Mural at Shantiniketan Photo: cbrao
బ్లాగరు సొంత విషయాలు
Virtual world కు Real World కు వ్యత్యాసం ఎక్కువ. బ్లాగు ప్రపంచం లో ఎవరికీ, ఇంకొకరు తెలియరు. బ్లాగరు తన గురించి తను రాసుకుంటే తప్ప, తన గురించి వేరే వారికి తెలుసుకునే అవకాశం తక్కువ. అందుకే ఎప్పుడైనా బ్లాగరు తన సొంత విషయాలు రాస్తే, మిగతావారు ఆసక్తిగా చదువుతారు. ఉదాహరణకు మీకు సుజాత బ్లాగంటే ఇష్టం. ఆమె టపాలు క్రమం తప్పకుండా చదువుతారు. మీకు తెలియకుండానే తన రచనలు గురించి మాత్రమే కాక, ఆమె వయస్సు, రూపం గురించి కొన్ని ఊహాగానాలు చేస్తారు. ఈ curiosity factor వలన సోది కబుర్లు, దిన చర్యలు కూడా పాఠకులు ఆసక్తిగా చదవటం జరుగుంది.
జపనీస్ కళలు
స్నిగ్ధ అధీకృతంగా మార్చుకుందా అకిరా అని? స్నిగ్ధ, నిస్సహందేహం గా చక్కటి పేరు. పిల్లలకు Anime (ఉచ్ఛారణ: ఆనిమే) పై ఆసక్తి సహజం. ఎన్నో చిత్రాల సమాహారంతో తీసే animation కళ ఇది. అనిమె లో తీసిన ఒక వీడియో ఇక్కడ చూడండి. "ఇప్పుడే ఒక సయిను తీసుకువచ్చింది 'No Tresspassing' తన గది తలుపుకి పెడుతుందిట." - ఇది ఇబ్బందికరమే. చాట్ లో అబ్బాయిలతో మోసగించబడే ప్రమాదముంది. స్నిగ్ధ వెబ్‌సైట్ చిరునామా ఇవ్వగలరు. జపనీస్ చిత్రకళ ఎంతో కళాత్మకంగా ఉంటుంది. Mount Fuji చిత్రాలు, వెదురు, పూలు, జపనీస్ కళలు, సంస్కృతి విషిష్టమైనవి. ఇంత చక్కటి సంస్కృతి మీ పిల్లలకు అబ్బటం ప్రమోదం.
http://sarath-sahityam.blogspot.com/2008/08/blog-post_24.html
ఆనందంగా జీవించటం
సంజీవదేవ్ అంటారు " Optimism is life, Pessimism is death." ఆనందంగా జీవించటం ఒక కళ. చుట్టూ అననుకూల పరిస్థితులున్నా, జీవితాన్ని ఆనందించటాన్ని నేర్చుకోవాలి. రాత్రి నిదురించే ముందు, నీళ్లలో Eau de Cologne కొన్ని చుక్కలు వేసుకొని స్నానం చెయ్యండి. మీ పడకగదిని కళాత్మకంగా తీర్చి దిద్దండి. గులాబి వాసనలొచ్చే, అగర్బత్తులు వెలిగించండి. టేప్ రికార్డర్లో మీ కిష్టమైన సంగీతం వింటూ నిద్రకుపక్రమించండి. చక్కటి నిద్ర మీ స్వంతం. Sound sleep మీ స్వంతం కావాలంటే, ప్రతి రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల నడక చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని చక్కటి ఆకృతి లో ఉంచటానికి దోహదపడుతుంది. ప్రతి గంటకూ ఒక గ్లాసు నీరు తాగండి. రోజూ ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు, పళ్లు మీ అహారంలో ఉండేలా చూసుకోండి. మితాహారం తో ఆరోగ్యం మీ సొంతం. ఇంకో ముఖ్యమైన విషయం Early to bed, Early to rise, మీరు ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగటానికి అమృతంలా పని చేస్తుంది. ఆచరించండి. మీ జీవితం మూడు పువ్వులు, ఆరు టపాలుగా వర్ధిల్లుతుంది. ఆయుష్మాన్ భవా!
http://virajaaji.blogspot.com/2008/08/blog-post_25.html
ఎంగేజ్మెంట్ కి పెళ్లి కి తేడా ఉంటుందా?
తల్లి తండ్రులు తమ పిల్ల పెళ్లి వైభవంగా చెయ్యాలని ఆశిస్తారు. తమ పిల్లను, సినిమా వెంకటేష్ (బీద, పల్లెటూరి, చదువు తక్కువ వాడు) వైభవంగా పెళ్లి చేసుకోలేడు. ఉదాహరణకు చూడండి -నువ్వు నాకు నచ్చావ్ (2001) (వెంకటేష్, ఆరతి అగర్వాల్). పెళ్లి కి ముందు, తమకు నచ్చిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ ఘనంగా చేస్తే, తమ ముచ్చటా తీరుతుంది. తరువాత వెంకటేష్ వచ్చి ఎలా పెళ్లిచేసుకొన్నా, తమ కోరిక అప్పటికే నెరవేరుతుంది కనుక ఎంగేజ్మెంట్ ఘనం గా చేస్తున్నారని, గీతచార్య ఉవాచ.
నాకు తెలిసి, నిశ్చయ తాంబూలాలకు మొగ పెళ్లి వారు ఏ అరడజను మందో వచ్చి, అమ్మాయి మెడలో ఏ నగో వేసి అమ్మాయి తమదనిపించుకొంటారు. వివాహ శుభలజ్ఞ పత్రికలు, పరస్పరం మార్చుకుంటారు. ప్రాంతాన్ని బట్టి కొద్ది మార్పులుండవచ్చు. కాని ఇప్పుడు జరుగుతున్న దేమిటి? ఈ మధ్య నేను కొన్ని ఎంగేజ్మెంట్ వేడుకలకు వెళ్లటం జరిగింది. జీలకర్ర-బెల్లం, మాంగల్యధారణ, సప్తపది తప్పించి పెళ్లిలో జరిగే అన్ని పనులూ, ఎంగేజ్మెంట్ వేడుకలో చేసి, దాదాపు వివాహమా అన్నంత హంగామాగా, వందల మంది అతిధుల సమక్షంలో, కాబోయే వధూ వరులు, ఉంగరాలు, దండలు మార్చుకుంటున్నారు. Marriage reception లా తంతు నడిపిస్తున్నారు. ఇహ ఛాయా చిత్రాలు, drinks, విందులూ సరే సరి. ఇవన్నీ అతే అనిపిస్తుంది, చూసే వారికి. ఏమి చెయ్యగలం? మారే కాలం తో పాటు మనమూ మారాలి అనుకుని సమాధానపడతాము.
3 కామెంట్‌లు:
రావు గారూ,
ఏమన్నారూ? సో...సో...(గుండె పట్టుకుని)సోది కబుర్లా? హెంత మాటనేసారండీ? సుజాత సోది కబుర్లు రాస్తుందా? నా హృదయం తీవ్రంగా ఘాయపడి పోయింది. ఇకనుంచి నేనూ గొడవలకు, తగాదాలు దారితీసే టపాలు రాస్తానుండండి, ఇదే నా ప్రతిజ్ఞ! హ హ హ !
"ఇకనుంచి నేనూ గొడవలకు, తగాదాలు దారితీసే టపాలు రాస్తానుండండి, ఇదే నా ప్రతిజ్ఞ! హ హ హ !"
మీరు కూడా కానివ్వండి... ఇప్పుడు చాలా మంది బ్లాగరులు చేసే పని అదే కదా... BEST OF LUCK. (కూడలి వల్ల ఓ గొప్ప ఉపయోగం ఏమిటంటే... ఇటువంటి తపాల జోలికి వెళ్లకపోవడం.. కనీసం తొంగి చూడక పోవడం. కూడలి నన్ను రోజూ కొంత మంది బ్లాగరుల నుంచి సంరక్షించుతోంది)
ఈ మధ్య బ్లాగుల్లో ఎక్కువసార్లు విన్నపదం
గొడవలకు, తగాదాలు
గొడవలకు, తగాదాలు
గొడవలకు, తగాదాలు అదన్నమాట
కామెంట్‌ను పోస్ట్ చేయండి