ఆదివారం, ఆగస్టు 10, 2008

రేడియోలో నా ఇంటర్వ్యూ - 2

OLYMPUS DIGITAL CAMERA

నా మాటా-మంతీ ప్రసారం చేస్తున్న స్రవంతి

రేడియోలో నా ఇంటర్వ్యూ - 1 చదివిన పాఠకులు, నా ఇంటర్వ్యూ పై చూపించిన ఆసక్తికి ధన్యవాదాలు. మీరు ఎదురు చూస్తున్న ఈ శ్రవణ ముద్రితాన్ని, మీకు వినిపించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. నాదైన ప్రపంచంలో, నా ఊహలలో, ఆలోచనాధారలో, కమ్మని సంగీతంలో విహరించండి. నేను ఎంపిక చేసుకున్న ఈ అణిముత్యాల్లంటి పాటలు మిమ్ములని అలరిస్తాయని తలుస్తాను.

Get this widget | Track details | eSnips Social DNA

4 వ్యాఖ్యలు:

Purnima చెప్పారు...

Thanks so much for sharing!! చాలా విషయాల గురించి తెలుసుకున్నాను!!

అజ్ఞాత చెప్పారు...

సీబీరావుగారూ, తెల్లారుతూనే, మీఇంటర్వూ, మీసొంతగొంతుతో వినడం మహ ఆనందాన్ని కలిగించింది. పక్షులగురించి, మనసున మల్లెలమాలలూగెనే వెనక కథలూ, యంగ్ క్రౌడ్ తో భేటీ,..మొత్తంమీద చాలా హాయిగా వుంది.
మీ అమ్మాయి బొమ్మలా చక్కగా వుంది.
మనఃపూర్వకంగా నా నమోవాకములు.
ఈసెలెక్ట్ ప్రొఫైలు గొడవ పెడుతోందండీ.
మాలతి

ramya చెప్పారు...

బావుందండీ,చక్కటి పాటలు కూడా:)

సుజాత చెప్పారు...

రావు గారు,
నిజంగా చాలా విషయాలు తెలిశాయి. మిమ్మల్ని పరిచయం చేసిన ఆయన కూడా బలే మంచి ప్రశ్నలు వేసారు. పక్షుల్ని ప్రత్యేకంగా వాచ్ చేయకపోయినా bird sanctuaries కి తప్పకుండా వెళ్ళి అన్ని రకాల పక్షుల్నీ చూడ్డం నాకిష్టం! అవి zoo లకి భిన్నంగా ఉండడం కూడా ఒక కారణం అక్కడికెళ్లడానికి. మైసూర్ సమీపంలోని Ranganaathittu bird sanctuary, 'kokkere bird sanctuary చాలా సార్లు చూశాను. ఇప్పుడు ఉప్పలపాడులో ఒకటి ఉందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. మీరు ఎన్నిన పాటలు కూడా హాయిగా ఉన్నాయి.

ధన్యవాదాలు!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి