బ్లాగులోకంలో కల్లోలం లేపిన ఆ నలుగురు ఎవరో దీప్తిధారకు తెలిసింది. భారతదేశానికి దూరంగా, పర్యటనలలో ఉండటం వలన వీరిగురించి ఆలస్యంగా తెలిసింది. ఈ దుష్ట చతుష్టయం గురించి నా కంటే పాఠకులకు ఎక్కువే తెలిసి ఉండగలదు. వీరిని దుష్ట చతుష్టయం అనటం న్యాయమేనా?వీరు విదేశీ శక్తులేనా?వీరి కుట్రలేమిటి?వీరి అసభ్యరాతలకు కారణమేమిటి?ఇంతకీ వీరు నలుగురా, ముగ్గురా,లేక, ఇద్దరా?ఒక్కరే బహు పేర్లతో రాస్తున్నారా?
"ఏ విదేశీ శక్తి లేదు, ఈ కుట్ర లేదు. ఓర్వలేని వారి పని. " -పారాహుషార్.... జాగ్రత్త పడండి అనే టపాలో జ్యోతక్క అంటున్నది.కేవలం ఓర్వలేనితనమే వీరిచే అసభ్యరాతలు రాయించిందా? ఓర్వలేనితనం కంటే మించినదే వీరితో అలాంటి హేయమైన పని చేయించింది.
"we are making a laughing stock of ourselves . ఇలాటివాటికి అనవసరంగా డప్పు కొడుతూ ప్రచారం చేసి అనవసరమయిన " అపోహలు, అపార్థాలూ, అవకాశాలూ " ఇంకా పెంచిన వాళ్ళమవుతున్నాము" అన్న వంశీ గారి మాటతో కనీసం వివాదంలోకి లాగబడిన బ్లాగర్లు ఏకిభవించి ఉంటే మొరిగిన/మొరుగుతున్న కుక్కలు అలసి, సొలసి, సొమ్మగిల్లిపడిపొయ్యెవన్న అభిప్రాయం మీద "మీ స్పందన" ? అని అడుగుతున్నది netizen .
"మీరు గమనించారో లేదొ కానీ కాగడా మరియు ధూం బ్లాగుల ధోరణిలో చాలా మార్పు వచ్చింది. కాగడా వారు గతంలో జరిగిన తప్పులను (కొంతవరకు) ఒప్పుకొని తమ బ్లాగులో రాడికల్ మార్పులు తీసుకొని వస్తామని ప్రకటించి పాటించారు. ఇకపై వ్యక్తినింద వుండదని, సిద్ధాంత పరమయిన చర్చ మాత్రమే వుంటుందని ప్రకటించారు. ఆ రకంగా తమ బ్లాగులని క్లీన్ చేయడం నేను గమనించాను. మహిళా బ్లాగర్లపై అసభ్యకరమయిన వ్యాఖ్యలు, టపాలు ఆ బ్లాగుల్లో ఇప్పుడు లేవు. ఈ-తెలుగు గురించి మాత్రం విమర్శలు చెలరేగుతూనే వున్నాయి." అని శరత్ తెలుపుతున్నారు.
ఈ గాంగ్ లోని వ్యక్తులు మారారా? వీరు మారినట్లుగా, వీరి రాతలవలన ప్రభావితమైన బ్లాగర్లు లేక పాఠకులు ఎవరైనా చెప్పగలరా? మారితే ఈ ముసుగులెందుకు? దివిటీలెందుకు? e - తెలుగు పై వీరికున్న సందేహాలు నిజాయితీ గలవేనా? నిజాయితీ గలవే అయితే, హైదరాబాద్ లో నెల నెలా జరిగే బ్లాగర్ల సమావేశానికొచ్చి తమ సందేహాలు e- తెలుగు పెద్దలను అడిగి తెలుసుకోవచ్చుగా? మిడి మిడి జ్ఞానంతో e - తెలుగుపై బురద చల్లటమెందుకు?
తమ బ్లాగులలోని అసభ్య రాతలు తొలగించి, ముసుగు తీసి ఎప్పుడైతే జనస్రవంతి లో కలిసిపోతారో అప్పుడే వీరు మారినట్లు ఋజువు. అందాకా వీరి ప్రవర్తన అనుమానాస్పదమే. ఈ నలుగురు విద్యావంతులు, తమ మేధస్సును సక్రమమైన మార్గంలో వినియోగిస్తారని ఆశిద్దాము. ఆ తరుణం రావాలని, వీరికి హృదయపూర్వక స్వాగతం చెప్పాలనీ కోరుకుందాము.
8 కామెంట్లు:
ఈ సీరియల్ అయిపోయింది అనుకున్నాను.. ఇంకా సాగతీస్తున్నారా రావు గారు?
ఆ తెలిసిన వివరాలు పంచితే,మిగతావారు కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
కుట్రా లేదు పాడూ లేదు. వాళ్లకంత సన్నివేశం నాస్తి. చీమ చిటుక్కుమంటే ఉలిక్కిపడే వాళ్లతో ఇదో గోల - ప్రతి దాని వెనకా విదేశీ హస్తం, సైకిలు, కారు, బస్సు అంటూ.
Lol... this is a funny post. So hilarious!!
@imaaya (శాక్య ముని): ఈ వ్యాఖ్య రాసింది మీరా లేక మీ పేరుతో మరొకరా? "ఇది ఆలోచనలు స్వేచ్ఛ గా ప్రవహించేచోటు… అవును స్వేచ్ఛ గా … విచ్చలవిడిగా కాదు! ఇది పరమాద్భుత భావాలతో మనిషి ఆడుకునే చోటు…" అని వెలిబుచ్చిన మీకు, ఎంతో గంభీరమైన ఈ వ్యాసం నవ్వు తెప్పిస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంత నవ్వు తెప్పించే విషయమేమున్నదీ వ్యాసంలో?
@cbrao
నవ్వు తెప్పించటానికి కారణాలు ఉన్నాయి.
"బ్లాగులోకంలో కల్లోలం లేపిన ఆ నలుగురు ఎవరో దీప్తిధారకు తెలిసింది"
"వీరు విదేశీ శక్తులేనా?వీరి కుట్రలేమిటి?వీరి అసభ్యరాతలకు కారణమేమిటి?ఇంతకీ వీరు నలుగురా, ముగ్గురా,లేక, ఇద్దరా?ఒక్కరే బహు పేర్లతో రాస్తున్నారా?"
ఇలాంటి పరస్పర విరుధ్ధమైన మాటలు ఒకే పేరా లో కనబడటం నవ్వు రావటానికి ఒక కారణం. ఇక్కడ అప్రస్తుం అనిపిస్తే నా రెండు వ్యాఖ్యలను తొలగించగలరు.
నిజం చెప్పొద్దూ
నాక్కూడా
నవ్వు
జాలి
మొ.
అన్ని భావాలు వచ్చాయి.
మీరు ఇప్పుడున్నది విదేశంలోనే కదా? కాస్త అక్కడ జేమ్స్ బాండ్ అవతారం ఎత్తి కనిపెడుదురూ. పుణ్యం వుంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి