ఈ సామెత ఎక్కువమందికి తెలిసిన తెలుగు సామెత. బ్రాహ్మణులెవరో గుర్తించటానికి ఈ జంధ్యం బాగా ఉపయోగపడేది. మరి జగమెరిన బ్రాహ్మణుడిని జంధ్యం లేక పొయినా బ్రాహ్మణుడిగా గుర్తిస్తాము, గౌరవిస్తాము, ఆశీర్వాదం అందుకొంటాము. భాషా ఇండియా బహుమతి గ్రహీత సుధాకర్ జగమెరిగిన బ్రాహ్మణుడు. ఇప్పుడీ సుధాకర్ 'శోధన మీకు నచ్చిందా?' అని అడుగుతున్నారు. నేనడుగుతున్నా - మీ శోధన ఎవరికైనా, ఎందుకు నచ్చదని? తన ఈ బ్లాగును ఇండిబ్లాగర్స్ అవార్డులకు nominate చెయ్యమని రాశారు తన బ్లాగులో. జంధ్యమున్న సుధాకర్ మెడలో మరో జంధ్యం వేద్దామా లేక జంధ్యం లేని వారికి తేనెగూడు వారు sponsor చేస్తున్న ఈ వీరతాడు వేద్దామా? ఆలోచించండి.
- cbrao
పోటీలలో మనకు బాగా నచ్చిన బ్లాగులనే నామినేట్ చెయ్యడం అవసరం. సమర్థుడైన అభ్యర్థిని గత ఎన్నికల్లో గెలిపించామని ఈ ఎన్నికల్లో అతనికి ఓటెయ్యకుండా ఉండం కదా (అంతకంటే సమర్థుడు ప్రస్తుతం పోటీలో ఉంటే తప్ప)? ఉన్నవాటిలో శోధనే అత్యుత్తమ తెలుగు బ్లాగు అని ఎక్కువ మంది అనుకుంటే మళ్లీ శోధనకే అవార్డు రానివ్వండి. తప్పేముంది? పోటీల్లో గెలుచుకునే మెడల్స్ లాంటి ఈ అవార్డులను జంధ్యాలతో పోల్చలేం.
- Trivikram
1 కామెంట్:
ళోళ్ (LOL అన్నమాట :-))
నన్ను కొంపదీసి దిగ్గజం చేసేస్తున్నారా ఏమిటి? నేను ప్రస్తుతానికి సెలిబ్రిటీనే నండి బాబు.
ఇటువంటి కాంటెస్టులకు నామినేట్ చెయ్యమని సొంత సైటు లోనే అడగటం వెబ్ లో ఒక సాంప్రదాయం :-) ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్తారు కదా పెద్దలు.
నాకైతే నా బ్లాగు కంటే చదువరి, చరసాల, త్రివిక్రం, ప్రసాదం గారి బ్లాగులు చదవటం ఇష్టం...అలా ఒకొక్కరికి ఒకో రకం బ్లాగు నచ్చవచ్చు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి