బుధవారం, ఫిబ్రవరి 06, 2008

బ్లాగ్వీక్షణం -3


Peacock -Batik print on cloth Photo: cbrao

చదవటానికి,టపాల ఎంపికలో, మీ సౌలభ్యం కోసం -మరి కొన్ని టపాల పరిచయం.

అమృతం కురిసిన రాత్రి ఈ-వారం ఇ-Book
http://sridharchandupatla.blogspot.com/2008/01/book.html
' చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. యేదో రహస్యం నన్నావరించుకుంది. అపుడే నీ నవ్వు నా గుండెకింద వినపడింది.' 'అమృతం కురిసిన రాత్రి ' -బాలగంగాధర్ తిలక్ కవితలు download చేసుకోండి.Download నిదానంగా వుంది. ఓపిక కావాలి.www.sharelor.com కంటే http://www.esnips.com/ ఎక్కువ వేగంగా వుంది.

గుండె చప్పుడు... : మధించిన దున్నపోతుల స్వైరవిహారం
http://hridayam.wordpress.com/2008/01/30/stock-market-fii/
స్టాక్ మార్కెట్లలో చిన్న మదుపరులు నష్టపోతున్న వైనం గురించిన కథనం, ఆసక్తికరంగా వుంది.

ఎప్పటికో నా కలల ప్రయాణం – I
http://blog.vikatakavi.net/2008/01/30/%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82-i/
అమెరికా నుంచి భారత్ వచ్చేప్పుడు లేక భారత్ నుంచి అమెరికా వెళ్లేప్పుడు విమానాశ్రయం లో లగేజ్ బరువు ఎక్కువయ్యింది; కొన్ని కిలోల బరువు తగ్గించాలంటే, మీరేమి చేస్తారు? మీ ఫీలింగ్స్ ఎలా వుంటాయి? మీతో పాటుగా మీ స్నేహితులు, విమానాశ్రయం లో ఆ సమయంలో లేకుంటే, Excess luggage ని ఏమి చెయ్యాలి?

మనసులో మాట: చిరంజీవి: అభిమాని ఆత్మహత్య.
http://anurup.blogspot.com/2008/02/blog-post.html
రాజకీయవేత్తలు,సినీతారలంటే అభిమానంతో,ఆత్మహత్య చేసుకునే, తమిళ్నాడు సంస్కృతి మన రాష్ట్రంలో కూడా వచ్చిందా? చిరంజీవి రాజకీయాలలోకి రావటానికి రాజశేఖర్ లాంటి వాళ్లు అడ్డొస్తున్నారని, మనస్తాపం చెందిన చిరు వీరాభిమాని కథ విన్నాక మనసు కలత చెందక మానదు.

సంప్రదాయ వివాహమేనా ?
http://netijen.blogspot.com/2007/08/blog-post_26.html
ధనవంతులు తమ కుటుంబాలలో వివాహాలు,విలాసవంతంగా చేస్తారు. దాన్ని మనము ఆపగలమా? వారిని చూసి, మధ్యతరగతి వారు, తెలివి తక్కువగా, గుడ్డిగా అనుకరించటం సబబా? తాహతుకు మించి ఖర్చుపెడితే,వచ్చే కష్టాన్ని అనుభవించక తప్పదు. Netizen చెప్పదలిచిన సందేశం ఇది. రచయిత తను చెప్పదలచిన విషయాన్ని, టపాలో,చెప్పటం లో స్పష్టత లేదు.పాఠకుల వుత్తరాలు కూడా, టపా అర్థం కానట్లుగా చెప్తున్నై.


గరీబ్ రధ్ …
http://kaburlu.wordpress.com/2008/02/03/%e0%b0%97%e0%b0%b0%e0%b1%80%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%a7%e0%b1%8d/
సికందరాబాదు నుంచి బెంగళూరు కు తక్కువ ఖర్చులో, శీతల (Air-conditioned) రైల్ లో ప్రయాణించండి, సౌఖ్యంగా.

Travellers and Magicians – భూటాన్
http://navatarangam.com/?p=156
భూటాన్ లాంటి దేశం నుంచి, చక్కటి భావుకత వున్న చిత్రాలు ఊహించగలమా? Awards: Deauville Asian Film Festival - Audience award & Asian Americal Film Festival - Emrging Director award సూక్ష్మంగా చిత్ర కథ: “అనగనగా ఓ గ్రామంలో ఓ చదువుకున్న యువకుడు ఉన్నాడు. అతను ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని అమెరికాలో యాపిళ్ళు ఏరే పనికి బయలుదేరుతాడు. దారిలో ఓ అందమైన అమ్మాయిని కలుస్తాడు.” అని యోగి హాస్యమాడతాడు. “ఆ యువకుడు ఆ అమ్మాయికోసం తన అమెరికా ప్రయాణాన్ని విరమించుకున్నాడు!” Dondup నవ్వుతూ అంటాడు.

అడవిదారంట
http://tethulika.wordpress.com/2008/02/04/%e0%b0%85%e0%b0%a1%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%9f/
తెలుగు వాతావరణం లోని కథలు మీరు ఎన్నో చదివే వుంటారు.పూర్తి అమెరికా వాతావరణం లో కథ చదివారా? అమెరికా విధ్యార్థులు, ప్రాజెక్ట్ లు,అమెరికా సమాజపు తీరు తెన్నులు గురించిన భిన్న వాతావరణ కథ; మీరు చదవాలనుకుంటే, ఈ అడవిదారంట మనూ తో కలిసి నడుస్తూ, అడవి అందాలను చూస్తూ, బొనస్ గా అమెరికనిండియన్ ను కూడా మీరు చూడవచ్చు.

1 కామెంట్‌:

Bhaskar చెప్పారు...

amrutam kurisina ratri download chesukunnanu.nenarulu.ilage ampasaya,padita parmeswara sastry vilunama,asamardhuni jeevita yatra lanti classics dorike sitelu cheppagalaru.dhanyavadamulu.

కామెంట్‌ను పోస్ట్ చేయండి