గురువారం, అక్టోబర్ 04, 2007

సాహితీవనం -7

A) సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు
4) ఎనిమదవ తరగతి నుంచి చదవ వలసినది

B) అల్పజీవి నవల, ఆరు సారా కథలు, ఆరు సారో కథలు రాసిన ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి వృత్తి రీత్యా

1) డాక్టర్
2) Bar Owner
3) అధ్యాపకుడు
4) న్యాయవాది


Gladiola flowers at my home Photo:cbrao

C) Romancing with Life స్వీయ చరిత్ర రాసిన వారు

1) సునీల్ దత్
2) దేవ్ ఆనంద్
3) రాజ్ కపూర్
4) గురు దత్

D) భారతదేశము, శ్రీలంక ల మధ్య రామసేతు నిర్మాణం గావించిన ఇద్దరు కట్టడ నిపుణుల లో ఒకరు

1) విభీషణుడు
2) సుషేణుడు
3) హనుమంతుడు
4) సుగ్రీవ

E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత

!) విశ్వనాధ సత్యనారాయణ
2) చలం
3) దేవులపల్లి
4) కట్టమంచి రామలింగా రెడ్డి

F) యాత్రాస్మృతి -స్వీయచరిత్ర రాసినది

!) కందుకూరి వీరేశలింగం
2) దాశరధి కృష్ణమాచార్య
3) చిలకమర్తి లక్ష్మినరసింహం
4) టంగుటూరి ప్రకాశం

G) నూరేళ్ల తెలుగు నవల పుస్తకం (వ్యాసాలు) రాసినది

1) సహవాసి
2) డి.వెంకట్రామయ్య
3) వల్లంపాటి వెంకట సుబ్బయ్య
4) పెద్దిభొట్ల సుబ్బరామయ్య

H) సావిత్రి, జమున, ఎన్.టి.రామారావు నటించిన మిస్సమ్మ చిత్రం చూశారా? ఈ చిత్రంలో, మేరీ గా నటించిన, సావిత్రి పాత్ర అసలు పేరు

1) కమల
2) కనక లక్ష్మి
3) వెంకట లక్ష్మి
4) మహా లక్ష్మి

I) బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే వీరి సిద్ధాంత వ్యాసాన్ని (Ph.D కోసం) అమోదించి డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు పలు చిత్రాలలొ నటించారు.

1) మోహన్ బాబు
2) జయమాల
3) సుమలత
4) జయంతి

J) హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

పి.సుశీల పాడిన ఈ పాట ఏ చిత్రం లోనిది?

1) భక్త జయదేవ
2) తెనాలి రామకృష్ణ
3) విప్రనారాయణ
4) మహాకవి కాళిదాసు

షరా మాములే! మీ జవాబులు దీప్తిధారకు ఎప్పటిలాగే పంపండి.

9 వ్యాఖ్యలు:

వికటకవి చెప్పారు...

నమస్తే రావు గారు,
ఈసారి కొంచం సులువుగానే ఉన్నాయి.

A) 3
B) 4
C) 2
D) 2
E) 1
F) 3
G) 2
H) 1
I) 4
J) 1

స్వయం ప్రతిభ
A,D,H,I,J

గూగులమ్మ ప్రతిభ
B,C,E

ఊహా ప్రతిభ
F,G

ఈ రకంగా బుర్రకి పని కల్పించారు, ధన్యవాదములు!

cbrao చెప్పారు...

@వికటకవి
అభినందనలు.50 శాతం అంటే 5 మార్కులు సాధించారు.

వికటకవి చెప్పారు...

అయ్యో రామ! గూగులమ్మవి 3 గాక 2 మార్కులేనా వచ్చినవి. అయితే ఊహలమ్మ బొత్తిగా సాయ పడలేదన్నమాట. ప్చ్...

Giri చెప్పారు...

అన్నీ రావు కాని, వచ్చిన కొన్ని ఇవిగో.
A-3
C-2
D-2 రామసేతు అని ఇప్పుడంటున్నము కాని ఇది అసలు నలసేతు, కదా?
H-4
J-1

సిరి చెప్పారు...

నమస్తే.
ఇవి నా సమాధానాలు.

A- 3
B- 4
C- 2
D- 4
E- 1
F- 2
G- 1
H- 4
I- 4
J- 2

రెండు జవాబులు గురించి ఇంకా డౌటే...!

నేనుసైతం చెప్పారు...

A)3
B)4
C)2
D)2
E)1
F)2
G)1
H)4
I)2
J)1

పై సమాధానములు అన్నిటికి నేనే భాద్యుడను.ఎవరికి, ఎటువంటి ప్రమేయం లేదు :)

Solarflare చెప్పారు...

చిన్న మనవి -
To make it more intersting and to let most of us give answers, can I suggest something?
- the answers till now to be hidden till the reader gives his own.
- A deadline, after which the comments received till now are made public.
This would give the likes of us to give answers.By the time we get around to reading the post and replying, most of the answers would already be present.

తెలుగు వీర చెప్పారు...

మంచి ఆలోచన సోలార్‌ఫ్లేర్!!

Sridevi చెప్పారు...

ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు ఎక్కడున్నాయి? ఇదే బ్లాగులో సుషేణుడు వారధి కట్టినట్లు వ్రాసారు (ఇంకో టపాలో)! సుషేణుడు సుగ్రీవునికి వైద్యుడని చదివానొకచోట (ఎంత వరకు నిజమో తెలియదు :-) )! వారధి కట్టినట్లున్న సమాచారం మీకెక్కడ లభ్యమైనదో చెప్పగలరా, దయచేసి?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి