలా మంది టపాల్లో వ్యాఖ్యానించాను.దాన్నే మళ్ళీ ఇక్కడ చెబుతున్నా.
ఈ ఇరవై రోజుల్లో ఏమి జరిగిందో తెలియదు ఎందుకంటే పంటల నూర్పిడిలో మునిగిపోవడంవల్ల విషయం తెలియలేదు జూన్లో బ్లాగుప్రపంచంలోకి ప్రవేశించాను.వచ్చినప్పుడున్న వాతావరణం ఇప్పుడులేదు.అయినా ఇదేంటండి బ్లాగులోకంలో అందరూ మంచి విద్యావంతులు,సంస్కారవంతులున్నారనుకున్నా,మా పల్లెటూరి ప్రజలే మేలు కదండి.అపార్థాలు పొడచూపినా త్వరగా మరచిపోయి మళ్ళీ కలిసిపోతూవుంటాము.అయినా ఎవరో ఏదో అన్నారని మనం బ్లాగులు మూసుకోవడమేంటండి.పొగడ్తల్నే కాదు విమర్శల్ను కూడా స్వీకరించే స్తితప్రజ్ఞత,మనస్తత్వం అలవరచుకోవాలి.ఇలా జరగడవల్ల మంచి బ్లాగర్లను కోల్పోయినవారమవుతాము.ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకానికి పత్రికారంగంలో గుర్తింపు వస్తోంది,ఇలాంటి సమయంలో మంచి బ్లాగర్లు తమ బ్లాగులను మూసివేయడం తెలుగును ప్రపంచవ్యాప్తిచేయాలన్నమన ఆశయం నెరవేరదు.గత నెలలో దీనికోసం పుస్తక ప్రదర్శనలో మన బ్లాగు మిత్రులు కష్టపడినదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారవుతుంది.బ్లాగులను మూసివేయలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించమని నా విజ్ఞప్తి.

అజ్ఞాత చెప్పారు...

అసలు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి రమణి గారు బ్లాగ్ ఓపెన్ చేసాను. ఆ బ్లాగ్ పాస్ వార్డ్స్ అడుగుతోంది. నా జిమెయిల్ అకౌంట్ అక్కడ పని చెయ్యలేదు. ఆమె ఆహ్వానించిన యూజర్ అకౌంట్స్ మాత్రమే పని చేస్తాయని మెసేజ్ డిస్ప్లే అవుతోంది.

అజ్ఞాత చెప్పారు...

రమణి గారు ఎవరినీ ఇన్వైట్ చేయలేదు. నేను మెయిల్ కూడా పంపాను నా జిమెయిల్ అడ్రెస్తో, మూసేసాను క్షమించండి అని అంటున్నారు,. దయచేసి రమణి గారు బ్లాగు తెరవాల్సిందిగా కోరుకొంటున్నాము. మీకు మా అందరి మద్దతు ఉంది.

cbrao చెప్పారు...

"రమణి గారు బ్లాగు తెరవాల్సిందిగా కోరుకొంటున్నాము. మీకు మా అందరి మద్దతు ఉంది." -ఎందుకు భయం? భయపడేవాళ్లనే ఈ కొంటె కోణంగులు భయపెడ్తారు.మనము ధైర్యంగా వుంటే వాళ్లే తోక ముడుస్తారు. రమణి, భయం విడనాడండి -బ్లాగు ఎప్పటిలా కొనసాగించాలని కోరుతాను.

అజ్ఞాత చెప్పారు...

రమణి గారి Blog ఎంతొ బాగుంటుంది.తెలిసినంత వరకు ఈ విషయం లొ రమణి గారి గురించి ఎక్కడ ఎమి వాఖ్యాలు రాలెదు.కాని ఆవిడ ఎందుకు Blog close chesaro.......?రమణి గారు బ్లాగు తెరవాల్సిందిగా కోరుకొంటున్నాము.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

రావు గారు, మరి మీకు జాతిపిత గాంధీ మహాత్ముని మీద ఇలా బ్లొగ్ లో రాయడం సమంజసమా?
ఇతను (మార్తాండ) "గాంధీ మహాత్ముని కులగజ్జి " అని ఇలా రాయడం సమంజసమేనా లేక అతను జాతి పిత గాంధి గురించి అతని బ్లొగ్ లో రాసు కున్నాడు కనుక అది అతని ఇష్టం అంటె. ఇటువంటి వారి వ్యాఖ్యలు రెగులర్ గా రాసెవారి బ్లొగ్ లో అనుమతించవచ్చా? మీరూ దీనిమీద చ్చర్చించాలి మీకు తెలిసిన సీనియర్ మరియు సిన్సియెర్ బ్లొగర్ల తో
http://telugu.stalin-mao.net/?p=151

cbrao చెప్పారు...

ప్రమదావనం లోని ఆంతరంగిక విషయాలు మహిళల ద్వారానే బయట ప్రపంచానికి వెళ్లడయ్యాయా అనే సందేహం కలుగుతుంది. ఈ సందేహానికి ఎలాంటి ఆధారము లభించటం లేదు.

అజ్ఞాత చెప్పారు...

రమణి గారి మీద కూడా కాగడా బ్లాగులో చాలా జుగుప్సాకరమైన రీతిలో టపా రాశాడు. అతడు ఇంకా రాయనిది సుజాత గారి మీదే! కానీ ఇతర కథల్లో ఆమె పాత్ర కూడా ఉంచాడు.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత గారు. You need not think that I am not privileged to negate with Gandhi or Gandhism. Do you know that books written by Ambedkar criticising Gandhi were not banned in India?

అజ్ఞాత చెప్పారు...

ఈ విషయం ఇక్కడి తో వదిలెస్తే మంచిది ఎక్కడ ఏమి రాసారో చెప్పడం అంత మంచిది కాదేమో
nestam
jaajipoolu.blogspot.com

అజ్ఞాత చెప్పారు...

కాగడా బ్లాగర్ మరీ బరితెగించి బూతు ఫొటోలు పెట్టే స్థాయికి దిగజారాడు. blogger.com యజమానులైన గూగుల్ వారు అలాంటి ఫొటోలు అప్ లోడ్ చెయ్యకూడదని రూల్ పెట్టలేదా, పెట్టి గాలికి వదిలేశారా? డబ్బులు తీసుకుని హోస్టింగ్ చేసే ప్రొవైడర్స్ కూడా తమ చేత హోస్ట్ చెయ్యించిన బ్లాగుల్లో అలాంటి ఫొటోస్ కనిపిస్తే ఆ డొమెయిన్స్ బ్లాక్ చేసేస్తారు. మన ఇండియాలో వెబ్ సైట్స్ లో బూతు బొమ్మలు హోస్ట్ చెయ్యడానికి చట్టాలు ఒప్పుకోవని అమెరికన్ హోస్టులు, బ్లాగ్ ప్రొవైడర్లు ఉపయోగించుకుంటున్నారు సిగ్గు విడిచి.

అజ్ఞాత చెప్పారు...

ఆ సైట్ల అడ్రెసులు ఇవ్వగలరు. నేను ఒకటి మాత్రమే చదవగలిగాను.
స్త్రీలు అని జాలి చూపుతుంటాము కానీ కొందరు ఇటువంటివారు ఉంటారు ఇటువంటి చండాలమైన వారి వల్ల మంచి మహిళలూ తలయెత్తుకోలేరు. జ్యోతి మరణి లను వెంటనే బహిష్కరించి వేయగలరు.
ఎవరో ఇద్దరు స్ర్తీ ల వల్ల పూర్తి స్ర్తీ జాతినే అవమానిస్తూ రాయడం తప్పు.
ఆ సంఘటన గూర్చి మీరు ఇలా రాయడం మంచి పద్దతి, ఆ స్ర్తీలను వెంటనే ఇక్కడి నుండి తొలగించడమే మంచిది.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత గారు గాంధి గురించిన సేమ్ మేటర్ ని అనేక బ్లాగుల్లో స్పామ్ చేశారు. ఏం వేషాలా? ఆ విషయం నన్నే డైరెక్ట్ గా అడిగినా సమాధానం చెప్పగలను. ఒకే మేటర్ ని అనేక బ్లాగుల్లో స్పామ్ చెయ్యడమేమిటి?

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

ఇప్పటికే చాలామంది చెప్పేసారు. ఈ విషయాన్ని పట్టించుకోకపోతేనే మంచిది. పట్టించుకునే కొద్దీ అది తెలుగు బ్లాగావరణాన్ని మరింత కలుషితం చేసే అవకాశం మనమే కల్పించినట్టవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరూ ఎవరికీ మద్ధతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి బ్లాగు వారిది. తెరిచి ఉంచుతారా, మూసి వేస్తారా అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమైన నిర్ణయం. మనం గమనిస్తే అర్ధం లేని రచ్చ చేసే వాళ్ళని వేళ్ళమీద లెక్కగట్టవచ్చు. 99.9% మంది చాలా ఆరోగ్యకరంగానే మసలుకుంటున్నారు. ఏదో వెయ్యిమందిలో ఒక్కరో, ఇద్దరో ఇంకో ఇద్దరి మీద అర్ధం లేని దాడి చేస్తున్నారు అని, చేతనంగా ఉన్న మిగ్లిన బ్లాగరులు బ్లాగు చోటుని అతిగా ఈ విషయం గురించి వాడుకోవడం నాకైతే రుచించడం లేదు. దాడికి గురికాబడ్డ ఆ ఒకరిద్దరు తమని తాము ఇలాంటి అల్లరి మూకల ఆరోపణల ఆధారంగా
బేరీజు వేసుకోకుండా నిరంతరంగా వారి వారి వ్యాపకాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

బ్లాగు అనేది మన గురించి, ప్రపంచాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాము అనే దాని గురించి రాసుకునే వెసులుబాటు. మన బ్లాగు మన వరకూ ప్రత్యేకం. మన గురించి మనకే బాగా తెలుస్తుంది. కాబట్టి మనల్ని, మన బ్లాగుని ఎవరో ఇచ్చిన తీర్పుల ఆధారంగా బేరీజు వేసుకుని మన వ్యాపకాలని, వెసులుబాటుని వదులుకోవడం సరైన చర్య కాదు.

krishna rao jallipalli చెప్పారు...

ఏకాంతపు దిలీప్ గారు కరెక్ట్. సోది, సొల్లు, పిరికి (అజ్ఞాతలు), అసూయాపరులు, సుత్తి, కుసంస్కారులు, వెన్నెముక లేని వారు, జిడ్డు, జీళ్ళపాకం, కుట్ర, కుతంతం, శాడిస్తులు, చెదపురుగులు, వగైరా జాతి వారిని పట్టించుకోవడం వెస్ట్.

PAVANKALYAN[I.A.S] చెప్పారు...

బ్లాగులు రాసుకునేది వ్యక్తిగత సంతృప్తికోసం.అలా కాకుండా వేరొకర్ని ఎక్కిరించడానికీ,ఎద్దేవా చెయ్యడానికీ,అసహ్యంగా అపహాస్యం చేసి హానికలిగించడానికో అయితే అది ఆ వ్యక్తుల సంస్కారాన్నే తెలుపుతుంది.అలాంటి వారితో కలిసి అనామకుల్లా అరిచి గోలచేసే మరికొందరు అజ్ఞాత వ్యక్తుల దౌష్ట్యాన్ని చూస్తుంటే వారి మన:స్థితి మీద అనుమానంతోపాటూ జాలి కలుగుతోంది.
katti mahesh kumar gaaru baaga cheppaaru strini avamaana parise raathalu raayatam manishi lakshanam kaadu

కామెంట్‌ను పోస్ట్ చేయండి