ఆదివారం, డిసెంబర్ 07, 2008

తెలుగు బ్లాగు రచయితలు, పాఠకులు


Grass at Sea World of San Diego Photo: cbrao

గత రెండు సంవత్సరాలలో తెలుగు బ్లాగు రచయితలు, పాఠకులు గణనీయంగా పెరిగారు. కొత్త బ్లాగరుల బ్లాగుల సృజనలో, పోషణ (maintenance) విషయంలో, తెలుగుబ్లాగు గుంపు తన వంతు క్రియాశీలక పాత్రలో విజయవంతమైందని చెప్పవచ్చు. తెలుగు బ్లాగుల, తెలుగు వికి ల వ్యాప్తికి తెలుగుబ్లాగు, e-తెలుగు చెప్పుకోతగ్గ కృషి చేస్తున్నాయి. e- తెలుగు కార్యవర్గ సభ్యునిగా, మొదటినుంచీ ఈ సంఘ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నా. బెంగళూరు తెలుగు బ్లాగరులు నెల నెల సమావేశాలు జరుపుకోవటానికి తెలుగుబ్లాగు గుంపు ప్రోత్సాహం చాలా ఉంది. e-తెలుగు తరఫున, హైదరాబాదు లో ప్రతి నెలా తెలుగు బ్లాగరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల నివేదికలు గతం లో దీప్తిధార, జాబిల్లి, శోధన, e-తెలుగు ల లో మీరు చదివే ఉంటారని తలుస్తాను. మీరు తెలుగు బ్లాగులకు కొత్త అయినచో, e-తెలుగు సంఘం గురించి దీప్తిధార e - తెలుగు రెండవ అడుగు
http://deeptidhaara.blogspot.com/2007/02/e.html
టపాలో చూడవచ్చు. e--తెలుగు సంఘం bye-laws కూడా ఇదే టపాలోంచి దిగుమతి చేసుకోవచ్చు. భారతదేశంలోని పట్టణాలలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలుగు పాఠకులు,బ్లాగరులు తరుచూ కలుసుకోవాలనీ, తెలుగు భాషా వ్యాప్తికి తమ వంతు కృషి చెయ్యాలని, ఆశిస్తాము. గతంలో అమెరికా బ్లాగరులు ఒక virtual meeting జరిపారు. ఇప్పుడు అడపాతడపా కూడలి కబుర్లలో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కబుర్ల స్ఫూర్తిగా మహిళా బ్లాగరులు కబుర్లలో భాగంగా ప్రమదావనం ఛాట్ నిర్వహిస్తున్నారు.

నేను అమెరికా వచ్చాక, నేను నా వద్ద ఉన్న సమాచారం మేరకు, తెలుగు బ్లాగరులను, పాఠకులను కలవగలిగాను. ఇంతవరకూ డెట్రాయిట్, వాషింగ్టన్, అట్లాంటా, కొలంబస్, డెన్వర్ ఇంక చికాగో పట్టణాల లోని తెలుగు బ్లాగరులు, పాఠకులను కలుసుకోగలిగాను. తరచూ ప్రయాణాలలో ఉండటం వలన ఈ సమావేశాల నివేదిక ఇవ్వటం వీలుపడలేదు. వీలు చేసుకొని, ఈ నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడకు కేవలం సందర్శకుడిగా వచ్చిన కారణంగా పలు నగరాలు సందర్శించే వీలు కలిగింది. ఫిబ్రవరి దాకా ఇక్కడే (ఉత్తర అమెరికా, కాలిఫోర్నియా) ఉండగలను. ఈ కాలిఫోర్నియాలోనే పలు బ్లాగరులు, తెలుగు పాఠకులు ఉన్నారు. వీలు వెంబడి వీరందరినీ కలవాలని తలంపు. కాలిఫోర్నియా నివాస బ్లాగరులు, పాఠకులు మీ contact information నాకు పంపగలరు. మీ వీలునుబట్టి సామూహికం లేక వ్యక్తిగత సమావేశమవుదాము. అమెరికా లోని ఇతర ప్రాంతాలలో నివసించే వారు కూడా మీ contact info నాకు పంపకోరుతాను. నా పర్యటనలో భాగంగా మిమ్ములను కలిసే ప్రయత్నం చేస్తా.



ఈ bloggers & readers data base ఆధారంగా మీకై మీరే ఈ సమావేశాలు నిర్వహించుకోవచ్చు, హైదరాబాదు బ్లాగర్లవలే. డెట్రాయిట్ ప్రాంతంలో తెలుగు బ్లాగరులు, పాఠకులు ఉన్నారు. ప్రాణహిత అంతర్జాల పత్రిక వారు కూడా ఈ చుట్టుపక్కలే ఉన్నారు.వీరంతా నెలకోసారి కలిసే వీలుంది. ఆ ప్రయత్నం చెయ్యవలసినదిగా అక్కడి వారిని కోరుతున్నా. ప్రస్తుతం చికాగో, కొలంబస్ లోని బ్లాగర్ల సమావేశానికి నా వంతు కృషి చేస్తున్నా. వీలు వెంబడి మిగతా ఊళ్లలో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలి. అమెరికాలో దూరాలు ఎక్కువే. దూరాభారాన్ని లెక్కచెయ్యకుండా సమావేశం నిర్వహించటం కష్టమే అయినా, మనసుంటే మార్గముండక పోదు.

అన్ని ఊళ్లలో తెలుగు బ్లాగరులు సమావేశమవ్వాలి; తెలుగు భాష, బ్లాగుల, తెలుగు వికీ అభివృద్ధికై కృషి చెయ్యాలి. పరస్పర సహాయం అందించుకోవాలి. ఈ కింది టపా లో సూచించిన విధంగా మరికొన్ని పనులు చెయ్యవచ్చు.
http://veeven.wordpress.com/2008/12/06/december-second-sunday/
ఉత్తర అమెరికా తెలుగు బ్లాగరులు, పాఠకులు (భవిష్యత్లో బ్లాగరులు?) మీ contact info నాకు పంపగలరు. సమావేశాల గురించి,సమాచార చిట్టా (database)విశ్లేషించి,మీకు తెలియ చేస్తాను. తెలుగు అభ్యుదయానికి మన వంతు తోడ్పడుదాం. తెలుగు బ్లాగులు,వికి ద్వారా తెలుగు భాషలో అందరికీ పనికి వచ్చే మరింత ఉపయుక్త సమాచారాన్ని చేరుద్దాం.

9 కామెంట్‌లు:

GIREESH K. చెప్పారు...

దయచేసి, బెంగళూరు తెలుగు బ్లాగర్ల సమావేశం వివరాలు ఎవరైనా తెలియచేయగలరు.

అజ్ఞాత చెప్పారు...

Rao garu,

When are you coming to Louisiana? December last week would be great for me. New Orleans lo French Quarters and Jazz music vini veldurugani:-)

మాలతి చెప్పారు...

భాస్కరరావు గారూ,
మాడిసన్ లో మీటింగు పెట్టేంత సీను నాకు లేదు. ఇంకా ఎవరైనా బ్లాగరులున్నారేమో నాకు తెలీదు. మీరు ఫరవాలేదనుకుంటే నాకు ఇమెయిలివ్వండి మీనెంబరు. ఫోనులో మాటాడుకుందాం. నా ఐడి thulikan@yahoo.com.
- malathi

cbrao చెప్పారు...

@ఇస్మాయిల్: మీ ఆత్మీయ ఆహ్వానానికి ధన్యవాదాలు. అట్లాంటా దాకా వచ్చాను. మీ గురించిన సమాచారం నా వద్ద లేక పోవటం తో, మిమ్ములను కలువలేక పోయాను. నా వ్యక్తిగత వేగుకు మీ చిరునామా, ఫోన్ నంబర్లు పంపగలరు. ఈ సారి down south వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తాను. ఈ లోపు మీ ప్రాంత తెలుగు పాఠకుల, రచయితల సమాచారం సేకరించండి.

మీ ఊరు న్యూ ఒర్లేన్స్ వస్తే Tuesday Feb.24.2009 న జరిగే Mardi Gras పండగకు రావాలి. అప్పుడు నగరమంతా ఊరేగింపులతో కోలాహలంగా ఉంటుంది. Bluegrass, Jazz సంగీతం వింటూ, మార్గరిటా ఇష్టంగా తాగుతూ, Cajun/Creole/New Orleans-style ఆహారం తింటూ, ఆనందించటానికి అంతకంటే మంచి సమయముండదు.

cbrao చెప్పారు...

@ మాలతి: మీకు సీన్ లేక పోవటమేమిటి? మీరు మంచి రచయిత్రుల కోవలో ఉన్నారు. సరయూ మీ అమ్మాయి. ఇవి చాలవా? సరే ఇంతకీ విషయమేమిటంటే, బ్లాగర్ల దినొత్సవం నాడు మీరు మీ ఇంట గాని లేక మీకు రెండు గంటల దూరంలో ఉన్న రాధిక (స్నేహమా....) ఇంట గాని సమావేశమవ్వండి. ఆ విశేషాలు మీ బ్లాగులో రాయండి. చికాగో బ్లాగర్ల సమావేశానికి మీకు ఆహ్వానం పంపమని అక్కడి బ్లాగర్లకు రాస్తాను. మీకు వీలయితే వెళ్లవచ్చు. డెట్రాయిట్ సమావేశం లో ఎందరో సాహితీ ప్రేమికులను కలిసే అవకాశం కలిగింది. మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది.

మీ ఊరొస్తే నాకు మీ, సరయూల ఆటోగ్రాఫ్స్ ఇస్తారా? "స్నేహమా" రాధిక వివరాలిస్తూ మీకు వ్యక్తిగత వేగు పంపుతున్నాను. వారిని సంప్రదించి సమావేశమవ్వండి. నా వివరాలు కూడా పంపుతున్నా, మీకు వీలయినపుడు మాట్లాడవచ్చు.

cbrao చెప్పారు...

@గిరీష్.K: బెంగళూరు సమావేశం గురించి,మీరు బెంగళూరు బ్లాగర్లను సంప్రదించండి.మీరు మురళీకృష్ణ గారికి (murali.kunapareddy at gmail.com) ఉత్తరం రాయవచ్చు.

cbrao చెప్పారు...

@Sai Brahmanandam: మీ ఉత్తరానికి ధన్యవాదాలు.మీ వ్యాసాలు చదివి నా అభిప్రాయం తెలియపరుస్తాను.

మాలతి చెప్పారు...

భాస్కరరావు గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. షికాగోవారి ఆహ్వానం వచ్చింది. వారికి జవాబు రాస్తాను. ఈ చలీ మంచూ మూలంగా నేను వూరు పొలిమేర విడిచి వెళ్లడం లేదండీ. నేనూ, రాధికా ఆరునెలలుగా కలుద్దాం అనుకుంటునే వున్నాం కానీ పడలేదు. నిజానికి నేను మళ్లీ ఆలోచించుకున్న తరవాత నాకు అనిపించింది సమావేశాలు నావల్ల కాదు. కానీ నాకు తెలుగుభాష, తెలుగువికీకి చేతనయిన సేవ చెయ్యాలని కోరిక. అంచేత ఈరెండు విషయాల్లో నేను చేయగలిగినది ఏమైనా వుంటే చెప్పండి.
సరయు ఆటోగ్రాఫ్ తప్పకుండాను. నాలుగు రోజులు ఆగాలి. ఆ తరవాత, తాను నిజంగా గుర్తింపబడ గల స్టార్ అయినతరవాత మొదటి ఆటోగ్రాఫ్ మీకే పంపుతాను. :)
- మాలతి

cbrao చెప్పారు...

@ మాలతి:
సరే. మీకు రాధికకు వీలుకుదిరినప్పుడే కలవండి. తెలుగు సంఘాలలో పదవులకై , అంతర్గత ముఠా కుమ్ములాటలు, సంఘాలపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసాయి. అదృష్టవశాత్తు తెలుగు వికీ కి పనిచేసే వారు, బ్లాగులు రాసే వారు నిస్వార్ధంగా, లాభాపేక్షలేకుండా పని చేస్తున్నారు.

తెలుగు వికి కి మీరు కొత్త అని తలుస్తాను. ఒక అసమగ్ర వ్యాసం రంగనాయకమ్మపై ఉన్నది. అది విస్తరించగలరా? చూడండి
http://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE

ఇంకా వికీలో చెయ్యవలసిన పనులు చాలా ఉన్నయ్. ఒక సారి వికీలో రాయటం మొదలు పెడితే, అవేమిటో, మీకే తెలియగలవు.

రచయిత్రి నిడదవోలు మాలతి పై ఎలాంటి పరిచయ వ్యాసం లేదు. అది రాయవలసిఉన్నది. కొంత వ్యవధి తర్వాత నేను ఆ పని ప్రారంభించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి