తీపి వార్తలు - రాస్తున్నది- సి.బి.రావు. చక్ర కేళి అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా? ఇవి గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైనవిగా భావించవొచ్చు. నేను ఆంధ్రప్రదేష్ లో పలు జిల్లాలు తిరిగాను కాని ఇవి గుంటూరుజిల్లాలోనే ఎక్కువగా లభ్యం అవటం వలన మిగతా జిల్లాల వారికి వీటి గురించి పెద్దగా తెలియదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ఇది కనపడదు.ఈ పండు పరిమాణంలో చిన్నది గాను, తీపిదనంలో పెద్దదిగాను ఉంటుంది. దీనిగురించి తెలియని వాళ్ళకు ఇది తీపి వార్తేగా మరి.
తీపి వార్తల వివరాలలోకి వెళ్ళేముందు కొన్ని ముఖ్య ప్రధాన వార్తలు
అ) యహూ వెబ్ సైట్ ఇప్పుడు తెలుగులో
ఆ) ఉత్తమ తెలుగు బ్లాగు బహుమతుల ఎంపిక
ఇ) కూడలి
ఈ) తీపి గుర్తులు
అ) యాహూ అని ఒక కేక Junglee చిత్రంలో షమ్మి కపూర్ వేసినది గుర్తుందా? నేను కొంతకాలం ఆ వెబ్ సైట్ భారతీయులదేమోనని భ్రమపడ్డాను. కాకపొయిననూ యహూ అని మీరు ఇప్పుడు తెలుగు లో కూడా అరవవొచ్చు. చూడండి.
http://in.telugu.yahoo.com/
వార్తలే కాకుండా ప్రత్యేక వ్యాసాలు,కథలు, కాకరకాయలతో ఆకర్షణీయంగా ఉంది. ఈ కింద పేజీ తెరవటంలో మీ సహనాన్ని పరీక్షించవచ్చు.
http://docs.yahoo.com/info/suggest/
ఆ) ఉత్తమ భారతీయ బ్లాగుల nomination ఒక కొలిక్కి వచ్చింది. ఇందులో మీ బ్లాగు పేరు ఇక్కడ చూడండి.
http://www.indibloggies.org/nominations-2006/
ఇక్కడ మీ బ్లాగు పేరు ఉన్నవారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ బ్లాగు పేరు లేకపోతే, వచ్చే సంవత్సరం ఉండగలదని నా అకాంష. దానికై ఇప్పటినుంచే కృషి చెయ్యండి.
ఇ) కూడలి మీకు ఇష్టమని నాకు తెలుసు. బృందావనము, కూడలి - అవి అందరివే. గోవిందుడు, వీవెన్ అందరివాళ్ళే. కూడలి మీకు మరింతగా ఉపయోగపడేదిగా ఉండేందుకు ఏమి చెయ్యాలో మీ సూచనలు పంపండి, దిగువ ఇచ్చిన చిరునామాకు.
http://groups.google.com/group/telugublog/
ఈ) తీపి వార్తలు - తీపి గుర్తులు
మీకేమైన తీపి గుర్తులున్నాయా? ఉంటే ఈ టపాకు మీ వ్యాఖ్యానం లో రాసి మీ మిత్రులతో పంచుకోండి. సంతోషం పంచుకున్నప్పుడు నాలుగితలవుతుందని భట్ల పెనమూరు సంగతేమోకానీ మా పొన్నూరులో అంటారు. మొన్న 22 సంవత్సరాల భూమికను అడిగా. తనకేమైనా తీపి గుర్తులున్నాయా అని. తనూ, ఆకాష్ ఎన్నో సాయంత్రాలు ice cream parlor లలో గడిపారట, ఎన్నో ice creams లాగిస్తూ. ఆ మధురమైన సాయంకాలాలు గుర్తుచేసుకునేందుకై ice creams లో వచ్చే sticks పదిలంగా భద్రపరిచిందట. ఆ sticks తన తీపిగుర్తులని భూమిక తలుస్తోంది. అదండీ తీపిగుర్తులు ఐస్‌క్రీం స్టిక్స్ కథ. అవాక్కయ్యారా!
4 కామెంట్‌లు:
thanks
మీరు చెప్పిన తర్వాతే నా బ్లాగ్ బెస్ట్ తెలుగు బ్లాగ్స్ లో ఉందని తెలిసింది.
మీ 'దీప్తి ధార" ఉత్తమ తెలుగు బ్లాగులలో ఒకటి గా ఎంపికైనందున మీకు శుభాభినందనలు.
శుభాభినందనలు.
చెక్కరకెళి అరటిపండు మా గొదావరి జిల్లాల్లొ కూడ చాల ఇష్టపడుతుంటారు. దాని రుచే వేరు...అరటి పళ్ళలొ రారాజు...
ఉత్తమ బ్లాగు కింద ఎంపిక అయినందుకు మీకు నా శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి