గురువారం, జనవరి 24, 2008

బ్లాగ్వీక్షణం -2


Satya Yamini in popular TV programme "Little Champs". Courtesy: Zee TV Photo taken from TV by cbrao

ఈ చదవతగ్గ టపాల ఎంపిక, బ్లాగరుల పేరు ప్రతిష్టలు కాక, కెవలం content ఆధారంగా చెయ్యబడ్డది. మంచి టపాలలో, ఇవి కొన్ని మాత్రమే. ఇందులో కొన్ని పాత టపాలు, మీరు చదివి వుంటారు. కాని కొత్తగా వచ్చిన, వందల సభ్యులకు, ఇవి కొత్త టపాలే అవుతాయి. పాతవారు కూడా ఇందులో కొన్ని మిస్ అయివుండవచ్చు. ఒకసారి చదివినవారు, ఇంకోమారు చదివి ఆనందించవచ్చు. కావున, పాత వాటిని కూడా ఇందులో వుంచా.

వినిమయ తత్త్వం (కన్స్యూమరిజం) మనలను పిచ్చివాళ్ళను చేస్తున్నదా?

http://nagamurali.wordpress.com/2008/01/17/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%af-%e0%b0%a4%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%ae/#comment-82

మనకు అవసరం లేని వస్తువులను కూడా, మనకు అమ్మగల సామర్ధ్యం, వినియోగ వస్తువుల పంపిణీ అధికారుల కుంది. విచక్షణతో కొనాలని ఈ వ్యాసం చెపుతున్నది.

2007 సాహిత్య సింహావలోకనం – కథ
http://sameekshaclub.wordpress.com/2008/01/22/overview/
2007 లో ప్రచురించిన కథలపై ఒక విహంగ వీక్షణం ఇది.సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు ‘లో చిన్నపిల్లల ఆవేదనలను, అక్కిరాజు భట్టిప్రోలు ‘గేటెడ్ కమ్యూనిటీ’ లో ధనిక,బీద మద్య వస్తున్న భావ ఘర్షణను చిత్రించి పాఠకులనాకట్టుకున్నారు. ఈ సంవత్సరం వచ్చిన కథల సంపుటాల సంక్షిప్త పరిచయం వుందీ టపాలో.

భిక్షకుల బాల్టిమోర్
http://www.charasala.com/blog/?p=212
అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలోని, మేరీలాండ్ రాష్త్రం లోని,బాల్టిమోర్ లో ఎందుకని ఎక్కువ బిచ్చగాళ్లున్నారో,విచారించవలసిన విషయమే. అమెరికా లాంటి సంపన్న దేశం లో ఇలా బిక్షుకులను ఊహించటం కష్టమే.

ఆడవారిని సంతోషపెట్టడం, పెద్ద కష్టమేమీ కాదు
http://jokulashtami.blogspot.com/2008/01/56.html
ఇందులో ఇచ్చిన list చాల పెద్దదిగా ఉండొచ్చు; కానీ, స్త్రీ ని ప్రసన్నం చేసుకోవటం వెనక ఇంత కష్టముంటుందని,వ్యంగంగా చెప్తుందీ చిన్న వ్యాసం. ఇంటర్నెట్ లో, ఒక సంవత్సరంగా బహుళ ప్రచారం పొందిందీ వ్యాసం. Original author is unknown.

రాలిపడ్డ జ్ఞాపకాలు (కవిత)
http://kalpanarentala.wordpress.com/2008/01/24/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/
శృంగార భావన లలితంగా చెప్పిన రమ్యగీతం. కవయిత్రి కల్పనా రెంటాల.

నా ఆటోగ్రాఫ్, సొల్లు (సెల్లు)మెమోరీస్...
http://blaagadistaa.blogspot.com/2008/01/blog-post_17.html
మీరు ఒక సెల్ ఫోన్ కొంటారు. వారం తర్వాత మీ కొలీగ్ అదే ఫోన్ ని 800 రూపాయలు తక్కువకి ఇంకోచోట కొన్నానని చెప్తాడు. ఇంకో నెలకి ఇంకో మంచి మోడల్, మీరుకొన్నదానికన్నా తక్కువధరకే మార్కెట్ లోకి వస్తే ? మీకు సెల్ ఫోన్ల పై ఎంతో విజ్ఞానముందని మీ సలహా పాటించి, మీకు తెలిసినాయన, సెల్ ఫోన్ కొని, తరువాత అంత దిక్కుమాలిన ఫోన్ ఎలా recommend చేశావని అడిగితే? ముగింపు మిమ్ములను నవ్విస్తుంది.


"లకోటా ప్రశ్న"(Bita) ...అడగండి...వెంటనే మీకు జవాబులు రడీ..!!
http://palaka-balapam.blogspot.com/2007/09/bita.html

మీ భవిష్యత్ తెలుసుకోవాలని వుందా? చిరు రాజకీయాలలోకి వస్తాడా? నాకు H-1 Visa వస్తుందా? నాకు ఈ సంవత్సరమన్నా పెళ్లవుతుందా? తెలంగాణా ఎప్పుడొస్తుంది లాంటి ప్రశ్నలేవన్నా సరే అడగొచ్చు. అడగటం మీదే ఆలస్యం మరి..

పెళ్ళెప్పుడు??? (హాస్యం)
http://thotaramudu.blogspot.com/2007/03/blog-post_28.html
పెళ్లికాని ప్రసాదుల అవస్తలపై సునిశిత పరిశీలన. ఈ టపా ఇంటర్నెట్లో చాలా చక్కర్లు కొట్టింది. మిమ్ములను నవ్వించటం ఖాయం.

1 వ్యాఖ్య:

దుప్పల రవికుమార్ చెప్పారు...

ఏడాది తెలుగు కథనంతా సమీక్షించి రాసిన వ్యాసానికి ఒక్కసారి హిట్లు మీద హిట్లు ఎలా వచ్చేస్తున్నాయబ్బా అని తెగ ఆశ్చర్య పడిపోతున్నా. ఇంతలో మీ బ్లాగును చూసేక తెలిసింది. అసలు కారణం. నన్ను గుర్తించి పదిమందికీ తెలియజెప్పిన మీకెన్ని వీరతాడులు వేయాలి? వెయ్యను. ఒక్క నమస్కారం చెప్పుకుంటున్నా. నమస్తే.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి