శనివారం, జులై 26, 2008

ఏ మెదడు మీరు ఉపయోగిస్తారు?

ఇది చాలా అమోఘమైనది. చాలా గంటల పాటు మీరు దీని గురించి ఆలొచిస్తూనే ఉంటారు.

amazinggirl

ఈ బొమ్మలో అమ్మాయి, కుడిపక్కకు తిరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే దానర్ధం మీరు మెదడులోని కుడి భాగం వాడతారని; ఇంకోలా కనిపిస్తే, మీరు ఎడమ మెదడు వాడతారని అర్థం. కొంతమంది రెండు దిక్కులూ తిరుగుతున్న అమ్మాయిని చూడగలరు. కాని ఎక్కువమంది అమ్మాయి ఒకవైపు మాత్రమే తిరుగుతున్నట్లుగా గ్రహించగలరు. మీరు మెదడు లోని ప్రవాహ గతిని మార్చి, ఆ అమ్మాయి రెండు దిశలలోనూ తిరిగేట్లుగా చెయ్యగలరు. ఇలా అమ్మాయి భిన్న దిశలలో తిరుగుతున్నట్లుగా అనిపించటానికి, మెదడు లోని రెండు పార్శ్వాలే కారణభూతాలని ప్రయోగాల ద్వారా తెలుస్తుంది.
ఈ కింది పట్టిక ఎడమ, కుడి భాగాలలో ఉన్న మెదడు లోని తేడాలని తెలియచేస్తుంది.

Left Brain     Right Brain
Logical         Random
Sequential     Intuitive
Rational        Holistic
Analytical      Synthesizing
Objective      Subjective

Looks at       Looks at
parts             wholes

Most individuals have a distinct preference for one of these styles of thinking.Some, however, are more whole-brained and equally adept at both modes. In general, schools tend to favor left-brain modes of thinking, while downplaying the right-brain activities.Left-brain scholastic subjects focus on logical thinking, analysis, and accuracy.

Right-brained subjects, on the other hand, focus on aesthetics, feeling, and creativity.If you look away, she may switch from one direction to the other.I found that if I just look at her feet or relax and look at the floor where the reflection shows, she will switch direction!

Source of article : Internet

20 కామెంట్‌లు:

Chari Dingari చెప్పారు...

నాకు రెండు వైపులా తిరిగినట్టు కనిపిస్తుంది..కాసేపు...కుడి...కాసేపు...ఎడమ...అసలు ఆ అమ్మాయి రెండు వైపులా తిరుగుతోంది అని నా అనుమానం....ఇందులో ఆప్టికల్ ఇల్ల్యుషన్ ఎదీ లేదేమో?

అజ్ఞాత చెప్పారు...

scroll up and down to change direction, i dont see any brain technology here

Bolloju Baba చెప్పారు...

అమ్మాయి భలే తిరుగుతుంది
బొల్లోజు బాబా

కామేశ్వరరావు చెప్పారు...

నాకూ రెండువైపులా తిరిగడం కనిపిస్తోంది, scroll చెయ్యకుండానే. కాబట్టి ఇది కచ్చితంగా మెదడూ చేసే విచిత్రమే. కాస్త ప్రయత్నిస్తే, ఎటుకావాలంటే అటు తిరిగినట్టు కూడా కనిపిస్తోంది! నా మెదడుతో ఉన్న చిక్కే ఇది, ఒక పట్టాన ఆలోచించదు కదా :-)
ఇక్కడ అసలు బొమ్మ 2-dimensional. కానీ అది 3-dimensionalగా కనపడ్డమే మెదడుచేసే మొదటి చిత్రం. దీన్ని ఆధారంగా చేసుకొని తయారుచేసిన విచిత్రం ఇది.
బావుంది!

అజ్ఞాత చెప్పారు...

నేను ఎన్నిసార్లు చూసినా అమ్మాయి కుడివైపుకే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది!

Sujata M చెప్పారు...

So.. I use the left side of my brain. I was a left hander. My mum had actually changed me to a right hander. So I dont know how can this be possible.. Left handers usually have their right part of the brain active. Is it possible to change it later ? :D

Rajendra Devarapalli చెప్పారు...

దాట్ల గారూ నాబ్రెయినే మీరూ వాడుతున్నారా?లేక మీమెదడును నేను వాడాలనుకుంటున్నానా?? :)నాకూ అలాగె కనిపిస్తుంది.
బియ్యేలో సైకాలజీ క్లాసులో భాగంగా ఒక సారి జరిపిన పరీక్షలో నాకు వర్ణాంధత ఉందని తేలింది.అంటే colour blindness, ఆకుపచ్చలో ఒక షేడ్ నాకు కనిపించదు అని.ఇక్కడ నీకసలు మెదడే లేదని ఫలితమొస్తుందని భావించా,కానీ అలాంటి ప్రమాదమేమీ లేదని కాస్త కంటే ఎక్కువగానే ఆనందించా.
సుజాత గారు,మీరు చెప్పినట్లు చూస్తే,నిజంగా మీ అమ్మగారు మిమ్మల్ని కుడిచేతివాటానికి బలవంతంగా మార్చి ఉన్నట్లయితే మీకు నత్తి ఉండి ఉండాలి,కనీసం చిన్నప్పుడు,ఆంగ్లరచయిత సోమర్సెట్ మామ్ ఇందుకో ప్రముఖ ఉదాహరణ

అజ్ఞాత చెప్పారు...

నరేంద్ర భాస్కర్ S.P
చాలా బాగుందడీ మీ మెదడుకు మేత, నాకూ దాట్ల& రాజేంద్ర గార్ల లాగా కుడి ప్రదక్షిణమే కనపడుతోంది, ఏది ఏమైనా రాజేంద్ర గారన్నట్టు, మెదడు ఉందో? లేదో? మాకు మేము తెలుసుకోగల అవకాశం కల్పించారు,
నెనర్లు,

అజ్ఞాత చెప్పారు...

నాక్కూడా అలే ఉంది అది కుడి వైఏ తిరుగుతుంది

రవి వైజాసత్య చెప్పారు...

కుడి..ఎడమ..మరలా కుడి

రవి వైజాసత్య చెప్పారు...

ఒకటి గమనించా..కేవలం బొమ్మనే చూస్తున్నప్పుడు నాకు కుడివైపు తిరుగుతున్నట్టుగానూ..కొంచెం పాఠ్యం చదువుతూ చప్పున చూపు బొమ్మవైపు మరల్చినప్పుడల్లా ఎడమవైపు తిరుగుతున్నట్టూ అనిపించింది. సరదాగా ఉంది

Srikanth చెప్పారు...

కుడి వైపే తిరుగుతున్నట్టు ఉంది

cbrao చెప్పారు...

మొదటగా ఈ అమ్మాయి ఎడమ వైపు తిరుగుతున్నట్లుగా అనిపించింది. దృష్టి మరల్చి, క్రీగంట చూస్తే, కుడి పక్క తిరుగుతుంది. అంటే నేను మెదడు లోని రెండు పార్శ్వాలనూ ఉపయోగించగలిగానన్న మాట.

Naga చెప్పారు...

నాకూ మా ఆవిడకు ఒకేసారి వ్యతిరేక దిశల్లో తిరిగినట్లు కనపడడంతో అనుమానాలు పోయాయి. కొంత కృషితో బొమ్మను ఎటు కావాలంటే అటు తిప్పడం నేర్చుకున్నాను. చాలా గొప్ప టెక్నాలజీ!

నెనర్లు.

spandana చెప్పారు...

నాకూ కుడి వైపుకే తిరుగుతున్నది. అయితే చాలా ప్రయత్నించి మెదడుకు సర్ది చెప్పాకా 360 డిగ్రీలు కాకుండా 180 డిగ్రీలు మాత్రమే కుడికీ ఎడమకూ ఊగుతున్నట్లుగా చూడగలుగుతున్నాను. మీరేవరైనా ఇలా చూశారా? లేక నాకు మెదడు మోకాల్లోకి వచ్చిందా?

దీన్ని బట్టి నేర్చుకునే నీతి చూసేదంతా నిజం కానక్కర లేదు. నాకు కనిపించేది మా ఆవిడకు కనపడక్కర లేదు.

--ప్రసాద్
http://blog.charasala.com

spandana చెప్పారు...

బాగా ప్రయత్నించాక ఇప్పుడూ నేణు కూడా ఎప్పుడు ఎలా అయినా చూడగలుగుతున్నాను.

నాకు వుపయోగ పడిన మంచి వుపాయం. ఎడమ కాలి మీద నిలబడిందని ఓసారి, కుడి కాలి మీద నిలబడిందని ఓసారి వూహించుకుంటే చాలా సుళువుగా దిశను మార్చవచ్చు.

--ప్రసాద్
http://blog.charasala.com

అజ్ఞాత చెప్పారు...

This has been on the internet for quite sometime and one of the widely distributed one.
there is no big optical illusion, it turns both ways intermittantly.
it doesn't really tell whether you use the right brain or left brain !!
As long you have the full brain you use both sides simultaneously for every task. you need both sides for any task ( in case your one half brain is removed for some reason as a child, the other half takes over most of the function of the removed part, if it was removed when you grew up the other half can't take over the function).
Language function is more or less localised to Left half of the brain. Language function includes naming, reading, writing, comprehention and repetetion. This part is more developed in women ( they are able to speak more fluently , non stop but lot of men have dificulty in this matter )where as men has better right brain, it takes care of visuo-spatial orientation ( to say, men are able to remember directions and locations better.EG: if a man and woman drive from charminar to Ameerpet for the first and ask them to repeat or just do the return drive, the chances are that the lady would miss or gets lost )
for visual function you need both sides, if one part is damaged you 'd miss crtain area in the visual field.
the above fuctions you attributed to left and right brain are poorly localised in the brain you can't say either left or right.

అజ్ఞాత చెప్పారు...

@ Sujata garu
you know our left brain controls right side of the body movements and vice versa
All the right handers has left side of the brain dominant ( for language function..see earlier post )and you expect all left handers to have right brain dominant, but it is not true.
About 90% of the left handers do have left side dominant brain, only few left handers has right side dominance.
The skull bones on the left side are a bit thicker than right side, it is the natures way of protecting important language function
in case of head injury

సుజాత వేల్పూరి చెప్పారు...

నేను కాసేపు కుడి వైపు మెదడూ, కాసేపు ఎడమ వైపు మెదడూ ఉపయోగిస్తున్నాను! దీన్నే సం యమనం అంటారనుకుంటా!

Sujata M చెప్పారు...

Oh ! interesting. Dear Anonymous, Its true that one can get lost in hyd while driving very easily. Its obvious that there will be no good sign boards or directions on rods. Even if a sign board exists, we are most likely to miss it, because it is placed just when we cross it, with very small and uncomprhendable letters.

Ok. I agree with Sujatha garu also. Now I am a sabsasachi.. So does that mean my brain works both ways? Left to Right ?

Thanks anyway. Gee...

కామెంట్‌ను పోస్ట్ చేయండి