బుధవారం, జూన్ 04, 2008

పుస్తకావిష్కరణ సభలు


దీప్తిధార ప్రచురణ e పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్ర మూర్తి

మీకు పుస్తకావిష్కరణ సభలకు వెళ్లే అలవాటు ఉందా? మన దురదృష్టం; ఇలాంటి సభలకు ఎక్కువమంది జనం రారు.కవితలు ప్రచురిస్తే,కొనేవారుండరు. స్నేహితులకు, బంధువులకు నూతన సంవత్సర శుభాకాంషలతో పాటుగా, ఇవి పోస్ట్ చెయ్యాల్సిందే. ఈ మధ్యనే ఒక పుస్తకావిష్కరణ విశేషాలను వివరిస్తూ,మిత్రులు కస్తూరి మురళీకృష్ణ అంటున్నారు " నేనో పుస్తకావిష్కరణ సభ చేస్తే పిలిచింది 300.వచ్చింది ముగ్గురు.అదీ మా అమ్మ,చెల్లి,భార్య!" తెలుగు నేలన పుస్తక పఠనం తగ్గింది. యాంత్రిక జీవనం. అంతా busy, busy.

ఇలాంటి పరిస్థితులలో ఒక e-book ఆవిష్కరణ సభ ఎలా వుంటుందో మీరు ఊహించుకోగలరు. మీ ఊహలకు భిన్నంగా పురాణ ప్రలాపం e పుస్తకావిష్కరణ సొమాజీగూడా ప్రెస్ క్లబ్ ఆవరణలో, ఎంతో ఉత్సాహవంతంగా జరిగింది. తెలుగు పత్రికలవారు, ఎలెక్ట్రానిక్ మీడియా, పుస్తకాభిమానుల కరతాళాల మధ్య జరిగింది. తెలుగుపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా సాక్షి పత్రికలు ఈ ఆవిష్కరణ సభ విశేషాలు ప్రచురించాయి. దురదృష్టవశాత్తూ, ఒక్క దినపత్రిక కూడా, అచ్చుతప్పులు లేకుండా, దీప్తిధారలోని e పుస్తకం డౌన్‌లోడ్ లింక్ ను సరిగా ప్రచురించలేక పోయింది. కరెక్ట్ లింక్ కింద ఇస్తున్నా.

http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html

మీకోసం పత్రికలలో ప్రచురించిన విశేషాల మాల, దిగువున, ఇస్తున్నాను.

వక్తలు ఎడమ నుంచి;ఆంజనేయ రెడ్డి(వేమన ఫౌండేషన్),జె.లక్ష్మీ రెడ్డి, కె.రామచంద్రమూర్తి, C.L.N.గాంధి, ఎన్.ఇన్నయ్యపురాణ ప్రలాపం 'ఇ-బుక్‌' ఆవిష్కరణ
ఖైరతాబాద్‌, జూన్‌ 3 (న్యూస్‌టుడే): ప్రముఖ రచయిత ప్రొ|| హరిమోహన్‌ ఝా మైథిలీ భాషలో రాసిన పురాణ ప్రలాపం తెలుగు అనువాదంతో గల 'ఇ-బుక్‌' ఆవిష్కరణ జరిగింది. పురాణ ప్రలాపం పుస్తకానికి విదేశాల్లో తెలుగు వారి నుంచి మంచి ఆదరణ రావడంతో పుస్తకాన్ని వెబ్‌సైట్‌ http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29html లో పొందుపర్చినట్లు సెంటర్‌ ఫర్‌ ఎంక్వైరీ ఛైర్మన్‌ ఎన్‌.ఇన్నయ్య తెలిపారు. అవసరమనుకుంటే పుస్తకాన్ని పూర్తిగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. పుస్తకాన్ని హైస్కూల్‌ స్థాయిలో నాన్‌డిటెయిల్డ్‌ పుస్తకంగా, టీవీ సీరియల్‌గా ఉంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో ఇ-బుక్‌ ఆవిష్కరణ అనంతరం పుస్తకాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువదించిన ప్రొ.లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ పురాణ ప్రలాపం ఎన్నిసార్లు చదివినా మళ్లీ చదువాలనిపిస్తుందన్నారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రశ్నించే తత్వంతో మూఢనమ్మకాలు తొలగుతాయన్నారు. ఈ పుస్తకాన్ని ఛాందసవాదులు చదివినా, వైరులు చదివినా హాస్యం తప్ప కోపం రాదన్నారు. రవాణాశాఖ జాయింట్‌ కమిషనర్‌ సీఎల్‌ఎన్‌గాంధీ మాట్లాడుతూ వ్యంగ్య వినోద రూపంలో ఉన్న ఈ పుస్తకం మొదలు పెడితే పూర్తిచేయాల్సిందేనన్నారు. ఇందులో హేతువాద భావాలకు దగ్గరి సారూప్యం ఉందన్నారు. ప్రచురణ కర్త (వేమన ఫౌండేషన్‌) ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కూడా విశ్వవిద్యాలయాల్లో మూఢనమ్మకాలపై బోధన చేయడం విచారకరమన్నారు.


వక్తలను పరిచయం చేస్తున్న ఇన్నయ్య (Centre for Inquiry India)సమస్యకు దాడులు ప్రతిరూపాలు కాదు
సోమాజిగూడ, జూన్‌ 3 (ఆన్‌లైన్‌): ప్రశ్న పెట్రోలు కంటే బలమైంది అయినప్పుడు 'ఆంధ్రజ్యోతి' పత్రికను ప్రశ్నించడం మాని పెట్రోలు పోయడం ఏమిటని 'టి ' చానల్‌ సి.ఇ.ఓ. కె.రామచంద్రమూర్తి ప్రశ్నించారు. విద్యా వేత్త, ప్రొఫెసర్‌ జె.లక్ష్ష్మారెడ్డి తెలుగులోకి అనువదించిన 'పురాణ ప్రలాపం' పుస్తకాన్ని ఇంటర్నెట్‌ ద్వారా విదేశాల్లో ఉన్న తెలుగు వారికి అందించేందుకు వెబ్‌సైట్‌ (DEEPTIDHAARA.BLOGSPOT.COM) ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్ర మూర్తి మాట్లాడుతూ పురాణ ప్రలాపం పుస్తకంలో పదబంధాలు సున్నితంగా వ్యంగ్య రూపంలో చెప్పడం వల్ల ఆలోచన పెరుగుతుందన్నారు. ఏపుస్తకం చదివినా అందులో ప్రశ్నించడం మొదలుపెడితే మరో ప్రశ్న మొదలవుతుందన్నారు.
బలహీనమైన వాదన వినిపిస్తుంద న్నారు. హేతుబద్ధంగా వాదన వినిపించాలి కానీ సమస్యకు దాడులు ప్రతిరూపాలుకాదని చెప్పారు. పుస్తక అనువాదకర్త జె.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలుగు పుస్త కాలను హిందీలోకి అనువదించాను కానీ హిందీలో హరిమోహన్‌ ఝూ రచించిన పురాణ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు అందించాలన్న ఉద్ధేశంతో రాశానన్నారు. సమాజంలోని మూఢనమ్మకాలను ఖండించి విమర్శనా త్మకంగా, వ్యంగ్యంగా ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించి, ఆలోచింప చేసే విధంగా పురాణప్రలాపం ఉందన్నారు. ఆర్టీఏ శాఖ అధికారి పి.ఎల్‌.ఎన్‌ గాంధీ మాట్లాడుతూ హేతువాద భావాలను సారుప్యతతో ఆకట్టుకునే విధంగా పురాణ ప్రలాపం ఉందని తెలిపారు. వేమన ఫౌండేషన్‌ అధినేత ఆంజినేయరెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్‌ ద్వారా వేమనసాహిత్య పుస్తకాలు, 5వేల పద్యాలను ప్రాచుర్యం లోకి తీసుకురావడంతోపాటు వేమన గ్రంథాలను ప్రచురి స్తున్నామని వెల్లడించారు.
ప్రముఖ హేతువాది ఇన్నయ్య మాట్లాడుతూ పురాణ ప్రలాపం పుస్తకాన్ని పదవ తర గతిలో పాఠ్యాంశంగా తీసుకురావాలని సూచించారు. టీవీ ల్లో సీరియల్‌గా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చిత్రీకరించాల న్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హేతు వాదులు, రచయితలు, విప్లవ కవులు పాల్గొన్నారు.


అనువాదం చేసిన జె.లక్ష్మీ రెడ్డి

Meeting Photos: cbrao

5 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

ఇది నిజంగా వెరైటీగా ఉంది. ఈ-పుస్తకం కాబట్టి పుస్తకావిష్కరణ సభకూడా వర్చువల్గా పెడితే ...? :-)

అజ్ఞాత చెప్పారు...

భలే వెరైటీ..

-- విహారి

netizen నెటిజన్ చెప్పారు...

కొత్తపాళీ: ఎందుకని పెట్టకూడదు. తాడేపల్లి వారు బ్లాగు పుస్తకాని విడుదల చేసే ప్రక్రియలో ఉన్నట్టున్నారు. ఈ సారి బ్లాగు పుస్తకాన్ని ఇలాగే "వర్చుయల్" గా ఆవిష్కరించవచ్చు. అది వారి ఇష్టం అనుకోండి.

@రావుగారికి: అచ్చుతప్పులు దారుణంగా వచ్చాయి. పేర్లనే "కంత" లు బొంతలుగా మార్చేసారు. పి (Peter) లోలాగానా , సి (calcutta )లో లాగాన తెలియలేదు.

గాంధి గారితో పరిచయమున్నవారికి తెలుస్తుంది - సి. ఎల్. ఎన్ గాంధి అని, కొత్త వారికి తెలియదు.

ఇక ఈ దొంగల స్కూళ్ళు ఎందుకు నిర్వహివిస్తున్నారో ఈ పత్రికా యజమానులు?

Bolloju Baba చెప్పారు...

i expected this kind of things to happen in future. but you made it happen now. congratulations. the reading books has become lesser and lesser now a days. virtual book reading is gaining importance and i am hopeful that it may increase in future. this kind of inaugurations will definitely elicit interest in readers and help in this regard.

bolllojubaba

అజ్ఞాత చెప్పారు...

ఫొటోలో వాళ్ళు పట్టుకున్న పేపర్లలో కూడా లింకు అచ్చుతప్పుగానే (html ముందు చుక్క లేదు) ఉంది కదా. అదే పత్రికలు వాళ్ళూ వేసుకునుంటారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి