శనివారం, జులై 05, 2008

బ్లాగరు మిత్రులకు: మీతో నేను -2









 నా బ్లాగు చిట్టా

దీప్తిధార బ్లాగులోని My Blog List చూసారా? అందులో మీరు ఇష్టపడే బ్లాగుల లింకులు పెట్టుకోవచ్చు. ఇందులో కొత్త ఏముంది అంటారా? ఇంతకు క్రితం ఉన్న Blog Rollలో, కేవలం ఆయా బ్లాగులకు లింకులు మాత్రమే వుంటే కొత్తగా వచ్చిన ఈ My Blog List లో ఆయా బ్లాగులలో తాజాగా ప్రచురించబడిన టపాల పేర్లు లింకులతో సహా ప్రత్యక్షం. అంతే కాదు, మీరు snippets ఎంచుకుంటే, ఆయా తాజా టపాలలోని మొదటి మూడు వాక్యాల, ముందుచూపు కూడా చూడవచ్చు. ఉదాహరణ కావాలంటే నా ప్రపంచం సైట్లోని , My Blog List చూడవచ్చు. ఈ బ్లాగులలో సరికొత్తగా తాజీకరించబడిన టపాలు పైన, అన్నిటికన్నా పాత టపాలు దిగువనా కనిపిస్తాయి. కొత్త టపాలను ఈ విధంగా గుర్తించటం చాలా సులువు. మీరు తరచుగా చదివే బ్లాగులకు ఇలా మీ బ్లాగులో, మీరు లింక్ ఇవ్వటం వలన ఆయా బ్లాగులకు rating value పెరుగుతుంది. అంతే కాదు, మీ బ్లాగు పాఠకులు, మీ బ్లాగులో టపా చదవటం పూర్తయ్యాక, తాజాగా ప్రచురించబడిన టపాల వైపు వారి దృష్టి మరలి, ఆయా బ్లాగులూ చదువుతారు. మీ మిత్రులూ, వారి బ్లాగులో, మీ బ్లాగుకు ఇదే విధంగా లింక్ ఇస్తే, అక్కడి పాఠకులు ఇక్కడకూ వస్తారు. ఇది ఉభయత్రా లాభకరము. మరి My Blog List ఎలా పెట్టుకోవాలంటే, సహాయము కొరకు ఈ దిగువ లింక్ చూడగలరు.
http://buzz.blogger.com/2008/06/show-off-your-favorite-blogs-with-blog.html

మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?
http://teluguvadini.blogspot.com/2008/03/blog-post_8627.html

డ్రాఫ్ట్ బ్లాగరు లో పెను మార్పులు

కొత్తగా draft.blogger లో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు మీ బ్లాగ్ పోస్ట్ కింద స్టార్ రేటింగ్, వర్డ్ ప్రెస్ లో లాగా కామెంట్ బాక్స్ వగైరాలు. ఈ విషయమై చదువరి టపా చూడండి.
draft blogger లో auto save సదుపాయం లేదు. draft.blogger.com ద్వారా తెలుగు Inscript Documents ను Copy & Paste చేసి ప్రచురించే సమయంలో పెక్కు HTML coding సమస్యలు సతాయిస్తాయి. Word తో వచ్చే Meta Tags ను draft.blog, అంగీకరించదు. Line breaks సమస్యలు కూడా వస్తాయి. పరిష్కారం ఉంది. Windows Live Writer ద్వారా ప్రచురిస్తే ఈ Coding సమస్యలు రావు. పై చెప్పిన, వీటిలోని చాలా అంశాలు దీప్తిధార లో ప్రవేశ పెట్టబడినవి. గమనించగలరు.

విండోస్ లైవ్ రైటర్ తో ఉపయోగాలు

Word Press ఉపయోగించే వారు గమనించే ఉంటారు; బొమ్మలు ఎగుమతి సమయంలో కొన్ని సార్లు అది మనలను ఇబ్బంది పెడుతుంది. మీ account blogspot , wordpress లేక మరేదైనా Windows Live Writer దిగుమతి చేసుకుని, చాలా సులభంగా, మీ బ్లాగులు, ఒకే చోటి నుంచి, ప్రచురించుకోవచ్చు. చిత్రాలకు సంభందించి కొద్దిపాటి editing సదుపాయం కూడా ఇందులో లభ్యం. Windows Live Writer ను దిగువ చిరునామా నుంచి దిగుమతి చేసుకోండి. ఉపయోగించటం చాలా సులువు.
http://get.live.com/writer/overview

బ్లాగ్ రేటింగ్ పెంచుకోవటం ఎలా?

సీనియర్ బ్లాగరులకు, బ్లాగు అభివృద్ధికి సూచనలు, ఇక్కడ చూడండి.
http://bloggingblunders.com/

ఈ సూచనలు పాటించాక, మీరు బ్లాగు రాయటం లో నిమగ్నమయినప్పుడు, ఎవరైనా ఫోన్ చేస్తే, ఈ వీడియోలో చూపిన విధంగా చేయండి. బ్లాగే జనా, సుఖినోభవంతు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి