శనివారం, జూన్ 28, 2008

అంతర్జాల వీక్షణం -3నమ్మ బెంగలూరు
http://avee-ivee.blogspot.com/2008/06/blog-post_11.html

ಮಹಾ ಯೋಗಿ ವೇಮನ ರಸ್ತೆ - ఎందుకు ఏఁవిటీ ఎలా
http://andam.blogspot.com/2008/06/blog-post_27.html

మీరు మన బెంగలూరు లో బస్ ప్రయాణం చేసారా? లేకుంటే ఒక సారి పయనించి చూడండి. అక్కడి బస్ లో ప్రయాణం, తన బ్లాగు చదవటమూ గొప్ప education అని సెలవిస్తున్నారు త్రివిక్రం. మీకు స్వయంచాలిత బాగిలు అంటే తెలుసా? ఈ టపా చదివితే మీకు గొప్ప జీవన తత్వం నడువె అంతరవిరళి అఫవాతక్కి అవసరవే కారణ అనే మాటలలో గోచరమవుతుంది. కన్నడలో ఉంది, ఇది ఎలా అర్థమవుతుంది అని బెంబేలు పడవద్దు. మీకు తెలుసా నమ్మ బెంగలూరు లో పూలు, పాలు ఇంకా పళ్లు లభ్యం కావని? నమ్మశక్యం కాని ఈ విషయానికి కారణ మేమిటో తెలుసా? త్రివిక్రం మార్గసారధై మనకు వాటి మతలబు, హాస్యభరితంగా వివరిస్తారు. కొరమంగలం లో ఉన్న మహాయోగి వేమన రస్తే గురించి, ఆ పేరెలా వచ్చిందో వగైరా కథా కమామిషు నమ్మ రాకేశ్వర మాటలలో తెలుసుకోండి. ఆసక్తికరమైన కథనం.

తెలుపు_నలుపు
http://sbmurali2007.wordpress.com/2007/12/05/problem/

ఆస్ట్రేలియాలో అడవులకంటే ఎడారి ప్రాంతమే అధికం. భూ విస్తీర్ణ తో పోలిస్తే, జనాభా సంఖ్య తక్కువ. "సాధారణంగా మనం ప్రకృతి అందమంతా గల గలా పారే నదుల్లోనూ, పచ్చని చేలల్లోనూ వుందని అనుకుంటాం. “అక్కడేముంది, నా మొహం, ఉత్త ఎడారి ప్రాంతం”, అని మనం చాలా సార్లు చప్పరించేస్తాం కూడా. కానీ ఆస్ట్రేలియా ఖండాన్ని చూసిన తరువాత మనకనిపిస్తుంది, ఇంత ఎర్రటి ఎడారి కూడా ఎవరో చిత్రకారుడు ప్రశాంతమైన మనసుతో కుదురుగా కూర్చుని గీసిన బొమ్మలా ఎంత అందంగా వుందని." అంటారు అడిలైడ్ నగరంలో నివసించే శారద. ఆస్ట్రేలియా దేశం లోని Great Barrier Reef, 12 Apostles, Kangaroo island మొదలగు సుందర ప్రాంతాల గురించి వివరిస్తున్నారీ వ్యాసంలో. మీ పడక్కుర్చీలో కూర్చుని, ఆస్ట్రేలియా చుట్టిరండి.


మారెప్పోపాఖ్యానం
http://anilroyal.blogspot.com/2008/05/blog-post_06.html

లీలామోహనం : చిరంజీవిపై మారెప్ప దాడి
http://vijayamohan59.blogspot.com/2008/06/blog-post_24.html

రాజకీయాలు మురికివన్న అపప్రధ ఊరికే రాలేదు. ఎంతసేపూ అవతల వారిని ఆడిపోసుకుని పైకి రావాలన్న దుగ్ధ ఎక్కువగా కనిపిస్తుంది. మంత్రి మారెప్ప లీలలు చూశారా అంటూ అబ్రకదబ్ర, విజయమోహన్ లు చెప్తున్న కబుర్లు విన్నారా? చిరంజీవిని రక్తవ్యాపారి అంటూ తాజాగా వార్తలలోకి ఎక్కిన మారెప్ప పై విశ్లేషణలే ఈ వ్యాసాలు..

అమెరికాలో వస్త్రధారణ
http://www.apweekly.com/sahitya/sahi.asp?ID=AWA20051011033557&Title=Literature+-+Miscellaneous&lTitle=&Topic=0&Author_Id=0&spart=0&scat=0&ndate=10/11/2005

మీరేదైన కొత్త వ్యక్తుల గుంపులోకి వెళితే, వారు మొదటగా గమనించిందేమిటో తెలుసా? మీ ఆహార్యాన్ని. మీ దుస్తుల బట్టి మీకు గౌరవం లభిస్తుంది. పరిచయం అయ్యాక, మీ గురించి తెలిసాక మీ వ్యక్తిత్వం బట్టి మీకు గౌరవం లభిస్తుంది. ఎక్కువ విని, తక్కువ మాట్లాడే వారికి ఎక్కువ గౌరవం లభించటం చూస్తుంటాము. అమెరికా లో కూడా, మీరు వేసుకునే దుస్తుల బట్టి మీకు గుర్తింపు రావటమో, లేక గుర్తింపు లేక పోవటమో వుంటుంది. వస్త్రధారణ బట్టి, వ్యక్తులను పాప్యులర్, జాక్స్‌, ప్రెప్పీస్,పంక్‌,గాత్,గీక్‌,నెర్డ్‌,నార్మల్‌ ఇంకా గేమర్స్ అని వ్యవహరిస్తారు. మరి వస్త్రధారణ ప్రకారం మీరు ఏ group నకు చెందుతారు? వస్త్రధారణ పై సురేంద్ర కె. దారా విశ్లేషణ చూడండి.

యాహూ మెయిల్‌లో తెలుగు!
http://veeven.wordpress.com/2007/09/16/telugu-in-yahoo-mail/

ఉత్తరాలలో ఎక్కువమంది తెలుగు వాడరు కారణమేమంటే ఉత్తరం అందుకునే వారిలో ఎక్కువమందికి యాహూ మైల్ ఉండటమే. శోధన బ్లాగు సమీక్షింపదలచి సుధాకర్ కు జులై 2006 లో, నేను రాసిన జాబుకు తన జవాబు నా యహూ పెట్టెలోకి వచ్చింది. తెరిచి చూస్తే అంతా గ్రీక్, లాటిన్. ఉత్తరం అర్థం కావటం లేదని నేను, మరలా జవాబు పంపానని సుధాకర్, ఇలా ఇద్దరి మధ్య 17 ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. మధ్య కొన్ని ఉత్తరాలలో, తెలుగు కుదరక పోతే పరవాలేదనీ, జవాబు ఇంగ్లీషు లో పంపమని కూడా రాయటం జరిగింది. జవాబు, తెలుగులోనే రాయాలన్న సుధాకర్ కుతూహలంతో, చివరకు తన ఉత్తరాలు నేను చదవలేకపోవటము, శోధన బ్లాగు నేను సమీక్షకుండానే మిగిలిపోవటమూ జరిగింది.
వీవెన్ తెచ్చారు శుభవార్త. ఇప్పుడు మీరు జి-మైల్ నుంచి యాహూ కి పంపే తెలుగు ఉత్తరాలు, ఎలా పంపాలో సులభంగా వివరిస్తున్నారు.


Bhumika magazine

ఉద్వేగంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం
http://bhumika.org/archives/479


స్త్రీవాద పత్రికగా `భూమిక’ ప్రాచుర్యం పొందింది. గత 15 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈ పత్రిక నడుపుతున్నారు కొండవీటి సత్యవతి. ఇలాంటి పత్రికలు ఆర్థిక పరంగా, స్వయంగా నిభాయించుకు రావటం కష్టం. కారణం ప్రకటనలు రాక పోవటం, చాలినన్ని ఆర్థిక వనరులు లేక పోవటమూ. గత 2008 మార్చ్ నెల లో, ఆర్థిక భారం వలన పత్రిక వెలువరించ లేక పోతున్నట్లుగా తెలిపారు. ఈ కారణంగా, పత్రిక నిర్వహించిన, కథల పోటీ బహుమతి ప్రదాన సభలో, బహుమతి గ్రహీతలు, బహుమతి సొమ్మును, భూమిక పత్రికకు ఇవ్వటాన్ని లైలా యెర్నేని తప్పు పట్టి, అసలు ఇలాంటి ఆడ పత్రికలు గిట్టితే మటుకు నష్టేమేమిటి అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది ఎన్నో కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఆడవారి కోసం ప్రత్యేక పత్రికలు అవసరమా? దీని పై చర్చను చూడండీ టపాలో.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి