శనివారం, అక్టోబర్ 13, 2007

హిట్ల కోసం టపాలు


కృష్ణవేణికి భక్తితో సమర్పణకు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద అమ్మకానికి వుంచిన పూలు Photo:cbrao

ప్రజా రంజకమైన విషయాలపై రాస్తే హిట్లు బాగా వస్తాయి. ఏ విషయాలపై రాస్తే ప్రజారంజకమౌతాయో, విహారి తమ “మీర్రాసిన టపా హిట్టా ఫట్టా �“ విశ్లేషణాత్మక వ్యాసం “లో విపులీకరించారు. బ్లాగరు తొలినాళ్లలో హిట్లకోసం వెంపర్లాడినా,తరువాత వాటిని పట్టించుకోక, విశ్వనాథ్ లా కళాత్మకంగా ఉండటం అభిలషణీయం. కామెంట్స్ వ్యామోహం నుంచి కూడా బయటపడటం కష్ట సాధ్యమైన విషయమే. తెలుగు వికిపెడియ కు మన మిత్రులు, నిజంగా చాలా కష్టపడి, అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నారు.వీరంతా హిట్ల కోసం రాయటం లేదు.పేరుకోసం అసలే కాదు. వికీ లో వ్యాసకర్తలెవరో,పాఠకుడికి తెలియదు. తెలుగు పాఠకులకు కొత్త రచనలందించాలన్న తపనే, వీరిచేత రాయిస్తుంది. ఇది సామాజిక సేవా దృక్పధం కింద వస్తుంది.వీరందిరికీ నా వందనాలు. సంగీతంలో A.R.Rehman గొప్ప హిట్, నిస్సందేహంగా. కాని చరిత్రలో నిలిచే పాటలు కొద్ది మాత్రమే ఐతే,ఇళయ్ రాజా, కె.వి.మహాదేవన్, సి.ఆర్.సుబ్బరామన్,సుసర్ల, పెండ్యాల, రాజేశ్వరరావు వగైరా ప్రముఖులు స్వరపరచిన పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్మరణీయాలు. వీరి పాటలు కాల పరీక్షకు నిలిచే అణిముత్యాలు.

సాహితీ విషయాలపై గంభీరంగా టపాలు రాస్తే పాఠకులు కొంచెం దూరంగా వుంటారు.గంభీరంగా కాక, జనార్క్షణీయంగా కాక మధ్యస్తం గా రాస్తే, జటిలమైన విషయాలు కూడా పాఠకుడిని చేరతాయి.కొన్ని సాహిత్య విషయాల బ్లాగ్ టపాలకు, హిట్స్ రాకపోయినా, తరువాత చదివేవారి సమాచారం నిమిత్తం కొన్ని విషయాలు నేను నా బ్లాగులో రాస్తున్నాను. కర్ణాటక సంగీతకారిణి సౌమ్య పై నేను రాసిన టపా కొద్దిమందిని మాత్రమే ఆకర్షించగలిగింది. ఇవ్వాల్టి బ్లాగరులు మరో 15 సంవత్సరాల తరువాత ఈ టపా చూస్తే,అందులోని విషయాలు వారికి ఇష్టం కావచ్చు.ద్రాక్ష సార, శాస్త్రీయ సంగీతం వయస్సు పెరిగే కొలదీ మధురమౌతాయి.

హిట్స్ తో నిమిత్తం లేకుండా, తెలుగు వికిపిడియ వారి శోధన కు ఉపయోగపడే విధంగా,పుస్తక రూపం లొ వచ్చినా నిలవదగ్గ, టపాలు రాయాలని నా అకాంక్ష.నా రచనలలో, తెలుగు వికీ వారికి ఉపయోగపడేవి ఏవైనా,వారు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

3 కామెంట్‌లు:

Burri చెప్పారు...

దీప్తి గారు ముందు మీ టపా/అలోచనలకు నా నెనర్లు. మీరు చెప్పినది అక్షరాల నిజం. ఎవరో వస్తారు, ఎదో కామెంట్ రాస్తారు అని ఎదురు చూడని తెలుగు వికిపిడియ పరిశోధన చిరస్మరణీయం. వికి, జల్లెడ, కూడలి, తేనగూడు లాంటి సైట్ లేకపోతే మన బ్లాగ్ లోకం తెరలేని సినిమాహాల్ వంటిది.

-మరమరాలు

cbrao చెప్పారు...

మరమరాలు - మీ ఉత్తరానికి నెనర్లు. నా పేరు దీప్తి కాదు.మా అమ్మాయి పేరు దీప్తి.బ్లాగ్ పుత్రిక,నిజ పుత్రిక ఇద్దరి పేరూ దీప్తే.

Burri చెప్పారు...

CBRao గారు, నేను ఇప్పుడే గమనించాను మీ వ్యాఖకు నెనర్లు. మీ బ్లాగ్/అమ్మాయి పేర్లు చాలా బాగున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి