ఆదివారం, ఫిబ్రవరి 03, 2008

నెల్లూరు జైల్ లో నూతన గ్రంధాలయం

శిక్షపడ్డ ఖైదీలు భోజన ప్రియులైతే, విశాఖపట్టణం జైలు కు బదిలీ కావాలంటారు. కారణం అక్కడ ఇద్దరో లేక ముగ్గురో ఖైదీలు, గతం లో స్టార్ హోటళ్లలో chefs; అదేనండీ వంటవాళ్లు. వారు ప్రస్తుతం జైల్ లోని వంటశాల నిర్వహిస్తూ, రుచికరమైన *** వంటలు వండుతున్నారట. మరి ఖైదీలు, పుస్తక ప్రియులైతే ఎక్కడకు వెళ్లాలి? నిస్సందేహంగా నెల్లూరు జైలు కు. అక్కడ, చక్కటి గ్రంధాలయం, ఖైదీల కోసం నిర్వహిస్తున్నారు. నెరసం (నెల్లూరు జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పెరుగు రామకృష్ణ గారు పంపిన వివరాలు చూడండి) వారు ఈ మధ్యనే జైలు గ్రంధాలయానికి, 1000 కొత్త పుస్తకాలు కానుకగా ఇచ్చారు.జిల్లా గ్రంధాలయాలకే నిధులు లేక, కొత్త పుస్తకాలు సరఫరా కాని రోజుల్లో, జైల్లో ఇన్ని కొత్త పుస్తకాలు ఉండటం ప్రశంసనీయం. ఖైదీలు ఈ గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకుని, వారి జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకొంటారని, మంచి పౌరులౌతారని, ఆశిద్దాము.

Click on images to enlarge
6 వ్యాఖ్యలు:

krish చెప్పారు...

NAMASTE,
CHALA MANCHI PANI. ABHINANDANALU.
REGARDS
KRISHNA RAO J GUNTUR

రాకేశ్వర రావు చెప్పారు...

నిజమైన సాహితీ ప్రియులైతే హత్య చేయాలేమో!!!

cbrao చెప్పారు...

నీ కామెంట్ చాల తమాషాగా వుంది. కాని కొన్ని గొప్ప గ్రంధాలు జైల్లోనే రాయబడ్డాయి.హిట్లర్ మైన్ కాంఫ్, జవహరలాల్ ఇందిరకు రాసిన ఉత్తరాలు వగైరా పుస్తకాలు. తీరిక వుండటం వాళ్లను పుస్తకాలను రాయటానికి అనువైన వాతావరణం కల్పించింది. ఈ టపా ప్రస్తుతం forward mails లో చక్కర్లు కొడతా వుంది ఆశ్చర్యంగా. నెల్లూరు వాళ్లు, ఖైదీలకు పుస్తకాలు ఇవ్వగా, హైదరాబాదు వారు వెనకబడ్డారన్న ఆలొచనతో కావచ్చు. తెలుగు బ్లాగరులు, ఖైదీలకు కంప్యూటర్లో తెలుగు రాయటం ఎలా? అని ఎందుకు నేర్పకూడదు? ఖైదీలలోని సృజనాత్మకతను ఎందుకు వెలికి తీయ కూడదు?

ramperugu చెప్పారు...

Dear Rao gaaru..
Memu chesina panini viswa vyaptham chesinanduku dhanyavaadalu..
Kondaryina spandinchenduku avakaasam..
Ram

మాలతి చెప్పారు...

మంచి వార్త. ఈవిధంగా తెలుసుకున్నాను. సంతోషం. గ్రంథాలయాలతోపాటు, చదువురానివారికి జైళ్లలో చదువు చెప్పేవారు కూడా వున్నారా.

2. ఇప్పుడే చూసాను రావుగారూ, మీ షష్ఠిపూర్తి విషయం. నా మనఃపూర్వక శుభాకాంక్షలు.

Rajesh Devabhaktuni చెప్పారు...

ఇది మంచి ఆలోచన మరియు సుభ పరిణామం, అయితే పుస్తకాల విలువ, వాటి ఉపయోగాల గురించి వారికి ఎవరైనా చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది, అది వారికి పుస్తకాలు చదవడానికి ప్రేరణగా ఉంటుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి