జీతం కోసం ఆంగ్ల భాష
జీవితం కోసం అమ్మ భాష
జీవితం కోసం అమ్మ భాష
తెలుగు బాట -తెలుగు కై నడుద్దాము.
మాతృభాష తెలుగు పై ఎంత మమకారం ఉన్నా,ఉద్యోగం,పరిశోధన,
వ్యాపారాల కోసం ఆంగ్ల భాష నేర్వటం తప్పనిసరవుతుంది. అయితే ఎవరైనా ఏ పుస్తకమైనా మాతృభాషలో చదివి ఆనందించినంతగా పరాయి భాషలో చదివి ఆనందించలేరు.మనకు గాయమయితే, ఓర్వలేని బాధ కలిగితే అమ్మా అనే అంటాం కాని మదర్ అని అనము. మాతృభాష మన గుండెలలోంచి తన్నుకు వస్తుంది. మీ పిల్లలకు తెలుగు నేర్పండి. సిలికానాంధ్రా వారి మా బడి లో మీ పిల్లలు తెలుగు సులభంగా ఆడుతూ, పాడుతూ నేర్వగలరు. మీ పిల్లలకు తెలుగు నేర్పటంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను http://etelugu.org/ వారి దృష్టికి తీసుకురావచ్చు. మీ పిల్లలకు మాతృభాష కమ్మదనాన్ని దూరం కానివ్వకండి.
Click on images to enlarge
తెలుగు సాహిత్యానికి సంబంధించి 3 విశిష్ట పత్రికలున్నాయి. ఇవి మనకు పత్రీకలమ్మే దుకాణాలలో కనపడవు.ఏవో కొన్ని పెద్ద పుస్తకాల దుకాణాలలో తప్పించి ఇవి మరెక్కడా కనపడవు కనుక వీటిని గురించి తెలుగు పాఠకులకు తెలియదనే చెప్పాలి. తెలిసినా ఇవి సులభంగా లభ్యం కావు. ఈ పుస్తక ప్రదర్శనలో ఈ పత్రికలకు వార్షిక చందాదారులయితే ఈ పత్రిక తిన్నగా మీ ఇంటికే వస్తుంది.మంచి పత్రికలను చదవండి, ప్రోత్సాహించండి. చందాదారులయి మనము వాటిని బతికించుకుందాము. ఇది మీ ఉత్తమ అభిరుచిని తేటతెల్లం చేస్తుంది. ఈ వ్యాసాలలో ఇంతవరకూ ప్రస్తావించని పత్రిక -సాహిత్య ప్రస్థానం కూడా ఈ మూడు పత్రికలలో ఒకటి. వీటి వివరాలు 1) మిసిమి -చింతనాత్మక సారస్వతం -సంస్థాపక సంపాదకులు రవీంద్రనాధ్ ఆలపాటి. రెసిడెంట్ ఎడిటర్: వల్లభనేని అశ్వినీ కుమార్ 2) పాల పిట్ట -సంపాదకుడు: గుడిపాటి 3) సాహిత్య ప్రస్థానం -సంపాదకుడు: తెలకపల్లి రవి
Click on images to enlarge - Narla chiranjeevi and Devulapalli Krishna Sastry
ఈ-తెలుగు స్టాల్ ను ఆనుకుని సాహితీ స్రవంతి వారి స్టాల్ ఉంది. ఇది తప్పక దర్శించ తగ్గ స్టాల్. హైదరాబాదు బుక్ ఫెయిర్ వారు ఇంకా సాహితీ స్రవంతి వారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టాల్ ఇది. మరెక్కడా లభ్యం కాని,ఎందరో రచయితల అపురూప చిత్రాలు ఈ స్టాల్ లో మనము చూడవచ్చు.నేను ఈ స్టాల్ ను దర్శించినప్పుడు సాహితీ ప్రస్థానం సహ సంపాదకుడు వొరప్రసాద్ అక్కడే ఉన్నారు. మన తెలుగు బ్లాగుల గురించిన వ్యాసం ప్రజా శక్తి దిన పత్రిక ప్రచురణార్థం పంపమని కోరారు. ఆసక్తిగల బ్లాగరులు ఈ విషయమై వ్యాసం వారికి పంపవచ్చును.
ఈ చిత్రంలో, సాహితీ స్రవంతి స్టాల్ నిర్విహిస్తూ కనిపిస్తున్న తంగిరాల చక్రవర్తి కవి, కధా రచయిత ఇంకా పలు కవితా సంకలనాల సంపాదకుడు కూడా. వారి తండ్రి గారు తంగిరాల కృష్ణ ప్రసాద్ (నాటక ప్రయోక్త) స్మృతి గా తంగిరాల రంగస్థ పురస్కారాన్ని ప్రతి సంవత్సవరం నాటక రంగం లో సేవ చేస్తున్న ప్రయోక్తలు, రచయితలు,నటులకు ఇచ్చి నాటక రంగాన్ని ప్రోత్సాహిస్తున్నారు. సాహిత్య ప్రస్థానం మాస పత్రిక కు చందా ఇక్కడ కట్టవచ్చు. ఆ పత్రిక పాత సంచికలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి.
శనివారం కావటం తో ఈ రోజు ఈ-తెలుగు స్టాల్ కు బ్లాగరుల సందర్శనం ఎక్కువగానే ఉంది. శ్రీయుతులు పప్పు నాగరాజారావు, అక్కిరాజు భట్టిప్రోలు (మూడు బీర్లు తర్వాత),కత్తి మహేష్ కుమార్, కోడిహళ్లి మురళీ మోహన్ (తురుపు ముక్క) ,తెలుగు సుజాత (మనసులో మాట), పూర్ణిమ (ఊహలన్నీ ఊసులై), స్వాతి (కల్హారా),సుభాషిణి పోరెడ్డి (మట్టి మనసు) మొదలగు బ్లాగర్లు ఈ-తెలుగు స్టాల్ కు వచ్చిన వారిలో ఉన్నారు.
Left to right sitting: Sri Katti Mahesh Kumar, Smt Satyavathi, Veeven
Left to right standing: Srinivasa Raju, Rahamanuddin Shaik,Kautilya
కొస మెరుపు: వీవెన్ నాయనమ్మ శ్రీమతి సత్యవతి గారు ప్రదర్శన తుది దాకా మాతో స్టాల్ లో గడపటం విశేషం. తెలుగు పుస్తకాలు చదువుతానని వారు నాతో అన్నారు.
Photos: cbrao -Nikon D90
6 కామెంట్‌లు:
బుక్‌ఫెయిర్‌లో లభించే సాహిత్య పత్రికలను గురించి చెప్పారు బాగానే ఉంది. కానీ మరొక పత్రిక సంగతి మరచిపోయినట్లున్నారు. అది సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి ద్వైమాస పత్రిక సాహితీ స్రవంతి. ఇది కూడా చందా కట్టి ప్రోత్సహించవలసిన పత్రికే.
ఈ సారి నేను రాలేక పోతున్నాను. ప్రయత్నిస్తాను. ఏదో ఒక రొజు వస్తాను. సమాచారాన్ని మాకు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు.
సిబిరావు గారూ,
మిసిమి కి ప్రస్తుతం చందా కడుతున్నాను. మిసిమి చందా వివరాలు http://misimi-monthly.com/ లో ఉన్నాయి. పాలపిట్ట అడ్రెస్ లేక ఫోన్ నంబర్ ఉంటే తెలియజేయగలరు.
కృతజ్ఞతలు.
@రమణ: పాల పిట్ట సంవత్సర చందా కింద రూ.300/- కు చెక్ లేదా డ్రాఫ్ట్ Palapitta Books పేరు మీద హైదరాబాదులో లో చెల్లింపబడేట్లు ఉన్నది, ఈ కింది చిరునామాకు పోస్ట్ చెయ్యండి.
Manager,
Palapitta,
H.No: 16-11-20/6/1/1,
403,Vijayasai Residency,
Saleemnagar,Malakpet,
Hyderabad-500 036
Phone No: 9848787284
@కోడీహళ్ళి మురళీ మోహన్: అవును. సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి ద్వైమాస పత్రిక సాహితీ స్రవంతి కూడా ప్రోత్సాహించవలసిన పత్రిక.
@రాజశేఖరుని విజయ్ శర్మ: తప్పక రండి. పాత మిత్రులను కలుసుకునే మంచి అవకాశం. మంచి పుస్తకాలు అన్నీ ఒకే చోట, తగ్గింపు ధరకు లభ్యమవుతాయి ఇక్కడ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి