శనివారం, జూన్ 11, 2011

భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారితో ముఖాముఖి

Bhumika Monthly Magazine

మన సమాజంలో స్త్రీల సమస్యలు బహు విధాలుగా వున్నాయి. ఈవ్ టీజింగ్ మొదలుకొని వరకట్న సమస్య, గృహహింస, ఉద్యోగినుల సమస్యలు,కార్యాలయాలలో లైంగిక వేధింపులు వగైరా స్త్రీల సమస్యలకు, సలహా చెప్పేవారు, సహాయం అందించే వారు లేక స్త్రీలు  మొన్నటి దాకా మౌనంగానే బాధ భరిస్తూ వచ్చారు. 


 ఆంధ్రదేశం లో స్త్రీవాద ఉద్యమం మొదలయ్యాక బాధిత స్త్రీల గోడు వినే వారు వచ్చాక చీకటిలో ఒక చిరుదీపం వెలిగింది.  ఆ దీపమే భూమిక సహాయ కేంద్రం.  భూమిక - స్త్రీవాద పత్రిక సంపాదకురాలు  కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సహాయ కేంద్రం ఎందరో స్త్రీల కన్నీళ్లు తుడిచింది. వెన్ను తట్టి, పీడిత స్త్రీల వెనుక తామున్నామని భరొసా ఇచ్చింది. 2008 మార్చ్ నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ భూమిక సహాయ కేంద్రం ప్రారంభించబడింది. 

 Bhumika Editor - Kondaviti Sathyavathi

మీకు తెలుసా!  సత్యవతి గారు తమ మిత్రులతో కలిసి కార్యాలయాల   లో  పనిచేసే స్త్రీల సమస్యలపై పోరాడి,  మహిళలకు ప్రసూతి సెలవు 90 రోజుల నుంచి 120 రోజులు సాధించారు.    


Bhumika Helpline

భూమిక సహాయ కేంద్రం ఆదివారం మినహాయించి  ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అనుభవజ్ఞులైన సామాజిక కార్యకర్తలచే నిర్వహించబడుతూ ఉంది. శనివారం న్యాయవాది ద్వారా చట్టపరమైన సలహాలు (Legal advices) కూడా లభ్యమవుతాయి.  భూమిక సహాయకేంద్ర టెలిఫోన్ సంఖ్య: 1800 425 2908 (Toll free).  ఇతర రాష్ట్రాలనుంచి ఫోన్ చెయ్యాలంటే  040 - 27605316  కు చెయ్యాలి. http://helpline.bhumika.org/

భూమిక స్త్రీవాద పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారితో ముఖాముఖి జూన్ 8, 2011 న ఆకాశవాణి, రైన్‌బో
FM ఛానెల్ లో ప్రసారమైంది.  వీరిని ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీమతి వసుమతి శర్మ.  ఈ ఇంటర్వ్యూ కింద వినవచ్చును.
http://dl.dropbox.com/u/31976678/Interview%20with%20Kondaveeti%20Satyavathi.MP3

దీప్తిధారలో గతంలో భూమిక, కొండవీటి సత్యవతి లపై  ఈ కింది వ్యాసాలు వెలువడ్డాయి. ఆసక్తి కలవారు వీటిని చూడవచ్చు.

 
భూమిక మూలికా డైరి 2008
http://deeptidhaara.blogspot.com/2008/01/2008.html


ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో , తలకోన అడవిలో

http://deeptidhaara.blogspot.com/2008/05/9.html

ఉద్వేగంగా జరిగిన భూమిక   బహుమతుల ప్రదానోత్సవం
http://deeptidhaara.blogspot.com/2008/06/3.html


భూమిక సత్యవతి గారిని కలుపుకొని, తెలుగు బ్లాగరుల ప్రత్యేక విహార యాత్ర చేద్దామా?
http://deeptidhaara.blogspot.com/2008/10/9.html


భూమిక  Helpline కి ప్రచారం కల్పించేలా ప్రమదావనం తరపున ఎవరైనా ఒక టపా రాయటం అవసరం.
http://deeptidhaara.blogspot.com/2009/01/2.html  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి