శుక్రవారం, ఫిబ్రవరి 22, 2008
కథ చెప్తా వింటారా?
ఎండిన పసుపుపచ్చ గడ్డి, ఎత్తైన ఆకుపచ్చ గడ్డి,పులిని కనపడనీయవు. పులి వేటకు, ఆకస్మిక దాడి చెయ్యటానికి అనువైన ప్రదేశం ఇది. Photo: cbrao
జిం కార్బెట్, కుమాయున్ అడవుల మధ్య వున్న, చిన్న గ్రామంలో నివసించే వాడు.ఒక రోజు, ఇద్దరు వ్యవసాయదారులు, అతని వద్దకు వచ్చి, నార్సింగ్ పై, పులి దాడి చేసి గాయ పరచిందనీ, అతని ఎడమ తొడ భాగాన్ని తినివేసిందనీ,అతని శవం చెరువుకావల పొదల్లో కనుగొన్నామని చెప్పారు. అంతకు మూడు రోజుల క్రితం కమాలాబాయి పై దాడి చెయ్యటానికి ప్రయత్నిస్తే, సమయానికి ఆమె కేకలు విన్న, కొందరు కట్టెలు కొట్టేవారు ఆమెను రక్షించారు. జిం కు అర్థమయ్యింది; ఆ పులి మనిషి రక్తం రుచి మరిగిందని, ఇక ఉపేక్షిస్తే లాభం లేదని.
సాయంత్రం 6 గంటలు కావస్తుంది. వేసవి ఆవటం తో ఇంకా వెలుతురు వుంది. జిం తుపాకిని భుజానికి తగిలించుకొని,చెరువు గట్టునే నడవ సాగాడు. 200 గజాల దూరంలో ఎత్తుగా, దుబ్బుగా గడ్డి పెరిగి వుంది. దాని వెనక పులి వున్నా కనపడే అవకాశం తక్కువ. గాలి చెరువు వైపు నుంచి గడ్డి వైపు వీచ సాగింది. అక్కడ పులి వుంటే జిం కదలికలను, వాసన ద్వారా పులి పసి గట్ట కలదు. నిజంగానే, ఆ పొదల వెనుక ఒక పులి వుంది. ముళ్ల పంది ముళ్లు దాని శరీరం, కాలి లోను గుచ్చుకోవటం తో,అది వేగంగా పరిగెడ లేక, మనుష్యుల ఆవాసానికి దగ్గరగా వచ్చి, పెంపుడు జంతువులను, మనుష్యులను వేటాడుతూ వుంది.
జిం నడుస్తూ పులికి దగ్గరయ్యాడు. అతని వైపు నుంచి గాలి పులి వైపు వీస్తోంది. పులి అతని కదలికలను గమనించింది.
కథ చెప్పటం ఆపి పిల్లల కేసి చూశాను. మానవ్, దీప్తి, పక్కింటి శీను ఉత్కంఠగా నా కేసి చూసి, ఆ తరువాత ఏమయ్యింది? పులి జిం పై దాడి చేసిందా అని కుతూహలంగా అడిగారు.
అలా, పిల్లలకు నేను బాల్యం లో, ప్రకృతి, అడవులు, పర్యావరణం పై ఆసక్తి కలిగేలా కథలు చెప్పేవాడిని. కొన్ని కథలకు శ్రోతలు ఒక్కోసారి 7, 8 మంది దాకా పిల్లలు వుండే వారు. వారి ఖాళీ సమయం లో నా దగ్గరకు వచ్చి కథలు చెప్పమనే వారు.
పెక్కు జటిలమైన విషయాలనైనా, కథల ద్వారా చెప్పి పిల్లలను ఆకట్టుకోవచ్చు. వారికి కొత్త విషయాలు సులభంగా కథల ద్వారా నేర్పవచ్చు.
ఇలా కథలు చెప్పటం ఒక కళ. మీకు ఇలా కథలు చెప్పాలని వుందా? పిల్లలకు విద్యా విషయక అంశాలు, ఇలా కథలు గా చెప్పటానికి బెంగళూరు లో కథాలయ వారు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
కథాలయ గురించి ఈ వీడియో చూసి తెలుసుకోండి.
మరిన్ని వివరాలకై ఈ కింది వెబ్ సైట్ ను దర్శించండి.
http://www.kathalaya.org/aboutus.htm
వారి సమావేశాలు ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే, ఈ కింది బ్లాగును సందర్శించండి.
http://kathalaya.typepad.com/kathalaya/2007/02/index.html
ప్రయోజకరమైన ఇలాంటి సేవా సంస్థను నిర్వహిస్తున్న, గీతా రామానుజం గారిని అభినందిద్దాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్‌లు:
బాగుంది చాలా మంచి ప్రయత్నం.
బాగుందండీ.
బాగా బుద్ధి చెప్పారు రావు గారు,ఇంకా చక్కగా గుర్తు చేశారు.రకరకాల సమాచార,ప్రసార,వినోద సాధనాల వల్ల ఎంతో మంది కోల్పోతున్న సువర్ణఘడియలు,పిల్లలతో గడిపి వారితో కధలూ,కబుర్లు చెప్పుకోవటమూ,వారు చెప్పే బుల్లిస్టోరీస్ వినటం అనుభవించేవారికే ఆ ఆనందం తెలుస్తుంది.కాకపోతె కధలు చెప్పటం అంత వీజీ మాత్రం కాదు.అందులోనూ పిల్లలను ఆకట్టుకునేల చెప్పటం మరీ
కష్టం.అధవా ఎవరన్నా చెప్పినా పిల్లలను నిద్రబుచ్చేందుకో,వారు మారాం చేసే విషయం నుంచి దారి మళ్ళించేందుకో తప్ప విజ్ఞానం పంచేందుకు కాదన్నది చాలా సంధర్భాల్లో రుజువౌతుంది.కధలను వినిపించటంలో శిక్షణ అనేది ఒక మంచి ప్రయోగం,మీద్వారా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
కథాలయ వారి ప్రయత్నం చాలా చక్కనిది. సమాచారాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
ఇక పోతె, ఇంతకూ జిం తరువాత ఎం చేశాడు? మీ కథనం, శైలి చాలా చాలా బాగున్నాయి.
Letter received from Sri Bharat
from "Bharath" mbbhushan@gmail.com
to "BIRDScbrao" cbraoin@gmail.com,
date Sun, Feb 24, 2008 at 8:45 PM
subject Story telling
Dear Rao,
కథ వినటం కంటె మధురమయిన అనుభవం ఏముంటుంది ? చెప్పడము రావాలి గాని, వినేవాళ్లకు కొదవా? ఎన్నో పాత కథలను, ఇప్పటికీ మళ్లీ మళ్లీ చదివే వాళ్లున్నారు కనుక, వాటిని మళ్లీ మళ్లీ అచ్చేస్తున్నారు.
కథ గురించి - మీ కథ చాలా బాగుంధి
పిల్లలకు కథ చెప్పటము ప్రత్యేక కళనే !
1986 -1990 మధ్య, భద్రాచలం అవతల, శబరి సీలేరు నదుల దగ్గర, కోయ గ్రామాల్లొ పనిచేసేవాడిని. అప్పుడు, కథలను వినే అవకాశం, అనుకోకుండా ఒచ్చింది.
నేను పిల్లల కథలను పని కట్టుకొని వినేవాడిని. టేప్ రికార్డ్ చేసేవాడిని. గొప్ప అనుభూతి. అప్పుడు నా ఉద్దేశ్యం వేరు; వాళ్ల పదజాలం సేకరించాలని; తెలుగు లిపిద్వారా, కోయ భాష పాఠ్య పుస్తకాలను తయారు చేయడం, అప్పటి పని.
నిర్మలత్వం, అబ్బురమూ, ఆనందము ఊపిరిగా సాగుతాయి పిల్లల కథలు. సృష్టిలోని ప్రతి విషయం కథకు వస్తువే. మనసుకు పొరల్లేవు ఇది చెప్పాలి అది చెప్పకూడదని. కనిపించిన ప్రతిదీ కథయి కూసుంటది. కథ చెప్పటమూ రసవత్తరంగా సాగుతది. గోదారి పారినట్టు, శబరి సాగినట్టు. చెప్పేవానికి భాష గురుంచో, వస్తువు గురుంచో, ఎలాంటి సంకోచాల సంకెళ్లు లెవు కనుక కథ అయిపొయ్యేంతవరకు ఆసక్తిగా నడుస్తది.
That’s unique of the koya story telling. The mind is free of apprehensions and controls over language. There are no taboos on subject and there is no bar on the form. Just no mind blocks for the story teller. It’s like flight of the bird in the open drifting with quest of the mind
అడవి జంతువుల గురుంచి వాటి లక్షణాల గురుంచి, వాటి మధ్య తగవుల గురుంచి, వాటి సంబంధాల్లోని కథలగురుంచి, ఆకాశంలో చుక్కల గురుంచి, నీళ్లలో చేపల గురుంచి, పరకాయ ప్రవేశం, మాయా జాలం గురుంచి, వినడానికి వీలయ్యే ప్రతిదీ కథ అయిపొయ్యేది. మమూలుగ, చమత్కారంగ, హాస్యంతో నిండిన పిల్ల కథ గొప్పగా ఉండేది. వినడానికి కూచున్న, పది పదిహేను మంది పిల్లలు ఒక్కోసారి గొల్లుమని నవ్వేవారు. ఒక్కోసారి కళ్లు ఇంతింత చేసుకొని ఊపిరిబిగబట్టి వినేవాళ్లు.
Nice article you sent
Its reminder, before we lose the sensibilities and "edit" before something is felt or even said.
Thanks Rao garu, nice link to know more of the experiments done by friends. Good resource on story telling
Will send it to friends
నాలుగు పైసలకు పనికిరాని ప్రతిదీ, జీవితంలోంచి విసిరి పడేసే కాలంలో, ఇలాంటి రచనలు చాల అవసరము.
Bharath
@రాజ శేఖర రావు మద్దిపట్ల - ఆ తరువాత కథ ఏమయ్యింది? కథ ముగింపు, వ్యాస వుద్దేశానికి అవసరం లేదని భావించా. మరో మిత్రుడు సురేష్ కూడా ఇదే ప్రశ్న వెయ్యటం జరిగింది. మా ఇద్దరి సంభాషణ (దిగువున ఇస్తున్నా) మీ సందేహం తీర్చగలదని తలంపు.
“Suresh” suresh.muragalla@gmail.com
Suresh: ఏంటండీ, మద్యలొ ఆపేసారు కధని?
Me: కథని పిల్లలకు ఎలా అసక్తిగా చెప్పచ్చో తెలియ చెప్పే వ్యాసం ఇది. ఇది కథ కాదు.
మానవ్, దీప్తి, పక్కింటి శీను వీరంతా నిజమైన పాత్రలే. ఇది నిజంగా జరిగిన సంఘటనే. అంటే ఇలా మానవ్ కు కథ చెప్పటం.
Suresh: Ok nice..
మరి అప్పుడు సరే.. ఇప్పుడు.. మరి ఎప్పుడు పూర్తి చేస్తారు ?
Me: ఈ వ్యాసంలో కథను పూర్తిగా చెప్పాల్సిన అవసరము వుందా?
సురేష్: అవసరం అంటే లెదులెండి... U have educated the way to tell stories... Nice of you, but ending లొ చెప్పి ఉండి ఉంటే... Tension లెకుండా ఉండేది...
Me: నీ కోసం ప్రత్యేకంగా చెప్తా. పులి బయటకు వచ్చి జిం పై దాడి చేసింది. జిం ముందస్తు జాగ్రత్తలో వుండటం వలన తప్పించుకొని, దానిని షూట్ చేశాడు.ప్రజలకు, మనుష్యుల్ని చంపే పులి నుంచి, విముక్తి, అలా కలిగించాడు జిం.
సురేష్: ఓ అవునా.. నెను వెరేది expect చేసా..
Since that tiger got thorn in leg... he might have taken that and... Cured the tiger's wound... and it never tried killing human beings
అనుకున్నా
Any way... TQ for letting me know the remaining story...
Me: అతని పేరు మీదే భారత దేశం లో మొదటి వన్యమృగ సమ్రక్షణ కేంద్రం Corbet National Park స్థాపించారు.
Suresh: అవునా...Corbet National Park ఎక్కడ, India లో?
Me: ఉత్తర ప్రదేష్ లో
Suresh: oh ok... TQ
ఈ టపా చదివి బాగా అనిపించింది.
కథాలయ వారి ప్రయత్నాలను ప్రశంశించాలనిపించింది.
ఈ కథాలయ వారి workshop ఆంగ్లంలో ఉన్నట్లు అనిపిస్తోంది. తెలుగులో కూడా ఉందా?
ఒక చిన్న సవరణ సూచించాలనిపించింది ఈ వీడియో పరిచయంలో. This gave birth to... అని ఉంటే బావుండేదేమో? వారు ఒక చిన్న skit ఏదైనా కూడా వీడియోలో చూపిస్తే బావుండునని అనిపించింది.
రావు గారూ,
మీరు సురేష్ గారితో చేసిన సంభాషణ చదివాక మీ అభిప్రాయం నిజమే అని అంగీకరిస్తున్నాను. మీ శైలి బాగుంది. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి