శనివారం, ఫిబ్రవరి 14, 2009
ప్రేమ ఎంత మధురం!
మధురమైన ప్రేమ గీతాలకు ఖజానా Jim Reeves (August 20, 1923 – July 31, 1964). Man with Golden Voice గా భావించబడే జిం రీవ్స్ పాటలు ఎంతో మధురమైనవి. ఆ గొంతులోని మాధుర్యం జిం రీవ్స్ చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, అభిమానులను అలరిస్తూ, అతని పాటలు మిలియన్స్ లో అమ్ముడుపోయేలా చేసింది. అంతే కాదు, నన్ను అమెరికా లోని నాష్విల్ , టెన్నిసీ రాష్త్రం లోని సంగీత కళాకారుల కీర్తిమందిరాన్ని (Nashville Country Music Hall of Fame and Museum) దర్శించేలా చేసింది. నిజానికి ఎప్పటినుంచో చూడాలని కలలుకన్న జిం రీవ్స్ మ్యూజియం చూడలేకపోయాను (ఎవో కారణాలవలన దాన్ని మూసివేశారు) కాని ఈ కీర్తిమందిరంలో జిం రీవ్స్‌కు సంబంధించిన ఎన్నో జీవిత విశేషాలను, తాను వాడిన వస్తువులను ప్రదర్శించారు. అవన్నీ చూస్తుంటే నేను B.Sc చదివే రోజులలో రేడియో సిలోన్ లో విన్న జిం రీవ్స్ పాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చేయి. రేడియోలో జిం రీవ్స్ పాటలొస్తే చెవులు రిక్కించి వినే వాళ్లము నేను, బాలసుబ్రమణ్యమూను. అతనే నాకు జిం రీవ్స్ ను పరిచయం చేశాడు. జిం రీవ్స్ అమెరికా సింగర్ అయినా U.K, Africa , Germany, India ఇంకా శ్రీ లంక లలో పెక్కు మంది అభిమానులున్నారు. క్రిస్టమస్ సమయంలో జిం రీవ్స్ పాటలు మారుమోగుతుంటాయి, ఇప్పటికీ.
ప్రేమ ఎంత మధురమో, ప్రియురాలి మనసు అంతకఠినమైతే! ప్రేమికులు విడిపోవటం హృదయంలో బాధా తప్తమైన గాయానికి కారణభూతమవుతుంది.ఇదే కొందరు కళాకారులు కొన్ని విలువైన కళాసృజనలను సృష్టించటానికి ప్రేరణ అవుతుంది. Jim Reeves పాటలలో ఎక్కువభాగం ఇలా విడిచివెళ్లిన ప్రియురాలిపై పాడినవే. He will have to go, Four Walls లాంటి గీతాలు ఈ విరహాగ్నిలో పుట్టినవే. విరహంలోని మధురిమ అనుభూతి చెందాలంటే జి ం రీవ్స్ పాటలు వినాల్సిందే.
Four Walls
Out where the bright lights are glowing
You're drawn like a moth to a flame
You laugh while the wine's over-flowing
While I sit and whisper your name
Four walls to hear me
Four walls to see
Four walls too near me
Closing in on me
Sometimes I ask why I'm waiting
But my walls have nothing to say
I'm made for love, not for waiting
But here where you've left me, I'll stay
Four walls to hear me
Four walls to see
Four walls too near me
Closing in on me
One night with you is like heaven
And so, while I'm walking the floor
I'll listen for steps in the hallway
And wait for your knock on my door
Four walls to hear me
Four walls to see
Four walls too near me
Closing in on me
Closing in on me
ఈ పాటను జిం రీవ్స్ పాడుతున్న వీడియో ఇక్కడ చూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
ఈ వారాంతంలో Grand Canyon, Las Vegas, Death Valley ల ను దర్శించబోతున్నాను కావున నా బ్లాగుకు నాలుగు రోజులు సెలవు ప్రకటించటమైనది. గమనించగలరు.
అవునా రావుగారు ? అక్కడ కౌబాయ్ లెవరన్నా కనిపిస్తే అడిగానని చెప్పండి.ఆ సినిమాలకు వీర,పిచ్చ,మహా,తీవ్ర అభిమానిని నేను,ఎన్ని వందలసినిమాల్లో చూస్తేనేమి మీలాగా ప్రత్యక్షంగా తిలకించే అవకాశమొస్తుంది ??
:) :)
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: నాకూ కౌబాయ్స్ ను చూడాలన్న ఆసక్తి ఉంది. అమెరికా చాలా పెద్ద దేశం. ఇక్కడి Texas, Oklahoma, Arizona రాష్ట్రాలలో Cowboys ఉంటారు. వీటిలో నేను దర్శించిన Grand Canyon అరిజోనా లో ఉన్నప్పటికీ Grand Canyon లో పచ్చిక బీళ్లు శూన్యం. పశువుల మేతకు పచ్చిక అవసరం. అందుచేత ఇక్కడ కౌబాయ్స్ కనిపించరు. పైన పేర్కొన్న రాష్ట్రాలలో పచ్చిక బీళ్లు ఎక్కువ, రవాణా సౌకర్యాలు తక్కువ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా లో మారుమూల ప్రాంతాలకు నేడు రైలు సదుపాయం కూడా ఉంది. నేడు వీరి సంఖ్య తగ్గింది. వేసవి కాలంలో జరిగే రోడియో ఉత్సవాలలో, కౌబాయ్స్ ను మనము చూడవచ్చు.
రాజేంద్ర కుమార్ గారు,
కౌబాయ్ సంస్కృతి దాదాపు అంతరించిపోయింది. ఇప్పుడది వెస్టర్న్ సినిమాల లోనూ, 'రోడియో'ల పేరిట అక్కడక్కడా జరిగే వేసవి జాతరలలోనూ మాత్రమే కనిపిస్తుంది. క్యాలిఫోర్నియాలో లివర్మోర్ అనే ఊర్లో ప్రతి ఏడాదీ జూన్ లో రోడియో జరుగుతుంది (అల్లప్పుడు 1984లో ఎన్టీవోడు ఆపరేషన్ కోసం అమెరికా వస్తే నాదెండ్ల తిరుగుబాటు చేశాడే .. ఆ ట్రిప్పులో ఎన్టీవోడు ఈ లివర్మోర్లో పేద్ద హిందూ టెంపుల్‌కి శంఖుస్థాపన చేశాడు. తూర్పు తీరంలో పిట్స్బర్గ్ లాగా, పడమటి రాష్ట్రాల్లో ఈ లివర్మోర్ గుడి బాగా ప్రసిద్ధం. కుసింత సెరిత్ర జ్ఞానం :-) )
సరే. సంగతేంటంటే, ఆ మధ్యెప్పుడో నేను లివర్మోర్ రోడియోని వీడియో తీసి ఎడిట్ చేశాను. ఆ వీడియో ఇక్కడ నొక్కితే కనిపిస్తుంది. ఎడిట్ చేసేటప్పుడు పుల్డౌన్ తీసెయ్యటం మర్చిపోవటం వల్ల ఇందులో interlacing artifacts వచ్చాయి, ఏమనుకోకుండా చూడాలి.
మీకు ఓపిక, బ్యాండ్‌విడ్త్ ఉన్నట్లయితే మెగా అప్లోడ్ వారి సైటు నుండి ఈ వీడియో అసలు ప్రతిని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. జాగ్రత్త, అది బహు పెద్ద ఫైలు (సుమారు 280MB). డౌన్లోడ్ చేశాక VLC Player లో video>>Deinterlace>>Blend సెట్ చేసుకుని చూడండి.
బాగుందండి అబ్రకదబ్రగారు.కౌబాలలు,కౌగరల్స్,బుల్లిబుల్లి పోనీలు,అయితే డ్యూరేషన్ తక్కువగానే ఉంది కానీ అంత పెద్ద ఫైలు ఎందుకయ్యిందంటారు?
@రాజేంద్ర
అది హై-డెఫినిషన్ వీడియో. నిజానికా నాలుగు నిమిషాలు 800MB దాకా పట్టింది. బ్లూ-రే ప్లేయర్లో 52 అంగుళాల హెచ్డి టివి తెర మీద బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాకపోతే అంత పెద్దది ఎక్కించటానికి మెగా అప్లోడ్ వాళ్లొప్పుకోరని దాన్ని 280MBకి కుదించాల్సొచ్చింది. ఇదైతే నలభై అంగుళాల దాకా బాగుంటుంది, అంతకన్నా పెద్ద తెర మీద మసకబారటం మొదలౌతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి