శుక్రవారం, అక్టోబర్ 19, 2007

సాహితీవనం -11


కూటి కోసం కోటి తిప్పలు, శ్రీశైలం Photo: cbrao


సాహితీవనం -9 లో మిగిలిన సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత

!) విశ్వనాధ సత్యనారాయణ
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యుడు. వీరు రాసిన వేయి పడగలను స్వర్గీయ పి.వి.నరసింహారావు గారు హిందీలోకి 'సహస్ర ఫణ్‌' పేర అనువదించారు. వీరు రాసిన ఏకవీర ఆధారంగా ఏకవీర చిత్రం వచ్చింది.

F) యాత్రాస్మృతి -స్వీయచరిత్ర రాసినది

2) దాశరధి కృష్ణమాచార్య
స్వాతంత్ర సమరయోధుడు, కవి దాశరధి గారి స్వీయ చరిత్ర ఇది.దాశరధి రంగాచార్య వీరి తమ్ముడు.గాలిబ్ గీతాలకు కృష్ణమాచార్య తెలుగు అనువాదానికి బాపు బొమ్మలు వేశారు.నిజాం రాజు అకృత్యాలను, కాళోజీతో చేతులుకలిపి ఎలుగెత్తి చాటారు.

G) నూరేళ్ల తెలుగు నవల పుస్తకం (వ్యాసాలు) రాసినది1) సహవాసి
జె.ఉమా మహేశ్వర రావు (సహవాసి) ఎన్నొ అద్భుతమైన రచనలందించారు.వాటిలో పంచతంత్రం,రాజశేఖర చరిత్ర(కందుకూరి నవలకు నవీకరణ),అనువాదాలు ఏడు తరాలు, అమ్మ మొదలైనవి. మరణించే దాకా,పీకాక్ క్లాసిక్స్ తో కలిసి పని చేసి, అద్భుతమైన పుస్తకాలను తెలుగు వారికందించారు.
H) సావిత్రి, జమున, ఎన్.టి.రామారావు నటించిన మిస్సమ్మ చిత్రం చూశారా? ఈ చిత్రంలో సావిత్రి అసలు పేరు

4) మహా లక్ష్మి
1955లో విడుదలైన, ఒక అద్భుతమైన, పూర్తినిడివి హాస్య చిత్రం ఇది.ఈనాటికీ నూతనంగా ఉంటుంది.ఎన్ని సార్లైనా చూడవచ్చు.


I) బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే వీరి సిద్ధాంత వ్యాసాన్ని (Ph.D కోసం) అమోదించి డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు పలు చిత్రాలలొ నటించారు.

2) జయమాల
కర్ణాటక లోని ఆల్మట్టీ డాం వలన నిర్వాసితులైన మహిళల, స్థితిగతుల పై చేసిన వీరి పరిశోధనకు డాక్టరేట్ లభించింది. శబరిమలై వెళ్లి స్వామిని పొరబాటుగా తాకినట్లు ప్రకటించి వార్తలలోకెక్కారు.

వివరాలకు చూడండి
http://www.koumudi.net/General/heroine_phd.html


J) హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మణి కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
పి.సుశీల పాడిన ఈ పాట ఏ చిత్రం లోనిది?

2) తెనాలి రామకృష్ణ
ఎక్కువమంది అభిప్రాయపడినట్లు ఇది భక్త జయదేవ చిత్రంలోంచి కాదు. ఈ జయదేవుని అష్టపది తెనాలి రామక్రిష్ణ చిత్రం లోది. మధురమైన ఈ పాట చూడండి.పాటవింటూ మైమరుస్తారు.ఇప్పుడు పాఠకుల స్పందన చూద్దాము. ప్రశ్నలైతే చాలామంది చూశారు కాని కొద్దిమంది మాత్రమే ధైర్యంగా సమాధానాలు పంపారు. ధన్యవాదాలు.సమాధానాలు పంపిన వారి పేర్లు, వారి స్కోర్ ఇవిగో.

1) గిరి 4
2) వికటకవి 5
3) సిరి 8
4) నేను సైతం 9

ప్రశ్నలు కఠినంగా ఉన్నా ఉత్తమసమాధానాలు పంపిన నేను సైతం, సిరి వీరిద్దరినీ దీప్తిధార అభినందిస్తున్నది;వీరతాడు వెస్తున్నది. హై!హై!!నాయకా.వీరిరువిరికీ, రసమయి మాసపత్రిక సంచిక దీప్తిధార నుంచి అందుతుంది.వారి చిరునామాలు,ఫోన్ నంబర్ వివరాలు cbraoin at gmail.com కు పంపవలసినదిగా మనవి.

1 వ్యాఖ్య:

Budaraju Aswin చెప్పారు...

మీ బ్లాగు చాలా బావుందందీ...

మీరు Bird watchers society of AP లో Secretary ఆ..

మీ లాంటి వారిని ఇలా కలినందుకు చాలా ఆనందంగా ఉంది

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి