ఆదివారం, ఫిబ్రవరి 10, 2008

బ్లాగ్వీక్షణం -4Butterfly at Ongole Photo: cbrao

నా ఇష్టం మీ కష్టం
http://hasyapujallulu.blogspot.com/2008/02/blog-post.html
కొత్తగా వచ్చిన బ్లాగులలో స్వాగతించతగినది డా.గురవారెడ్డి గారి హాస్యపుజల్లు. ఇది మనలను కడుపుబ్బా నవ్వించగలదని ఆశిద్దాము. డా.గురవారెడ్డి గారు, హైదరాబాదు లో, Orthopedic Surgeon గా పనిచేస్తున్నారు. రొగుల కీళ్ల నొప్పులను, వైద్యంతో కాక, తన సున్నిత హాస్యంతో తగ్గిస్తున్నారని వినికిడి.

Sex and Death - Two Great Taboos
http://uravishankar.wordpress.com/2008/02/08/sex-and-death-two-great-taboos/

సృష్టి కార్యం, చావు వీటి గురించి తక్కువ మాట్లాడేలా, మన మనస్సు పై నియంత్రణ బాల్యం నుంచీ వుంటుంది. మన చుట్టూ వున్న సమాజం, సామాజిక పరిస్థితులు మనల్ని అలా తయారు చేస్తాయి. మన పూర్వీకులు సృష్టి కార్యం ఎంతో పవిత్రమైందని తలిచారు. శివాలయం లోని, శివలింగం, పానువట్టం దేనిని పోలి వుంటాయో గమనించారా? శివరాత్రి జాగారం చేస్తూ, శివాలయం లో ఏమి చేసే వారో తెలుసా? దేవాలయాల పై బూతు బొమ్మలెందుకు? అనే తాపీ ధర్మారావు గారి పుస్తకం చదవండి. మృత్యువు మానవుడికి మొదటి నుంచీ పెద్ద అంతు చిక్కని రహస్యమే. శరీరానికే మృత్యువు కాని, ఆత్మ కు లేదని హిందువుల నమ్మకం. చనిపోయిన ప్రతి జీవికీ ఒక ఆత్మ వున్నట్లైతే,ఈ భూప్రపంచంలో ఉన్న జీవాత్మలను లెక్కించటం ఎవరి తరం?

వేంగో
http://saintpal.freehostia.com/?p=76

ఇది ఫ్రెంచ్ దర్శకుడు టోనీ గాట్లిఫ్, సంగీత ప్రధానమైన, సినిమా పరిచయం.ఈ సినిమాలోని సంగీతం అద్భుతం.అసలు సంగీతం కోసమే చూడాల్సిన సినిమా ఇది. చిత్రంలో అనేక సంగీత ప్రధాన సన్నివేశాలున్నాయి.ప్రముఖ ఫ్లెమెంకో గాయని లకైతా పాడిన పాట Video ను ఈ టపాలో చూడవచ్చు. ఈ సంగీత భరిత, సాయంత్రపు పార్టీ లో, ఉద్వేగంగా పాల్గొనండి.

తొలి మలుపు
http://karyampudi.blogspot.com/2007/12/blog-post_7757.html
అమ్మ కొట్టినా, పిల్లవాడు ఓదార్పుకై మరల తల్లి వద్దకే వెళతాడు.పిల్లవాడు మాటవినకుంటే, దండం దశగుణా భవేత్ అన్నారు పెద్దలు. మొక్కై వంగనిదే, మానై వంగునా అన్నారు. అమ్మ ప్రేమ గురించిన కథ ఇది. అమెరికా బ్లాగరులూ, మీ పిల్లలు మాటవినకుంటే, వారికీ నాలుగు తగిలిస్తారా?

వచ్చిపోవే పిచ్చుకమ్మా
http://www.telugudanam.co.in/kalaksheapam/paaTalu/pp_page15.htm#%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B5%E0%B1%87%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE

ఇది పిల్లల పాటలు లో ఒక పాట.
కొయ్య ముక్కలు గూడు చేశా
రేకు ముక్కను తలుపు చేశా
మెత్త మెత్తని ఈకలెన్నో
గూటి నిండా పరచి ఉంచా.
అంటూ పిచ్చుకను ఆహ్వానిస్తే, పిచ్చుక మీ ముంగిట్లో వాలదా?

మోహన్ బాబు – ఆవు
http://www.teluguvennela.com/2008/01/blog-post_30.html

ఆవుకూ, మోహన్‌ బాబుకూ లంకె ఏమిటి? ఇది చదివి నవ్వకుండా మీరు వుండగలరా? ప్రయత్నించి చూడండి.

Easy Hyderabad
http://www.easyhyderabad.com/

మీరు బెంగళూరు నుంచి హైదరాబాదు కు బదిలీ అయి వచ్చారు.మీ పిల్లలను ఏ స్కూల్ లో చేర్పించాలి? అర్థరాత్రి మీ నాన్న గారికి గుండెనొప్పి వచ్చింది? అంబులెన్స్ కావాలి?ఎవరిని సంప్రదించాలి? తెల్లవారుఝామున 5 గంటలకు విమానాశ్రయం వెళ్లాలి. ఆసమయంలో టాక్సీ ఎలా దొరుకుతుంది? పిల్లల పరీక్షల సమయంలో,కరెంట్ పోతే ఎవరికి ఫోన్ చేయాలి? అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ టపా.

తెలుగురధం : ప్రముఖ వీణా చిట్టిబాబు
http://teluguradham.blogspot.com/2008/02/blog-post.html

ప్రముఖ వైణికుడు చిట్టిబాబు గురించిన పరిచయ వ్యాసం బాగుంది. వ్యాసం లో చిట్టిబాబు చిత్రం లేకపోవటం వెలితిగా వుంది.చిట్టిబాబు గారి చే కదనకుతూహలరాగంలో స్వరపరచబడిన జయభారత్ అనే పాటను N.KARTHIK వీణ పై వినిపించిన చలన చిత్రాన్ని చూడండి..

http://youtube.com/watch?v=7jR7j91bY-Y

3 వ్యాఖ్యలు:

kalhara చెప్పారు...

ఇప్పటివరకూ చదవని మంచి టపాలను పరిచయం చేశారు. ఇలా కొన్నాళ్ళకోసారి రాస్తుండండి.

నిషిగంధ చెప్పారు...

మంచి టపా/బ్లాగ్ లను పరిచయం చేశారండి.. ధన్యవాదాలు :)

Suresh చెప్పారు...

mee aalochana harshincha thagindi.. ilaney Continue cheyyandi atleast one blog per 1-2months. easy hyderabad idea bavundi..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి