ఆటాడుదాం రా!
నేపధ్యం:
ఈ టపాకి ప్రేరణ, నిడదవోలు మాలతి గారి కథల వెనక కథలు. మాలతిగారు తమ కథలకు నేపధ్యం, ఈ వ్యాసంలో చక్కగా వివరించారు. ఈ నేపధ్యం అంటే నా మనసు ఎదో నేపధ్య సంగీతం వినసాగింది. నేపధ్య సంగీతమంటే నౌషాద్ గాక మరెవరు గుర్తుకొస్తారు? తన హృద్యమైన నేపధ్య సంగీతంతో, పాత్రల ఔచిత్యాన్ని పెంచిన నౌషాద్ జీవితం లో ఎన్నో విశేషాలు. లక్నో లో పుట్టి పెరిగిన నౌషాద్, మూకీ చిత్రాలకు సంగీతకారులు వాయించే Live orchestra కు ఆకర్షితుడయ్యాడు.పలువురు ఉస్తాద్ల వద్ద, హిందుస్తానీ సంగీతం నేర్చుకుని, తన అదృష్టాన్ని పరీక్షుంచు కోవటానికి, హిందీ చిత్రసీమ రాజధాని ఐన ముంబాయి పట్టణానికి వెళ్లి, అక్కడ అవకాశం దొరకపుచ్చుకునే ప్రక్రియ లో, బ్రాడ్వే థీయేటర్ ఎదురుగా గల ఫుట్‌పాత్ పై పెక్కు రాత్రులు నిద్రిస్తూ, తన సంగీతం ఎప్పటికైనా బ్రాడ్వే లో వినిపించాలని కలలు కన్నాడు.
కలలు నిజమైన వేళ
పదహారు ఏళ్ల తర్వాత , 1952 లో బైజు బావ్రా చిత్ర మునుజూపు (Preview) ప్రదర్శన ఆ థీయేటర్లో జరిగినప్పుడు, నౌషాద్ కు ఆనందభాష్పాలు ఆగాయి కావు. మీనాకుమారి నటించిన పకీజా చూసే వుంటారు. ఈ చిత్రం ముగిసే సరికి , సంగీత దర్శకుడు గులాం మొహమ్మద్ చనిపోవటం తో, ఆ చిత్రానికి నేపధ్య సంగీతం, టైటిల్ సాంగ్ (చిత్రం లోని నటీనటుల పేర్లు వచ్చే సమయంలో లత పాట) నౌషాద్ స్వర పరిచారు. ఈ చిత్ర విజయానికి నౌషాద్ నేపధ్య సంగీతం దోహదపడింది. చిత్రాలలో లో పాటల కిచ్చిన ప్రాముఖ్యం, నేపధ్య సంగీతానికి సంగీతకారులివ్వరు. ఆంగ్ల చిత్రాల నేపధ్య సంగీతం రికార్డులు గా విడుదలైనా, భారతీయ చిత్రాల నేపధ్య సంగీతం రికార్డులుగా రాలేదు. ఇలాంటి సమయంలో, నౌషాద్ వివిధ చిత్రాలకిచ్చిన నేపధ్య సంగీతం ఒక LP (D/MOCE 4016 Naushad Ali Background Music For Films Odeon Film music) గా HMV వారు విడుదల చెయ్యటం జరిగింది. ఇది నౌషాద్ కు తన సంగీతం పై ఉన్న ఆత్మవిశ్వాసానికి ఋజువు.
నౌషాద్ నేపధ్యం లోంచి ఈ టపాలో కొస్తే, ఈ టపా కు వివిధ బ్లాగు టపాల నేపధ్యం ఉంది. మన తెలుగు బ్లాగరుల చక్కటి టపాలకు స్పందించి రాసిన వ్యాఖ్యల సమాహారమే ఈ మ్యూజింగ్స్ .
Popular Drinks in USA
చివాస్ రీగల్, అమెరికాలో ఎక్కువమంది తెలుగు వాళ్ల ఇళ్లలో, అతిధులకు ఇచ్చే డ్రింక్. ఇది కాక ఇంకేదన్నా అక్కడ తెలుగు వారి మనసు దోచుకుంటే, అలాంటి వాటిలో ఒకటి జాక్ డేనియల్, రెండోది టెకీలా. ఇవి మన భారత దేశంలో ఐదు నక్షత్రాల హోటళ్లలో లభ్యం.
గుర్రపు బండి, పడవ ప్రయాణం
గుర్రబ్బండీ ముందు కూచుంటే వెనక్కు, వెనక కూచుటే ముందుకు వెళ్లమని, మనము కూర్చున్న చొటే బరువెక్కువయిందనీ, గుర్రబ్బండీ వాడు తమాషాగా సతాయిస్తాడు. కెమరా లేని వాళ్లు పడవ ముందు డెక్ పై కూచుని, ఛాయగ్రాహకులకు అడ్డంగా కూర్చుంటారు. మనం కూర్చున్న బెంచీ పై పెట్టుకున్న పుస్తకం, ఇంజన్ ప్రకంపనలకు కదిలి, కాళ్ల కింద నీటిలో తేలియాడటం మరువలేని భయంకర అనుభవం.
మనం విశ్వమానవులం
మనం మానవులం.. ఈ ప్రపంచ పౌరులం. భాషలు, సరిహద్దులు, మతాలు విడదీయలేని విశ్వమానవులవుదాము. ప్రేమను పంచుదాము. ఆకలిని, భయాన్ని తరిమివేద్దాము. దేశ భక్తి కంటే ప్రపంచభక్తి ఇంకా ఉన్నతమైనదని చాటి చెప్పుదాము. యుద్ధాలు చరిత్రలో మాత్రమే కనిపించే, శాంతిప్రపంచాన్ని నిర్మిద్దాం. ప్రపంచ పౌరులంతా ఒకటే. శాంతి, సౌభాగ్యం వెల్లి విరియటానికి నిరంతర కృషి చేద్దాము.
ప్రయాణమనే జీవిత పుస్తకం
జీవితం ఒక పుస్తకం లాంటిది. ప్రయాణం లోని మజా అనుభవించని వారు పుస్తకం లో చదివేది ఒక పేజీ మాత్రమే. గమ్యస్థానాన్ని కాక గమ్యస్థానానికి వెళ్లే ప్రయాణాన్ని అనందించండి. జీవితం ఎంతో మధురంగా ఉంటుంది.
(To be continued…)
3 కామెంట్‌లు:
Interesting!! Awaiting the rest of the parts.
The first link referring to te.thulika isn't working, I guess!!
చలంగారి మ్యూజింగ్స్ చదువుతున్నట్లుంది. ఇలా చైతన్యస్రవంతిని కంటిన్యూ చెయ్యండి. మంచి ఎడ్యుకేషన్.
@పూర్ణిమ: నిడదవోలు మాలతి గారి కథల వెనక కథలు link ఒక tiny url. అది పని చేస్తుంది. Please try again.
@కత్తి మహేష్: ఈ వ్యాఖ్యలు బాగా ఉంటే దానికి కారణం, వాటి ప్రేరణ అయిన మూల టపాలు. మంచి గంధం పూసుకుంటే చక్కటి సువాసనలు, మంచి టపా చదివితే మంచి వ్యాఖ్యలూ వస్తాయి. టపా చదివే సమయం, అప్పటి మూడ్ బట్టి కూడా వ్యాఖ్యల్లో తేడాలుంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి