మంగళవారం, జనవరి 01, 2008

అంతర్వీక్షణం


గౌతమి స్నాన ఘట్టం, రాజమహెంద్రవరం Photo: cbrao

ఎవరి పేరును వారు గూగుల్ లో అన్వేషించి ఫలితాలు చూసుకోవటం ఎక్కువైందని గూగుల్ సర్వే ఫలితాలు చెప్తున్నై. ఎదుటవారిని అర్థం చేసుకోవటం కంటే మనలను మనం అర్థం చేసుకోవటం ఎక్కువ కష్టమైనా, అభిలషణీయమైనది. ఆశ్చర్యమేమంటే మనలో లోపాలు ఎదుటవారు గుర్తించక ముందే, మనం గమనించలేక పోవటం. నిజమైన స్నేహితుడే, నీ హితాన్ని కోరి, నీలోని లోపాలను నీకు చెపుతాడు.

నా బ్లాగు దీప్తిధార మొదలు పెట్టింది 26th July 2006 న. మొదలు పెట్టి ఒకటి రెండు పారాలు రాసి, వదిలేసా. కారణం తెలుగు టైప్ చెయ్యటం కుదరక. కొన్ని నెలల తరువాత, తెలుగు ను లేఖిని లో టైప్ చెయ్యటం నేర్చుకుని, కష్టం మీద ఆ వ్యాసం పూర్తి చేశా. నా మొదటి టపా రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురూ. ఇందులో రడియో కు నాకు ఉన్న అనుబంధం, ఆ రోజుల్లో రచయితలతో నా పరిచయాలు, సమావేశాల గురించీ రాయటం జరిగింది. ఆ తరువాత చాన్నళ్లకు 15th Sept 2006 న మిత్రులు శ్రీ ఐ. మురళీధర్ కు ధర్మనిధి పురస్కార ప్రధాన సందర్భంలో, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పై రాసిన వ్యాసంతో, పునః ప్రారంభించి, అడపా దడపా బ్లాగులో నా రచనలు ప్రకటిస్తూ వున్నాను.

నా వ్యాస రచనలు పరిశోధనతో కూడినవి,రాసి లో దీర్ఘమవటం వలన, బ్లాగు ప్రారంభించి సంవత్సరం దాటినా ఇంతవరకూ ప్రచురించినవి కేవలం 88 మాత్రమే. ఇందులో కొన్ని రచనలు బహు ప్రజాదరణ పొందినవైతే మరి కొన్ని సాహిత్య విషయాలపై రాసినవి పాఠకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఏ విషయాలపై రాస్తే పాఠకులనుంచి స్పందన ఎక్కువొస్తుందో తెలిసినప్పటికీ, అలాంటి కథనాలు చాలా మంది ఇస్తున్నందున, వాటి జొలికి పోక, భిన్నమైన అంశాలతో, నాదైన శైలి లో రాస్తున్నాను.

స్వోత్కర్ష:

నేను ప్రారంభించిన కొన్ని వ్యాసాలు trendsetters గా వుండి, ఇతరులు ఆ అంశాలపై రాసే సందర్భం లో అదే మూసను అనుసరించటం జరిగింది.ఉదాహరణగా నెల నెలా జరిగే తెలుగు బ్లాగ్మిత్రుల సమావేశ నివేదికలు.సాహితీవనం శీర్షికపై ప్రారంభించిన సాహిత్యం గురించిన ప్రశ్నలు మరికొంతమందికి ప్రెరణ కలిగించి వారిని అలాంటి Quiz టపాలు రాసేలా చేసాయి. తెలుగు టైప్ చెయ్యటం రాక ముందు తెలుగు బ్లాగులను ఆంగ్లంలో Biosymphony (http://groups.yahoo.com/group/biosymphony) లో పరిచయం చేస్తూ వ్యాసాలు రాస్తే, తెలుగు రాయటం నేర్చాక తెలుగు బ్లాగులను తెలుగులో సమీక్ష చెయ్యటం మొదలు పెట్టాను. ఈ సమీక్షలు Biosymphony లోను, పారదర్శి (http://paradarsi.wordpress.com) లోను ప్రకటించడం జరిగింది.ఆ తరువాత ఇద్దరో,ముగ్గురో బ్లాగ్సమీక్షలు రాయటం మొదలెట్టి అర్థాంతరంగా ఆపేశారు.తెలుగు బ్లాగులపై, బ్లాగ్మిత్రులు, సమీక్షలు రాయటం అవసరం అని నేను భావిస్తూ, వారిని మరలా రాయవలసినదిగా కోరుతాను. తమ బ్లాగు పారడీల ద్వార, పాఠకులను నవ్వించి, కవ్వించిన చదువరి కొన్ని బ్లాగులను ఎంచుకుని సమీక్షిస్తే భవ్యంగా వుండగలదని, భవదీయుని తలంపు.

2007 కొన్నిజ్ఞాపకాలు

శోధనకు ప్రజాదరణ తగ్గిందా?

ఈ సమీక్షలు రాసే సమయం లో, శోధన సుధాకర్ బ్లాగు సమీక్షకై సుధాకర్ కు కొన్ని ప్రశ్నలు పంపితే, తాను వాటికి తెలుగులో సమాధానాలు రాసి నా యాహూ చిరునామాకు పంపంటం జరిగింది. యాహూ లో తెలుగు ఒక ముక్క అర్థం కాక, ఆంగ్లం లో సమాధానం పంపమని కోరాను. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలలో కొంత కాలహరణం జరిగింది. నా బాధ పడలేక సుధాకర్ తన జవాబులను (తెలుగులో) ఏదో బ్లాగులో పెట్టి ఆ చిరునామా నాకు పంపటం జరిగింది. నేను వీలు చూసుకుని, నా సమీక్ష మొదలు పెడదామని, ఆ బ్లాగును సందర్శిస్తే అక్కడ క్రితం వుంచిన సమాచారం కనపడలేదు. ఇహ మళ్లీ ఉత్తరాలు రాసే తీరిక లేక నెల్లూరు పై వ్యాసాలు మొదలెట్టాను. పాఠకులకు అవి నచ్చాయన్నది వెరే విషయం.శోధన అలా సమీక్షకు చిక్కకుండా మిగిలిపోయింది. తెలుగులో బహుళ ప్రజాదరణ పొందిన ఈ బ్లాగుకు ఈ మధ్య ప్రజాదరణ తగ్గినట్లుగా, నాకు నచ్చిన 10 బ్లాగులలో శోధన లేకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలుగ చేసింది. చూడండి http://veeven.wordpress.com/2007/08/17/top10-telugu-blogs/


జ్యోతక్క బ్లాగుకు వస్తున్న ప్రజాదరణ చూసి అసూయ పడే వాళ్లున్నారని తెలిసింది ఆకాశరామన్న బ్లాగు ద్వారా. పొద్దు కు రాసిన వ్యాసంలో, తన రచనకు source of information తెలుపక పోతే వచ్చే ఇబ్బందులేమిటో జ్యోతక్కకు, మనకూ తెలిసింది. గృహిణి ఐన జ్యోతక్క తెలుగు బ్లాగులకు చేస్తున్న సేవ వెలకట్టలేనిది.బ్లాగర్లకు సూచనలందిస్తూ, తెలుగు బ్లాగుల కోసం, ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించే జ్యోతి అభినందనీయురాలు. చూడండి

http://jyothivalaboju.blogspot.com


తెలుగు జాతీయవాది

తెలుగువారికి ఒక ప్రత్యేక దేశం కావాలన్న వితండవాదం తో మనకు పరిచయమైన అంబానాథ్ గుర్తున్నారా? తల్లుల పై రాసిన వీరి వ్యాసం విశేష స్పందన పొంది 53 పైగా పాఠకుల ఉత్తరాలను పొంది ఒక కొత్త చరిత్ర సృష్టించింది.తన బ్లాగు కేవలం ఆహ్వానితులకు మాత్రమే అని ఒక కొత్త వరవడి ప్రవేశపెట్టారు వీరు. దీనివలన తన బ్లాగులో ఏమి ప్రచురితమవుతున్నయో అనే విషయం కూడలి కి కూడా తెలియదు. అన్వేషణ యంత్రాలకూ తెలియదు. ఇలా close ended blog అవటం వలన మన పాఠకులు దాని గురించి చర్చించే అవకాశం లేదు. ఈ బ్లాగు మీరు చదవాలంటే అంబానాథ్ కు జాబు రాయండి ఆహ్వానం కొరకు.

ambanath at gmail.com

అంబానాథ్ బ్లాగు చిరునామా

http://www.telugujaatheeyavaadi2.blogspot.com/


కొత్త నీరు

ఈ మధ్య పాఠకుల ఆదరణ పొందిన కొన్ని బ్లాగులలో కొత్తపాళి బ్లాగు మొదటగా చెప్పుకోవాలి. వీరి కొత్తపాళి, విన్నవి కన్నవి బ్లాగులను పాఠకులు ఇష్టంగా చదువు తున్నారు. ఈ మధ్యన వెల్చేరు నారాయణ రావు గారు హైదరాబాదు వచ్చినప్పుడు, వారు ఎన్నో విషయాలు ముచ్చటించటం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ విరచిత ' ఆముక్త మాల్యద ' లాంటి ప్రబంధాలు చదివే వారు తక్కువయ్యారని, విచారం వ్యక్త పరిచారు. మీరు చదివారా? ఆముక్త మాల్యద ను తెలుగు పాఠకులకు కొత్తపాళీ పరిచయం చేస్తున్నారు తమ బ్లాగు ద్వారా. చూడండి

http://telpoettrans.blogspot.com/2006/11/amukta-malyada-story-begins-thus-sri.htmlకంప్యూటర్ సమస్యలపై సాంకేతిక సహాయం అందించే కొత్త బ్లాగు కంప్యూటరెరాస్, కొద్దికాలం లో ఎక్కువ టపాలు ప్రచురించి, 10000 పై చిలుకు పాఠకుల ఆదరణ పొందింది.

http://computereras.blogspot.comమీరు చూశారా? మా హ్యాపీ డేస్.........వీడియో. విజయవంతమైన హ్యాపీ డేస్ సినిమా తో ప్రేరణ చెంది నిర్మించిన వీడియో ఇది. చక్కటి సాంకేతిక విలువలతో ఉన్నదీ వీడియో.

http://gemsofhindupur.blogspot.com/2007/12/blog-post.htmlతెలుగు సినిమా పై పట్టువోని కార్యదీక్షతతో రాస్తున్న ఔత్సాహిక యువ బ్లాగరు వెంకట్. సినిమా ప్రేమికుల అభిమానం బాగా పొందాయి వెంకట్ రచనలు. 24 ఫ్రేంస్ బ్లాగే కాక నవతరం అనే వెబ్ సైట్ ప్రారంభించి విశ్లేషణాత్మకం గా సినిమా వార్తలు అందిస్తున్నారు. అతని ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.చూడండి.

www.24fps.co.in
www.navatarangam.com

తెలుగు వారికి పనికి వచ్చే ఎంతో సమాచారం తో కూడిన వంశీ వెబ్ సైట్ మీకు పరిచయమే. ఇందులో కొత్త సొగసులద్దటానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నై.అతిధి రచయితలతో వ్యాసాలు రాయించి ప్రకటిస్తున్నారిక్కడ. ఇందుకోసం ఎందరో రచయితలకు నిరంతరం ఎన్నో వుత్తరాలు రాస్తూ, శ్రమించి విజయులయ్యారు వంశీ. చూడండి

http://maganti.org/vyasavaliindex.htmlకొత్త బ్లాగరు పొద్దెరగడట. విశాఖనుంచి ఒక బ్లాగరు ఉదయం సాయంత్రం బ్లాగులు రాస్తూ, తను నిద్రింపక, మనలను నిద్రపోనీకుండా రాస్తున్నాడు. కొద్దికాలంలో ఎక్కువ టపాలు రాసి ఒక కొత్త record సృష్టించే ప్రయత్నంలో వున్నారీయన. పాఠకుల ఆదరణ లభించింది. పర్యావరణ స్పృహ కూడా వుంది. మంచి అంశాలతో చర్చలకు మనలను ఆహ్వానిస్తున్నాడు. చూడండి

http://pichukalu.blogspot.com

http://visakhateeraana.blogspot.com
http://charchaavedika.blogspot.com/

ఇంకా ఎన్నో కొత్త మంచి బ్లాగులు ఈ సంవత్సరం మనం చూశాం. స్థలాభావం వలన మరి కొన్ని మంచి బ్లాగుల గురించి రాయలేక పోతున్నా.అలా రాయలేక పోతున్నందుకు బ్లాగు మిత్రులను మన్నించ వలసినదిగా మనవి. ఈ సంవత్సరంలో బ్లాగుల సంఖ్య పెరిగింది. టపాలు పెరిగాయి.ప్రచురితమైనవన్నీ గతంలో చదివినా, ఇప్పుడు సాధ్యపడటం లేదు.బ్లాగులో టపాలకు వర్గీకరణ అవసరం ఎక్కువైంది. కూడలి లో ఇప్పుడున్న వర్గీకరణలకు తోడుగా అదనంగా ఏమి వుంటే బాగుండగలదని మీ అభిప్రాయం?

మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంషలు.

18 వ్యాఖ్యలు:

Vamsi M Maganti చెప్పారు...

నమస్కారం రావు గారూ

మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తక్కువ టపాలు ఉన్నా, మంచి జాతి రత్నాలు అవి - ఎవరి బ్లాగు పోష్టులు చదవటానికి తీరిక లేకపోయినా మీ బ్లాగు టపాలు మటుకు తప్పక చదువుతాను...

మీ నుంచి ఈ సంవత్సరం మరిన్ని టపాలు ఆశిస్తూ...ఇంకా ఎంతో చేయవలసి ఉన్న నా చిన్న వెబ్సైటుకి మీకు నచ్చిన వాటిలో స్థానం కల్పించినందుకు సంతోషిస్తున్నాను...ధన్యవాదాలు...

విధేయుడు
వంశీ

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

అయ్యా,రావు గారూ,మీరు ఏమన్నా నాకు అనందమే.ఈమధ్య రాశి బాగా తగ్గించాను గమనించారా?నిజానికి నేను రాయాలనుకున్నవి ఇప్పటికి మొదలుపెట్టలేదు.రాబర్ట్ ఇంగర్సాల్,రస్సెల్,చార్లెస్ బ్రాడ్లా ఇలా చాలా మంది గురించి,అలాగే సాహిత్యం లో చాలా అసమానతలు ఇంకా చాలా కానీ,మనవాళ్ళు సీరియస్ విషయాల జోలికి పోరని అర్ధమై వేరే వాళ్ళకు రాస్తున్నాను.ఇంతకీ రాజమండ్రిలో ఉన్నారన్నమాట.వైజాగ్ ఏమన్నా వస్తున్నారా?

కొత్త పాళీ చెప్పారు...

ఈ టపా .. ఆటోగ్రాఫ్ సినిమా మినీ వెర్షనులా .. తెలుగ్ బ్లాగ్లోకాన్ని ఒక విహంగ వీక్షణం చేశారు. బాగుంది.

రవి వైజాసత్య చెప్పారు...

తెలుగు జాతీయవాదము వితండవాదమనటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..
ఇహపోతే నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నేను ఇన్నయ్యగారి భావాలతో అంగీకరించకపోయినా, వారి రచనలు కొత్తతరానికి అందించడానికి కృషిచేస్తున్నందుకు నెనర్లు

స్మైల్ చెప్పారు...

రావు గారు...మీ వల్ల నా బావమరిది వీడియో చూడ్డం జరిగింది. జియా తర్వాత కాస్త స్టైల్̍గా గడ్డం నిమురుకుంటూ ఫోజిచ్చిన ఆ చిరుతే నా బామ్మర్ది కిరణ్. మొత్తానికి మా హిందూపురం పేరు నిలబెట్టారు మీ ప్రశంసతో.(అన్నట్టు నా బహుమతి...?:-)అలాగే అంబానాథ్ గారితో తీవ్రంగా విభేదించినా ఆయన టపాలు గుర్తుచేశారు, వేగు పంపిస్తాను.నెనర్లు-స్మైల్.

cbrao చెప్పారు...

వంశీ : చిత్రసీమలో వంశీ ఒక సృజనాత్మక రచయిత ఐతే అంతర్జాలంలో వంశీ వెబ్సైట్ తెలుగు వారి సమాచార పుట్ట.బంగారానికి వాసనలా వున్న కొత్త వ్యాసావళి లో,ప్రస్తుతం వైవిధ్యం లోపించినా,కొత్త పాపాయి పెరుగుతున్న కొలదీ వైవిధ్య భరితమైన రచనలు రాగలవని ఆశ.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి: తెలుగు బ్లాగు పాఠకులు హాస్యభరిత రచనలు ఎక్కువ ఇష్టపడతారు. DSG బ్లాగు రెండు రెళ్ళు ఆరు, విహారి, ప్రసాదం, మొహన్ రాజ్ తెలుగు లో మీ ముందుకు... మంచి హాస్య రచనలు కలిగి మనలను నవ్వించి, పాఠకుల విశే్‌ష అదరణ పొందాయి. బ్లాగరు తేల్చుకోవలసింది, తను రాయటం ఎందుకోసం? పాఠకుల జేజేలకా లేక వారికి తెలియని కొన్ని కొత్త విషయాలను వారి ముందుంచటమా? ఈ ప్రశ్నకు మీకు దొరికే సమాధానం బట్టి, ఎలాంటి రచనలు చేయాలనేది మీరు నిర్ణయం చేసుకోగలరు?

మీ బ్లాగులో కాక, మీ రచనలు ఇంకెక్కడ ప్రచురిచమవుతున్నాయి?

గౌతమి ఘాట్(రాజమహేంద్రవరం) చాయచిత్రం, మారేడుమిల్లి అడవులకు వెళ్తూ తీసిన చిత్రం. నేను హైదరాబాదు నివాసిని.

Suresh చెప్పారు...

the way you described is really awesome.. and we are all pretty much impressed with the blogs you posted, and Thanks for sharing all your thoughts in this blog.

వెంకట్ చెప్పారు...

నా సైట్ గురించి మీ బ్లాగులో ప్రస్తావించినందుకు నెనర్లు. ౨౦౦౭ లో కంటే మంచి వ్యాసాలు వ్రాసి మరింత సమాచారం పాఠకులకు అందించాలని ప్రయత్నిస్తాను.
వెంకట్

cbrao చెప్పారు...

రవి వైజాసత్య: ప్రపంచం లో ఎక్కడ చూసినా సరిహద్దు తగాదాలు, పెట్రోల్ కోసం యుద్ధాలు ఇప్పటి మాట. భవిష్యత్ లో, నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి.దేశాల మధ్య ఈ సరిహద్దులు తొలిగి మనమంతా విశ్వ మానవులం కావాలి. సౌభాతృత్వం కావాలి.ఇప్పుడు జరుగుతున్నదేమిటి? భారత్ పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు సమస్య ఉగ్రవాదానికి ఊతమిచ్చి ఎందరినో పొట్టన పెట్టుకుంది.ఇది ఆరని చిచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు సమస్య,తమిళ్నాడు, కర్నాటక మధ్య నీటి తగాదా.మన రాష్ట్రం లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య నీటి తగువు. ఎక్కడికి పోతున్నాం మనం?

భారత్ లో భాషా రాష్ట్రాల ఏర్పాటు కొందరి రాజకీయ వాదుల స్వార్థ ప్రయోజనాలకు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు.ప్రత్యేక తెలంగాణ వలన కొందరు రాజకీయవాదులు మంత్రుల పదవులతో లాభం పొందుతారు కాని సామాన్య ప్రజానీకానికి ఒరిగేది శూన్యమే. చిన్న రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధి సాధించటం, పెద్ద బహుళార్ధ సారక నిర్మాణాలు చేపట్టడం కష్టమని నిరూపణ అయ్యింది.

ఇలాంటి పరిస్తితులలో తెలుగు వారికి ప్రత్యేక దేశ మంటే, నీటి కోసం మహారాష్ట్ర తోను, కర్ణాటక తోను యుద్ధాలు చేయటం మనకు తప్పనిసరి అవుతుంది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లాలంటే మనకు వీసా కావాలి. చెన్నై, ముంబై, ఢిల్లీ వగైరా ఎక్కడకు వెళ్లాలన్నా మనకు వీసా కావాలి. భారత దేశం ఎన్నో దేశాలుగా ముక్కలు ముక్కలవుతుంది. సరిహద్దున వున్నా బంగ్లాదేష్ అక్రమణ వలసదారులను అరికట్టదం అసాధ్యమయ్యింది. భారత్ దేశం ఇన్ని ముక్కలతో బలహీనమయి, శతృవును ఎదుర్కోవటం కష్టమవుతుంది.

కావలసినది భాషా ప్రయుక్త రాస్ట్రాలు, దేశాలు కాదు, ప్రజాశ్రేయస్సు. అది కుంటుపడితే ఎట్లా? భారత దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే రాష్ట్రాలుగా విభజింపబడాలి కాని మరే ఇతర ప్రాతిపదిక పైన కాదు. రాజకీయ నాయకుల పదవులు కాదు, ప్రజాశ్రేయస్సు ముఖ్యం.

ఇప్పుడు నమ్ముతారా, తెలుగు జాతీయవాది యొక్క ప్రత్యేక తెలుగుదేశ సిద్ధాంతం మనల్ని ఎట్లా నట్టేట ముంచుతుందో? ప్రపంచ ప్రజలు ప్రపంచ భాష Esperanto (http://en.wikipedia.org/wiki/Esperanto) నేర్చుకుని, సరిహద్దు లేని విశ్వమానవ ప్రజలుగా కలిసి నివసిస్తే, ప్రపంచ శాంతి నెలకొనదా?

mohanrazz చెప్పారు...

Rao గారూ..ఎక్కడెక్కడో తచ్చాడుతూ యాదృచ్చికంగా వచ్చిన నేను మీరు నా బ్లాగ్ ప్రస్తావించడం చూసి 'R.S.బ్రదర్స్' లాగా 'అవాక్కయ్యాను'. కృతఙ్ఞతలు.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

రావు గారూ.. సాంకేతికాలు బ్లాగు మీ జాబితాలో చోటుచేసుకున్న విషయం ఆశ్చర్యమనిపించింది. రంగూ, రుచీ, వాసన లేని సాధారణ సాంకేతిక బ్లాగుకి మీ జాబితాలో స్థానం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

అయ్యా రావు గారు నేను త్వరలో మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను.
@ స్మైల్ గారూ మీది హిందూపురమా? మీ మాజీ యంపీ కాలువ శ్రీనివాసులును అడిగానని చెప్పండి.

cbrao చెప్పారు...

@కొత్త పాళీ: విధ్యార్థి గా కాలేజ్ జ్ఞాపకాలు ఎందరికో ప్రీతిపాత్రమని, Happy Days సినిమా విజయం ఋజువు చేసింది. నా Autograph Sweet Memories సినిమా చూసి బయటకు వస్తుంటే, సినిమా చివరలో రవితేజ డైలాగ్ గుర్తొస్తుంది.నా కథ చూసాక, మీకు కూడా మీ Sweet Memories గుర్తొస్తున్నాయా?

విధ్యార్థి గా గడిపిన రోజులు తిరిగి రావు. అందుకే యువకులు,పెద్దవారూ కలిసి Happy Days చూస్తున్నారు. పెద్దవారు తమ కాలేజ్ రోజులు తిరిగి గుర్తుకు తెచ్చుకుంటున్నారు.31st Decembar న 2007 జ్ఞాపకాలన్నీ ఒక సారి గుర్తు తెచ్చుకుంటూ నా బ్లాగు చరిత్ర రాస్తే, నా బ్లాగుకు మిగతా బ్లాగులతో వున్న అనుబందం దృష్ట్యా, ఒకటిన్నర సంవత్సరాలుగా బ్లాగర్లతో వున్న సంబంధాలు ఒక సారి మరల గుర్తుకు తెచ్చుకుంటే ఇలాంటి జ్ఞాపకాల వెల్లువే వచ్చింది, వస్తుంది. కొత్తగా వచ్చిన బ్లాగరులకు ఇది బ్లాగు చరిత్రగాను వుండగలదు.మంచి సినిమా గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసులో ఓ మూల ఏదో శంక - విశ్వమానవులమయ్యాం కాబట్టే పక్కవాడి వనర్లు దోచుకుందామనే కోరిక కలుగుతోందేమో ! సంకుచితత్వంలోనే సౌఖ్యం ఉందేమో !

చైనీసు శ్పానిషు ఇంగ్లీషు అరబ్బీ లాంటి భాషలవాళ్ళే నిజమైన విశ్వమానవులు కాగలరు. సంఖ్యలో పెద్దవాళ్ళు గనుక, ఎక్కువ దోచుకోగలరు గనుక.

అంబానాథ్ సంగతెలా ఉన్నా రాబోయే అర్ధపుష్కరంలో భారతదేశం చాలా చరిత్రాత్మక మార్పులకు లోను కాబోతోంది కనుక ఏ సంభావ్యతనీ త్రోసిపుచ్చలేకుండా ఉన్నాను.

Esperanto అనేక భాషలుగా విడిపోదనే నమ్మకం (guarantee) ఏదైనా ఉందా ? గతంలో అయిదు దక్షిణ రాష్ట్రాల్లోను ఒకే ద్రావిడభాష ఉండేది.అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా దాకా - టిబెట్ నుంచి మహారాష్ట్ర దాకా ఒకే సంస్కృతం ఉండేది.కాలక్రమంలో ఏమైంది ? రేపు కొంతకాలానికి ఇంగ్లీషైనా అంతే ! (అది చూడ్డానికి మనం ఉండమనుకోండి)

మన అసలు సమస్య భాషలు ఉండడం కాదు. ఆ భాషలకు గౌరవం లేకపోవడం అని నేననుకుంటున్నాను. మనల్ని మనం ఒక జాతిగా హీనపఱచుకోవడానికి బాగా అలవాటుపడిపోయాం. అదే మన అసలు సమస్య.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇంకో విషయం-వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకు తెలియకుండానే ఆ మార్పులకు ఆంధ్రప్రదేశ్ ని సర్వసన్నద్ధం చేస్తున్నాడు. గమనించారా ? కాదు, ఏదో అదృశ్యశక్తి అతనిచేత అలా చేయిస్తోంది.

cbrao చెప్పారు...

@తా.ల.బా.సు: "వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకు తెలియకుండానే ఆ మార్పులకు ఆంధ్రప్రదేశ్ ని సర్వసన్నద్ధం చేస్తున్నాడు." -ఏ మార్పులకు ? ఏ విధంగా? కాస్త వివరించండి?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

తినబోతూ రుచి అడుగనేల ? వేచి చూడండి.

cbrao చెప్పారు...

@స్మైల్: దీప్తిధార ద్వారా మీకు ఈ వీడియో గురించి తెలియటం,చూడటం ఆనందదాయకం. Gems of Hindupur వాళ్లు ఎంతమంది మొత్తం? వారు లేపాక్క్షి గురించి రాస్తే బాగుణ్ను. మీ snail mail చిరునామా అందినది. త్వరలో పోస్ట్ చేస్తాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి