శనివారం, జనవరి 19, 2008

అక్బర్ - జోధాబాయి


Image courtesy: Indiafm.com

సలీం, అనార్కలి పాత్రలతో రూపొందిన ముఘల్ ఎ- ఆజం చిత్రం గుర్తున్నదా? ఇందులో అనార్కలి పాత్ర కొంచం నిజం, ఎక్కువ భాగం కల్పితం. ఇప్పుడు అక్బర్-జోధాబాయి చిత్రం, అశుతోష్ గోవారికర్ (లగాన్ ఫేం) దర్శకత్వం లో వస్తుంది. అక్బర్ చరిత్రను పొందుపరిచిన అక్బర్నామా లో జొధాబాయి ప్రస్తావనే లేదని చరిత్రకారులు చెప్తున్నారు. అక్బర్,కచ్చవా వంశం, అంబర్ లోని, భార్ మల్ పుత్రిక హీరా కువారి ను వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్బర్ తన కొత్త మతం దిన్-ఎ-ఇలాహి ని ప్రకటించి, ఈమెకు మరియం జమాని (ప్రపంచానికి మేరి) అనే బిరుదు ఇచ్చాడు. హీరా కువారి ను వివాహమాడటం లో రాజనీతిజ్ఞత వుంది. హిందూ రాజుల దండయాత్రల నుంచి రక్షణకై,వారిలో కొందరిని స్నేహితులుగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా, జరిగిందీ వివాహం. మరి అక్బర్ మూడవ రాణి గా చెప్పబడుతున్న ఈ జోధాబాయి (రాజకుమారుడు సలీం తరువాత జహంగీర్ తల్లి) ఎక్కడ నుంచి వచ్చింది? కొందరు జోధాబాయి ఉంది కాని ఆమె అసలు పేరు అది కాదని చెప్తున్నారు. ఇది 18, 19 వ శతాబ్దపు చరిత్ర కారుల సృష్టి.హీరా కువారి నే జోధాబాయి గా అన్వయిచుకుంటే చిక్కుముడి విడవచ్చు. జొధాబాయి, హిందూ మతాన్ని అనుసరించి, పూజలు చెయ్యటానికి అనుమతించబడింది.
జొధాబాయి గురించి చరిత్రకారులు భిన్న కథనాలు చెప్తారు. 1832 లో, జేంస్ టాడ్ ప్రచురించిన రాజపుటాన చరిత్ర ప్రకారం, జోధాబాయి, రాయ్ సింగ్ పుత్రిక. ఈమెకు జెహంగీర్ తో వివాహమయ్యింది.
.
ఇంతకూ అక్బర్ ఎలాంటి వాడు? శాంతి కాముకుడు. పరమత సహనము కలవాడు.అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించే వాడు.తన కొలువులో హిందువులకు పెద్ద పదవుల నిచ్చాడు.హిందూ, ముస్లిం ఐకమత్యం కోసం,జోధాబాయిని వివాహమాడి ఆమెకు పూర్తి మత స్వేచ్చనిచ్చాడు. అన్ని మతాల సారంతో కూడిన దిన్-ఎ-ఇలాహి మతాన్ని రూపొందించాడు. అక్బర్ గురించి మన చరిత్ర పాఠాలలో మనకు ఇలాగే చెప్పారు కదా.

అక్బర్ చరిత్రను నమోదు చేసిన అక్బర్ నామా లో దీనికి విరుద్ధవిషయాలున్నై.మరి ఏది నిజం అంటే మీరు "అక్బర్ ఇలా గ్రేట్ అయ్యాడు!" అనే వ్యాసాన్ని ఈ దిగువన ఇచ్చిన లింక్ లో చదవండి.
http://theuntoldhistory.blogspot.com/2008/01/blog-post.html

త్వరలో విడుదలయే సినిమా చూసి, ఏది నిజమో, తెలుసుకుంటామంటారా? నేతి బీరకాయలో నెయ్యి ఎంత వుంటుందో, సినిమా లో నిజం కూడా అంతే వుండదా?

జోధా - అక్బర్ చిత్రం లోంచి ఈ అందమైన పాట చూసి ఆనందించండి.జోధా - అక్బర్ చిత్రం లోని పాటలు ఇక్కడ వినండి.
http://www.filmicafe.com/music_filmi_detail_song.php?movie_id=439

3 వ్యాఖ్యలు:

రవి వైజాసత్య చెప్పారు...

అక్బరు భార్యల గురించిన చిక్కుముళ్ళు విప్పటం చాలా కష్టం. అక్బరుకు ఒక ఆర్మేనియా క్రైస్తవ భార్య కుడా ఉండేదంటా. మరియం ఉజ్జమానీ అమె పేరేనని కూడా ఒక వాదనుంది :-)

Sridhar చెప్పారు...

భాస్కర్ రావు గారు! జోధాబాయి గారి గురించి చక్కగా చెప్పారు.

pi చెప్పారు...

అయ్యా,

మీ టపా బావుంది. మనకి అఖ్బర్ గురించి అంత పెద్దగా తెలియదని నా అభిప్రాయం. అఖ్బర్ మీద శాంతికాముకుడు అని ఎన్ని వాదాలు ఉన్నా, కర్కోటకుడు అని కూడా చాలా వాదాలు ఉన్నాయి. నేను సినిమాలో చరిత్రని చస్తే నమ్మను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి