మీ ఉత్తరాలు
బ్లాగ్వీక్షణం చదివి మీరు వెలిబుస్తున్న అభిప్రాయాలు ఉపయోగకరంగా ఉన్నై.మీ ఉత్తరాలకు సమాధానం రాయటానికీ కొన్ని సార్లు నేను చిన్నపాటి పరిశోధనలే చెయ్యవలసి వస్తుంది. ఇది కష్టమయినా, ఇష్టమైన పని కాబట్టి, కష్టమనిపించటంలా. ఉదాహరణకు అమెరికాలో భారతీయ తల్లి తండ్రులు వ్యాసం. ఉద్యోగం చేసే తల్లి తండ్రులకు ఎంతో ఉపయుక్త సమాచారముందిందులో.మీ ఉత్తరాలు నాకు కొత్త విషయాలు తెలుసుకోవటానికి దోహదపడినట్లే, నా వ్యాసాలు కూడా మీకు ఉపయోగపడితే, వాటి ఉద్దేశం నెరవేరినట్లే.
నా టపా బ్లాగ్వీక్షణంలో లేదెందుకు?
కొంతమంది మిత్రులు వారు రాసిన ఎంతో మంచి టపా గురించి బ్లాగ్వీక్షణంలో రాయలేదేమని అడగటమో/రాయటమో చెస్తున్నారు. కూడలి/జల్లెడలో వచ్చే వ్యాసాల సంఖ్య పెరిగింది. ఇన్ని వ్యాసాలలో మంచివి ఏవో గుర్తించాలంటే, అన్ని టపాలు చదవాలి. ఇది సాధ్యమయే పనేనా ఏ వ్యక్తి కైనా? పొద్దు పత్రికలో ‘మే’లిమి బ్లాగులు జాబులూ అనే శీర్షికతో, ప్రతి నెలా వచ్చే బ్లాగుల బాగోగులను సమీక్షుస్తున్నారు. చక్కగా వుంటున్నవీ సమీక్షలు. ఈ భోగట్టా తయారు చేసి,విశ్లేషణకై, ఆరుగురు కష్టపడుతున్నారు.Too many cooks spoil the broth అనే ఆంగ్ల సామెత తప్పని పొద్దు సంపాదక వర్గం ఋజువు చేసింది. వారికి అభినందనలు.బ్లాగ్వీక్షణం అలాకాక,భవదీయుడు ఒంటరిగా చేసే/రాసే విషయం. కొన్ని మంచి టపాలు తప్పిపోయే అవకాశాలు ఎక్కువ. మీరు రాసిన టపా, ఎంతో కష్టపడి రాసింది,నలుగురికీ ఉపయుక్తమైన టపా అని మీరు భావిస్తే,బ్లాగ్వీక్షణం లో దాని సమీక్షకై, ఆ టపా URL ఇస్తూ,ఒక ఉత్తరం రాయండి నాకు.
బ్లాగ్వీక్షణంలో టపాలు ఎలా ఎంపిక చేస్తారు? ?
కొందరు మిత్రులు ఏ basis పై బ్లాగ్వీక్షణం లో టపాలు ఎంపిక చేస్తారని అడిగారు. ఈ ఎంపిక చాలా రకాలుగా ఉంటుంది. బ్లాగరు మిత్రుల సమావేశాలలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చే బ్లాగులు, ఎక్కువ కామెంట్స్ వచ్చిన టపాలు, మిత్రులు సిఫారసు చేసినవి, కొత్తవైనా వినూత్నంగా వుండేవి. కొత్త బ్లాగులకు ప్రాచుర్యం కలిగించటం కూడా ఒక ఉద్దేశం గా ఉన్నది.
Wordpress లో చేంతాడంత url
పురాణ ప్రలాపం e-పుస్తకం url ను పత్రికల వారు తప్పుగా ప్రచురించటం అయ్యాక, వచ్చిన కొత్త ఆలోచన ఏమంటే, ఇంత చిన్న url ముద్రించటం కష్టమయితే,Wordpres లో తెలుగు బ్లాగుల url మూడు నాలుగు లైన్లని, తప్పు లేకుండా పత్రికలు ఎలా ముద్రించగలవు అని. మిత్రులకు ఇంత పెద్ద url పంపాలన్నా కష్టమే కదా. అదృష్టవశాత్తు వర్డ్‌ప్రెస్ లో ఒక సౌకర్యం ఉంది. మీరు రాసిన టపాను భద్ర పరచు/ప్రచురించే సమయంలో,Permalink లో change లేక మార్చు అనే option ఉన్నది. దీనిని ఉపయోగించి, మీ url చివరన వున్న తెలుగు పేరును, క్లుప్తమైన ఆంగ్ల పేరు తో భద్ర/ప్రచురిచతం చేస్తే, మీ url పొడగు చాలా క్లుప్తం గా ఉండగలదు. దీనిని వాడటం అందరికీ సులువు. బ్లాగ్వీక్షణం లో మీ బ్లాగు url ఇవ్వటం కూడా సులువై పోతుంది.
అనామక వ్యాసాలు
కొందరు బ్లాగు మిత్రులు, వ్యాసానికి పేరు లేకుండా ప్రచురిస్తున్నారు. వీటిని గుర్తించటం చాలా కష్టం. కొన్నాళ్ల తరువాత, ప్రచురించిన వారు కూడా ఏ టపాలో ఏముందో చెప్పలేరు. వ్యాసం లోని విషయాలకు సంబంధముండేట్లుగా, ఏదైన పేరు వ్యాసానికి ఉంచండి. ఇలా పేరులేని వ్యాసాలకు బ్లాగు సమీక్షలలో చోటు దొరకటం కష్టమని గుర్తించండి. అంత కష్టపడి వ్యాసం రాసి చిన్న పేరు వుంచటానికి బద్ధకించవద్దు. కొందరు ఒకే పేరు పలు టపాలకు పెడ్తున్నారు. ఇలాంటి సందర్భాలలో పేరు-1, పేరు -2 లాగా వ్యాసాలకు పేర్లు వుంచండి. లేకుంటే మీ వ్యాసాలు కవలలై, గుర్తించటం కష్టం.
నా బ్లాగుకు Hits రావాలంటే ఏమి చెయ్యాలి?
కొత్త బ్లాగరులు, తమ బ్లాగులకు హిట్స్ రావటం లేదనీ, ఏమి చెయ్యాలో సూచించమంటారు. మీరు తీరిక సమయంలో,ఇతర బ్లాగులు చదివి, వాటికి చక్కటి కామెంట్స్ రాయండి. ఈ కామెంట్స్ వలన, మీ బ్లాగుకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. కూడలి, తేనెగూడు, జల్లెడ లాంటి సైట్స్ లో మీ బ్లాగుపేరు register చెయ్యండి.ఎలా register చేయాలో తెలియక పోతే, తెలుగుబ్లాగు గుంపు కు ఒక ఉత్తరం రాయండి. మీ బ్లాగులో కామెంట్ రాసిన ప్రతి ఒక్కరికీ తగిన జవాబు లేక ధన్యవాదాలు తెలియచేయండి.
బ్లాగు: గృహాలంకరణ
మీ బ్లాగు template ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. ఇది మీ ఇల్లు కదా. తాజాగా పలువురిని ఆకర్షించింది ముక్తలేఖ అనే బ్లాగు.ఈ బ్లాగు టెంప్లేట్ చాలా సింపుల్ గా ఉంటూనే ఆకర్షణీయంగా వుంది. బ్లాగర్.కాం లో ఇచ్చే టెంప్లేట్ కాక బయట టెంప్లేట్లు దొరుకుతాయి. గూగుల్ లో blogspot templates అని అన్వేషించండి.మీకు ఒక మంచి ఇల్లు దొరకగలదు.
మంచి బ్లాగరను ఎలా అవ్వటం?
ఏమి రాయాలి, ఎట్లా రాయాలి అనే విషయం పై TEN TIPS FOR WRITING A BLOG POST చూడండి.
మీకు ఇప్పటికే బ్లాగులు రాసిన అనుభవముంటే ఇది చూడండి.
7 + 1 Habits of a Highly Effective Blogger
(To be continued)
5 కామెంట్‌లు:
@ఒరెమున: మీరు చెప్పిన విధముగా పారాగ్రాఫులకు sub-headings పెట్టాను. గమనించండి. Draft blogger లో HTML coding errors వలన Windows Live writer ద్వారా మరలా ప్రచురించే సమయం లో, మీవి, రాధిక కామెంట్స్ తొలగించబడినవి. మరిన్ని వివరాలకు బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 2 చూడగలరు.
@రాధిక: ఈ వ్యాసం మీకు నచ్చినందుకు ప్రమోదం.
ఈ వ్యాసం చాలా బావుందండీ!
-రవి
బహుతచ్ఛా రావు గారు.
అతడే ఒక సైన్యంలా .. మీరందిస్తున్న బ్లాగ్వీక్షణ సేవ, ముఖ్యంగా కొత్త బ్లాగరులకి బాగా ఉపయోగకరమని నమ్ముతున్నాను.
కొత్త బ్లాగురులకి, హిట్లు కావాలనుకునే వారికి ఒక సూచన. మీ సోంత ఆలోచనలని రాయండి. ఊరికే వెబ్ లో దొరికిన లింకులు పెట్టడమో, పేపరు కటింగులు పెట్టడమో కాదు. మీరు చదివిన పుస్తకం గురించి గానీ, మీ చిన్నప్పటి సంఘటన గానీ, ఆఫీసులో జరిగిన ఫన్నీ విషయంగానీ, మీరు చూసిన సినిమా గానీ, మీ మాటల్లో చెప్పండి. భాష విషయంలోనూ అక్షరాల పొందిక (స్పెల్లింగు) విషయంలోనూ జాగ్రత్త వహించండి. మీరు ఆసక్తి కరమైన విషయాలు రాస్తుంటే హిట్లూ వ్యాఖ్యలూ అవే వస్తాయి.
కొత్త బ్లాగరులకు చేస్తున్న సూచనలకు ధన్యవాదాలు.
రావు గారు : మీరు చేస్తున్న ఒక గొప్ప పనికి ఏదో ఉడతాభక్తిగా నావంతుగా నేను ఈ బ్లాగ్ టెంప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయి, నాకు నచ్చినవి కొన్ని అన్నింటినీ కలిపి ఒక టపాగా (Free and Premium Templates for your Blogger/Wordpress Blogs) ఇప్పుడే ప్రచురించా ... ఎవరికైనా ఉపయోగ పడితే అదే పదివేలు. లేకపోయినా కనీసం ఎక్కడో మూలన పడిపోయిన విషయాలకి వెలుగు ప్రసాదించాను అన్న తృప్తి ఎలాగూ ఉంది.
ఏది ఏమైనా ఇలాంటి టపాలన్నీ మీరు నిర్విఘ్నంగా ప్రచురించాలని ఆశిస్తూ ... ధన్యవాదాభినందనలతో...
కామెంట్‌ను పోస్ట్ చేయండి