మంగళవారం, జులై 22, 2008

రేడియోలో నా ఇంటర్వ్యూ - 1

OLYMPUS DIGITAL CAMERA

నేడు Rainbow FM లో సుమన్స్పతి రెడ్డి గారు చేసిన ఇంటర్వ్యూ లో, పక్షుల గురించి, ఛాయాగ్రహణం గురించి, తెలుగు బ్లాగుల గురించీ మాట్లాడాను.  ఆది బ్లాగరు చావా కిరణ్, వీవెన్ బ్లాగుల కోసం చేస్తున్న విశేష కృషిని ప్రస్తావించాను. కంప్యూటర్ కు  తెలుగు నేర్పటం అనే విషయం పై తెనాలిలో చేసిన Workshop గురించి ఉదహరిస్తూ, ఆసక్తి ఉన్న వ్యక్తులకూ, సంస్థలకూ తెలుగు బ్లాగు గుంపు, e-telugu తరపున Workshops నిర్వహించటానికి సంసిద్ధత తెలియ పరచాను.

OLYMPUS DIGITAL CAMERA

Left to Right: cbrao and Sri Sumanaspati while recording the programme

 
ఈ ప్రోగ్రాం broadcast అయ్యే సమయంలో  live record చెయ్యటానికి, నా వద్ద, స్నేహితుల వద్ద working condition లో ఉన్న, టేప్ రికార్డర్ లేక పోవటం తో, ధ్వనిముద్ర గావించ లేక పోయాను. ఆకాశ వాణి టేప్ సంపాదించి, పూర్తి శ్రవణ interview  త్వరలో ఇక్కడ ఇవ్వటానికి కృషి చేస్తాను.


అప్పుడే ఒక శ్రోత నుంచి ఉత్తరం వచ్చింది. శ్రీనివాస్ కుమార్ గారు రాస్తున్నారు: "I would like to know about any website that provides Telugu typing using INSCRIPT method. I know lekhini.org but it is phonetic English based one. Kindly let me know if there is something like this." 


గమనిక: ఈ కార్యక్రమం తొలిసారిగా 22 జులై  2008 న మధ్యాహ్నం 1.30 P.M. కు సరదా లో ప్రసారమయ్యింది.   ధ్వని ముద్రణ అయ్యిన గంటకే ప్రసారం చేశారు. మరలా, మరలా వారికి ఖాళీ దొరికినప్పుడల్లా ఇది పునః ప్రసారమవుతుంది కావున, తెలుగు బ్లాగుల గురించిన సమాచారం ఎక్కువమందికి చేరే అవకాశం ఉంది.

17 కామెంట్‌లు:

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

మనకు దొరికిన అవకాశాలను వాడుకొని తెలుగు బ్లాగుల గురించి, కంపూటర్ లో తెలుగు వ్రాయటం గురించి అందరికీ చెప్పాలి. అప్పుడే మన కృషి ఫలిస్తుంది. మీ కృషికి జోహార్లు

Rajendra Devarapalli చెప్పారు...

రావు గారు చాలా సంతోషం.మీరు ఆకాశవాణి అన్న పదప్రయోగం చేశారు.అది ఆల్ ఇండియా రేడియో వారికి మాత్రమే పరిమైతమినదని అనుకుంటున్నాను.

MURALI చెప్పారు...

తెలుగు బ్లాగులు, బ్లాగరులు వర్ధిల్లాలి.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు చాలా సంతోషం.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

రావుగారు మీ కృషికి జోహార్లు.

కొత్త పాళీ చెప్పారు...

అభినందనలు

cbrao చెప్పారు...

@రాజేంద్ర కుమార్: హైదరాబాదు A, హైదరాబాదు B, వివిధభారతి, రైంబో ఇవన్నీ ఆకాశవాణీ వారివే కనుక అకాశవాణి అన్న పదం నా వ్యాసం లో ఉదహరించటం జరిగింది.
@పద్మనాభం దూర్వాసుల
@ మురళి
@రాధిక
@వేణూ శ్రీకాంత్
@కొత్త పాళీ
మీ అందరి ప్రోత్సాహకరమైన శుభాకాంషలకు నెనర్లు.

Rajendra Devarapalli చెప్పారు...

అలాగా రావు గారు,రెయిన్ బౌ యఫ్.యం ఆకాశవాణి వారిదా?అలాగైతే విశాఖపట్నం లో కూడా మీ ఇంటర్వ్యూ ప్రసారమౌతుందేమో చెప్తే మేమూ వింటాము :)

అజ్ఞాత చెప్పారు...

wow Sebhash rao garu.

-- vihaari

Srividya చెప్పారు...

చాలా మంచి ప్రయత్నమండి.

Purnima చెప్పారు...

అభినందనలు!!

Ramani Rao చెప్పారు...

నేను ఆఫిసులో ఉండగా జ్యోతి గారు ఈ విషయం నాకు చెప్పారు. ఆరోజే నేను నా హెడ్ ఫోన్స్ ఇంట్లో పెట్టి రావడం నా దురదృష్టమే రావుగారు. వినలేక పోయాను. ఈ మధ్య మీ పేరు తరచూ వినడం వల్ల, మీ వ్యాఖ్యలు నా బ్లాగులో చోటు చేసుకోవడం వల్ల నిన్న జరిగిన చిన్న సరదా సరదా సంఘటన మీతోటి, మన బ్లాగు మిత్రులతోటి పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను.

సి.యెస్ రావు గారని, పెద్ద కార్పోరేట్ ఆఫిసులో కంపనీ సెకరెట్రీ. మీ ఇద్దరి పేర్లకి ఉన్న తేడ అక్కడ 'యెస్ ' ఇక్కడ 'బి ' అంతే. ఆయన(సి.యెస్ రావుగారు) నన్ను పిలిచి ఎలాగు నేను ఓ ప్రభుత్వ ఆఫీసుకి వెళ్తున్నాను కాబట్టి, తన పని కూడా కొంచం చూడమని, తను ఫలాన అని చెప్తే వాళ్ళు చేస్తారని చెప్పారు. ఆ ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళి నేను చెప్పిన పేరు మీది. సి.బి. రావు గారు పంపారు, వాళ్ళు సి.యెస్ రావు గారికిఫోన్ చేసి కనుక్కొనే దాకా నేను మీ పేరు చెప్తున్నాను అన్న ఐడియా నాకు రాకపోవడం, గమనించిన అందరూ ఆ సంఘటనని సరదాగా తీసుకొవడం జరిగింది.
మీ బ్లాగు అడ్రస్ అక్కడ ఆసక్తి చూపిన వారికి ఇవ్వడం జరిగింది.

cbrao చెప్పారు...

@రమణి: మీ అభిమానానికి నెనర్లు. ఇంకో దృక్పధం లో ఆలోచిస్తే, ఇది blog addiction తీవ్రతను తెలియ చేస్తుంది. అందమైన ఆడవాళ్లూ, మీరు ఎక్కువ సేపు కంప్యుటర్ ముందు గడిపితే, స్క్రీన్ నుంచి వచ్చే రేడియేషన్ వలన, మీ facial skin moisture contents తగ్గిపోయి మొహం ముడతలు వచ్చే ప్రమాదముంది. మీ కంప్యూటర్ స్క్రీన్ కు Screen protector అమర్చుకోగలరు. దీని ఖరీదు సుమారుగా 180 రూపాయల నుంచి 250 దాకా వుంటుంది. ఇది మిమ్ములను Ultraviolet rays నుంచి కాపాడగలదు. ఇది కొనటం వీలు కాని పక్షం లో, Sun Protective Lotion SPF (Sun Protection Factor) 25 నుంచి 50 దాకా ఉన్నవి మొహానికి రాసుకొని, కంప్యూటర్ ముందు కూర్చోండి. కంప్యూటర్ ముందు తక్కువ గంటలు గడిపే వారు SPF 15, ఎక్కువ గంటలు గడిపే వారు SPF నంబర్ పెంచుకుంటూ పోతూ వాడండి.

నేను లదాఖ్ (J&K) వెళ్లినప్పుడు అక్కడి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుకోవటానికై, Biotique Red Sandal Wood Lotion SPF -50 వాడాను.

Bolloju Baba చెప్పారు...

congrats
bollojubaba

Unknown చెప్పారు...

బాగుంది... బ్లాగుల ప్రచారానికి ఇప్పుడు రేడియో కూడా.

అజ్ఞాత చెప్పారు...

THank you for bringing us Veeven's radio interview. Enjoyed that very much.
I hope to listen to yours too.

cbrao చెప్పారు...

మీ ఉత్తరానికి నెనర్లు. కొద్ది రోజులలో, నా ఇంటర్వ్యూ సరైన ఫార్మాట్ (MP3) లో ఎగుమతి చేసి, మీకు వినిపిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి