శనివారం, జులై 26, 2008

రజనీకాంత్ కొత్తచిత్రం: కథానాయకుడు

kathanayakudu
రజనీకాంత్, జగపతి బాబు, నయనతార, మీనా ముఖ్య తారాగణంగా కథానాయకుడు సినిమా రాబోతుంది. మలయాళం లో అఖండ విజయం సాధించిన చిత్రం  "కథ పరయుంబోల్" ఈ చిత్రానికి మాతృక.

రజనీకాంత్ నిజజీవితంలోంచి కొన్ని సంఘటనలు, మిత్రుల ప్రస్తావన ఈ చిత్రం లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్ర కథానుసారం రజనీకాంత్, జగపతి బాబు మంచి మిత్రులు. రజనీకాంత్ సూపర్ స్టార్ అయితే, మరొక హీరో మంగలిగా వుండిపోతాడు. వారి స్నేహం అలాంటి పరిస్తితులలో ఏమవుతుందో చిత్రంలో చూడాల్సిందే. ఈ చిత్రంలో స్నేహం విలువ ఎంతో సముచితంగా చూపబడింది. ఆగస్ట్ 3 World Friendshipday ను, ఈ చిత్రం విడుదలను కలిసి ఉత్సవంగా నిర్వహించబోతున్నారు. ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని హిందీ లో షారుక్ ఖాన్ నాయకుడిగా నిర్మించబోతున్నాడు.

కథానాయకుడు లో Comedian సునీల్ తన ఇష్టానుసారం, మీసాలు పెంచటం, తగ్గించటం ఒక విశేషం. 75 ఏళ్ల దక్షిణ భారత చలన చిత్రసీమకు నీరాజనం పడుతూ నిర్మించిన సన్నివేశాలలో, తెలుగు, తమిళ, మలయాళ ఇంకా కన్నడ చిత్ర ప్రముఖులను చూపించటం జరిగింది.

soundarya_rajnikanthఈ చిత్రానికి కావలసిన గ్రాఫిక్స్ అన్నీ రజనీకాంత్ పుత్రిక సౌందర్య, తన స్టుడియో ‘Ocher’ లో చెయ్యటం జరిగింది. ఈ నీరాజనం సన్నివేశం లో, స్టుడియో సాంకేతిక నిపుణలతో బాటుగా, సౌందర్య కూడా కొన్ని సెకన్లు కనిపించబోతున్నది.  శంకర్ మహాదేవన్ పాడిన సినిమా సినిమా సినిమా సినిమా ఎంటీఅర్, ఏన్ఆర్, రాజకుమార్ ఎంతొమంది వచ్చారండీ అనే పాట ఈ సినిమాలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పాటలో రజనీ 10 సోకైన పాత్రలలో కనిపిస్తాడు.వచ్చే వచ్చే వాన అంటూ శ్రేయ ఘోశాల్ పాడిన పాట మెరుపు కలలు చిత్రం లోని సుజాత పాడిన ఓ వాన పడితే ఆ కొండ కోన హాయీ అనే పాట గుర్తుకు తెస్తుంది. ఓం జరారె అంటూ డేలర్ మెహందీ, చిత్ర, సాధన సర్గం పాడిన ఇంకో పాట ఈ చిత్రానికి మరో ఆకర్షణ. Soundarya Rajnikanth Pic Courtesy: Hindu Cinema Portal

సంగీతం: G V ప్రకాష్
దర్శకత్వం: పి.వాసు (Chandramukhi fame)
నిర్మాత: సి.అశ్వనీ దత్

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం, 1200 (తెలుగు మరియు తమిళం కలిసి) ప్రింట్ల తో, ఆగస్ట్ 1 న విడుదల కాబోతుంది . అమెరికా లో పలు నగరాలలో, జులై 31 న, ఈ చిత్రం ప్రివ్యూ షోలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేష్ లో 300 ప్రింట్ల తో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

చిత్రం లోని పాటలు ఇక్కడ వినండి.

http://musicmazaa.com/telugu/audiosongs/movie/Kathanayakudu.html?e

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Ye Website chhosina ee Tamil godava ekkuvaga vundi. Mari inta pichhi elago mari. Asalu Rajanikanth ela superstar naku artham kaadu. Aayana market anta mana telugu valla valle.

అజ్ఞాత చెప్పారు...

entandi rao gaaru, monnemo Chiranjeevi blog.. ippudu rajinikanth blog.. enti meeru rajakeeya pravesam gani.. cine ranga pravesam gani cheyyabothunnara?

కామెంట్‌ను పోస్ట్ చేయండి