శనివారం, ఆగస్టు 30, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -5

rama_weds_sitaPainting Courtesy: Bapu

గద్దర్ - రాముడు

శ్రీకాకుళం లో కమ్యూనిస్టులు అనేవారు (?) “ఈ పీడిత ప్రజల కోసం మేమెంత కష్టపడ్డామో, మాకు తెలుసు, ఇంకా పైనున్న వాడికి (God) తెలుసు." మనిషి ఎంత హేతుబధ్ధంగా సిద్ధాంతాలు చేసినా, కొన్ని పొరబాట్లు అలా జరుగుతుంటాయి. దీనికి కారణం చుట్టూ ఉన్న, సామాజిక పరిస్థితులు, ఆలోచనలపై కలిగించే ప్రభావం కావచ్చు. ఉదాహరణగా గద్దర్, భద్రాద్రి రాముని వేడుకోవటం చెప్పవచ్చు.

http://navvulaata.blogspot.com/2008/08/10000.html?ext-ref=comm-sub-email

ఆడ బ్లాగుల్లో సోదే వుంటుందా?

"ఇకనుంచి నేనూ గొడవలు, తగాదాలు దారితీసే టపాలు రాస్తానుండండి." – మనసు బ్లాగరి సుజాత.

ఇష్ట కామ్యాభి సిద్ధిరస్తు. మీరు "ఆడ బ్లాగుల్లో సోదే వుంటుందా?" అనే అంశం పై ఒక టపా రాయగలరా? రాసే సమయంలో ఇవి కూడా గుర్తుంచుకోండి. ప్రాచుర్యం చెందిన టపాలలో ఏ అంశాలపై రాసారు? పులిహోర పురాణం, ఉపాహరంలో నాకు నాచ్చనిది ఒక్కటే , ఆంటీలా కనిపిస్తున్నానా? పదహారేళ్ల అమ్మాయిలా లేనా?, మా అత్తగారి కబుర్లు, మొగుళ్లంతా ఒకటే,వంటింట్లో నా మొదటి రోజు,బీరకాయ మహత్యం , సాంబారు చేద్దాం రండి,వండమని నన్నడగ తగునా, పండగలు - పిండివంటలు, ఇవే నా ఆరు రోజుల నగలు,నా పుట్టిన రోజు మరిచిపోయి చూడు,మొదటి ప్రేమ లేఖ, పుట్టలో పాలు పోయటం ఎట్లా? వగైరాలు గురించి బ్లాగుల్లో రాస్తున్నారేమోనని శోధించండి.
వంటే నా లక్ష్యం. రుబ్బురొలే నా మార్గం. మీరు రాయటమే తరువాయి, ఆ తరువాత ఏమి జరుగుతుందని నన్నడగొద్దు. నాకూ తెలియదు. ఇది మహిళా బ్లాగరుల రాజ్యం. ఈ ఉత్తరం పై మీకు అభ్యంతరాలుంటే మనసు బ్లాగరి సుజాత కు రాయండి. తను పాడే కదనకుతూహలరాగం వినిపించటం లేదా?

http://sarath-sahityam.blogspot.com/2008/08/blog-post_24.html

బ్లాగులు - వ్యాఖ్యలు

బ్లాగు లేక పోయినా, రాయక పోయినా (Update), వ్యాఖ్యాతకు నష్టం లేదు. వ్యాఖ్యలు లేనిచో , బ్లాగరు లో (ముఖ్యంగా కొత్త బ్లాగరులలో) అసంత్రుప్తి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సద్విమర్శలు బ్లాగుకు ప్రాణవాయువు లాంటివి.

ముగ్గురు సుజాతలు

1) మనసు బ్లాగరి సుజాత (మనసులోమాట)
2) A to Z Sujata (గడ్డిపూలు)
మూడవ సుజాత నార్ల బ్లాగు కు రాసే సుజాత గారు.నార్ల పుస్తక సంగ్రహాన్ని పరిచయం చేస్తూ, పెద్ద వ్యాసం రాశారు. అంబేడ్కర్ యూనివర్సిటీ లో Librarian గా పనిచేస్తున్నారు. నార్ల తదనంతరం, నార్ల గ్రంధాలయాన్ని, ఈ విశ్వవిద్యాలయానికి బహుకరించటం జరిగింది.

http://sarath-sahityam.blogspot.com/2008/08/blog-post_26.html

ప్రజా రాజు చిరంజీవి

తన వాలంటీర్ల సేవతో, ఎంతోమంది నగుమోము పై చిరునవ్వులు పూయించాడు కదా, చిరంజీవి. సంతోషాంధ్ర ప్రదేష్ ఎంత దూరంలో ఉంది?

http://manishi-manasulomaata.blogspot.com/2008/08/blog-post_27.html

11 వ్యాఖ్యలు:

sujata చెప్పారు...

a - z sujatha ? bavundee muddu peru!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

"మనిషి ఎంత హేతుబధ్ధంగా సిద్ధాంతాలు చేసినా, కొన్ని పొరబాట్లు అలా జరుగుతుంటాయి."

ఇది పొఱపాటు కాదు. ఇదే సరైన విదానం. ప్రపంచంలో ఎక్కువమంది కమ్యూనిజం వైపు ఆకర్షితులు కాకపోవడానికి కమ్యూనిస్టుల్లో జీర్ణించిన మతవ్యతిరేకతే కారణం. దేవుడున్నాడని కమ్యూనిస్టులు ఒప్పుకునుంటే ఈపాటికి ప్రపంచమంతటా కమ్యూనిజమే ఉండేది. ఇంతకాలమయినా కమ్యూనిస్టులు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు.

మన దేశంలో కమ్యూనిస్ఠులది ఇంకో తరహా. వీళ్ళ దృష్టిలో ముస్లిమ్ మతం ఆమోదయోగ్యం. హిందూమతం దుర్మార్గమతం. ఎందుకంటే తమకు రాజకీయ శ్వాస ఇస్తున్న పశ్చిమ బెంగాల లో పేద ముస్లిమ్ వోట్ల మార్జిన్ తో తామక్కడ గెలవాలి కనుక. అందుకని దేశవ్యాప్తంగా హిందూమతాన్ని ద్వేషిస్తూ, ముస్లిమ్ మతాన్ని భూజానికెత్తుకునే పనిలో 'బిజీ' అయ్యారు.

మఱి అటువంటప్పుడు వీళ్ళు 'పైవాడి' (ఊపర్ వాలా) గుఱించి మాట్లాడితే తప్పయిపోయిందా ?

శరత్ చెప్పారు...

రాగు గారూ,
ఇది మీ బ్లాగ్ అని నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగుల మీద అవగాహన కలుగుతోంది. ఇవరబ్బా మీ గురించి ఇలా రాసారు అని చూస్తే అది మీరే!

cbrao చెప్పారు...

@sujata: మీ ఉత్తరాన్ని తొలిగా మనసు బ్లాగరి సుజాత రాసినదని పొరబడ్డాను.మీకు A to Z Sujata అనే నామకరణం లో అర్థం ఉంది. ఒక classification కూడా ఉంది. మీ బ్లాగు వైవిధ్యమైనది. ఆవకాయ నుంచి ఆటం బాంబు దాక దేనిపై నైనా వైవిధ్యంగా రాస్తున్న రచయిత్రి మీరు. అందుకే అలా పేరుంచటం జరిగింది. సుజాతలెక్కువయి పాఠకులకు ఏ సుజాత ఎవరో తెలియని పరిస్థితులలో ఇలాంటి వర్గీకరణ అవసరమనిపించింది. ఈ ముద్దు పేరు మీకు నచ్చినందుకు ప్రమోదం. మీ రచనలలో ఇన్ని వైరుధ్యమైన విషయాలు మీ బలం, బలహీనత కూడా.

cbrao చెప్పారు...

@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: కమ్యూనిస్మ్ సిద్ధాంతాలకు, దేవుని అస్తిత్వానికి పొత్తు కుదరదు. పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల తీరు వేరుగా ఉంది. వారు అవలంబిస్తున్న విధానాలు, వారి secularist భావాలెటువంటివో తెలుపుతున్నాయి. అన్ని విధాన నిర్ణయాలనూ రాజకీయమే (Vote bank politics) దిశానిర్దేశనం చేస్తుంది.

cbrao చెప్పారు...

@శరత్: నెనర్లు. పోనీ లెండి,ఇప్పటికైనా గుర్తించారు. నా ప్రపంచం ఎవరిదనుకుంటున్నారు? పారదర్శి ఎవరిదనుకుంటున్నారు?

సుజాత చెప్పారు...

బ్లాగు అనేది మొదట పరిచయం కాగానే మొదట పుస్తకాల మీద ఉన్న ఆసక్తి కొద్దీ పుస్తక పరిచయాల పేరుతో బ్లాగు మొదలు పెట్టాను. కానీ అప్పటికే అద్భుతంగా రివ్యూలు రాసే వారు బ్లాగ్లోకంలో ఉండటంతో మరో వైపుకు మళ్ళాలనుకున్న్నాను.
సాహిత్యం,సంగీతం,రాజకీయాలు,సినిమాలు, హాస్యం,స్త్రీవాదం, ఇత్యాది విషయాల మీద చక్కగా రాసే వారు బోలెడు మంది అప్పటికే ఉన్నారు. అందుకే స్త్రీలు తమను తాము identify చేసుకునే సరదా విషయాలు రాస్తే ఎలా వుంటుందన్న ఆలోచనతో (అదే కొనసాగించాలని కాదు)సరదా బ్లాగింగ్ మొదలెట్టాను. నా బ్లాగుల్లోని ప్రతి పాత్రా నా జీవితంలోంచి ఊడిపడాలని ఏమీ లేదు. సగానికి సగం ఫిక్షన్లే!

రావు గారు,
"గొడవలు తగాదాలకు దారి తీసే బ్లాగులు రాయడం" సరదాకి అన్నదే లెండి. నిజంగా నాకంత వోపిక లేదు.

మొత్తానికి ఆడవాళ్ల బ్లాగుల్లో సోదే ఎక్కువన్నమాట తేలిపోయింది. దీన్ని బట్టి బ్లాగులో ఏమి రాయాలి? అసలు రాయాలా వద్దా అన్నమాట ఆలోచించడం తప్పదని అనిపిస్తోంది.

నేను కదన కుతూహల రాగం ఆలాపించడం లేదండీ! నిజంగానే! కాకపోతే పురుషులు రాస్తే సోది కాని అంశాలు (ఏమిటవి అని ప్రశ్నిస్తే ఉదాహరణలు ఇప్పటికిప్పుడు ఇవ్వలేను. బ్లాగులు వెదికి చూస్తే దొరుకుతాయి) ఆడవాళ్ళు రాస్తే సోది ఎలా అవుతాయా అని ఆశ్చర్యపడుతున్నానంతే!

cbrao చెప్పారు...

@ సుజాత: "మొత్తానికి ఆడవాళ్ల బ్లాగుల్లో సోదే ఎక్కువన్నమాట తేలిపోయింది."

నా మాటలు నిజాయితీగా మీరు ఒప్పుకొన్నందుకు హార్దిక అభినందనలు. నెనర్లు. నిజానికి నా మాటలు, మిమ్ములను మరింతగా కదనకుతూహలరాగం లోకో, లేక మహిళా బ్లాగులు ఇట్లా ఉన్నాయేమిటని శివరంజని లోకో తీసుకు పోతాయని సందేహించాను. Sportive గా, మీరు మోహన రాగం ఆలాపించటం, ప్రమోదాన్నిస్తుంది.

"సాహిత్యం,సంగీతం,రాజకీయాలు,సినిమాలు, హాస్యం,స్త్రీవాదం, ఇత్యాది విషయాల మీద చక్కగా రాసే వారు బోలెడు మంది అప్పటికే ఉన్నారు."

అవును. కాని చిరంజీవి చెప్పినట్లు (పాత పథకాలను, పాత ఆయుధాలతోనే, కొత్త పద్ధతిలో నిర్వహించటం, ఉపయోగించటం) పైన పేర్కొన్న అంశాలను, మీదైన శైలిలో రాస్తే, అవి పాఠకులను చదివించేలా చెయ్యగలవు. మీ రచనలలో ఉండే subtle humor మీ రాతలను elevate చెయ్యగలవు. ఎలా రాయాలి అన్న ప్రశ్నకు జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -6 చూడవచ్చు. ఇహ మిగిలింది, ఏమి రాయాలి అనే ప్రశ్న. దీనికి జవాబు: మీ గుండెల్లోంచి వచ్చేవి, మిమ్ములని కదిలించినవి, పాఠకుడి కి ఉపయోగపడుతుందనుకున్న వేని గురించైనా రాయవచ్చు.

సుజాత చెప్పారు...

రావు గారు,
ఆడవాళ్ల బ్లాగుల్లో సోది ఎక్కువన్న మీ అభిప్రాయానికి నా నిర్వేదాన్ని అలా ప్రకటించాను గానీ నేను ఒప్పుకోలేదండీ, ఒప్పుకోలేను కూడా! ఇవాళ ఆరోగ్యం అంతగా బాగలేదు, లేకపోతే ఇంకా ఎక్కువ దీనిగురించి రాద్దును.

ఇక పోతే ప్రతి విషయానికీ శివరంజని, లేదా ముఖారి రాగాలకు దిగను నేను!అవి రెండూ ఎంజాయ్ చేయాలంటే మంచి ఏడుపు మూడ్ ఉండాలి. అలాంటి మూడ్ నాకెవరైనా లంచం ఇచ్చినా రాదు ఎప్పుడూ!

పురుషులు ఇంట్లో ఎలా వున్నా కుటుంబ విషయాలని బ్లాగుల్లో (కనీసం nerrator గా నైనా) సరదాగా అందరితో పంచుకోలేరు. స్త్రీలు ఇంట్లో,బయట, ఎలా ఉన్నా (ఉద్యోగాలు, సోషల్ సర్వీస్ ఇలాంటివి చేస్తున్నా) కుటుంబ విషయాలను అందరితో (నా బ్లాగులో nerrator లాగా) పంచుకోగలరు. అంత మాత్రాన అది సోదంటే ఎలా? నేను లోక్ సత్తా లో పని చేస్తున్నపుడు "ప్రభుత్వ కార్యాలయాల్లో వృధా ఖర్చుల్ని తగ్గించడం" గురుంచి నేను ఒక సలహా చెపితే ఇలా అన్నారు,"స్త్రీలు ఎక్కడికెళ్ళినా "ఇంటిని" మర్చిపోరు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. అలా ఇంటిని మనం(పురుషులు) గేటు దాటగానే వదిలేసి వస్తాము. తిరిగి గేటులో అడుగు పెడితే తప్ప ఇల్లంటే ఏమిటో మనకు గుర్తు రాదు" అని! (వృధా ఖర్చు తగ్గించడం గురించి స్త్రీలు మాత్రమే ఆలోచించగలరు అని ఆయన ఉద్దేశం అని నేను అర్థం చేసుకున్నాను) అందువల్ల స్త్రీలను, ఇంటిని విడదీసి చూడలేను నా మటుకు!.ముఖ్యంగా వివాహితలను!

ఇక రాయడం గురించి మీ కొత్త పోస్టులో చెప్పిన విషయాలు చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి.తప్పక పాటిస్తాను !

శరత్ చెప్పారు...

@ రావు గారు,

అప్పుడే మీ ప్రొఫైల్ చూసి మీ బ్లాగు లిస్ట్ చూసాను. నా ప్రపంచం మీది, ఇన్నయ్య గారిదని నాకు ఇదివరకే తెలుసు. మీకు త్వరలోనే నా అడ్రసు మెయిల్ ఇస్తాను. ఇన్నయ్య గారు కూడా యు ఎస్ వస్తున్నారా? వారి పర్యటన వివరాలు ఏంటి?

@ సుజాత గారూ,
మీ అరోగ్యం ఎలా వుంది?

cbrao చెప్పారు...

@శరత్: సెప్టెంబర్ 3 వ వారంలో ఇన్నయ్య గారు అమెరికా రాజధాని నగరాని కొస్తున్నారు. అక్కడే సుమారుగా రెండు నెలలుండి వివిధ హేతువాద కార్యక్రమాలలో పాల్గొంటారు. చికాగో ప్రాంతంలో ఉంటున్న తెలుగు బ్లాగరులు మీకు తెలుసా?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి